-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Latest Breaking viral trending National International Andhra Pradesh and Telangana Live Updates on Jan 6th kjr
-
Breaking News: విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారో: మంత్రి లోకేష్
ABN , First Publish Date - Jan 06 , 2026 | 06:20 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 06, 2026 21:28 IST
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారో: మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు: లోకేష్
మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై నిఘా పెట్టాలి: మంత్రి లోకేష్
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చట్టాలపై అధ్యయనం చేయాలి: మంత్రి లోకేష్
-
Jan 06, 2026 19:30 IST
అమరావతి: మరోసారి మంత్రి లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్
బుధవారం విశాఖ 12వ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టుకు మంత్రి
తప్పుడు రాతలపై సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేసిన లోకేష్
సాక్షి తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో...
విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్
-
Jan 06, 2026 19:18 IST
ABNతో మావోయిస్టు నేత, PLGA కమాండర్ బర్సే దేవా
తెలంగాణ పోలీసులకు నా అంతట నేను లొంగిపోలేదు: ABNతో బర్సే దేవా
బయటికెళ్తున్న నేను పోలీసులకు చిక్కడంతోనే లొంగిపోవాల్సి వచ్చింది
పార్టీలో దేవ్ జీ, గణపతి ఎక్కడ ఉన్నారో తెలియదు: ABNతో బర్సే దేవా
దేవ్ జీ, గణపతి.. నాకు ముఖపరిచయం కూడా లేరు: ABNతో బర్సే దేవా
నేను పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు: ABNతో బర్సే దేవా
గతేడాది అక్టోబర్‌లో హిడ్మాతో కలిసే ఉన్నా: ABNతో బర్సే దేవా
హిడ్మాతో చాలాకాలం పాటు కలిసి పనిచేశా: ABNతో బర్సే దేవా
లొంగిపోవాలనే ఆలోచన నాకు, హిడ్మాకు ఎప్పుడూ లేదు: బర్సే దేవా
మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోతోంది: ABNతో బర్సే దేవా
టవర్, హెలికాప్టర్ షాట్ వెపన్స్‌ను పోలీసుల నుంచే తీసుకెళ్లాం: బర్సే దేవా
హిడ్మా నా పక్క గ్రామం అయినందున పరిచయం ఎక్కువ: బర్సే దేవా
మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి: ABNతో బర్సే దేవా
ప్రభుత్వాల దగ్గర ఉన్న టెక్నాలజీ మావోయిస్టుల దగ్గర లేదు: బర్సే దేవా
-
Jan 06, 2026 19:18 IST
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు..
సంక్రాంతికి APSRTC 8,432 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి 2,432 బస్సులు
ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే: APSRTC
-
Jan 06, 2026 18:21 IST
HILT పాలసీని స్వాగతిస్తున్నా: ఎమ్మెల్యే దానం నాగేందర్
సీఎం రేవంత్‌రెడ్డికి ఒక విజన్, ఆలోచన ఉన్నాయి: దానం
తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం చేరుకోవడం పక్కా: దానం
-
Jan 06, 2026 18:19 IST
తెలంగాణ హైకోర్టుకు నటి రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్
డ్రగ్స్ కేసులో తనపై నమోదైన FIR క్వాష్ చేయాలని పిటిషన్
డ్రగ్స్ కేసులో అమన్‌ప్రీత్ సింగ్‌ను A7గా చేర్చిన పోలీసులు
కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న అమన్‌ప్రీత్ సింగ్
అమన్‌ప్రీత్ పిటిషన్‌పై విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా
-
Jan 06, 2026 18:19 IST
పురుగులమందు తాగుతూ మహిళ సెల్ఫీ వీడియో
నంద్యాల మూలాన్‌పేటలో పురుగులమందు తాగుతూ మహిళ సెల్ఫీ వీడియో
అత్తింటివారు వేధింపులు భరించలేక సూసైడ్ అంటూ ఆయేషా వీడియో
నంద్యాల ఆసుపత్రికి ఆయేషా తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు
-
Jan 06, 2026 18:18 IST
అమరావతి: మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల పోస్టింగ్స్‌పై చర్చ
మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీవోఎం నిర్వహణ
-
Jan 06, 2026 17:55 IST
అమరావతి: భూ రికార్డుల్లో తప్పులకు జగన్ పాలనే కారణం: మంత్రి అనగాని
జగన్ ప్రభుత్వం జరిపిన రీసర్వే 1.0లో తప్పులు దొర్లాయి: మంత్రి అనగాని
రీ సర్వే 1.0పై గ్రామసభలు పెడితే 2.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయి: అనగాని
విస్తీర్ణంపై రీసర్వే సమయంలో రైతులు చెప్పిన సరిహద్దులే కీలకం: అనగాని
-
Jan 06, 2026 17:19 IST
ఢిల్లీ: 55 సాహిత్య గ్రంథాలు ఆవిష్కరించిన ధర్మేంద్ర ప్రధాన్
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఒడిశా గ్రంథాలు విడుదల
శాస్త్రీయ భాషలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుంది: ధర్మేంద్ర ప్రధాన్
-
Jan 06, 2026 17:19 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో CRDA అథారిటీ భేటీ
అమరావతిలో ప్రాజెక్ట్‌లకు ప్రారంభమవుతున్న ల్యాండ్ పూలింగ్
అమరావతి: 16,666.57 ఎకరాల భూమి సమీకరించనున్న CRDA
రైల్వేలైన్, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ, IRR కోసం ల్యాండ్ పూలింగ్
పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో భూసమీకరణ
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూసమీకరణ
అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు,...
ఎండ్రాయి, కర్లపూడి లేమల్లె గ్రామాలు ఎంపిక
తుళ్లూరు మండలంలోని వద్దమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఎంపిక
రేపు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలతో పాటే ప్రక్రియ ప్రారంభం
-
Jan 06, 2026 16:39 IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ-NCR వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కాలుష్యానికి కారణాలు, పరిష్కారాలపై నివేదిక కోరిన ధర్మాసనం
సమగ్ర నివేదికను ప్రజాక్షేత్రంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశం
-
Jan 06, 2026 13:50 IST
దక్షిణ నేపాల్‌లో అల్లర్లు, పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
టిక్ టాక్ వీడియోతో రెండు వర్గాల మధ్య ఘర్షణ..
నేపాల్-భారత్ సరిహద్దులు మూసివేత..
టిక్ టాక్ వీడియోను వైరల్ చేసిన ఇద్దరు యువకులు..
వైరల్ వీడియోతో బిర్‌గంజ్, పర్సాలో అల్లర్లు, కర్ఫ్యూ.
-
Jan 06, 2026 13:37 IST
మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై చర్చ
బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..
మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై చర్చ ప్రారంభం.
-
Jan 06, 2026 13:04 IST
18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 18న కుటుంబ సమేతంగా మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి..
రాత్రి మేడారంలోనే బస చేయనున్న సీఎం..
19న ఉదయం కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం..
మేడారం గద్దెలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం..
మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుని రాత్రి దావోస్‌కు సీఎం పయనం..
23 వ తేదీ వరకు దావోస్‌లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న సీఎం
24న దావోస్ నుంచి యూఎస్‌కి వెళ్లనున్న సీఎం..
తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ హైదరాబాద్‌కి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.
-
Jan 06, 2026 13:01 IST
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
జనవరి 31 వ తేదీన తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం..
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర బడ్జెట్.. తొలిసారిగా ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వం
బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్ _ వన్ ఎలక్షన్ , 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం.
-
Jan 06, 2026 12:58 IST
పరకామణి కేసులో ముగ్గురిపై క్రిమినల్ కేసులు..
పరకామణి కేసులో అప్పటి CI జగన్‌మోహన్‌రెడ్డి, టూ టౌన్ CI చంద్రశేఖర్ ప్రమేయం..
నిందితుడు రవికుమార్ ఆస్తులు పరిశీలించిన SI లక్ష్మీ రెడ్డికి కూడా కేసుతో ప్రమేయం..
ఇప్పటికే ఈ ముగ్గురిని VRకు పంపిన పోలీసుశాఖ..
హైకోర్టు తాజా ఆదేశంతో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న AP CID..
కేసుకు సంబంధించి కొన్ని పత్రాలు తారుమారు చేశారనే.. అభియోగాలు ఎదుర్కొంటున్న వన్‌టౌన్ CI విజయ్‌కుమార్..
వన్‌టౌన్ CI విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తారా? లేదా అన్న దానిపై ఉత్కంఠ.
-
Jan 06, 2026 12:57 IST
భోగాపురం విమానాశ్రయంపై ప్రజెంటేషన్ ఇచ్చిన పట్టాభిరామ్
భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు తెచ్చామంటూ..
వైసీపీ అవాస్తవాల ప్రచారం చేస్తోంది: పట్టాభిరామ్
2016లోనే విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ అనుమతులు: పట్టాభిరామ్
భోగాపురం విమానాశ్రయ అంకురార్పణ చంద్రబాబు చేశారు: పట్టాభిరామ్
-
Jan 06, 2026 11:45 IST
పడవ బోల్తా.. వ్యక్తి మృతి..
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో సముద్రంలో బోటు బోల్తా..
గోపాలరావు అనే మత్సకారుడు మృతి..
సురక్షితంగా బయటపడిన నలుగురు మత్సకారులు.
-
Jan 06, 2026 11:15 IST
రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం
ఢిల్లీ: రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం..
కేంద్ర క్యాబినెట్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం.
-
Jan 06, 2026 10:53 IST
2.89 కోట్ల ఓట్ల తొలగింపు
SIRలో భాగంగా యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు..
ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలకు అవకాశం, మార్చి 6న తుది జాబితా.
-
Jan 06, 2026 10:33 IST
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్-2047పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ..
జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులను మండలిలో పెట్టనున్న ప్రభుత్వం.
-
Jan 06, 2026 09:50 IST
ముక్కంటి గోశాల వద్ద.. కొండచిలువ కలకలం..
తిరుపతి: ముక్కంటి గోశాల వద్ద కొండచిలువ కలకలం..
శ్రీకాళహస్తి పట్టణం భరద్వాజతీర్థంలోని ముక్కంటి ఆలయ గోశాల సమీపంలో సోమవారం కొండచిలువ కనిపించింది..
కొండ చిలువను పట్టుకుని కైలాసగిరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సిబ్బంది..
సుమారు 10 అడుగు పొడువు, 20 కిలోల బరువు ఉన్న ట్లుగా అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
-
Jan 06, 2026 09:00 IST
ఇద్దరు పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్యాయత్నం
నారాయణపేట: మరికల్ మండలం తీలేరులో దారుణం..
ఇద్దరు పిల్లలను చంపి తండ్రి శివరాములు ఆత్మహత్యాయత్నం..
ఇద్దరు పిల్లలను చంపి యాపల్ చెరువులో పడేసిన తండ్రి..
విద్యుత్ తీగను పట్టుకుని శివరాములు ఆత్మహత్యాయత్నం..
ఆ తర్వాత పురుగుల మందు తాగిన శివరాములు..
శివరాములు పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
-
Jan 06, 2026 08:58 IST
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి(81) కన్నుమూత..
పుణెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్మాడి మృతి..
1964-1972 వరకు వాయుసేనలో పైలట్‌గా కల్మాడి విధులు..
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు.
-
Jan 06, 2026 07:41 IST
పిచ్చి కుక్క స్పైర విహారం.. ఒక్క రోజే 50మంది పై దాడి..
నిర్మల్: భైంసా లో పిచ్చి కుక్క భీభత్సం, నిన్న ఒక్క రోజే 50మంది పై దాడి..
బాధితుల్లో నలుగురు చిన్నారులు, 20మంది మహిళలు, 26మంది పురుషులు..
కుక్క కాటు బాధితులతో ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట..
మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికుల అగ్రహం..
ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆవేదన.
-
Jan 06, 2026 07:26 IST
నేడు తిరుమలకు మారిషస్ అధ్యక్షుడు..
తిరుపతి: శ్రీవారి దర్శనార్థం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ నేడు తిరుమలకు రాక..
ఉదయం 11.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లి ముక్కంటి దర్శనం..
మధ్యాహ్నం 1.15 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న ధరమ్ బీర్ గోకుల్..
అనంతరం తాజ్ హోటల్‌లో విశ్రాంతి.. సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస..
బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి దర్శనం..
అనంతరం ధర్మగిరిలోని వేదవిజ్ఞానపీఠాన్ని సందర్శించి తిరుమల నుంచి తిరుగు ప్రయాణం..
మారిషస్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన జిల్లా అధికారులు.
-
Jan 06, 2026 07:23 IST
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం..
తిరుపతి: వాతావరణం, పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం..
రేణిగుంట ఎయిర్‌పోర్టులో సోమవారం ఆలస్యంగా నడిచిన పలు విమానాలు..
శివమొగ్గ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చి 1.20కి శివమొగ్గకు వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానం ఆలస్యం..
హైదరాబాదు నుంచి 11.45 గంటలకు వచ్చి 12.00 కి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం 12.20కు వచ్చి 3.20కి బయలుదేరి వెళ్లింది.
-
Jan 06, 2026 07:21 IST
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు పులికాట్ తీరం ముస్తాబు..
తిరుపతి: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు పులికాట్ తీరం ముస్తాబు..
సూళ్లూరుపేట వేదికగా ఈ నెల 10, 11 తేదీల్లో పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు అటవీ శాఖ సర్వం సిద్ధం..
పులికాట్ సరస్సులో పక్షులను వీక్షించేందుకు వచ్చే సందర్శకుల కోసం తగిన ఏర్పాట్లు..
10 కిలోమీటర్ల మేర పక్షులను వీక్షించేందుకు 5 వ్యూ పాయింట్లు సిద్ధం..
నేడు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అధ్వర్యంలో సుళ్లూరుపేటలో విద్యార్థులతో ర్యాలీ.
-
Jan 06, 2026 07:10 IST
ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్
కోనసీమ: ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్..
ONGC వర్క్ ఓవర్ రిగ్ సైట్‌లో కొనసాగుతోన్న మంటలు..
ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు..
కోనసీమ జిల్లా కలెక్టర్, రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇరుసుమండ బ్లోఅవుట్‌తో ప్రజలకు ఇబ్బందులు రాకూడదు: పవన్ కల్యాణ్
-
Jan 06, 2026 06:56 IST
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు..
ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
నేడు హిల్ట్ పాలసీపై చర్చించనున్న ప్రభుత్వం.
-
Jan 06, 2026 06:28 IST
ఢిల్లీలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు..
పలు చోట్ల సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.
-
Jan 06, 2026 06:22 IST
నేడు ఆదిలాబాద్ బంద్‌కు BRS పిలుపు
RTC డిపో ఎదుట బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళన..
డిపోలోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు..
సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్.