Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 31 , 2026 | 06:12 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 31, 2026 07:23 IST

    నంద్యాల: శ్రీశైలం జలాశయంలో అడుగంటిన నీటి నిల్వలు

    • ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 44 టీఎంసీలు

    • విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన ఇరు రాష్ట్రాలు

    • పది నెలల్లో ఏపీ 2,060 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

    • తెలంగాణ 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

  • Mar 31, 2026 07:10 IST

    నేడు కేరళంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం

    • కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

    • మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు

    • బులుస్సేరి నుంచి నన్మండ వరకూ రాహుల్ బస్సు యాత్ర

    • సాయంత్రం కోలులాండి నుంచి కొల్లాం వరకూ రోడ్‌షో

  • Mar 31, 2026 07:09 IST

    హైదరాబాద్: నేడు మహావీర్ జయంతి

    • మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశం

    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అధికారులు

  • Mar 31, 2026 07:09 IST

    నేడు కేరళలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Mar 31, 2026 07:08 IST

    నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • సనంద్‌లో కేన్స్‌ సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

  • Mar 31, 2026 07:07 IST

    రంగారెడ్డి: అత్తాపూర్‌లో పోలీసుల ముందు యువకుల స్టంట్స్

    • రక్షక్ పోలీస్ వాహనం ముందే ప్రమాదకర విన్యాసాలు

    • పోలీస్ వాహనం కనిపించేలా వీడియో చిత్రీకరణ

    • ఇద్దరు యువకులను పట్టుకున్న పోలీసులు

  • Mar 31, 2026 06:52 IST

    విజయవాడలో ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు

    • షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో చెలరేగిన మంటలు

    • హుటాహుటిన ప్రయాణికులను దించిన డ్రైవర్‌

    • సురక్షితంగా బయటపడ్డ 34 మంది ప్రయాణికులు

    • రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్‌ బస్సు

  • Mar 31, 2026 06:18 IST

    తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల వసంతోత్సవాలు

    • ఉదయం 8గంటలకు బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు

    • తర్వాత వసంత మండపంలో వసంతోత్సవం

  • Mar 31, 2026 06:17 IST

    దేశ వ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు

    • పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్ల బంద్‌

    • ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో..

    • స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

  • Mar 31, 2026 06:16 IST

    హైదరాబాద్‌: మియాపూర్‌లో తప్పిన పెను ప్రమాదం

    • హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్‌తో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

    • ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం, రెండు టూవీలర్ల దగ్ధం

  • Mar 31, 2026 06:15 IST

    చెన్నై: నేడు తిరువారూర్‌లో సీఎం స్టాలిన్ ప్రచారం

    • సౌత్‌కార్ స్ట్రీట్‌లో సీఎం స్టాలిన్‌ బహిరంగ సభ

    • 3 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో స్టాలిన్ ప్రచారం

  • Mar 31, 2026 06:15 IST

    నేడు LPGతో ముంబై చేరుకోనున్న నౌక

    • రేపు న్యూ మంగళూరు చేరుకోనున్న మరో LPG నౌక

  • Mar 31, 2026 06:14 IST

    ఆపరేషన్‌ కగార్‌కు నేడే చివరి రోజు

    • నేటితో ముగియనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డెడ్‌లైన్‌

    • అజ్ఞాతంలోనే అగ్ర నేతలు గణపతి, బెస్రా, నరహరి

  • Mar 31, 2026 06:13 IST

    IPL: నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్‌

    • న్యూ చండీగఢ్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • Mar 31, 2026 06:12 IST

    నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు: విపత్తు నిర్వహణ శాఖ

    • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు