Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 18 , 2026 | 08:43 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 18, 2026 10:16 IST

    విపక్షాలు దక్షిణాదిరాష్ట్రాలకు ద్రోహం చేశాయి: మంత్రి లోకేశ్

    • ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీశాయి: లోకేశ్

    • విపక్షాల తీరు ఫెడరల్‌ స్ఫూర్తిపై జరిగిన దాడి: మంత్రి లోకేశ్

  • Apr 18, 2026 10:13 IST

    ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఆగ్రహం

    • అబద్ధాలతో యుద్ధం గెలవలేరు, చర్చల్లో పురోగతి సాధించలేరు

    • దిగ్బంధనం కొనసాగితే హోర్ముజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్

  • Apr 18, 2026 10:13 IST

    కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాం: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు

    • మా పార్టీ శ్రేణులు, నాయకులు సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తారు

    • దేశంలో ఇంకా రాచరిక పాలన కావాలని కాంగ్రెస్ భావిస్తోంది

    • ముస్లిం సమాజానికి మేలు చేయాలని కాంగ్రెస్ డ్రామా

    • దేశ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

  • Apr 18, 2026 08:46 IST

    భర్త తిట్టాడని ఇంట్లోంచి వెళ్లిపోయిన మహిళ

    • హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు శంషిగూడలో వివాహిత రాజేశ్వరి అదృశ్యం

    • భర్త మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాజేశ్వరి

    • భర్త ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

  • Apr 18, 2026 08:44 IST

    హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో కానిస్టేబుల్ మోసం

    • మనస్తాపంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

    • పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు

    • యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్

  • Apr 18, 2026 08:44 IST

    రంగారెడ్డి: ఆరాంఘర్ దగ్గర ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

    • మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

    • జేసీబీలతో అక్రమ నిర్మాణాల తొలగింపు

  • Apr 18, 2026 08:43 IST

    నేటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు

    • నిరవధిక వాయిదా పడనున్న ఉభయసభలు