Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 28 , 2026 | 07:20 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 28, 2026 21:46 IST

    తమిళనాడులో రోడ్డెక్కిన మందుబాబులు

    • టాస్క్‌ మార్క్ ఉద్యోగుల నిరసనలతో మూతపడిన వైన్స్‌

    • ప్రైవేట్‌ క్లబ్‌ల దగ్గర బారులు తీరిన మందుబాబులు

    • 717 వైన్‌ షాపులు మూసివేయించిన సీఎం విజయ్‌

  • May 28, 2026 21:45 IST

    ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    • ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    • సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీకి బదులు జైపుర్‌కు మళ్లింపు

    • ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానం జైపూర్‌కు మళ్లింపు: కర్ణాటక సీఎంఓ

  • May 28, 2026 21:28 IST

    విజయవాడ: నేడు ముగిసిన KNR సిట్‌ విచారణ

    • పది గంటల పాటు కొనసాగిన KNR సిట్‌ విచారణ

    • లిక్కర్‌ స్కామ్‌లో వచ్చిన డబ్బుతో ఆస్తులు కూడేసినట్లు సిట్‌ నిర్ధారణ

    • ఆస్తుల కొనుగోలు అంశాల్లో సమాధానాలు దాటవేసిన KNR

  • May 28, 2026 20:35 IST

    అన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తి ఇవాళ మా ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంది: రేవంత్‌

    • ఎన్టీఆర్‌ పెట్టిన పక్కా ఇళ్ల పథకమే.. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం: సీఎం

    • ఇందిరాగాంధీ పేదలకు భూములను పంచారు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • ఈనాడు యుద్ధాల సమయంలో కొందరు అమెరికాకు లొంగిపోతున్నారు: సీఎం

    • కానీ ఉక్కు మహిళ అమెరికాకు వెళ్లి వారికే వార్నింగ్‌ ఇచ్చి వచ్చారు: సీఎం

  • May 28, 2026 20:17 IST

    తెలుగుజాతికి స్ఫూర్తి నింపిన నాయకుడు ఎన్టీఆర్‌: రేవంత్‌ రెడ్డి

    • దేశం గర్వించదగ్గ మహానాయకుడు ఎన్టీఆర్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

    • ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది: రేవంత్‌ రెడ్డి

    • దేశ చరిత్ర నుంచి స్ఫూర్తికి ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాలి: సీఎం రేవంత్

    • అంబేడ్కర్‌, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ భారతదేశ జాతిరత్నాలు: రేవంత్‌

    • సామాన్యుడికి ఓటుహక్కు ఇచ్చిన అంబేడ్కర్‌ను స్మరించుకోవాలి: సీఎం

    • పురుషులతో సమానంగా మహిళలకు ఓటుహక్కు కల్పించారు: రేవంత్‌

  • May 28, 2026 20:08 IST

    కళలు, కళాకారులను గౌరవించడం కాంగ్రెస్‌ సంస్కృతి: టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్

    • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఎన్టీఆర్‌: మహేశ్ గౌడ్‌

    • ఎన్టీఆర్‌ మహానాయకుడు.. ఆదర్శనీయమైన వ్యక్తి: మంత్రి తుమ్మల

  • May 28, 2026 20:02 IST

    హైదరాబాద్‌: అమీర్‌పేట్‌ మైత్రీవనంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

    • 23 అడుగుల ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

    • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై రేవంత్‌ హామీ

    • ఎన్టీఆర్‌ అభిమానుల చిరకాల కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చిన రేవంత్‌ రెడ్డి

  • May 28, 2026 20:01 IST

    కర్నూలులో రూ.3 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్

    • నగరాన్ని స్మార్ట్ సిటీ చేసేందుకు కృషి చేస్తున్నా: టీజీ భరత్

    • శంకుస్థాపన చేసిన పనులన్నీ నెల రోజుల్లోపు పూర్తిచేసేలా టార్గెట్ పెట్టాం: మంత్రి

  • May 28, 2026 19:59 IST

    అమరావతి: ఏపీ లిక్కర్‌ కేసులో సిట్ విచారణ

    • జగన్ పీఏ KNRను ప్రశ్నిస్తున్న సిట్‌ అధికారులు

    • ఉదయం 11:00 గంటల నుంచి కొనసాగుతున్న విచారణ

  • May 28, 2026 19:51 IST

    ఖమ్మం: బోనకల్ మం. గార్లపాడులో సోలార్ పవర్ ప్లాంట్స్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

    • తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది: భట్టి విక్రమార్క

    • ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ పవర్‌ ప్రారంభిస్తున్నాం: భట్టి

    • వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ సోలార్ యూనిట్స్ మంజూరు చేస్తున్నాం: భట్టి

    • బోనకల్, కొడంగల్ మండలాల్లో పూర్తిగా సోలార్ యూనిట్స్ మంజూరు: భట్టి

  • May 28, 2026 19:45 IST

    ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ

    • విజయసాయిరెడ్డిని ఏడున్నర గంటలపాటు విచారించిన ఈడీ

    • మద్యం స్కామ్‌ కేసులో నాకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

    • మద్యం స్కామ్‌ కేసులో ఎవరి పేర్లు చెప్పలేదు: విజయసాయిరెడ్డి

    • రాజ్‌ కసిరెడ్డికి అన్ని విషయాలు తెలుసని మాత్రమే చెప్పా: విజయసాయిరెడ్డి

    • రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో కర్త, కర్మ, క్రియ: విజయసాయిరెడ్డి

  • May 28, 2026 19:42 IST

    హనుమకొండ: ధాన్యం కొనుగోళ్ల అంశం సీరియస్‌గా తీసుకోండి: పొంగులేటి

    • ఈ ఐదు రోజులు ఛాలెంజింగ్ పీరియడ్: మంత్రి పొంగులేటి

    • తాలు, తరుగు పేరుతో వేధిస్తే అధికారులపై చర్యలు: పొంగులేటి

    • ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: పొంగులేటి

  • May 28, 2026 19:04 IST

    హనుమకొండ: ధాన్యం కొనుగోళ్లను స్పీడ్అప్ చేయాలని సమీక్ష చేస్తున్నాం: ఉత్తమ్‌

    • రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌

    • 4, 5వ తేదీల్లో రుతుపవనాలు రానున్నాయి: మంత్రి ఉత్తమ్‌

    • ధాన్యం తరలింపునకు అన్ని మార్గాలు ఉపయోగించుకోండి: ఉత్తమ్

    • ఇసుక లారీలనూ ధాన్యం సరఫరాకు వాడుకోవాలి: ఉత్తమ్‌

  • May 28, 2026 18:38 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు పనుల వాయిదా

    • రేపటి నుంచి ఘాట్‌రోడ్డుపై యథావిధిగా రాకపోకలు

    • ఎండలు, వడగాలులతో పనులు కొనసాగించలేమన్న అధికారులు

    • రేపటి నుంచి భక్తులకు ఘాట్‌రోడ్డులోకి అనుమతి

  • May 28, 2026 18:18 IST

    హైదరాబాద్‌: రాయదుర్గంలో భూముల ధరలకు రెక్కలు

    • TGIIC భూముల ఈ-వేలంలో రూ.237 కోట్లు పలికిన ఎకరం

    • ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రాయదుర్గం భూముల వేలం

    • రాయదుర్గంలోని పాన్‌మక్తాలో 11.38 ఎకరాలకు వేలం

    • బిడ్డింగ్‌ ధర ఎకరాకు రూ.139 కోట్ల కేటాయింపు

    • గతేడాది ఇదే ప్రాంతంలో రూ.177 కోట్లు పలికిన ఎకరం

    • 7 ఎకరాలకు రూ.1,357.59 కోట్లు పలికిన భూమి

  • May 28, 2026 17:43 IST

    పెద్దపల్లి: చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: ఉత్తమ్‌

    • తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు: ఉత్తమ్‌

    • 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది తెలంగాణలోనే: పాండా

    • 11 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం: ఉత్తమ్‌

    • మద్దతు ధర ప్రకటించటం తప్పితే కేంద్రం సహకరించడం లేదు: ఉత్తమ్

    • కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం: ఉత్తమ్‌

  • May 28, 2026 17:35 IST

    బిహార్‌: గంగానదిలో పడవ బోల్తా.. ముగ్గురి మృతి

    • ప్రమాద సమయంలో పడవలో 14 మంది భక్తులు

  • May 28, 2026 17:21 IST

    హైదరాబాద్‌: నార్సింగిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి

    • సర్వే నం.18లోని 105 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

    • నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ఆరోపణలు

    • వేణుగోపాల్‌ గౌడ్‌, నిమ్మల బాలస్వామి, రాజేశ్‌లపై ఫిర్యాదు

    • తహసీల్దార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు

  • May 28, 2026 17:15 IST

    ఢిల్లీ: కాజీపేట రైల్వే యూనిట్‌పై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమీక్ష

    • కాజీపేట రైల్వే యూనిట్‌లో ఇంటర్‌‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్‌

    • కాజీపేట రైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ పూర్తి కావొచ్చింది: మంత్రి

    • త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుంది: అశ్వినీ వైష్ణవ్‌

  • May 28, 2026 17:08 IST

    నెల్లూరు: ఆత్మకూరులో గాంజా మత్తులో బీర్ బాటిల్‌తో దాడి

    • గాంజా మత్తులో కరిముల్లా అనే వ్యక్తిపై బీర్ బాటిల్‌తో దాడి చేసిన కత్తి సుమంత్

    • గాయాలపాలైన కరిముల్లాను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

  • May 28, 2026 17:02 IST

    లక్షద్వీప్‌కు చేరిన నైరుతి రుతుపవనాలు: IMD

    • నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి: IMD

    • ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కాస్త ఆలస్యం: IMD

    • సాధారణంగా జూన్‌ 1న కేరళం తీరాన్ని తాకిన తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి: IMD

  • May 28, 2026 16:35 IST

    జల వివాదాలు.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన

    • జల వివాదాలను సహకార ధోరణిలో పరిష్కరించుకోవాలి: ప్రధాని మోదీ

    • అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణిలో పరిష్కరించుకోవాలి: ప్రధాని

  • May 28, 2026 16:34 IST

    బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులపై అమిత్‌ షా హర్షం

    • మమత పాలనలో చొరబాట్లు జరిగాయి: అమిత్‌ షా

    • ఇప్పుడు వలసదారులు తమంతట తామే వెనక్కి వెళ్తున్నారు: అమిత్ షా

    • స్వచ్ఛందంగా వెళ్లేవారిపై ఎలాంటి కేసులుండవు: అమిత్‌ షా

    • మమత పాలనలో చొరబాట్లు జరిగాయి: అమిత్‌ షా

    • ఇప్పుడు వలసదారులు తమంతట తామే వెనక్కి వెళ్తున్నారు: అమిత్ షా

    • స్వచ్ఛందంగా వెళ్లేవారిపై ఎలాంటి కేసులు ఉండవు: అమిత్‌ షా

  • May 28, 2026 16:32 IST

    మంత్రి పొంగులేటి సవాల్‌పై స్పందించిన కేటీఆర్‌

    • సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే: కేటీఆర్‌

    • కాంగ్రెస్‌ పడగొట్టిన, నిర్మించిన ఇళ్ల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కేటీఆర్‌

  • May 28, 2026 16:28 IST

    రాజకీయాల నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు: సిద్ధరామయ్య

    • సిద్ధాంతాలపై రాజీపడే ప్రసక్తే లేదు: సిద్ధరామయ్య

    • ఢిల్లీకి వెళ్లే ఉద్దేశం లేదు, ఎమ్మెల్యేగా కొనసాగుతా: సిద్ధరామయ్య

    • రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్‌ ఆదేశించింది: సిద్ధరామయ్య

    • హైకమాండ్‌ సూచనను తిరస్కరించా: సిద్ధరామయ్య

  • May 28, 2026 16:08 IST

    నేను ఓ పల్లెటూరి నుంచి వచ్చాను: సిద్ధరామయ్య

    • ఎమ్మెల్యేనో, మంత్రినో, సీఎంనో అవుతానని అనుకోలేదు: సిద్ధరామయ్య

    • రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బుద్ధుడు, బసవుడు, అంబేడ్కర్, గాంధీల సూత్రాలను విశ్వసించాను: సిద్ధరామయ్య

    • నాకు రాజ్యాంగం పట్ల అపారమైన గౌరవం ఉంది: సిద్ధరామయ్య

  • May 28, 2026 16:02 IST

    హైదరాబాద్‌: ERC ముందుకు BRS పార్టీ

    • ప్రజాభిప్రాయ సేకరణకు హాజరై వాదనలను వినిపించనున్న కేటీఆర్ ఆధ్వర్యంలోని BRS ప్రతినిధుల బృందం

  • May 28, 2026 15:59 IST

    తెలంగాణకు చల్లని కబురు

    • రెండురోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు

    • రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

    • ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు

    • ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలులు

    • వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు

  • May 28, 2026 15:51 IST

    ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

    • లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంపై ప్రశ్నిస్తున్న ఈడీ

    • మద్యం పాలసీలో అవకతవకలు, మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపుపై విచారణ

    • లిక్కర్ పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలపై ప్రశ్నిస్తున్న ఈడీ

    • తన సమక్షంలో లిక్కర్ పాలసీ భేటీలు 3 సార్లు జరిగినట్లు సాయిరెడ్డి వెల్లడి

  • May 28, 2026 15:42 IST

    సిద్దరామయ్య రాజీనామా సమర్పించినట్లు గవర్నర్ కార్యాలయం ధ్రువీకరణ

    • ధ్రువీకరించిన గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌

  • May 28, 2026 15:35 IST

    గవర్నర్‌ ప్రస్తుతం బెంగళూరులో లేరు: సిద్ధరామయ్య

    • గవర్నర్‌ లేకపోవడంతో కార్యదర్శికి లేఖ ఇచ్చా: సిద్ధరామయ్య

    • హైకమాండ్‌ ఆదేశాల మేరకు రాజీనామా: సిద్దరామయ్య

    • అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను: సిద్దరామయ్య

    • నా రాజీనామాను గవర్నర్‌ ఆమోదిస్తారనే నమ్మకం ఉంది: సిద్దరామయ్య

    • సీఎంగా అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్‌, ఖర్గేకు ధన్యవాదాలు: సిద్దరామయ్య

  • May 28, 2026 15:29 IST

    కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా

    • కర్ణాటక లోక్‌భవన్‌లో రాజీనామా లేఖ అందజేసిన సిద్దరామయ్య

    • సిద్దరామయ్య స్థానంలో సీఎం పదవి చేపట్టనున్న డీకే శివకుమార్‌

  • May 28, 2026 15:27 IST

    నెల్లూరు: ఇందుకూరుపేట లేగుంట పాడులో కిడ్నాపర్ల కలకలం

    • ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్ని గోనెసంచిలో వేసి కిడ్నాప్ చేసేందుకు దుండగుల యత్నం

    • పిల్లల అరుపులు విని కాపాడిన స్థానికులు

    • కిడ్నాపర్లకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు

  • May 28, 2026 15:06 IST

    అమరావతి: జూన్ 1న కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం

    • ఉదయం 11:00 గంటలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

  • May 28, 2026 14:57 IST

    బెంగళూరు: లోక్ భవన్‌కు చేరుకున్న సిద్ధరామయ్య

    • గవర్నర్ లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి రాజీనామ లేఖ సమర్పించిన సిద్ధూ

    • అనంతరం రాహుల్ గాంధీని కలిసిందేంకు ఢిల్లీ వెళ్లనున్న సిద్ధరామయ్య

  • May 28, 2026 14:41 IST

    ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

    • లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ప్రశ్నిస్తున్న ఈడీ

    • గతంలో విజయసాయిరెడ్డిని రెండుసార్లు ప్రశ్నించిన ఈడీ

  • May 28, 2026 14:33 IST

    బెంగళూరు: శివమొగ్గలో కురుబ సామాజిక వర్గం ఆందోళన

    • సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తుండటంతో టైర్లకు నిప్పంటించి నిరసన

  • May 28, 2026 14:21 IST

    కర్ణాటక: కాసేపట్లో లోక్‌భవన్‌కు సిద్దరామయ్య

    • గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్న సిద్దరామయ్య

    • సా.5:00 గంటలకు ఢిల్లీకి సిద్ధరామయ్య

    • సోనియా, రాహుల్‌తో భేటీకానున్న సిద్ధరామయ్య

    • రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

    • డీకే శివకుమార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న MLAలు

  • May 28, 2026 13:27 IST

    ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు: పవన్‌

    • రాజకీయ జీవితంలో ప్రజాపక్షం వహించారు: పవన్‌

    • సీఎంగా ఎన్టీఆర్ సేవలు మరువలేనివి: పవన్‌

  • May 28, 2026 13:27 IST

    నీట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు

    • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో కీలక భేటీ

    • పాల్గొన్న NTA డీజీ, పీఎంవో అధికారులు

  • May 28, 2026 13:20 IST

    రాజస్థాన్: అజ్మీర్‌లో నలుగురి సజీవదహనం

    • స్కార్పియో వాహనం తగలబడి నలుగురి మృతి

    • మృతుల్లో కాంగ్రెస్ నేత రామ్‌సింగ్ చౌదరి, కుటుంబీకులు

    • ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసుల అనుమానం

  • May 28, 2026 13:09 IST

    కర్ణాటక: సిద్దరామయ్య సీఎంగా రాజీనామా చేస్తారు: మంత్రి పాటిల్

    • కర్ణాటక తదుపరి సీఎం డీకే శివకుమార్: మంత్రి హెచ్‌కే పాటిల్

    • డీకే కొత్త సీఎం అని సిద్దరామయ్య ప్రకటించారు: మంత్రి పాటిల్

  • May 28, 2026 13:00 IST

    CBSE ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ప్రకటన

    • మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకారం

    • CBSE 12వ తరగతి పత్రాలు రీ-వాల్యుయేషన్‌కు ఆదేశం

    • విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా

    • OSM విధానంలో లోపాలున్నాయన్న ధర్మేంద్ర ప్రధాన్

    • తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటన

  • May 28, 2026 12:45 IST

    కర్ణాటక: మధ్యాహ్నం 2:30కు లోక్‌భవన్‌కు సిద్దరామయ్య

    • గవర్నర్ అందుబాటులో లేకపోయినప్పటికీ గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖ సమర్పించాలని నిర్ణయం

    • సా.5 గంటలకు ఢిల్లీకి సిద్దరామయ్య

    • సోనియా, రాహుల్‌తో భేటీకానున్న సిద్దరామయ్య

    • శుక్రవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

    • డీకే శివకుమార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

  • May 28, 2026 12:36 IST

    కృష్ణా: మాజీమంత్రి కొడాలి నానిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహం

    • ఓడిపోతే చంద్రబాబు బూట్లు తూడుస్తానన్నావ్.. ఎప్పుడు తూడుస్తావ్?

    • విజయవాడలో ప్రెస్ ముందు మాట్లాడటం కాదు.. దమ్ముంటే గుడివాడకు రా..

    • గుడివాడ ప్రజలు ఓడించినా కొడాలి నానికి బుద్ధి రాలేదు: వెనిగండ్ల రాము

    • సమాజం ఛీ కొడుతున్నా.. సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారు

    • రాజకీయాల్లో ఏం సాధించావని విమర్శలు చేస్తున్నావు?: వెనిగండ్ల రాము

  • May 28, 2026 11:57 IST

    ఢిల్లీ: 4 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

    • ఢిల్లీ, హర్యానా, త్రిపుర, పంజాబ్‌ రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం

    • ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష మల్హోత్రా

    • పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్

    • హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చన గుప్తా

    • త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్

  • May 28, 2026 11:39 IST

    జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నాంపల్లి కోర్టు లో విచారణ

    • 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రెండోసారి కోరిన పోలీసులు

    • ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరిన నిందితులు

    • బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

    • జూన్ 1న కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించనున్న నాంపల్లి కోర్టు

    • ఇప్పటికే ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు

    • ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు

  • May 28, 2026 11:35 IST

    నిర్మల్: పంట కొనుగోలులో కాంగ్రెస్ విఫలం: మహేశ్వర్‌రెడ్డి

    • నెలరోజులైనా 40% ధాన్యం కూడా కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉంది

    • అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయినా ఏ ఒక్క మంత్రి సందర్శించలేదు: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    • ఇచ్చిన హామీలను సైతం పక్కన పడేశారు: మహేశ్వర్‌రెడ్డి

  • May 28, 2026 11:34 IST

    హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

    • FCDA కార్యాలయం, స్కిల్ వర్సిటీ పనులు పరిశీలించిన మంత్రులు

    • నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం

    • ఆధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది

    • ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవడం ఖాయం: మంత్రులు

  • May 28, 2026 11:34 IST

    అనకాపల్లి: పాస్టర్ అభినయ్ దర్శన్‌కు బెయిల్

    • నర్సీపట్నం సబ్ జైలు నుంచి దర్శన్‌ విడుదల

    • నాపై మతపరమైన సెక్షన్లు పెట్టారు: అభినయ్ దర్శన్

    • పాదయాత్రలో మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు: దర్శన్

    • పాడేరు నియోజకవర్గం నుంచే యాత్ర కొనసాగుతుంది: దర్శన్

  • May 28, 2026 11:11 IST

    ఏపీలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పిడుగుపాటు హెచ్చరిక

    • వచ్చే 3గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్

    • అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం

  • May 28, 2026 10:50 IST

    కర్ణాటక సీఎంగా రాజీనామా చేస్తున్నా: సిద్దరామయ్య

    • కర్ణాటక సీఎంగా రాజీనామా చేస్తున్నట్టు సిద్దరామయ్య ప్రకటన

    • కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్లు సిద్దరామయ్య వెల్లడి

    • హైకమాండ్ నిర్ణయాన్ని మంత్రులకు తెలిపిన సిద్దరామయ్య

    • ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సిద్దరామయ్య

    • గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్న సిద్దరామయ్య

  • May 28, 2026 10:49 IST

    ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ మోత్కుపల్లి నరసింహులు భావోద్వేగం

    • ఎన్టీఆర్ లాంటి మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం: మోత్కుపల్లి

    • డబ్బు కోసం ఎగబడేవాడు నాయకుడు కాదు: మోత్కుపల్లి

    • రూపాయి లేకున్నా.. ఎన్టీఆర్ వల్లే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా: మోత్కుపల్లి

    • ఇప్పుడున్న నేతలందరి ఆరాటమంతా డబ్బు, సీటు కోసమే: మోత్కుపల్లి

    • ఎన్టీఆర్ ఆశీస్సులతో మరో ఉద్యమం తీసుకువస్తా: మోత్కుపల్లి

    • పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడుతా: మోత్కుపల్లి

  • May 28, 2026 10:39 IST

    ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

    • నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ శ్రేణులు

  • May 28, 2026 10:33 IST

    బెంగళూరు: సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్

  • May 28, 2026 10:31 IST

    మహనీయులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా: మోదీ

  • May 28, 2026 10:29 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ.2,230 తగ్గి రూ.1,56,060కి చేరిన 24క్యారెట్ల 10గ్రాముల బంగారం

    • రూ.2,050 తగ్గి రూ.1,43,050కి చేరిన 22క్యారెట్ల 10గ్రాముల బంగారం

    • కిలోపై రూ.5వేలు తగ్గి రూ.2,85,000కు చేరిన వెండి

  • May 28, 2026 10:22 IST

    అమరావతి: అందరి హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులు: మెగాస్టార్ చిరంజీవి

    • తరాలు మారినా, తారకరాముని ప్రభావం చెరిగిపోదు

    • నాకు 'ఎన్టీఆర్ పురస్కారం' లభించడం ప్రత్యేకమైన గౌరవం

    • తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారు

  • May 28, 2026 10:19 IST

    జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

    • ఆరో రోజుకు చేరుకున్న గాలింపు చర్యలు

    • అడవుల్లో ఉగ్రవాదుల కోసం వెతుకులాట

    • ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్

    • మంజాకోట్ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం

  • May 28, 2026 10:17 IST

    బక్రీద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

    • హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగ భావం మానవాళికి ఆదర్శం: లోకేశ్

    • బక్రీద్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా: ఎక్స్‌లో మంత్రి లోకేశ్

  • May 28, 2026 10:09 IST

    అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు

  • May 28, 2026 10:06 IST

    కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం

    • బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్

    • ఇవాళ రాజీనామా చేయాల్సి ఉన్న సీఎం సిద్దరామయ్య

    • ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సిద్దరామయ్య

    • నిన్న రాత్రి 10:30కు ముంబై వెళ్లిన గవర్నర్ గెహ్లాట్

    • మధ్యాహ్నం బెంగళూరుకు రానున్న గవర్నర్ గెహ్లాట్

    • మ.3గంటలకు గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్న సిద్దరామయ్య

  • May 28, 2026 10:04 IST

    అమరావతి: రెండోరోజు టీడీపీ మహానాడు

    • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు

    • నివాళులర్పించిన లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు

    • 1,875 క్లస్టర్ల నుంచి మహానాడుకు భారీగా హాజరైన టీడీపీ నేతలు, శ్రేణులు

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ప్రత్యేక తీర్మానం

  • May 28, 2026 10:03 IST

    హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ 103వ జయంతి

    • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి, నారా కుటుంబ సభ్యుల నివాళులు

    • నివాళులర్పించిన పురంధేశ్వరి, నారా భువనేశ్వరి

    • నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ, జూ.ఎన్టీఆర్‌

  • May 28, 2026 08:59 IST

    తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వవిఖ్యాత ఎన్టీఆర్: మంత్రి లోకేశ్

  • May 28, 2026 08:52 IST

    సిద్ధిరామయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం

  • May 28, 2026 08:46 IST

    ఎన్టీఆర్ జయంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

  • May 28, 2026 08:46 IST

    హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన మోత్కుపల్లి నరసింహులు

  • May 28, 2026 08:34 IST

    హైదరాబాద్: పురందేశ్వరి కామెంట్స్..

    • తెలుగువారు ఎక్కడున్నా అందరిపై ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుంది: పురందేశ్వరి

    • రాజకీయాలంటే ప్రజాసేవ అని ఎన్టీఆర్ రుజువు చేశారు: పురందేశ్వరి

    • ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురందేశ్వరి

    • తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: పురందేశ్వరి

  • May 28, 2026 08:32 IST

    హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్‌‌లో నివాళులర్పించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు

  • May 28, 2026 08:10 IST

    నేడు నిర్మల్ జిల్లాలో బీజేపీ రైతు భరోసా బస్సు యాత్ర

  • May 28, 2026 07:51 IST

    జర్మనీ ISSF షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో ఇషాసింగ్‌కు బంగారు పతకం

    • స్వర్ణం గెలిచిన భారత స్టార్ షూటర్‌, తెలంగాణకు చెందిన ఇషాసింగ్‌

    • మహిళల 25 మీ. పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్‌లో 43 పాయింట్లు సాధించిన ఇషాసింగ్‌

  • May 28, 2026 07:50 IST

    గుంటూరు: ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

    • పాల్గొన్న స్టేడియం సెక్రటరీ వజ్జా రామకృష్ణ, అన్నవరం దేవాలయం బోర్డు మెంబర్ రావిపాటి సత్యనారాయణ

  • May 28, 2026 07:49 IST

    ఎన్టీఆర్ ఘాట్‌కు జూనియర్ ఎన్టీఆర్

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • May 28, 2026 07:47 IST

    ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీపార్వతి

  • May 28, 2026 07:32 IST

    అమరావతి: నేడు రెండోరోజు టీడీపీ మహానాడు

    • ఉ.10 గంటలకు ప్రారంభంకానున్న మహానాడు

    • నేడు మహానాడులో కీలక తీర్మానాలకు ఆమోదం

    • సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం

  • May 28, 2026 07:29 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు మూసివేత

    • మరమ్మతు పనుల కారణంగా ఘాట్‌రోడ్డు మూసివేత

    • 15 రోజుల పాటు జరగనున్న ఘాట్‌రోడ్డు పనులు

  • May 28, 2026 07:28 IST

    హైదరాబాద్‌: రెండోరోజు పోలీస్‌ కస్టడీకి బండి భగీరథ్‌

    • పోక్సో కేసులో భగీరథ్‌ను విచారిస్తున్న పోలీసులు

  • May 28, 2026 07:27 IST

    కర్ణాటక: నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్దరామయ్య

    • ఉ.9 గంటలకు మంత్రులతో సిద్దరామయ్య బ్రేక్‌ ఫాస్ట్ సమావేశం

    • ఉ.10:30కు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సిద్దరామయ్య

    • గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించే అవకాశం

    • సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

  • May 28, 2026 07:27 IST

    నెల్లూరు: చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా

    • పలువురు ప్రయాణికులకు గాయాలు

    • ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు

    • ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తున్న బస్సు

  • May 28, 2026 07:26 IST

    ఇరాన్‌తో శాంతి చర్చల అంశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • చర్చలు విఫలమైతే.. రక్షణ మంత్రిని రంగంలోకి దించి ఇరాన్ పనిపడతాం: ట్రంప్

    • పాక్ ఆర్మీ చీఫ్, ప్రధాని అభ్యర్థనతోనే ఇరాన్‌కు అవకాశం ఇచ్చాం: ట్రంప్

    • ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది: ట్రంప్

    • ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయింది: ట్రంప్

    • అమెరికా దాడుల్లో ఇరాన్‌లో రెండుసార్లు పాలకవర్గం అంతమైంది: ట్రంప్

    • హోర్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుంది: ట్రంప్

  • May 28, 2026 07:21 IST

    ఢిల్లీలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన

    • సోనియా, రాహుల్‌ను కలవనున్న విజయ్

    • ఢిల్లీ JNTUలో తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న తమిళనాడు సీఎం విజయ్