Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 04 , 2026 | 07:10 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 04, 2026 21:43 IST

    అమరావతి: జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన

    • 2024–29 మధ్య 3 రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా నిర్ణయం: జనసేన

    • ఏపీ నుంచి ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌

    • 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి కేటాయించారు: జనసేన

    • పార్టీ రాజ్యసభ అభ్యర్థిని అధ్యక్షులు పవన్‌ నిర్ణయిస్తారు: జనసేన

    • ఆ తర్వాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది: జనసేన

  • Jun 04, 2026 21:29 IST

    ఉత్తమ పర్యాటక ప్రమోషన్‌ రాష్ట్రంగా ఏపీ

    • కేరళ పర్యాటక మంత్రి విశ్వనాథ్ చేతులమీదుగా పురస్కారం అందుకున్న మంత్రి దుర్గేష్

    • ఏపీ ప్రజల సంయుక్త కృషికి దక్కిన ఫలితం: దుర్గేష్‌

    • రికార్డు స్థాయిలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు

    • అంతర్జాతీయ పర్యాటకుల్లో 48% ప్రగతి: మంత్రి కందుల దుర్గేష్

  • Jun 04, 2026 21:29 IST

    ఎన్టీఆర్‌: రేపు మూలపాడుకు డిప్యూటీ సీఎం పవన్

    • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యటన

    • మూలపాడు సీతాకోకచిలుకల పార్క్‌ను సందర్శించనున్న పవన్

  • Jun 04, 2026 20:08 IST

    ఒక్క ఇంటికి రూ.1,27,79,406 కరెంట్‌ బిల్లు

    • సూర్యాపేట: పాలకీడు మండలం కొత్త తండాలో షాకింగ్ ఘటన

    • ఒక్క ఇంటికి రూ.1,27,79,406 కరెంట్‌ బిల్లు

    • బిల్లు చూసి షాకైన ఇంటి యజమాని

    • పొరపాటున బిల్లు పడిందంటున్న ట్రాన్స్‌కో అధికారులు

  • Jun 04, 2026 20:06 IST

    మృతదేహం మెడలో బంగారు గొలుసు మాయం

    • యాదాద్రి: భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

    • మహిళ మృతదేహం మెడలో 3 తులాల బంగారు గొలుసు మాయం

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు

  • Jun 04, 2026 20:01 IST

    హైదరాబాద్‌లో TMUS గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం

    • హైటెక్ సిటీలో కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

    • 2.5 లక్షల చదరపు అడుగుల్లో అత్యాధునిక టెక్ సెంటర్

    • 2027 చివరినాటికి 1000 మందికిపైగా ఉద్యోగాల కల్పన

    • టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్‌బాబు

    • పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యం తెలంగాణ: శ్రీధర్‌బాబు

  • Jun 04, 2026 19:30 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నివాసంలో ముగిసిన NDA నేతల భేటీ

    • రాజ్యసభ సీట్లపై చర్చించిన NDA నేతలు

    • జనసేనకు ఒక రాజ్యసభ కేటాయింపు

    • టీడీపీకి 3 రాజ్యసభ స్థానాలు

    • సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం

    • SIRపై మూడు పార్టీల నేతలు కలిసి సమన్వయ కమిటీలు

  • Jun 04, 2026 19:16 IST

    విజయవాడ: పోక్సో కోర్టు విచారణకు గోరంట్ల మాధవ్‌ గైర్హాజరు

    • మాధవ్‌ తరఫున గైర్హాజరు పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదులు

    • అత్యాచారానికి గురైన మైనర్‌ వివరాలు వెల్లడించిన కేసు విచారణ

    • మాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై కేసు

    • కేసు విచారణ జులై 13కి వాయిదా వేసిన విజయవాడ పోక్సో కోర్టు

  • Jun 04, 2026 19:02 IST

    బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల

    • 11 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

    • గుజరాత్‌- రాజుభాయ్‌ శుక్లా, మాన్‌సింగ్‌

    • గుజరాత్‌- ముకేష్‌ భాయ్‌ రత్నా, జితేంద్ర

    • మధ్యప్రదేశ్‌- తరుణ్‌ చుగ్‌, రజనీష్‌ అగర్వాల్‌

    • రాజస్థాన్‌- అల్కా గుర్జార్‌, సతీష్‌ పూనియా

    • ఒడిశా- దేబాశిష్‌ సమంత రే

    • మణిపూర్‌- శారదా దేవి

    • అరుణాచల్‌ ప్రదేశ్‌- తాయి తాగాక్‌

  • Jun 04, 2026 18:28 IST

    వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

    • వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సన్నద్ధం చేయాలి: మంత్రి తుమ్మల

    • ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ సాగుపై గ్రామసభల్లో అవగాహన

    • తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలి: మంత్రి తుమ్మల

    • ఎల్లుండి సీఎం చేతుల మీదుగా కొహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన

    • వ్యవసాయశాఖ ఖాళీ భూముల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి తుమ్మల

  • Jun 04, 2026 18:27 IST

    అమీర్‌పేట్‌ అగ్నిప్రమాదంలో 1043 నంబర్‌ పిల్లర్‌కు తాకిన మంటలు

    • మెట్రో పిల్లర్‌కు క్రాక్‌ రావడంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు

    • పిల్లర్‌ నాణ్యతను చెక్‌ చేస్తున్న JNTU నిపుణులు

    • ప్రత్యేక డివైజ్‌లతో పిల్లర్‌‌కు సామర్థ్య పరీక్షలు

    • ప్రమాద తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు

    • నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న మెట్రో అధికారులు

  • Jun 04, 2026 17:41 IST

    కర్నూలు: కర్ణాటక-టుమ్కూర్‌ రహదారిపై ప్రమాదం

    • ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి

    • మరో ముగ్గురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

    • మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు

  • Jun 04, 2026 17:40 IST

    సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం

    • అక్బర్ పేట- భూంపల్లి మండలం కూడవెల్లి అగ్రహారంలో చెట్టుపై పడిన పిడుగు

    • కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు.. ఆందోళనలో రైతులు

  • Jun 04, 2026 17:28 IST

    మేడ్చల్: బోడుప్పల్‌లో పార్క్‌ చేసిన 3 కార్ల దగ్ధం

    • చెత్తకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించి దగ్ధమైన కార్లు

  • Jun 04, 2026 17:26 IST

    మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే

    • సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం రేవంత్‌ రెడ్డి

    • కోయిల్‌ సాగర్‌, జూరాల ప్రాజెక్టు డ్యామ్‌ తదితరాలను పరిశీలించిన సీఎం

    • కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సీఎం రేవంత్‌ రెడ్డి

  • Jun 04, 2026 17:25 IST

    రంగారెడ్డి: రాజేంద్రనగర్, కాటేదాన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

    • మిర్చి, పసుపు ప్రాసెసింగ్ కంపెనీల్లో H-Fast, ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు

    • ప్రాసెసింగ్ కేంద్రంలో కుళ్లిన స్థితిలో మిర్చి, పసుపు, ధాన్యాల గుర్తింపు

    • నిబంధనలు పాటించని కంపెనీలపై కేసులు నమోదు చేసిన అధికారులు

  • Jun 04, 2026 17:22 IST

    తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు

    • ఏరియాను బట్టి భూముల రేట్లు 50 నుంచి 100 శాతం పెంపు

    • ప్రైమ్ ఏరియాలో ధరలు 100 శాతం పెంపు: మంత్రి పొంగులేటి

    • వ్యాల్యూ పెరగటంతో ప్రభుత్వానికి రూ.1200 నుంచి రూ.1400 కోట్ల ఆదాయం

    • శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడలో ధరల పెంపు లేదు: పొంగులేటి

    పూర్తి కథనం..

  • Jun 04, 2026 17:21 IST

    తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం

    • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం

    • లోతట్టు ప్రాంతాలు జలమయం, నిలిచిన విద్యుత్‌ సరఫరా

  • Jun 04, 2026 17:20 IST

    సికింద్రాబాద్‌లో విషాద ఘటన

    • వర్షంతో అదుపుతప్పి పడిపోయిన బైక్‌

    • బీటెక్‌ విద్యార్థి మదన్‌ మోహన్‌ పైనుంచి దూసుకెళ్లిన బస్సు

    • యువకుడు మదన్‌ మోహన్‌ అక్కడికక్కడే మృతి

  • Jun 04, 2026 17:19 IST

    అమరావతి: ప్రారంభమైన NDA నేతల సమావేశం

    • సీఎం చంద్రబాబు నివాసంలో NDA నేతల భేటీ

    • సమావేశానికి హాజరైన డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్

  • Jun 04, 2026 15:57 IST

    పోలవరం జిల్లా: దేవీపట్నం మండలం దండంగి కొండపై తిష్ట వేసిన పెద్దపులి

    • పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాల ప్రయత్నం

    • ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు

  • Jun 04, 2026 15:55 IST

    ఏపీ కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు

    • ఏపీ రిజర్వాయర్ల కేజ్‌ కల్చర్‌ పాలసీ ముసాయిదాకు ఆమోదం

    • ఏపీ ఏవియేషన్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం

    • మానవ అవయవ మార్పిడి చట్టం అమలు ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం

    • పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు పరిపాలన అనుమతులు

  • Jun 04, 2026 15:52 IST

    ప్రకాశం: ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాద ఘటన

    • నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల గల్లంతు

    • నీటికుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు లభ్యం

    • గల్లంతైన అభిరామ్‌ (14), సుశాంత్‌ (12), చిన్ను(11), దినేష్‌(10)

    • చిన్నారులంతా చెరుకుంపాలెం వాసులుగా గుర్తింపు

    • చిన్నారుల కోసం గజఈతగాళ్లతో గాలింపు

  • Jun 04, 2026 15:51 IST

    ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    • సెన్సెక్స్‌(14), నిఫ్టీ(11) పాయింట్ల లాభం

  • Jun 04, 2026 15:08 IST

    హైదరాబాద్: సచివాలయంలో ముగిసిన అఖిలపక్ష సమావేశం

    • కేకే అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో భేటీ

    • విద్యార్థులు, ఉద్యమకారుల సంఘాలను మళ్లీ కలుస్తాం: కేకే

    • ఉద్యమకారులందరినీ పిలిచి మాట్లాడతాం: కేకే

    • ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: కేకే

  • Jun 04, 2026 15:06 IST

    రష్యాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేష్‌ పర్యటన

    • రష్యా నోవోస్టల్-M చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో మంత్రి లోకేష్ భేటీ

    • భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి అవకాశాలను వివరించిన లోకేష్

    • భారత్‌లో అత్యాధునిక EAF స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి లోకేష్ ఆహ్వానం

    • శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

    • ఏపీలో ముడిపదార్థాల లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి లోకేష్‌ ప్రతిపాదన

    • లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని Novostal-M చైర్మన్ హామీ

  • Jun 04, 2026 14:47 IST

    రేపు సైకిల్‌పై ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు

    • అమరావతి: పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

    • విశాఖ పర్యటనలో పాల్గొనే కార్యక్రమానికి సైకిల్‌పై వెళ్లనున్న సీఎం చంద్రబాబు

    • ప్రజలు రేపు సైకిల్‌పై ప్రయాణించి, పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలన్న సీఎం

    • ప్రతి ఒక్కరూ రేపు ఒక మొక్క నాటి.. పచ్చదనాన్ని పెంపొందించాలి: సీఎం చంద్రబాబు

  • Jun 04, 2026 14:45 IST

    ఎమ్మెల్యేలు ఆకాశం నుంచి ఊడిపడలేదు: ABNతో మల్లు రవి

    • పార్టీ గీత ఎవరు దాటినా వేటు తప్పదు: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

    • చెప్పిన తర్వాత కూడా వినకపోతే చర్యలు: మల్లు రవి

    • కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు అత్యంత సహజం: మల్లు రవి

    • అందరినీ సమన్వయపరుస్తాం: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి

  • Jun 04, 2026 14:30 IST

    సిద్దిపేట : తోగుట మండలం పెద్దమాసానపల్లిలో మద్యపాన నిషేధం

    • గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ తీర్మానం

    • గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా రూ.50 వేల జరిమానా

    • సమాచారం ఇచ్చిన వారికి రూ. 1000 నజరానా

  • Jun 04, 2026 14:24 IST

    హైదరాబాద్‌లో ఎబోలా కలకలం

    • సుడాన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని ఐసోలేషన్‌కు తరలింపు

    • ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు

    • ఫీవర్‌ లక్షణాలు ఉండడంతో అప్రమత్తమైన అధికారులు

  • Jun 04, 2026 14:22 IST

    ఖమ్మం: పెనుబల్లి మండలం లంకాసాగర్‌లో దొంగల బీభత్సం

    • ఓ ఇంట్లో రూ.3.5 లక్షల నగదు, నాలుగు లక్షల విలువచేసే బంగారం చోరీ

    • మరో ఇంట్లో రూ. 20 వేల నగదు, రెండు కాసుల బంగారాన్ని అపహరించిన దుండగులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 04, 2026 14:02 IST

    హైదరాబాద్: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

    • పూర్తిగా కాలిపోయిన KSR షాపింగ్ కాంప్లెక్స్

    • 6 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

    • ప్రమాదంలో 20 షాపుల దగ్ధం, భారీగా ఆస్తి నష్టం

    • అమీర్‌పేట మెట్రో పిల్లర్‌ నెంబర్ 1043 దగ్గర ఘటన

    • ఎలాంటి ప్రాణనష్టం లేదని పోలీసుల ప్రకటన

  • Jun 04, 2026 14:00 IST

    హైదరాబాద్: అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్

    • అమీర్‌పేట-SR నగర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం

    • మెట్రో జంక్షన్ కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన

    • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన

  • Jun 04, 2026 13:02 IST

    హైదరాబాద్: అమీర్‌పేట్ మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం

    • షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో చెలరేగిన మంటలు

    • మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

  • Jun 04, 2026 13:00 IST

    అమరావతి: ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన నేలపాడు రైతు అశోక్

    • వైఎస్ జగన్‌ను కలిసి వచ్చిన వెంటనే భూమి ఇచ్చిన కాప అశోక్

    • మిగిలిన భూమిని కూడా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తుళ్లూరు CRDA ఆఫీస్‌లో ఇవ్వనున్నట్టు అశోక్ వెల్లడి

  • Jun 04, 2026 13:00 IST

    ఏపీ వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్

    • జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

    • అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకే కమిటీలు: పవన్

    • కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను పటిష్ఠం చేయడమే లక్ష్యం: పవన్

    • క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై నిర్ణయం: పవన్

  • Jun 04, 2026 12:46 IST

    హైదరాబాద్: చార్మినార్ వద్ద సందడి చేసిన కేటీఆర్

  • Jun 04, 2026 12:43 IST

    బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది: టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు

    • తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది: రాంచందర్ రావు

    • జాబ్ క్యాలెండర్ ఏమైంది?: రాంచందర్ రావు

    • 12 ఏళ్ల నుంచి నీళ్ల మీద ఒక్క పాలసీ లేదు: రాంచందర్ రావు

    • రావాల్సిన నీళ్ల కంటే తక్కువకి కేసీఆర్ ఒప్పుకున్నారు: రాంచందర్ రావు

    • మనకు రావాల్సిన కృష్ణా జలాలు డీకేకి రేవంత్ బహుమతిగా ఇచ్చారు: రాంచందర్ రావు

    • మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టారు: రాంచందర్ రావు

  • Jun 04, 2026 12:35 IST

    అమరావతి: పంచాయతీరాజ్ శాఖకు పలు అవార్డులు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం

    • కేబినెట్‌ భేటీలో అవార్డులను ప్రదర్శించిన అధికారులు

    • పవన్, పంచాయతీరాజ్ అధికారులను అభినందించిన సీఎం

    • పవన్ కల్యాణ్‌ను అభినందించిన పలువురు మంత్రులు

  • Jun 04, 2026 12:22 IST

    నెల్లూరు: కోట మండలం MPP పదవి టీడీపీ కైవసం

    • MPPగా వంజివాక, MPTCగా ఎంబెటి శశి ఎన్నిక

  • Jun 04, 2026 12:22 IST

    గుంటూరు: జగన్ దిష్టిబొమ్మ దగ్ధం దుర్మార్గం: వైసీపీ నేత అంబటి రాంబాబు

    • పోలీసుల అండతో టీడీపీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తోంది: అంబటి

    • మా ఇంటిపై దాడి చేసి.. మాపైనే దౌర్జన్యానికి వచ్చారు: అంబటి

    • మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: అంబటి

    • స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారు: అంబటి

  • Jun 04, 2026 12:21 IST

    హైదరాబాద్: సచివాలయంలో అఖిలపక్ష సమావేశం

    • కేకే అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో భేటీ

    • తెలంగాణ ఉద్యమకారులను గుర్తించనున్న అఖిలపక్షం

    • ఉద్యమకారుల గుర్తింపుపై సూచనలు స్వీకరించనున్న కమిటీ

  • Jun 04, 2026 12:20 IST

    అమరావతి: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

    • సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన పవన్

    • వెన్నునొప్పి ఎక్కువగా ఉండటంతో కేబినెట్‌లో చెప్పి వెళ్లిపోయిన పవన్

    • మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్

  • Jun 04, 2026 12:07 IST

    ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ ఉపసంహరణ

    • ఢిల్లీ మాలవీయనగర్ ప్రమాద ఘటనతో నిర్ణయం

  • Jun 04, 2026 11:50 IST

    హైదరాబాద్: సిట్ ఎదుట హాజరైన తీగల కృష్ణారెడ్డి

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్

  • Jun 04, 2026 11:49 IST

    కామారెడ్డి కాంగ్రెస్‌లో అంతర్గత పోరు

    • షబ్బీర్‌అలీ, చంద్రశేఖర్ వర్గాలుగా విడిపోయిన శ్రేణులు

    • క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఇరువర్గాల ఫిర్యాదులు

    • షబ్బీర్‌అలీపై క్రమశిక్షణ కమిటీకి చంద్రశేఖర్ వర్గం ఫిర్యాదు

    • పార్టీ నష్టపోయేలా షబ్బీర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు

    • ఇప్పటికే చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసిన షబ్బీర్‌ అలీ వర్గం

  • Jun 04, 2026 11:47 IST

    సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో రైతుల ఆందోళనలు

    • తొగుట-సిద్దిపేట రోడ్డుపై కాన్గల్ గ్రామ రైతుల రాస్తారోకో

    • రోడ్డుపై వరి ధాన్యం కుప్పగా పోసి నిప్పుపెట్టిన రైతులు

    • చేర్వాపూర్‌లో రైతుల రాస్తారోకో, భారీగా నిలిచిన వాహనాలు

    • ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల డిమాండ్

  • Jun 04, 2026 11:46 IST

    విశాఖ: బ్యాంక్ ఆఫ్ బరోడా మర్రిపాలెం బ్రాంచ్‌లో ఉద్యోగుల మధ్య ఘర్షణ

    • ఉద్యోగి శివరామరాజుపై సుత్తితో దాడి చేసిన మరో ఉద్యోగి రవికుమార్

    • శివరామరాజుకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Jun 04, 2026 11:45 IST

    నల్లగొండ: కట్టంగూరు దగ్గర డివైడర్‌ను ఢీకొట్టిన కారు

    • ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

    • మృతుడు వేణుగా గుర్తింపు

  • Jun 04, 2026 11:29 IST

    కేరళం, తమిళనాడులోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

    • ఈ ఏడాది ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించిన రుతుపవనాలు

    • తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వారం పట్టే అవకాశం

    • కేరళం, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం

    • కేరళంలోని 3 జిల్లాలకు IMD ఆరెంజ్ అలర్ట్

    • తమిళనాడులో 15 జిల్లాలకు భారీ వర్ష సూచన

  • Jun 04, 2026 11:25 IST

    కృష్ణా: గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు

    • టీడీపీ ఆఫీస్ నుంచి కూటమి శ్రేణుల విజయోత్సవ ర్యాలీ

    • మెయిన్ రోడ్డులో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు

    • 'గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా' అంటూ పోటీగా టీడీపీ నినాదాలు

    • ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు

    • నిరసన శిబిరం నుంచి వైసీపీ శ్రేణులను పంపించిన పోలీసులు

  • Jun 04, 2026 11:14 IST

    ప్రకాష్‌రాజ్ పోస్టుకు బండ్ల గణేష్ కౌంటర్

    • ప్రతి దాంట్లో వేలు ఎందుకు పెడతావు: బండ్ల గణేష్‌

    • అసలు నువ్వెవరు.. తమిళోడివా.. తెలుగోడివా, కన్నడిగవా?: బండ్ల గణేష్

    • ప్రతి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా: బండ్ల గణేష్

    • అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు: బండ్ల గణేష్

    • ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో: బండ్ల గణేష్

  • Jun 04, 2026 11:13 IST

    పవన్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్‌రాజ్ రియాక్షన్

    • మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర: ప్రకాష్‌రాజ్

    • సింగిల్‌గా వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి: ప్రకాష్‌రాజ్

  • Jun 04, 2026 11:12 IST

    చెన్నై: కాంచీపురంలో ఫుడ్ పాయిజన్

    • ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో ఫుడ్‌పాయిజన్

    • 100 మందికిపైగా అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

    • పలువురి పరిస్థితి విషమం, ICUలో చికిత్స

    • బిర్యానీ శాంపిల్స్ ల్యాంబ్‌కు పంపిన అధికారులు

  • Jun 04, 2026 10:57 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు..

    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు

    • 22 క్యారెట్లపై 100 రూపాయలు

    • 18 క్యారెట్ల బంగారంపై 90 రూపాయల తగ్గుదల

    • 100 గ్రాముల వెండిపై 500 రూపాయలు

    • కేజీ వెండిపై 5 వేల రూపాయల తగ్గుదల

  • Jun 04, 2026 10:52 IST

    బెంగాల్: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

    • భంగార్ పేలుళ్ల కేసులో తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు

    • ఎన్ఐఏ అధికారులకు రక్షణగా సీఆర్‌పీఎఫ్ బలగాల మోహరింపు

  • Jun 04, 2026 10:51 IST

    రష్యాలో కొనసాగుతున్న ఏపీ మంత్రి లోకేశ్ పర్యటన

    • ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్‌తో కీలక భేటీ

    • విశాఖలో ఎలక్ట్రానిక్ అసెంబ్లీ యూనిట్‌ ఏర్పాటుకు ఆహ్వానం

    • నెల్లూరులో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరిన లోకేశ్

    • శ్రీసిటీలో రోబోటిక్స్ సేవల విస్తరణకు లోకేశ్ వినతి

  • Jun 04, 2026 10:46 IST

    చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌తో కేటీఆర్ ములాఖత్

    • కేటీఆర్ వెంట తలసాని శ్రీనివాస్, సుధీర్‌రెడ్డి

    • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రిమాండ్‌లో ఉన్న బాల్క సుమన్

  • Jun 04, 2026 10:45 IST

    గుంటూరులో టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు

    • వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆందోళనకు వైసీపీ పిలుపు

    • రాక్షస పాలన ముగింపునకు రెండేళ్లు పేరుతో టీడీపీ కార్యక్రమం

    • ఒకేసారి ఇరుపార్టీల కార్యక్రమాలతో టెన్షన్

    • అప్రమ్తతమైన పోలీసులు

  • Jun 04, 2026 10:44 IST

    అమరావతి: విధ్వంస పాలన విముక్తికి రెండేళ్లు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

    • రాక్షస పాలనతో ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడిచారు: కొండపల్లి

    • 2024లో ఏపీ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు: కొండపల్లి

    • కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ప్రజాస్వామ్య వెలుగులు కనిపిస్తున్నాయి: కొండపల్లి

  • Jun 04, 2026 10:43 IST

    హైదరాబాద్: మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు అరెస్ట్

    • అక్రమ ఆస్తుల కేసులో భుజంగరావును అరెస్ట్ చేసిన ACB

    • భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన ACB కోర్టు

    • చంచల్‌గూడ జైలుకు భుజంగరావు తరలింపు

  • Jun 04, 2026 10:02 IST

    తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్

    • స్మగ్లింగ్ ముఠా నెట్‌వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్

    • రూ.12కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్

    • విదేశీ మహిళతో పాటు 10 మంది పెడ్లర్ల అరెస్ట్

    • థాయ్‌లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయి తరలింపు

  • Jun 04, 2026 09:50 IST

    అమరావతి: వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లు: మంత్రి అచ్చెన్న

    • గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024లో ప్రజలు చరమగీతం పాడారు: అచ్చెన్న

    • జగన్ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు: మంత్రి అచ్చెన్న

    • వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్య: అచ్చెన్న

    • ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ వైసీపీ: మంత్రి అచ్చెన్న

  • Jun 04, 2026 09:49 IST

    కొమురంభీం: దస్నాపూర్‌లో అగ్నిప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

    • మంటలార్పిన ఫైర్ సిబ్బంది, రూ.16లక్షల ఆస్తి నష్టం

  • Jun 04, 2026 09:49 IST

    అమరావతి: రైతులను వైసీపీ రెచ్చగొడుతోంది: మంత్రి నారాయణ

    • రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని కుట్ర: మంత్రి

    • అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదం: మంత్రి

    • రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది: మంత్రి

    • రైతుల భూములు వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారు?: మంత్రి

    • నిర్మాణాలు పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా?: మంత్రి

    • జగన్ అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు?: మంత్రి

  • Jun 04, 2026 09:48 IST

    పల్నాడు: అచ్చంపేటలో వడ్డీ వ్యాపారి ఆగడాలు

    • అప్పు తిరిగి చెల్లించలేదని ఇంటి గేటుకు అడ్డంగా ఇసుక పోసిన వడ్డీ వ్యాపారి

    • ఇంట్లో నుంచి రాకుండా ఇసుక అడ్డుగా పోయడంతో బాధితుని పిల్లల ఆవేదన

    • తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పినా వినకుండా ఇసుక పోసిన వడ్డీవ్యాపారి శంకర్

    • ఆదుకోవాలంటూ బాధితుని కుమారుడు నవీన్ ఆందోళన

  • Jun 04, 2026 09:44 IST

    అమరావతి: రాజధానిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి: మంత్రి నారాయణ

    • ట్రంక్ రోడ్లపై 43, LPS జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం: మంత్రి

    • కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టి తొలగిస్తున్నారు: మంత్రి

    • శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పనులు పూర్తి: మంత్రి

  • Jun 04, 2026 09:41 IST

    SP బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

  • Jun 04, 2026 09:40 IST

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం

    • అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం

    • లెబనాన్‌ లోపల కొన్ని ప్రత్యేక పైలట్ భద్రతా వలయాలు ఏర్పాటు

    • భద్రతా వలయాల్లో హెజ్బొల్లా మిలిటెంట్లను నిషేధించాలని ఒప్పందం

  • Jun 04, 2026 09:39 IST

    ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హోటల్ యజమాని అరెస్ట్

    • లవకేష్‌ బజాజ్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

    • నిన్నటి అగ్నిప్రమాద ఘటనలో 21 మంది మృతి

    • నిందితుడిపై హత్యతో సమానమైన నేరం కింద కేసు నమోదు

    • 6 గదులకే అనుమతి ఉంటే 25 గదులను నడుపుతున్న యజమాని

  • Jun 04, 2026 08:35 IST

    తిరుపతి: చంద్రగిరి మండలం అగరాల దగ్గర రోడ్డు ప్రమాదం

    • అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన డీసీఎం

    • కారు డ్రైవర్ రాజ్‌కుమార్(35) మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

    • ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jun 04, 2026 08:33 IST

    మేడ్చల్: దుండిగల్‌లో డ్రగ్స్ పెడ్లర్‌ను పట్టించిన ర్యాపిడో డ్రైవర్

    • ర్యాపిడోలో గంజాయి పార్సిల్ చేసిన బిహార్‌కు చెందిన రూపేష్‌కుమార్

    • అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ర్యాపిడో డ్రైవర్

    • పార్సిల్‌లో గంజాయి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు

    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 04, 2026 08:29 IST

    సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్

    • రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా: కేశినేని నాని

    • ఏ మాత్రం రాజకీయ ప్రమేయం లేని నా స్నేహితుడు రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

    • విజయవాడ టాస్క్‌ఫోర్స్ PSI నవీన్.. రాంబాబు తల్లిని వేధించారు

    • పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా: ఎక్స్‌లో కేశినేని నాని

  • Jun 04, 2026 08:29 IST

    రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

    • కొండవీటివాగు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

  • Jun 04, 2026 07:39 IST

    నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

    • ఉ.10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

  • Jun 04, 2026 07:38 IST

    కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి

    • ఇరాన్ దాడిలో భారతీయుడి మృతి

  • Jun 04, 2026 07:13 IST

    బిహార్‌: ముజఫర్‌పూర్‌లో అగ్నిప్రమాదం

    • ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో చెలరేగిన మంటలు

    • ముగ్గురి మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

  • Jun 04, 2026 07:13 IST

    కృష్ణా: గన్నవరం మండలం మెట్లపల్లిలో భారీ చోరీ

    • ఓ ఇంట్లో రూ.20లక్షల విలువైన బంగారం, వెండి చోరీ

    • ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

  • Jun 04, 2026 07:11 IST

    నేడు, రేపు పాలమూరులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష

    • రెండు హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహణ

    • మఖ్తల్, జూరాల, కోయిల్‌సాగర్, గూడెందొడ్డి ప్రాంతాల్లో సర్వే

    • సోమశిలలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ మీటింగ్

  • Jun 04, 2026 07:11 IST

    నేడు సిట్ ముందుకు బీజేపీ నేత లంకల దీపక్‌రెడ్డి

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నించనున్న సిట్

    • ఉ.11:30కు సిట్ కార్యాలయంలో విచారణ

  • Jun 04, 2026 07:10 IST

    నేటి నుంచి 10 రోజులు తెలంగాణలో వర్షాలు

    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

    • ఏపీలో నేడు విభిన్న వాతావరణ పరిస్థితులు

    • కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

  • Jun 04, 2026 07:10 IST

    నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

    • రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు

    • కేరళ, కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్-నికోబార్‌లో భారీ వర్షాలు