Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 02 , 2026 | 07:23 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 02, 2026 08:39 IST

    జూబ్లీహిల్స్‌‌లో మరో చోరీ

    • వృద్ధ దంపతుల ఇంట్లో వజ్రపు ఉంగరాలు మాయం

    • ఇంట్లో కేర్ టేకర్లుగా పనిచేస్తున్న వారిపై కేసు నమోదు

    • దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

  • Apr 02, 2026 08:38 IST

    కోనసీమ: మూసివేసిన ONGC బావి నుంచి గ్యాస్‌ లీక్‌

    • గ్యాస్‌ లీకేజీ అరికట్టేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నం

    • భయాందోళనలో పి.గన్నవరం మం. బెల్లంపూడి ప్రజలు

    • సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌

  • Apr 02, 2026 08:37 IST

    ఏపీలో కొనసాగుతున్న NTR వైద్య సేవల బంద్‌

    • బకాయిలు చెల్లించే వరకు బంద్‌ ఉంటుందన్న ఆస్పత్రులు

    • రూ.1,000 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం

    • హామీపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి

    • మొత్తం రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్

  • Apr 02, 2026 08:36 IST

    నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న గవర్నర్‌ నజీర్‌

    • ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ పనుల పరిశీలన

    • అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న గవర్నర్‌

  • Apr 02, 2026 08:36 IST

    కాకినాడ: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్

    • విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం

  • Apr 02, 2026 08:35 IST

    సీఎం చంద్రబాబు షెడ్యూల్‌

    • ఉ.8:30కి కడప ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు సీఎం

    • ఉ.11 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివాహానికి చంద్రబాబు

    • టీడీపీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం

    • మ.12:30కి ఉండవల్లికి తిరుగు ప్రయాణం

    • రా.7:30కి కుంచనపల్లిలో మరో వివాహానికి హాజరు

  • Apr 02, 2026 08:35 IST

    హైదరాబాద్‌: హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర

    • గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ ఆలయం వరకు శోభాయాత్ర

    • ఉదయం 11:30 గంటలకు ప్రారంభంకానున్న శోభాయాత్ర

    • హనుమాన్ శోభాయాత్ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

    • ఊరేగింపు రూట్లలో భారీ వాహనాలపై ఆంక్షలు

  • Apr 02, 2026 08:34 IST

    హైదరాబాద్‌: నేటి నుంచి జేఈఈ తుది విడత పరీక్షలు

  • Apr 02, 2026 08:34 IST

    ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డికి కాటా శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌

    • ఉదయం 11 గంటలకు బీరంగూడ శివాలయానికి రావాలి

    • ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దాం

    • తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ మహిపాల్‌రెడ్డికి కాటా శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌

  • Apr 02, 2026 08:33 IST

    కేరళలో సీఎం రేవంత్ పర్యటన

    • రెండో రోజు కేరళలో రేవంత్ ఎన్నికల ప్రచారం

  • Apr 02, 2026 08:33 IST

    నేడు తెలంగాణవ్యాప్తంగా గ్రామసభలు

    • ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ

  • Apr 02, 2026 08:32 IST

    హనుమకొండ: అయినవోలు మం. పున్నెలులో విషాదం

    • ధరణి లేఅవుట్‌ స్విమ్మింగ్ పూల్‌లో మూడు మృతదేహాలు గుర్తింపు

    • మృతులు ఫర్హానాత్(26), ఉబేర(9), ఆయేషా (5)

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Apr 02, 2026 08:31 IST

    ఇరాన్‌కు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం తగ్గిపోయింది: ట్రంప్‌

    • ఇరాన్‌ను రాతియుగానికి నెట్టేస్తాం

    • అవసరమైతే ఇరాన్‌ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటాం

    • డీల్‌ కుదరకపోతే ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది

  • Apr 02, 2026 08:30 IST

    గల్ఫ్‌ దేశాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం: ట్రంప్‌

    • సౌదీ, కువైట్‌, బహ్రెయిన్‌కు భద్రత కల్పిస్తాం

    • అమెరికా పిల్లల భవిష్యత్‌ భద్రంగా ఉండటానికే చర్యలు

    • అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉంది

    • అమెరికాలో ఇంధన సమస్య తాత్కాలికమే

  • Apr 02, 2026 08:30 IST

    ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్‌

    • ఇరాన్‌లో పాలకవర్గం మార్పునకు ఒత్తిడి తీసుకురాలేదు

    • వియత్నాం యుద్ధం ముగియడానికి 19 ఏళ్లు పట్టింది

    • అమెరికన్ల భవిష్యత్‌ కోసమే ఈ యుద్ధం

    • 2-3 వారాల్లో భీకరదాడులు చేస్తాం

    • యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు

  • Apr 02, 2026 08:29 IST

    అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడి జరిగింది: ట్రంప్‌

    • 45 వేల మంది పౌరుల మృతికి కారణమైంది

    • ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాం

    • హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ కోసం వినియోగించుకోవాలి

    • హర్మూజ్‌ జలసంధి నుంచి ఎలాంటి చమురు అక్కర్లేదు

    • మా దేశంలోనే పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయి

    • సంక్షోభం ముగిశాక హర్మూజ్‌ జలసంధి తెరుచుకుంటుంది

    • అతి త్వరలో యుద్ధం సమాప్తం అవుతుంది

  • Apr 02, 2026 07:26 IST

    47 ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్‌ అంతం కావాలని ఇరాన్‌ కోరిక

    • అమెరికాను శక్తివంతమైన దేశంగా మారుస్తున్నాం: ట్రంప్‌

    • ఇరాన్‌ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోంది: ట్రంప్‌

    • నా పాలనలో ఎన్నో విజయాలను సాధించాం: ట్రంప్‌

    • గత అధ్యక్షులు చేసిన తప్పులను సరిచేస్తున్నా: ట్రంప్‌

  • Apr 02, 2026 07:25 IST

    ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన

    • యుద్ధంతో ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగింది: ట్రంప్‌

    • ఇరాన్‌ కీలక నేతలను అంతం చేశాం: ట్రంప్‌

    • ఇరాన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసం చేశాం: ట్రంప్‌

    • అమెరికా భద్రత కోసం ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ అవసరం

    • ఇరాన్‌ అణ్వయుధాలు తయారుచేయకుండా చేశాం: ట్రంప్‌

    • ఇరాన్‌లో అధికార మార్పిడి కూడా జరిగింది: ట్రంప్‌

  • Apr 02, 2026 07:23 IST

    మళ్లీ పెరిగిన క్రూడాయిల్‌ ధరలు

    • 4 శాతం పెరిగిన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర

    • 105 డాలర్లకు పైగా ట్రేడవుతున్న బ్యారెల్‌ క్రూడాయిల్‌