-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International trending Live Updates of 4th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 04 , 2026 | 08:07 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 04, 2026 10:08 IST
అమరావతి: నేడు విజయవాడ వేదికగా అమరావతి ఏఐ సమ్మిట్
రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌టీపీఐ ఆధ్వర్యంలో సదస్సు
కృత్రిమ మేధపై అవగాహన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో సదస్సు
విద్యార్థులకు కెరీర్ పట్ల స్పష్టత, టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడంపై దిశానిర్దేశం
అమరావతి రీజియన్‌లో జరుగుతున్న అతిపెద్ద ఏఐ సమ్మిట్
-
Apr 04, 2026 10:08 IST
నెల్లూరు: సంగం మండలం కోలగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎదురుగా లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఐదుగురికి గాయాలు
అనంతపురం నుండి నెల్లూరు వైపు వెళుతుండగా ప్రమాదం
-
Apr 04, 2026 09:15 IST
సూర్యాపేట: కాలేజీ భవనం పైనుంచి దూకిన బీటెక్ విద్యార్థిని మైను(21)
కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
భవనంపై నుండి దూకడంతో తీవ్రగాయాలు
హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలింపు
బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న మైను
-
Apr 04, 2026 09:00 IST
హైదరాబాద్: అత్తాపూర్‌లో రెచ్చిపోయిన జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్
యువకుడు సద్దాంని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చితక బాదిన గ్యాంగ్
విచక్షణా రహితంగా కర్రలతో కొట్టడంతో సద్దాంకు తీవ్రగాయాలు
సద్దాంను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
Apr 04, 2026 08:33 IST
ప్రజాస్వామ్యాన్ని క్యాతనపల్లి కౌన్సిలర్లు కాపాడారు: గంగుల కమలాకర్
మంత్రి వివేక్ ప్రజాస్వామ్యన్ని కాపాడాలి
ప్రజల తీర్పును వివేక్ గౌరవించాలి
పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించం
అవాంచనీయ ఘటనలు జరగకుండా వివేక్ చూడాలి
ఈరోజు బీఆర్ఎస్ డే.. మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంటాం
-
Apr 04, 2026 08:21 IST
హైదరాబాద్: క్యూనెట్ కేసులో కీలక విషయాలు రాబట్టిన సెట్
10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సెట్
ఐటీ ఉద్యోగులకు బ్యాంక్ లోన్‌లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా చేసిన నిందితులు
ఒక్కో ఏజెంట్‌కు 500 మంది ఐటీ ఉద్యోగులు టార్గెట్
క్యూనెట్‌లో చిక్కుకుని EMIలు కడుతున్న ఐటీఉద్యోగులు
బాధితులతో ముందుగానే బాండ్ రాయించుకున్న ఏజెంట్లు
-
Apr 04, 2026 08:20 IST
హైదరాబాద్: నేడు సీఐడీ విచారణకు కౌశిక్‌రెడ్డి
11 గంటలకు CID ఆఫీస్‌లో విచారణకు రానున్న కౌశిక్‌రెడ్డి
తనపై నమోదైన కేసులో విచారణకు హాజరుకానున్న కౌశిక్‌రెడ్డి
-
Apr 04, 2026 08:17 IST
అఫ్గానిస్థాన్: దారావన్‌లో భూ ప్రకంపనలు, 8 మంది మృతి
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదు
ఢిల్లీ సహా ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
-
Apr 04, 2026 08:17 IST
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
-
Apr 04, 2026 08:16 IST
నేడు తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన
చెన్నైలో అన్నాడీఎంకే నేతలతో భేటీ కానున్న మోదీ
-
Apr 04, 2026 08:16 IST
నేడు ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీలో మొత్తం వార్డులు 24
బీఆర్ఎస్-13, కాంగ్రెస్-8, బీజేపీ-2, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు
గతంలో 19వ వార్డు యాదగిరి కిడ్నాప్ వివాదంతో ఎన్నిక వాయిదా
-
Apr 04, 2026 08:14 IST
నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
ఖానాపూర్ మున్సిపాల్టీలో మొత్తం వార్డులు 12
బీజేపీ-4, బీఆర్ఎస్-4, కాంగ్రెస్-3, ఇండిపెండెంట్-1
ఖానాపూర్ మున్సిపాల్టీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్
ఖానాపూర్ మున్సిపాల్టీలో మ్యాజిక్ ఫిగర్-7
ఎమ్మెల్యే, ఎక్స్ అఫిషియో, ఇండిపెండెంట్ కౌన్సిలర్, మరో బీఆర్ఎస్ కౌన్సిలర్‌తో కలిపి 6కు చేరిన కాంగ్రెస్ బలం
-
Apr 04, 2026 08:13 IST
నేడు క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల కోసం బీఆర్ఎస్-సీపీఐ కూటమి, కాంగ్రెస్ ప్రయత్నాలు
మొత్తం వార్డులు 22, రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు
బీఆర్ఎస్-సీపీఐ బలం 14, ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10
క్యాతనపల్లి మున్సిపాల్టీలో మ్యాజిక్ ఫిగర్ 13
కూటమిలో చీలికపైనే కాంగ్రెస్ ఆశలు
-
Apr 04, 2026 08:12 IST
IPLలో నేడు రెండు మ్యాచ్‌లు
IPLలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ Vs ముంబై ఇండియన్స్
ఢిల్లీలో మ.3:30 గంటలకు మ్యాచ్
అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు గుజరాత్ Vs రాజస్థాన్ మ్యాచ్
-
Apr 04, 2026 08:12 IST
ఏపీలో నేటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు
23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
-
Apr 04, 2026 08:07 IST
నేడు రాయచూర్‌లో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన
హోసల్లీ క్యాంప్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేంద్రమంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్, మంత్రి లోకేష్
శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నేతలు