-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 30th May 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 30 , 2026 | 07:15 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 30, 2026 21:39 IST
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం
CRDA సమావేశంలో 18 అంశాలకు ఆమోదం
అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్‌పై దృష్టి
రూ.547 కోట్లతో హైకోర్టు భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన
APCRDA బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి ఎకనామిక్ రీజియన్ RFPకి అంగీకారం
-
May 30, 2026 21:10 IST
హైదరాబాద్: కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి బాల్క సుమన్
కింగ్ కోటి ఆసుపత్రిలో బాల్క సుమన్‌కు వైద్య పరీక్షలు
బాల్క సుమన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రి వైద్యులు
మరికాసేపట్లో ముగియనున్న వైద్య పరీక్షలు
అనంతరం హిమాయత్‌నగర్‌లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు
-
May 30, 2026 20:05 IST
సిద్దిపేట: అక్బర్‌పేట భూంపల్లి మండలం ఎనగుర్తిలో విషాద ఘటన
పొలంలో గడ్డి తగలబెడుతున్న రైతు ఎల్లయ్య (65)
ప్రమాదవశాత్తు మంటల్లో పడి చనిపోయిన ఎల్లయ్య
-
May 30, 2026 19:34 IST
నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ముగిసిన బాల్క సుమన్ విచారణ
మరికాసేపట్లో బాల్క సుమన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం తరలించనున్న పోలీసులు
ఉస్మానియా ఆసుపత్రిలో బాల్క సుమన్‌కు వైద్య పరీక్షలు
వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ నివాసానికి బాల్క సుమన్‌ను తరలించనున్న పోలీసులు
-
May 30, 2026 19:13 IST
దేశంలోనే తొలిసారిగా రైతు డిస్కం ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం: సీఎం రేవంత్
అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని బీజేపీ, BRS యత్నం: సీఎం రేవంత్
వడ్ల కొనుగోలు అంశంలో మేం కొంటున్నది ఎంత?, కేంద్రం కొనేది ఎంత? : సీఎం రేవంత్
-
May 30, 2026 18:23 IST
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం
హాజరైన మంత్రి నారాయణ, సీఎస్ సాయిప్రసాద్
రాజధానిలో నిర్మాణాలు, ఇతర ప్రతిపాదనలపై చర్చ
-
May 30, 2026 17:32 IST
రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్
మహిళల 53 కేజీల విభాగంలో ఓటమి
మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో పరాజయం
-
May 30, 2026 17:29 IST
పల్నాడు: కొండవీడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియపై పవన్ ఆరా
-
May 30, 2026 17:28 IST
మంగళగిరి: DSC నిర్వహణపై ఆరోపణలు అవాస్తవం: విద్యా శాఖ కార్యదర్శి శశిధర్
DSCని పారదర్శకంగా నిర్వహించాం: విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్
మెరిట్ ఆధారంగానే DSCలో నియామాలు: కోన శశిధర్
DSCలో 16,347 పోస్టులకు నోటిఫికేషన్: కోన శశిధర్
3.36 లక్షల మంది అభ్యర్థులు DSCకి దరఖాస్తు: కోన శశిధర్
-
May 30, 2026 17:10 IST
కోల్‌కతా: TMC నేత అభిషేక్ బెనర్జీపై దాడి
TMC ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం
బెంగాల్‌లో సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై దాడి
TMC నేతల పరామర్శకు వెళ్తుండగా బెనర్జీపై దాడి
-
May 30, 2026 17:08 IST
అమరావతి: జూన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,728.67 కోట్ల విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు
కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేసిన ప్రభుత్వం
స్పౌజ్ పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూ.2.24 కోట్ల విడుదల
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
May 30, 2026 17:05 IST
ముగిసిన కర్ణాటక CLP సమావేశం
CLP నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
డీకేను CLP నేతగా ప్రతిపాదించిన సిద్దరామయ్య
-
May 30, 2026 16:52 IST
ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ
రానున్న 2 గంటల్లో ఢిల్లీ ఎన్సీఆర్‌లో భారీ వర్షం..
రాజస్థాన్, చండీగఢ్ ఉత్తర ప్రదేశ్, హర్యానా ,ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ
-
May 30, 2026 16:23 IST
ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
-
May 30, 2026 16:15 IST
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం
శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు
ఏఐసీసీ పరిశీలకులుగా వెళ్లిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా
శాసనసభా పక్ష సమావేశంలో డీకే శివకుమార్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
-
May 30, 2026 15:38 IST
నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు గంటలుగా కొనసాగుతున్న బాల్క సుమన్ విచారణ
బాల్క సుమన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్న నాంపల్లి పోలీసులు
సుమన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారో విచారిస్తున్న పోలీసులు
-
May 30, 2026 15:36 IST
హైదారాబాద్: నాంపల్లికి మాజీ మంత్రి కేటీఆర్
మరికాసేపట్లో న్యాయవాది కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్
నాంపల్లిలో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్
-
May 30, 2026 15:02 IST
అమరావతి: దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌గా చంద్రశేఖర్ ఆజాద్
ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం
-
May 30, 2026 13:58 IST
ఢిల్లీలో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు
ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్
భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లే లక్ష్యంగా ఉగ్ర కుట్ర
-
May 30, 2026 13:54 IST
కర్నూలు: ఆదోనిలోని అమరావతి నగర్‌లో దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త మహేష్(28)ను చంపిన భార్య
కేసు నమోదు చేసిన పోలీసులు
-
May 30, 2026 13:19 IST
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్..
బీఆర్ఎస్ భవన్ నుంచి నాంపల్లి పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు
సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
-
May 30, 2026 13:16 IST
వైఎస్ సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉంది: సీఎం చంద్రబాబు
తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు కుమార్తెకు ఉంది కదా: సీఎం
సునీత పోరాటం వల్లే ఇప్పటికీ వివేకా హత్యకేసు సజీవంగా ఉంది: సీఎం
ఇప్పుడున్న తరానికి కూడా వీరి హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయి: సీఎం
ఇప్పుడు జగన్ కుటుంబ చరిత్ర అందరికీ తెలిసింది: సీఎం
-
May 30, 2026 13:15 IST
అమరావతి: మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్
సైకో అంటే గొడ్డలి పార్టీ అని ప్రజలు గుర్తించారు: చంద్రబాబు
రోజురోజుకూ జగన్‌లో అసహనం పెరుగుతోంది: చంద్రబాబు
YS కుటుంబ అరాచకాలు నాకు కూడా కొన్ని తెలియవు: చంద్రబాబు
ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి: చంద్రబాబు
-
May 30, 2026 13:13 IST
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు: బాల్క సుమన్
ప్రశ్నిస్తే వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది: సుమన్
తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు: సుమన్
ఉద్యమ సమయంలో నాపై 250కి పైగా కేసులు పెట్టారు: సుమన్
ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తోంది: సుమన్
-
May 30, 2026 13:12 IST
అమెరికాలో భారతీయ యువకుడికి పదేళ్ల జైలు
గుజరాత్‌కు చెందిన కవన్‌కుమార్ పటేల్‌కు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
మానవ అక్రమ రవాణా కేసులో అతడికి ఈ శిక్ష విధించిన కోర్టు
-
May 30, 2026 13:03 IST
తెలంగాణ ఎడ్‌సెట్ - 2026 ఫలితాల విడదల
ఈ ఫలితాలను విడుదల చేసిన విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి
-
May 30, 2026 13:01 IST
బాల్క సుమన్‌పై నమోదైన కేసుల వివరాలు..
బాల్క సుమన్‌పై 326(g), 351(3), 353(1)(b), r/w55, r/w 61(2)(a), బీఎన్ఎస్ 4 పీడీపీపీఏ కింద నమోదు
బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆనంద్
బొగ్గు గని కార్మికుల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్న ఆనంద్
సింగరేణిని తగలపెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఆఫీసులను తగులపెడదాం అన్న సుమన్
-
May 30, 2026 12:45 IST
నల్లగొండ: కట్టంగూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై ప్రమాదం
లారీ, రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి
హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆల్టో కారును వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ
దీంతో డివైడర్ దాటి విజయవాడ వైపు వెళ్తున్న బెలోనో కారుపై పడిన ఆల్టోకారు
ఆల్టోలో ఉన్న ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి
-
May 30, 2026 12:36 IST
కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు
మొత్తం 19 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
కేరళలోని మలప్పురంలో పేలుడు పదార్థాల స్వాధీనం కేసులో దర్యాప్తు
అక్రమ పేలుడు పదార్థాల నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఫోకస్
కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ కోసం విస్తృత సోదాలు
-
May 30, 2026 12:31 IST
హైదరాబాద్: బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశాం: ఏసీపీ ప్రవీణ్
బాల్క సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం: ఏసీపీ ప్రవీణ్
సింగరేణి ఆస్తులతో పాటూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని మాట్లాడారు: ఏసీపీ
మూడు రోజుల వరకూ బాల్క సుమన్ ఆచూకీ తెలియలేదు: ఏసీపీ
సింగరేణి ఎంప్లాయీస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం: ఏసీపీ
బీఆర్ఎస్ భవన్‌లో ఉన్న సుమన్‌కు నోటీసు ఇచ్చి తీసుకెళ్తాం: ఏసీపీ
-
May 30, 2026 12:28 IST
హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ భవన్‌లోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం
పోలీసులతో BRS కార్యకర్తల వాగ్వాదం
బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు
పోలీసులు గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు
-
May 30, 2026 12:15 IST
ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడులు
సుమారు 15 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడి
పలుమార్లు మోగిన ఎయిర్ రైడ్ సైరన్లు
బంకర్లలోకి పరుగులు తీసిన ప్రజలు
ఈ రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
-
May 30, 2026 12:06 IST
కాక్రోచ్ జనతా పార్టీ (CJP)పై స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్ నేత సునీల్ అంబేకర్
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని వ్యాఖ్య
ప్రజా చర్చలను ఆందోళనలుగా చూడాల్సిన అవసరం లేదు
వివిధ అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమని స్పష్టం
CJPపై కొనసాగుతున్న చర్చల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి
-
May 30, 2026 11:54 IST
తిరుమల: టీటీడీకి భారీ విరాళం అందించిన నీరా రాడియా
ఎలక్ట్రిక్ బస్సుతో పాటూ 15 యాపిల్ ట్యాబ్‌ల విరాళం
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేసిన నీరా రాడియా

-
May 30, 2026 11:46 IST
గ్రీన్‌కార్డు దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం యూటర్న్..!
స్వదేశం నుంచే దరఖాస్తు చేయాలన్న ప్రకటనపై డీహెచ్‌ఎస్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) వివరణ
ప్రక్రియను అమెరికాలో పూర్తిచేయాలా, స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయం
ఇది కొత్త నిబంధన కాదని.. ఎప్పటి నుంచో అమల్లో ఉందని స్పష్టీకరణ
వలసదారులందరికీ ఈ నిబంధన వర్తించదని డీహెచ్‌ఎస్ వెల్లడి
-
May 30, 2026 11:45 IST
హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
దళారులు, అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారు: కిషన్‌రెడ్డి
బీజేపీ బస్సు యాత్ర తర్వాతే ప్రభుత్వంలో కదిలిక వచ్చింది: కిషన్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందుచూపు లేదు: కిషన్‌రెడ్డి
కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం, మంత్రులు చెబుతున్నారు: కిషన్‌రెడ్డి
ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని.. కేంద్రం ఎప్పుడూ తీసుకోదు: కిషన్‌రెడ్డి
-
May 30, 2026 11:35 IST
తగ్గిన బంగారం ధరలు
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 600 తగ్గుదల.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 550 తగ్గుదల.
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గుదల.
-
May 30, 2026 11:35 IST
గుజరాత్: భార్య వేధిస్తోంది.. చనిపోవడానికి అనుమతివ్వండి.. సూరత్ వ్యక్తి ఆవేదన
భార్య వేధింపులు భరించలేకపోతున్నానని సూరత్ వ్యక్తి ఆవేదన
అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపణ
సమస్యపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు లేఖ
-
May 30, 2026 11:26 IST
'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో, టికెట్ ధర రూ.600
రోజుకు 5 షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
-
May 30, 2026 11:26 IST
అమరావతి: ఆర్టీసీని వైసీపీ విచ్ఛిన్నం చేస్తే.. కూటమి ప్రభుత్వం కాపాడింది: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
ప్రభుత్వానికి స్త్రీ శక్తి పథకం బాధ్యత.. భారం కాదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
బస్సులు మారినా.. స్త్రీ శక్తి పథకం ఆగదు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
2029లోపు 3వేల CNG, ఈ-బస్సులు అందుబాటులోకి రానున్నాయి: రాంప్రసాద్
-
May 30, 2026 11:24 IST
అమరావతి: జూన్ 2న టీడీపీ ఎమ్మెల్యేలకు వర్క్‌షాప్
SIRపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
-
May 30, 2026 11:03 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి, హాజరైన పొన్నం, అజారుద్దీన్
అత్యాధునిక సౌకర్యాలతో కార్యాలయ భవన నిర్మాణం
CSRలో భాగంగా నిర్మాణం చేపడుతున్న ఫీనిక్స్ సంస్థ
-
May 30, 2026 11:02 IST
కర్ణాటక: లోక్‌భవన్‌కు డీకే శివకుమార్
సోదరుడు సురేశ్‌తో కలిసి గవర్నర్‌తో డీకే భేటీ
జూన్ 3న కర్ణాటక కొత్త సీఎంగా డీకే ప్రమాణస్వీకారం చేసే అవకాశం
-
May 30, 2026 10:51 IST
కాకినాడ: రోడ్డుపై వెళ్తున్న మహిళలపై దూసుకెళ్లిన లారీ
రౌతులపూడి మండలం శృంగవరంలో ఘటన
ఇద్దరు మహిళల పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
May 30, 2026 10:48 IST
హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై CID కేసు నమోదు
గత ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ గుర్తింపు
విజిలెన్స్ నివేదిక ఆధారంగా విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
-
May 30, 2026 10:42 IST
మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
250కిపైగా ఉచ్చులు, కరెంట్ తీగలను తొలగించిన సిబ్బంది
వేటగాళ్లకు చెక్ పెట్టిన సిబ్బంది కృషి అభినందనీయం: పవన్
వన్యప్రాణుల రక్షణకు గిరిజనులు సహకరించాలి: పవన్
అటవీ సంపదకు హాని చేసేవారిపై కఠిన చర్యలు: పవన్
-
May 30, 2026 10:38 IST
హైదరాబాద్: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండింగ్
బెంగళూరు నుంచి నాగపూర్ వెళ్తున్న ఇండిగో విమానం
-
May 30, 2026 10:34 IST
బాలకృష్ణ చిన్న కుమార్తె డ్యాన్స్.. వీడియో వైరల్..
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అద్భుతమైన డ్యాన్స్‌తో వావ్ అనిపించారు.
కొరియోగ్రాఫర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు.
తేజస్వి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
May 30, 2026 10:23 IST
హైదరాబాద్: నార్సింగిలో హైడ్రా అధికారుల దూకుడు
ముష్కి చెరువుకు కంచె వేస్తున్న ఇరిగేషన్, హైడ్రా అధికారులు
60 ఎకరాల చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తింపు
10 ఎకరాల కబ్జా స్థలంలో నిర్మాణాలకు నోటీసుల జారీ
-
May 30, 2026 10:23 IST
మహారాష్ట్ర: పర్భణి జిల్లా మాన్వత్‌లో ప్రమాదం
ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన బైక్, నలుగురి మృతి
-
May 30, 2026 10:22 IST
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండబోదని అంగీకరించాలి: ట్రంప్
హోర్ముజ్ జలసంధిని తక్షణమే సుంకాలు లేకుండా తెరవాలి: ట్రంప్
వాటర్ మైన్‌లు ఉంటే.. వాటిని త్వరగా నిర్వీర్యం చేయాలి: ట్రంప్
చాలా తక్కువ ప్రాముఖ్యత ఉన్న అంశాలకు అంగీకారం కుదిరింది: ట్రంప్
-
May 30, 2026 10:22 IST
తెలంగాణ హైకోర్టులో పెద్ది సినిమా యూనిట్ పిటిషన్ విత్‌డ్రా
వారం పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని పిటిషన్
గత తీర్పులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వని హైకోర్టు
దీంతో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న పెద్ది సినిమా యూనిట్
జూన్ 4న విడుదల కానున్న రామ్‌చరణ్ పెద్ది చిత్రం
-
May 30, 2026 10:21 IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శిలాతోరణం సర్కిల్ వరకూ చేరుకున్న భక్తుల క్యూలు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు
-
May 30, 2026 10:21 IST
నటుడు అజిత్‌కుమార్‌కు మాతృవియోగం
అజిత్‌కుమార్ తల్లి మోహిని మణి కన్నుమూత
-
May 30, 2026 09:27 IST
ఇరాన్‌తో ఒప్పందంపై సంతకం చేయని డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌తో ఒప్పందంపై 2 గంటలపాటు చర్చించిన ట్రంప్
డీల్‌పై సంతకం చేయకుండానే వెళ్లిపోయిన ట్రంప్
-
May 30, 2026 09:25 IST
సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి
సీబీఎస్‌ఈ రివాల్యూయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వ వర్గాలు
-
May 30, 2026 08:56 IST
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం దొనబండ సమీపంలో డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
పలువురు ప్రయాణికులకు గాయాలు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
May 30, 2026 08:39 IST
అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్న చంద్రబాబు
మహానాడు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
సాయంత్రం గంటలకు CRDAపై సీఎం చంద్రబాబు సమావేశం
-
May 30, 2026 07:41 IST
జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం
తెలంగాణపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్
హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం
తెలంగాణలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న పవన్
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన పవన్
రానున్న జీహెచ్ఎంసీ, భవిష్యత్ ఎన్నికలే టార్గెట్‌గా పవన్ వ్యూహరచన
-
May 30, 2026 07:24 IST
తిరుపతి: వైభవంగా రథోత్సవం
తిరుమల మాడ వీధుల్లో రథంపై ఉరేగుతున్న గోవిందరాజ స్వామి
-
May 30, 2026 07:21 IST
నల్లగొండ: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో ప్రమాదం
ఇంజిన్‌లో మంటలు చెలరేగి బస్సు దగ్ధం, ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
May 30, 2026 07:21 IST
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగులపై కేసు నమోదు
27 నకిలీ రసీదుల ద్వారా రూ.65,686 కాజేసిన వైనం
చిరంజీవి నాయక్, శంకర్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు
అధికారుల ఫిర్యాదుతో ఎస్వీ వర్సిటీ పీఎస్‌లో కేసు నమోదు
-
May 30, 2026 07:20 IST
కర్నూలు: ఆదోని మండలం పాండవగల్లులో రోడ్డు ప్రమాదం
బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. ముగ్గురి మృతి
మృతులు వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్
-
May 30, 2026 07:19 IST
అమెరికాలోని వర్జీనియాలో ఘోర రోడ్డు ప్రమాదం
స్టాఫోర్డ్ కౌంటీ దగ్గర అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
ఐదుగురి మృతి, మరో 34 మందికి గాయాలు
-
May 30, 2026 07:18 IST
ఆదివారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్న రేవంత్
పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్షలు
-
May 30, 2026 07:16 IST
నేడు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
సా.4 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
సిద్దరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి
-
May 30, 2026 07:15 IST
నేడు భారత్ పర్యటనలో మయన్మార్ అధ్యక్షుడు
జూన్ 3 వరకు కొనసాగనున్న మిన్ ఆంగ్ పర్యటన
ప్రధాని మోదీతో మిన్ ఆంగ్ ద్వైపాక్షిక చర్చలు
వాణిజ్యం, భద్రత, కనెక్టివిటీ, రక్షణ రంగాలపై చర్చ