-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh and Telangana ABN AndhraJyothy National International Latest viral trending Breaking Live Updates on Jan 10th kjr
-
Breaking News: సోషల్ మీడియాలో మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు కథనాలు: జగ్గారెడ్డి
ABN , First Publish Date - Jan 10 , 2026 | 06:04 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 10, 2026 19:44 IST
సోషల్ మీడియాలో మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు కథనాలు: జగ్గారెడ్డి
దురుద్దేశంగా ఇతరులపై బురదజల్లే కార్యక్రమం మంచిదికాదు: జగ్గారెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో చరిష్మా ఉన్న నేత మంత్రి కోమటిరెడ్డి: జగ్గారెడ్డి
కాంగ్రెస్‌లో అంచలంచెలుగా ఎదిగిన నేత మంత్రి కోమటిరెడ్డి: జగ్గారెడ్డి
మంత్రి కోమటిరెడ్డిపై పనిగట్టుకుని బురదజల్లుతున్నారు: జగ్గారెడ్డి
కోమటిరెడ్డిపై అసత్యాలు రాయాలని చెప్పినోడికి బుద్ధిలేదు: జగ్గారెడ్డి
-
Jan 10, 2026 19:41 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన కార్యాచరణ
సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం
తెలంగాణలో జనసేన బలోపేతం కోసం కమిటీలు
ప్రచారానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: జనసేన
-
Jan 10, 2026 19:41 IST
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల అధ్యక్షతన బడ్జెట్ సన్నాహక సమావేశం
కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో ఏపీ మంత్రి పయ్యావుల వినతులు
అమరావతికి గ్రాంటు ఇవ్వండి: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల
రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధి ప్రణాళిక ప్రకటించి నిధులు ఇవ్వాలి
విశాఖ ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి రూ.5 వేలకోట్లు కేటాయించాలి
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేయాలి: పయ్యావుల
ఏపీలో నదుల అనుసంధానానికి చేయూత ఇవ్వాలి: మంత్రి పయ్యావుల
-
Jan 10, 2026 19:41 IST
తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిటల్ చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
దేశ సేవ, ఆత్మనిర్భరతకు టెక్నాలజీని ఉపయోగపడాలి: శ్రీధర్‌బాబు
ఆధార్, యూపీఐలో ప్రపంచానికే భారత్ రోల్ మోడల్: శ్రీధర్‌బాబు
AI యుగంలో ఇంటెలిజెన్స్ కంటే కో-ఆర్డినేషన్ ముఖ్యం: శ్రీధర్‌బాబు
భవిష్యత్‌లో కోడింగ్ కంటే క్రియేటర్స్‌కే ఎక్కువ అవకాశాలు: శ్రీధర్‌బాబు
వ్యవసాయం, విద్య, వైద్యంపై పరిశోధనలు అవసరం: మంత్రి శ్రీధర్‌బాబు
-
Jan 10, 2026 19:41 IST
గుజరాత్ కు ప్రధాని మోదీ
గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ
ఎయిర్‌పోర్టు నుంచి సోమనాథ్ ఆలయానికి మోదీ
-
Jan 10, 2026 19:40 IST
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయనేతలు ఉండాలి: దత్తాత్రేయ
రాజకీయనేతలు నీతి, నిజాయితీగా పనిచేయాలి: బండారు దత్తాత్రేయ
దేశంలో ప్రధాని మోదీ అనేక మార్పులు తీసుకొస్తున్నారు: దత్తాత్రేయ
MNREGAలో 100 రోజుల పనిదినాలే ఉండేవి..
జీ రామ్ జీ చట్టంలో 150 రోజులకు పెంచారు: బండారు దత్తాత్రేయ
-
Jan 10, 2026 17:28 IST
రాయలసీమకు నీరు అందించామనడానికి పట్టిసీమే ప్రత్యక్ష ఉదాహరణ: చంద్రబాబు
పట్టిసీమ ద్వారా రాయలసీమపై మాకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాం: చంద్రబాబు
పట్టిసీమ వల్లే రాయలసీమలో ఉద్యానరంగం అభివృద్ధి: సీఎం చంద్రబాబు
పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేసిన..
రాయలసీమ లిఫ్ట్ పేరుతో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు చేసుకున్నారు: సీఎం చంద్రబాబు
నీటి విషయంలో రాజీపడేది లేదు.. ఏపీ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
కాళేశ్వరానికి లేని అభ్యంతరం.. నల్లమల సాగర్‌కు ఎందుకు?: చంద్రబాబు
తెలుగు ప్రజల కోసం ఒకరికొకరం సహకరించుకుందాం: సీఎం చంద్రబాబు
ప్రజల కోసం ప్రాజెక్టులు కానీ.. జగన్ కోసం ఎందుకు చేపడతాం?: చంద్రబాబు
నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకుని.. అవసరాల కోసం వాడుకోవచ్చు
మిగులు జలాలతో చేపట్టే నల్లమల సాగర్ వల్ల..
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోనూ నీటి లభ్యత పెరుగుతుంది: సీఎం చంద్రబాబు
ఆ నీటిని తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చు: సీఎం చంద్రబాబు
-
Jan 10, 2026 17:28 IST
ప్రజలు బుద్ధి చెప్పినా.. రాజధానిపై విషం చిమ్మటం ఆపలేదు: సీఎం చంద్రబాబు
ఏపీలో రానున్న రెండేళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు: సీఎం చంద్రబాబు
నీటిని సద్వినియోగం చేస్తున్నందునే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి
దేశంలోనే ఉద్యానవన రంగంలో అగ్రస్థానంలో ఉన్న మనం..
రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్-1గా నిలుస్తాం: సీఎం చంద్రబాబు
నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే: సీఎం చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనుకోవడం తప్పా?: సీఎం చంద్రబాబు
మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి: సీఎం చంద్రబాబు
-
Jan 10, 2026 17:28 IST
జగన్ తీరును మరోసారి తప్పుబట్టిన సీఎం చంద్రబాబు
కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు
జగన్‌కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరు: చంద్రబాబు
సింధూ నాగరికత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకుంటే మంచిది: చంద్రబాబు
ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీతీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయి
లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు..
నదీపరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి: సీఎం చంద్రబాబు
నదీగర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలీకుండా మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు
-
Jan 10, 2026 15:50 IST
ఫీజులు పెంచిన అమెరికా
వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా
2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచిన యూఎస్
మార్చి 1 నుంచి అమల్లోకి పెంచిన ఫీజులు
-
Jan 10, 2026 15:50 IST
తాత్కాలిక నిషేధం
గ్రోక్ చాట్‌బాట్‌పై ఇండోనేసియా తాత్కాలిక నిషేధం
AI టూల్‌తో అసభ్యకర ఫొటోల సృష్టిపై వివాదం
-
Jan 10, 2026 15:50 IST
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల అధ్యక్షతన బడ్జెట్ సన్నాహక సమావేశం
హాజరైన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు
హాజరైన తెలుగురాష్ట్రాల మంత్రులు పయ్యావుల, భట్టి విక్రమార్క
-
Jan 10, 2026 15:48 IST
కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్
ఒడిశా: భువనేశ్వర్ సమీపంలోని జల్దా దగ్గర కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్
గాయాలతో బయటపడిన నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది
రౌర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఘటన
-
Jan 10, 2026 13:26 IST
అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల
అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదు?: సజ్జల
పాలనా వికేంద్రీకరణలో అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదు
విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం: సజ్జల
-
Jan 10, 2026 13:18 IST
ఈగల్ టీమ్ సోదాలు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
నల్లగొండ: చిట్యాల దగ్గర ఈగల్ టీమ్ సోదాలు..
డూన్ దాబాలో 29 కిలోల OPM, పప్పీస్ట్రా డ్రగ్స్ స్వాధీనం..
డ్రగ్స్ విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు గురుమిత్‌సింగ్ అరెస్ట్..
రాజస్థాన్ నుంచి పప్పీస్ట్రా, OPM డ్రగ్స్ తెప్పిస్తున్న గురుమిత్‌సింగ్..
డ్రగ్స్‌ను లారీ డ్రైవర్లకు గురుమిత్‌సింగ్ విక్రయిస్తున్నట్లు గుర్తింపు.
-
Jan 10, 2026 07:08 IST
దుర్గగుడిలో అపచారం.. పాలల్లో పురుగు..
అమరావతి: దుర్గగుడిలో పూజకు ఉపయోగించే పాలల్లో పురుగు..
పురుగు కనిపించడంతో అరగంట పాటు అర్చనను నిలిపివేసిన అర్చకులు..
పూజలో ఆవుపాలకు బదులు టెట్రాబిక్ పాలు వాడటంపై అభ్యంతరం..
వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టిన అర్చకులు..
అరగంట పాటు అర్చన నిలిచిపోవడంతో అయోమయంలో భక్తులు.
-
Jan 10, 2026 06:04 IST
మొదలైన సంక్రాంతి పండుగ రద్దీ
జిల్లా కేంద్రాల నుంచి సొంతూళ్లకు బయల్దేరిన ప్రజలు..
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే, బస్ స్టేషన్లు.