Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 29 , 2026 | 06:58 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 29, 2026 20:14 IST

    పార్టీ నుంచి అలమ్‌ఖాన్‌ను బహిష్కరించిన TPCC

    • హత్యారోపణలపై అరెస్టైన TPCC ఉపాధ్యక్షులు అలమ్‌ఖాన్

    • అలమ్‌ఖాన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన TPCC క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి

    • హైదరాబాద్‌లో అడ్వకేట్‌ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో అలమ్‌ఖాన్‌ అరెస్ట్‌

  • May 29, 2026 20:06 IST

    ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    • రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులనూ రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు

    • బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్ రాజ్యసభ నామినేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

  • May 29, 2026 19:56 IST

    ఉమ్మడి ఏపీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతికి సీఎం రేవంత్‌ సంతాపం

    • సౌమ్యుడు, సహనశీలి గాదె వెంకటరెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి

  • May 29, 2026 19:55 IST

    మహారాష్ట్రలో MLC ఎన్నికల వేడి

    • సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కూటమిలో ఎడతెగని చర్చలు

    • మహా వికాస్ అఘాఢీలో 15 సీట్లపై ఏకాభిప్రాయం

    • కాంగ్రెస్‌-8, ఉద్దవ్‌ సేన-4, NCP-3 సీట్లు

    • నాసిక్‌, నాందేడ్‌ సీట్లపై కొనసాగుతున్న చర్చలు

    • అధికార పక్షం మహాయుతిలో తేలని సీట్ల పంచాయితీ

  • May 29, 2026 19:43 IST

    దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

    • రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలం

    • జూన్ తొలి వారంలో కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

  • May 29, 2026 19:40 IST

    పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

    • 823 వార్డులు ఆప్‌, 331 వార్డుల్లో కాంగ్రెస్ కైవసం

  • May 29, 2026 19:37 IST

    బిహార్ మాజీ సీఎం రబ్రీదేవికి మరోసారి షాక్‌

    • పాట్నాలోని నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు

    • నోటీసులు ఇచ్చిన భవన, గృహ నిర్మాణ శాఖ అధికారులు

  • May 29, 2026 19:35 IST

    గుంటూరు: బృందావన్ గార్డెన్స్‌లో నార్ల ఆడిటోరియం పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి పెమ్మసాని

    • మధ్యలో ఆగిపోయిన ఆడిటోరియం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు

    • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కమిషనర్ మయూర్ అశోక్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర

  • May 29, 2026 19:20 IST

    జగన్ హయాంలో అక్రమాలపై గనుల శాఖ ప్రకటన

    • జగన్‌ ప్రభుత్వ హయాంలో గనులశాఖ అక్రమాల సోదాలపై ED ప్రకటన

    • ఈనెల 26న హైదరాబాద్‌, జయపుర, కోయంబత్తూరులో 8 చోట్ల ఈడీ సోదాలు

    • ప్రతిమ, జీసీకేసీ, టర్న్‌కీ కంపెనీల్లో సోదాలు: ED

    • బోయినపల్లి శ్రీనివాస్‌రావు, అశోక్‌కుమార్‌, వెంకటరెడ్డి ఇళ్లలో సోదాలు: ఈడీ

  • May 29, 2026 19:18 IST

    చిత్తూరు: ఐరాల మం. చిగరపల్లి దగ్గర వాహనం ఢీకొని ఇద్దరి మృతి

    • మృతులు ఎగువ పాలకూరుకు చెందిన సుధ, చందుగా గుర్తింపు

  • May 29, 2026 19:09 IST

    ఐపీఎల్ 2026: కీలక పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్

    • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

    • ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో ఢీ

  • May 29, 2026 18:52 IST

    అమరావతి: DMEగా బాధ్యతలు స్వీకరించిన ఎ విష్ణువర్ధన్‌

  • May 29, 2026 18:39 IST

    కాకినాడ: పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం

    • స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.85 లక్షలు స్వాహా చేసిన నిందితుడు

    • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సురే వేణు

  • May 29, 2026 18:13 IST

    'SIR' ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

    • 'SIR'లో హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ పూర్‌గా ఉందన్న సీఎం రేవంత్‌

  • May 29, 2026 18:07 IST

    సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (85) మృతి

    • వయోభారం, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో కన్నుమూత

    • ఐదుసార్లు MLAగా గెలిచిన గాదె వెంకటరెడ్డి

  • May 29, 2026 17:53 IST

    కర్నూలు: ఆదోనిలో వాహన తనిఖీల్లో బైక్ దొంగ అరెస్ట్‌

    • నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

    • నిందితుడు రిమాండ్‌కు తరలింపు

  • May 29, 2026 17:40 IST

    ఐపీఎల్: లఖ్‌నవూ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన రిషభ్‌ పంత్‌

    • పంత్ అభ్యర్థనను అంగీకరించిన ఫ్రాంచైజీ

    • ఎక్స్ మీడియా వేదికగా వెల్లడించిన ఎల్ఎస్‌జీ

    • ప్రస్తుత సీజన్‌లో ఘోరంగా విఫలమైన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

  • May 29, 2026 17:32 IST

    సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ భేటీ

    • ఏపీ టెక్స్‌టైల్స్‌, హ్యాండ్లూమ్స్‌ అభివృద్ధిపై చర్చ

    • జౌళి శాఖలో కేంద్ర-రాష్ట్రాల సమన్వయంపై చర్చ

    • హాజరైన మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత

    • ఏపీలో టెక్స్‌టైల్స్‌ పార్కులు, పట్టు పరిశ్రమ విస్తరణపై చర్చ

  • May 29, 2026 17:12 IST

    విద్యుత్ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

    • 18 గిగావాట్లను ప్రధాన గ్రిడ్‌కు కనెక్ట్ చేసేలా రూ.22వేల కోట్లతో ప్రతిపాదనలు

    • ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలి: సీఎం

    • 2,898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్: చంద్రబాబు

    • నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు

  • May 29, 2026 17:03 IST

    ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం

    • తొలి విడతగా రూ.2వేల కోట్ల బకాయిలు విడుదల

    • 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం హామీ

    • రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు క్లియర్

  • May 29, 2026 16:59 IST

    హైదరాబాద్ క్యూర్ పరిధిలో అఫర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి జీవో జారీ

    • ఎల్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి

    • దిగువ, మధ్య తరగతి కోసం లక్ష ప్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు

    • పైలట్ ప్రాజెక్టు కింద 12వేల ప్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతి

  • May 29, 2026 16:51 IST

    మేడ్చల్‌: నకిలీ జీఓలు, అక్రమ భూ ఒప్పందాల దందా చేస్తున్న ముఠా అరెస్ట్

    • నార్సింగి పీఎస్‌లో నిందితులపై కేసు: శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్

    • ముగ్గురి అరెస్ట్, పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు సహా మరో ముగ్గురు

    • గండిపేట సర్వే నంబర్ 18 ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాల సృష్టించిన నిందితులు

  • May 29, 2026 16:48 IST

    ముంబై ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్యా గుడ్‌బై?

    • IPLలో రాణించని ముంబై ఇండియన్స్‌

    • IPL సీజన్‌లో వివాదాస్పదంగా హార్దిక్‌ పాండ్యా ఆటతీరు

    • ఓవైపు సీనియర్లతో విభేదాలు.. మరోవైపు కెప్టెన్సీపై విమర్శలు

    • MI మేనేజ్మెంట్‌తోనూ దెబ్బతిన్న హార్దిక్ పాండ్యా సంబంధాలు

    • వచ్చే సీజన్‌కు మరోటీమ్‌లోకి హార్దిక్‌ పాండ్యా!

  • May 29, 2026 16:45 IST

    పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం ఊరట

    • EHS వివరాల కోసం ట్రెజరీలకు వెళ్లాల్సిన అవసరం లేదు: ప్రభుత్వం

    • ఆరోగ్యశ్రీ డేటానే వినియోగించనున్న తెలంగాణ ప్రభుత్వం

    • మే 31లోపు డేటా సేకరణపై తాజా మార్గదర్శకాల విడుదల

    • సీనియర్ సిటిజన్ల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందన

    • అవసరమైతే తర్వాత కూడా వివరాల్లో మార్పులకు అవకాశం

  • May 29, 2026 16:40 IST

    మహారాష్ట్ర: పుణెలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

    • పలువురికి అస్వస్థత, ఆస్పత్రిలో చికిత్స

    • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

    • కల్తీ మద్యం ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్‌

    • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశం

  • May 29, 2026 16:34 IST

    TG ECET 2026 ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

    • డిప్లొమా, B.Sc(Mathematics) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ కోసం పరీక్ష

  • May 29, 2026 16:33 IST

    అమరావతి: 120 ఏళ్ల నాటి వట్టి చెరుకూరు గ్రామ సమస్యకు పరిష్కారం

    • శతాబ్ద కాలంగా 22A నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం గ్రామానికి మోక్షం

    • వట్టిచెరుకూరులో 5వేల మంది జనాభాకు ఊరట

    • మంత్రి అనగాని చొరవ, సీఎం చంద్రబాబు ఆదేశాలతో సమస్య పరిష్కారం

  • May 29, 2026 16:29 IST

    హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత

    • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న 37 కిలోల గంజాయి పట్టివేత

    • బిహార్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్‌, పరారీలో మరో ఇద్దరు వ్యక్తులు

  • May 29, 2026 16:17 IST

    పోలవరం అడవుల్లో పులి సంచారంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ ఆదేశం

    • పులి కదలికలపై నిరంతర పర్యవేక్షణతో పాటు అటవీ బృందాలను అప్రమత్తం చేయాలని సూచన

    • తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికల గుర్తింపు

    • గ్రామాల సమీపంలో సంచరిస్తోందని అధికారుల వెల్లడి

    పూర్తి కథనం

  • May 29, 2026 16:09 IST

    అమరావతి: APPGCET-2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు

    • APPGCET-2026లో 91.55 శాతం ఉత్తీర్ణత నమోదు

    • విద్యార్థుల కష్టానికి, పట్టుదలకు ఇది నిదర్శనమన్న లోకేశ్

    • ఉన్నత విద్య, పరిశోధనల్లో విద్యార్థులు రాణించాలని ఆకాంక్ష

    • పరీక్షలను సజావుగా నిర్వహించిన APSCHE అధికారులకు అభినందనలు తెలిపిన లోకేశ్

  • May 29, 2026 16:01 IST

    కొమురం భీం: ఆసిఫాబాద్ మం. రౌటసంకెపల్లిలో జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవ్-2026

    • ప్రారంభించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

    • హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు

    • పాల్గొన్న పంచాయతీరాజ్ ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్

  • May 29, 2026 15:49 IST

    కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం

    • గాంధీ భవన్లో పీఏసీ సమావేశం

    • పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం

    • హాజరుకానున్న సీఎం రేవంత్, పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్

    • పార్టీ నిర్మాణం, SIR లపై చర్చించనున్న పీఏసీ

  • May 29, 2026 15:45 IST

    భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    • 1,090 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 350 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

  • May 29, 2026 15:37 IST

    అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్‌ మీటింగ్‌

    • హాజరైన మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని, పయ్యావుల

    • తాజా రాజకీయ పరిణామాలు, మహానాడు, మహిళల రిజర్వేషన్‌, వైసీపీ రాజకీయాలపై చర్చ

    • ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకెళ్లాలని నిర్ణయం

  • May 29, 2026 15:33 IST

    కూటమి పాలనలో మహిళలకు ఆర్థిక గౌరవం: హోం మంత్రి అనిత

    • కోటి మంది మహిళలతో డ్వాక్రా సంఘాలు: వంగలపూడి అనిత

    • అన్న క్యాంటీన్లు, ప్రజావేదిక వంటివి కూల్చేందుకు విపక్షాల యత్నం: అనిత

    • ఏ రాజకీయ పార్టీ డ్వాక్రా సంఘాలను టచ్‌ చేసే ప్రయత్నం చేయలేదు: అనిత

  • May 29, 2026 15:29 IST

    ధాన్యం కొనుగోళ్ల అంశంలో నిజాయతీగా వ్యవహరిస్తున్నాం: ఉత్తమ్‌

    • ప్రతిపక్షాలవి దుష్ప్రచారం: మంత్రి ఉత్తమ్‌

    • తెలంగాణలో ఉన్నట్లుగా 29 రాష్ట్రాల్లో ఎక్కడా చేయడంలేదు: ఉత్తమ్‌

    • కేంద్రమే తెలంగాణ ప్రభుత్వ పనితీరును అంగీకరించింది: ఉత్తమ్‌

  • May 29, 2026 15:17 IST

    కొత్తపేట పీఎస్ హోంగార్డ్ జానీ మృతిపై స్పందించిన హోం మంత్రి అనిత

    • కరెంట్ షాక్‌తో హోంగార్డు జానీ మృతి చెందడం అత్యంత బాధాకరం: అనిత

    • హోంగార్డు జానీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: అనిత

  • May 29, 2026 15:06 IST

    గాంధీభవన్‌లో SIRపై ముగిసిన సమావేశం

    • సుమారు 4 గంటల పాటు కొనసాగిన శిక్షణ

    • SIR అమలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన AICC ట్రైనర్స్

    • ఓట్లు తొలగించకుండా, ఓటుహక్కును కాపాడే అంశంపై 60మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ

  • May 29, 2026 15:01 IST

    నీట్‌ పేపర్ లీక్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    • అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

    • నీట్ పేపర్ లీక్ కేసుల బాధ్యులను గుర్తించాలి: సుప్రీంకోర్టు

  • May 29, 2026 14:52 IST

    మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

    • దేవుడొక్కడే వీఐపీ: మద్రాస్‌ హైకోర్టు

    • దేవాలయాల్లో 'వీఐపీ సంస్కృతి'పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

    • దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టీకరణ

  • May 29, 2026 14:32 IST

    తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడి

    • 2026 నైరుతి రుతుపవనాల అంచనాలు విడుదల

    • బలంగా మారిన ఎల్-నినో ప్రభావం.. 50 శాతం లోటు వర్షాలు కురిసే అవకాశం

    • జూన్ రెండో వారంలో రుతుపవనాల రాక.. జూన్, జులైలో సాధారణ వర్షాలు

    • ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోయే అవకాశం

  • May 29, 2026 14:23 IST

    యువత జీవితాలతో జగన్‌ కుటుంబం ఆడుకుంది: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి

    • డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు: రాంగోపాల్ రెడ్డి

    • ఆస్తుల కోసం వ్యక్తులను చంపిన కుటుంబం జగన్‌ది: రాంగోపాల్‌ రెడ్డి

    • అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు: రాంగోపాల్‌ రెడ్డి

    • నిరుద్యోగుల విషయంలో వైసీపీ కుట్రలు చేస్తోంది: రాంగోపాల్‌ రెడ్డి

  • May 29, 2026 14:23 IST

    లిక్కర్ స్కామ్‌తో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారు: పట్టాభి

    • లిక్కర్ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయి: పట్టాభి

    • గొడ్డలి పార్టీకి P4 పథకం ఉంది.. అదే పవర్‌, ప్రాపర్టీ, పైసా పార్ట్‌నర్‌షిప్‌: పట్టాభి

    • అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేబులు నింపుకోవడమే గొడ్డలి పార్టీ P4: పట్టాభి

    • 2019-24 మధ్య KNR భార్య ఖాతాలోకి రూ.20 కోట్లు వచ్చాయి: పట్టాభి

    • ఓ సాధారణ పీఏ KNR ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి?: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి

  • May 29, 2026 14:21 IST

    హైదరాబాద్: ERC బహిరంగ విచారణలో గందరగోళం

    • రైతులు విద్యుత్ చోరీ చేస్తున్నారన్న CMD ముషారఫ్ అలీ

    • అలీ వ్యాఖ్యలపై BRS నేత జగదీశ్ రెడ్డి అభ్యంతరం

    • జగదీశ్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు

  • May 29, 2026 14:15 IST

    స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట

    • ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతి

    • డోపింగ్ టెస్టులు మిస్ అవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

    • సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన నిబంధనల మినహాయింపు ఉండదని స్పష్టం

    • ఒక అథ్లెట్ కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీయలేం: సుప్రీంకోర్టు

    • అందుకే అర్హత పోటీలకు అనుమతి ఇస్తున్నాం: సుప్రీంకోర్టు

  • May 29, 2026 14:11 IST

    రేపు సా.4గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

    • సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న MLAలు

    • జూన్ 1న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

    • సిద్దరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి

  • May 29, 2026 13:35 IST

    హైదరాబాద్: ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: టీజీఎస్ఆర్టీసీ జేఏసీ

    • మంత్రి పొన్నం వ్యాఖ్యలతో కార్మికులు ఆందోళనలో ఉన్నారు: ఆర్టీసీ జేఏసీ

    • మా డిమాండ్ ఎన్నికలు, సంఘాలు కాదు.. విలీనం: ఆర్టీసీ జేఏసీ

    • ఈనెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన: ఆర్టీసీ జేఏసీ

    • జూన్ 2న విలీనం ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష: ఆర్టీసీ జేఏసీ

  • May 29, 2026 13:34 IST

    తెలంగాణ గవర్నర్ కోటా MLCల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ

    • అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

    • గతంలో వాయిదా వేసిన జులై 22వ తేదీనే విచారిస్తామని వెల్లడి

  • May 29, 2026 13:33 IST

    కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లిలో విద్యార్థి ఆత్మహత్య

    • ఓ కాలేజీ క్యాంపస్‌లో ఉరి వేసుకున్న విద్యార్థి యశ్వంత్(18)

    • క్యాంపస్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

    • విద్యార్థి బంధువులను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం

  • May 29, 2026 13:32 IST

    ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

    • తెలంగాణ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్నారు: కిషన్‌రెడ్డి

    • కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్లు తయారుచేసే బాధ్యత అప్పగించారు: కిషన్‌రెడ్డి

    • ఐదేళ్లలో రైళ్లను RMU తయారు చేస్తుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • May 29, 2026 13:31 IST

    నటుడు అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

    • నాగచైతన్య వ్యక్తిత్వ హక్కులు పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు

    • అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, ఫొటో వాడటంపై నిషేధం

  • May 29, 2026 13:31 IST

    అమరావతి: కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక

    • ఆరు జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలు గుర్తింపు

    • అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

    • మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పవన్ ఆదేశం

  • May 29, 2026 13:26 IST

    నటి ట్విషా కేసులో కీలక పరిణామం

    • ట్విషా అత్త గిరిబాలా సింగ్‌ను అరెస్ట్ చేసిన CBI

    • గిరిబాలా సింగ్ నివాసంలో CBI విచారణ

    • టన్నెల్ వ్యూ టెక్నాలజీతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌

    • సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ రికార్డుల పరిశీలన

    • మానసిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ రిలీజ్

    • తల్లీకొడుకులపై అదనపు వరకట్న వేధింపులు, డౌరీ డెత్ కేసుల నమోదు

    • ఇప్పటికే గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ రద్దు

  • May 29, 2026 13:26 IST

    ఢిల్లీ: రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన షర్మిల భేటీ

    • రాహుల్‌గాంధీని మర్యాదపూర్వకంగా కలిశా: షర్మిల

    • ఏపీలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించా: షర్మిల

  • May 29, 2026 12:28 IST

    హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ

    • బండి భగీరథ్‌ను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

    • చర్లపల్లి జైలుకు బండి భగీరథ్‌ తరలింపు

    • భగీరథ్‌ను మూడు రోజులపాటు ప్రశ్నించిన పోలీసులు

  • May 29, 2026 12:27 IST

    తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ JC CET ఫలితాలు విడుదల

    • ఫలితాలు విడుదల చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

  • May 29, 2026 12:26 IST

    ఢిల్లీ: రాహుల్‌తో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల దంపతులు భేటీ

    • ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ

  • May 29, 2026 11:50 IST

    హైదరాబాద్: అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

    • కాంగ్రెస్ నేత ఆలంఖాన్‌, కుమారుడు ముజాహిద్ అరెస్ట్

    • న్యాయవాది హత్యకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చిన నిందితులు

    • న్యాయవాది మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు రెండేళ్లలో పదిసార్లు ప్రయత్నించినట్టు గుర్తింపు

    • కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • తన భూములకు అడ్డు వస్తున్నాడని హత్య చేయించిన ఆలంఖాన్

  • May 29, 2026 11:37 IST

    ఢిల్లీ: 'కాక్రోచ్ జనతా పార్టీ' అకౌంట్ బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

    • కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, 'X' సంస్థకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

    • 'కాక్రోచ్ జనతా పార్టీ' అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై కోర్టును ఆశ్రయించిన అభిజీత్ దిప్కే!

    • బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ 'రివ్యూ కమిటీ'కి హైకోర్టు కీలక ఆదేశం!

  • May 29, 2026 11:26 IST

    దేశంలో బీజేపీ విషపూరిత కుట్రలు చేస్తోంది: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌

    • బెంగాల్‌లో 93లక్షల ఓట్లు తీసేశారు: మహేష్‌

    • బీజేపీ కుట్రలతో బెంగాల్‌లో ప్రభుత్వమే మారిపోయింది: మహేష్‌

    • తెలంగాణలో అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలి: మహేష్‌

    • 90కిపైగా నియోజకవర్గాల్లో BLA పూర్తి చేశాం: మహేష్‌

    • జిల్లా, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశాం: మహేష్‌

  • May 29, 2026 11:25 IST

    హైకోర్టుల్లో తీర్పు ఆలస్యానికి చెక్ పెట్టిన సుప్రీంకోర్టు

    • తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలు

    • వాదనలు ముగిసిన 3 నెలలలోపు తీర్పు వెలువరించాల్సిందే: సుప్రీంకోర్టు

  • May 29, 2026 11:11 IST

    తిరుపతి: ఏఎస్ఐ రాము సస్పెన్షన్

    • తిరుమల ఎస్పీఎఫ్‌లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న రాము

    • ఏఎస్ఐ రాముపై కేసు నమోదు చేసిన పోలీసులు

    • రాత్రి సత్యనారాయణపురంలో మద్యం మత్తులో హల్‌చల్ చేసిన ఏఎస్ఐ

  • May 29, 2026 11:09 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో SIRపై శిక్షణ శిబిరం

    • హాజరైన మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్

    • పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి మాస్టర్ ట్రైనింగ్

    • SIR ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

  • May 29, 2026 11:08 IST

    ఢిల్లీ: AICC చీఫ్ ఖర్గేతో సిద్దరామయ్య భేటీ

    • కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ

  • May 29, 2026 11:08 IST

    తగ్గిన క్రూడాయిల్ ధర

    • 91.71 డాలర్లకు చేరిన బ్యారెల్ క్రూడాయిల్

    • డాలర్‌తో పోలిస్తే 95.45కి చేరిన రూపాయి మారకం విలువ

  • May 29, 2026 10:27 IST

    ఢిల్లీ హైకోర్టుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్

    • CJP పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా నిలిపివేతను సవాల్ చేసిన అభిజిత్

    • పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న జస్టిస్ కుమార్ కౌరవ్ ధర్మాసనం

  • May 29, 2026 10:22 IST

    ఢిల్లీ: సోనియా, రాహుల్‌తో ముగిసిన సిద్దరామయ్య భేటీ

    • పాల్గొన్న యతీంద్ర, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా

    • పలు రాజకీయ అంశాలపై చర్చించాం: సూర్జేవాలా

    • కేబినెట్ కూర్పులో ఎలాంటి ఇబ్బందులు లేవు: సూర్జేవాలా

  • May 29, 2026 10:09 IST

    తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

    • తిరుమలేశుడిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

  • May 29, 2026 10:07 IST

    యాదాద్రి: భూదాన్ పోచంపల్లిలో BRS ఆధ్వర్యంలో రైతుల ధర్నా

    • రోడ్డుపై ధాన్యం పారబోసి రైతల నిరసన

    • ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్

  • May 29, 2026 10:06 IST

    కోనసీమ జిల్లాలో భారీ వర్షం

    • ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం

    • నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

  • May 29, 2026 09:50 IST

    రాత్రి నుంచి పలుచోట్ల వర్షం, ఈదురుగాలుల సమస్యలు వచ్చాయి: మంత్రి గొట్టిపాటి రవి

    • ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం: మంత్రి

    • వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యం: మంత్రి గొట్టిపాటి

    • మధ్యాహ్నంలోపు విద్యుత్ పునరుద్ధరణకు అధికారులను ఆదేశించాం: మంత్రి గొట్టిపాటి

  • May 29, 2026 09:50 IST

    రాజస్థాన్: నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్‌ పాస్ పనుల్లో విషాదం

    • అండర్‌పాస్ పనుల్లో మట్టి కూలి ఇద్దరు రైల్వే ఇంజినీర్లు మృతి

    • కోటా జిల్లా దారాఘాటి హైవేపై నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్

    • మృతుల్లో జూనియర్ ఇంజినీర్ ప్రభాత్‌సింగ్

    • మృతుల్లో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంజయ్ ఝా

  • May 29, 2026 09:44 IST

    ఢిల్లీ: సోనియా, రాహుల్‌తో కర్ణాటక అపద్ధర్మ సీఎం సిద్దరామయ్య భేటీ

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నూతన సీఎం ఎంపిక, కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ

    • ఇప్పటికే సిద్దరామయ్య రాజీనామాకు కర్ణాటక గవర్నర్ ఆమోదం

    • సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ రద్దు చేసినట్టు లోక్‌భవన్ ప్రకటన

  • May 29, 2026 09:42 IST

    తూ.గో.: పురుషోత్తపట్నంలో గాలి వాన బీభత్సం

    • రైతు సేవా కేంద్రంపై పిడుగుపాటు, వస్తువులు దగ్ధం

    • దట్టంగా అలుముకున్న పొగలు

    • మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది

    • గాలి వానతో పలుచోట్ల కూలిన విద్యుత్ స్తంభాలు

  • May 29, 2026 09:41 IST

    హైదరాబాద్: రిచ్ కిడ్స్ కేసులో మరో యువకుడి అరెస్ట్

    • యువకుడు జతిన్‌పై పోక్సో కేసు నమోదు

    • ప్రధాన నిందితుడు అర్జున్‌కు సహకరించిన జతిన్

    • బాలిక నుంచి రూ.2లక్షలు తీసుకున్న జతిన్

    • ఇప్పటివరకు 9 మంది అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు

  • May 29, 2026 09:40 IST

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురుగాలుల బీభత్సం

    • కోడూరు మండలం కుమ్మరిపాలెంలో తాడిచెట్టు కూలి ఇద్దరు మృతి

  • May 29, 2026 09:38 IST

    నంద్యాల: శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం

    • నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలు నిలుపుదల

    • శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి

    • ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే యథావిధిగా స్పర్శదర్శనం కొనసాగింపు

    • భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందస్తుగా ఈవో నిర్ణయం

  • May 29, 2026 09:37 IST

    ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

    • తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.

  • May 29, 2026 09:36 IST

    జగిత్యాల జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

    • అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ ఇరు పార్టీల వాల్ పోస్టర్లు

    • ఎమ్మెల్యే సంజయ్‌ అవినీతిపై ఎల్లుండి చర్చకు బీజేపీ పిలుపు

    • జగిత్యాల మున్సిపాలిటీలో బీజేపీ అవినీతిపై చర్చకు కాంగ్రెస్ పిలుపు

  • May 29, 2026 09:36 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉ.11:30కు విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • సా.4గంటలకు సైబర్ క్రైమ్ యాక్షన్‌ ప్లాన్‌పై సమావేశం

    • సా.4:30కు పోర్టులపై రివ్యూ చేయనున్న సీఎం చంద్రబాబు

  • May 29, 2026 09:35 IST

    హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వైష్ణవ్ కిషన్ దాస్ అరెస్ట్

    • మలక్‌పేటలో వైష్ణవ్ కిషన్ అలియాస్ గణేష్ మహరాజ్ అరెస్ట్

    • వైష్ణవ్‌పై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 21 కేసులు

    • హత్య, హత్యాయత్నం, చోరీ కేసుల్లో నిందితుడిగా వైష్ణవ్

    • 14 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న వైష్ణవ్ కిషన్ దాస్

    • పూజారి అవతారం ఎత్తి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు

  • May 29, 2026 09:32 IST

    ఉత్తర్ ప్రదేశ్‌: హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం

    • బెత్వా నదిపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

    • ఐదుగురు కార్మికుల మృతి, పలువురికి తీవ్ర గాయాలు

    • కురారా పోలీస్ స్టేషన్ పరిధి కందౌర్-మొరకందర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం

  • May 29, 2026 08:37 IST

    కర్నాటకలో ఘోర రోడ్డుప్రమాదం, ఐదుగురి మృతి

    • చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి దగ్గర కారును ఢీకొట్టిన లారీ

  • May 29, 2026 07:08 IST

    నేటితో ముగియనున్న బండి భగీరథ్‌ పోలీస్‌ కస్టడీ

    • పోక్సో కేసులో భగీరథ్‌ను విచారిస్తున్న పోలీసులు

    • ఇప్పటికే 2 రోజలపాటు విచారించిన పోలీసులు

  • May 29, 2026 07:07 IST

    IPL: నేడు క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ Vs రాజస్థాన్‌

    • చండీగఢ్‌లో రాత్రి 7:30కు గుజరాత్‌, రాజస్థాన్‌ మ్యాచ్‌

    • ఈ నెల 31న ఫైనల్‌లో RCBతో తలపడనున్న క్వాలిఫయర్‌-2 విజేత

  • May 29, 2026 07:00 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు పనులు తాత్కాలికంగా వాయిదా

    • నేటి నుంచి యథావిధిగా ఘాట్‌రోడ్డుపై రాకపోకలు

    • ఎండలు, వడగాలులతో పనులు కొనసాగించలేమన్న ఆర్‌& బీ

  • May 29, 2026 06:59 IST

    సైన్యానికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ఆదేశాలు

    • గాజా భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు

    • గాజా భూభాగంలో 60% మా చేతుల్లో ఉంది: నెతన్యాహు

    • హమాస్‌పై ఇజ్రాయెల్‌ పట్టు బిగిస్తోంది: నెతన్యాహు

  • May 29, 2026 06:58 IST

    ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణం

    • పలు జిల్లాల్లో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు

    • అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్‌ అలర్ట్‌

    • నేడు, రేపు పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

    • మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

    • ఏపీలోని పలు జిల్లాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌