-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy National International Latest viral trending Andhra Pradesh and Telangana Live Updates on Jan 11th kjr
-
Breaking News: గిన్నిస్ రికార్డులు సాధించిన NHAI
ABN , First Publish Date - Jan 11 , 2026 | 09:18 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 11, 2026 21:24 IST
గిన్నిస్ రికార్డ్..
ఏపీలో రికార్డుస్థాయిలో నేషనల్ హైవేస్ నిర్మాణాలు
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో..
గిన్నిస్ రికార్డులు సాధించిన NHAI
-
Jan 11, 2026 21:24 IST
భారత్ విజయం
న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం
స్కోర్లు: న్యూజిలాండ్ 300/8, భారత్ 302/6
భారత్ బ్యాటింగ్: కోహ్లీ 93, గిల్ 56, శ్రేయస్ 49
3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
-
Jan 11, 2026 18:54 IST
అరుదైన ఘనత సాధించిన పవన్‌కల్యాణ్
జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో పవన్‌కల్యాణ్ ప్రవేశం
జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ గుర్తింపు పొందిన పవన్
'కెంజుట్సు'లో ప్రవేశంతో గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించిన పవన్
3 దశాబ్దాలుగా పైగా సాధన, పరిశోధనకు నిదర్శనమే పవన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు
-
Jan 11, 2026 18:53 IST
విశాఖ జిల్లా ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో..
తన కుటుంబ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన CEC పురుషోత్తం
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లోనే పూర్తి: CEC పురుషోత్తం
ఏపీ ప్రభుత్వ పాలనా సంస్కరణలు ఆకట్టుకుంటున్నాయి: CEC పురుషోత్తం
-
Jan 11, 2026 18:05 IST
SLBC పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
యుద్ధప్రాతిపదికన SLBC పనులు పూర్తిచేయాలని నిర్ణయం
సొరంగం తవ్వకాలకు టెక్నాలజీ వినియోగం: మంత్రి ఉత్తమ్
9.8 కి.మీ.పై ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తి: మంత్రి ఉత్తమ్
ప్రమాద ప్రాంతాల్లో అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్: ఉత్తమ్
భూగర్భ పరిస్థితుల అంచనాకు 3డీ మానిటరింగ్: ఉత్తమ్
సొరంగం పనుల్లో పనిచేసేవారికి 25 శాతం అదనపు జీతాలు
-
Jan 11, 2026 15:46 IST
రేపు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
పలు అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు
వర్చువల్‌గా హాజరుకానున్న కలెక్టర్లు
-
Jan 11, 2026 15:45 IST
రూ.5 కోట్ల బకాయిలు విడుదల
ఏపీలో చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిలు విడుదల
మంత్రి సవిత ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం
రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిలు జమ
గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలు చెల్లించిన ఆప్కో
సవితకు ధన్యవాదాలు తెలిపిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు
-
Jan 11, 2026 14:06 IST
అమరావతి మీద జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మండిపల్లి
ఏపీకి రాజధాని లేకుండా నాశనం చేసింది జగనే: మంత్రి మండిపల్లి
రాజధానిగా అమరావతిని ఐదేళ్లు పక్కనపెట్టి అపహాస్యం చేశారు
మూడు రాజధానుల పేరిట ఏపీని గందరగోళంలోకి నెట్టారు: మండిపల్లి
అమరావతిని చంద్రబాబు పునర్నిర్మిస్తున్నారని జగన్‌కు కడుపుమంట: మండిపల్లి
-
Jan 11, 2026 14:03 IST
పెద్దపల్లి: కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం పోలేదు: పొంగులేటి
ప్రజాపాలనకు రెఫరెండం అంటూ కేటీఆర్ కారు కూతలు కూస్తున్నారు
ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని కేటీఆర్.. మహిళలకు న్యాయం చేస్తారా?
ఇంటినే చక్కదిద్దుకోలేని వారు.. రాష్ట్రాన్ని సరిదిద్దుతారా?: మంత్రి పొంగులేటి
-
Jan 11, 2026 11:30 IST
శౌర్యానికి, పరాక్రమానికి సోమనాథుడు ప్రతీక: మోదీ
స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం అదృష్టం: ప్రధాని మోదీ
ఎన్నో దాడులను సోమనాథ్ ఆలయం తట్టుకుంది: మోదీ
ఎన్ని దాడులు జరిగానా ఆలయాన్ని ఎవరేం చేయలేకపోయారు
మళ్లీ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించుకున్నాం: మోదీ
-
Jan 11, 2026 10:30 IST
అమరావతి: జగన్‌పై మందడం రైతు సంక్షేమ సంఘం సభ్యులు ఆగ్రహం
ప్రజలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడటం సరికాదు: రైతులు
అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారు
సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అనడం సమంజసమా?
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకోవాలి
రెండో ల్యాండ్ పూలింగ్‌పై మాకు వ్యతిరేకత లేదు: మందడం రైతులు
-
Jan 11, 2026 10:00 IST
సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధనకు కార్యాచరణ: తలసాని
మన ఆత్మగౌరవం, అస్తిత్వంపై దెబ్బకొడితే ఊరుకోం
ఎవరినీ సంప్రదించకుండానే డీలిమిటేషన్ చేశారు: తలసాని
చట్ట ప్రకారం వెళ్తాం.. వదిలే ప్రసక్తే లేదు: మాజీమంత్రి తలసాని
ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి..
గాంధీ ఆస్పత్రి వరకు శాంతి యాత్ర చేపడతాం: తలసాని
ప్రభుత్వం దిగిరాకపోతే రైల్వేస్టేషన్, JBS ముట్టడిస్తాం
సికింద్రాబాద్ బంద్, ఆమరణ దీక్ష కూడా చేపడతాం: తలసాని
-
Jan 11, 2026 09:36 IST
విశాఖ: పెందుర్తిలో ప్రభుత్వ భూములు కబ్జా..
సర్వే నంబర్ 57/1, 2లో అక్రమ నిర్మాణాలు.
స్థానికుల ఫిర్యాదు తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు.
రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నించిన ఆక్రమణదారులు.
ఆక్రమణలను తొలగించకుండానే వెనుదిరిగిన రెవెన్యూ సిబ్బంది.
అధికారుల ఫిర్యాదుతో ఆక్రమణదారులను అరెస్ట్ చేసిన పోలీసులు.
-
Jan 11, 2026 09:26 IST
కొనసాగుతున్న సంక్రాంతి పండుగ రద్దీ
సొంతూళ్లకు హైదరాబాద్ వాసుల పయనం..
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే, బస్టాండ్లు..
హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు..
12, 13, 18, 19 తేదీల్లో అందుబాటులో స్పెషల్ ట్రైన్స్.
-
Jan 11, 2026 09:21 IST
హింసాత్మకంగా మారిన నిరసనలు..
ఇరాన్‌లోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 వారాల నుంచి నిరసనలు..
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో నిరసనలు..
ఇప్పటివరకు 72 మంది మృతి, 2,300 మంది అరెస్ట్..
ఇరాన్‌లో నిరసనలతో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేత..
ఇరాన్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్న అమెరికా..
కాల్పులు జరిపితే చావు దెబ్బ కొడతామని హెచ్చరించిన అమెరికా.