-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 24th May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 24 , 2026 | 05:49 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 24, 2026 21:07 IST
ఏలూరు: నూజివీడు మండలంలోని కాట్రేనిపాడు బ్లాక్ అడవిలో ఎగిసిపడుతున్న మంటలు
మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జనగాంగూడెం, దేవరగుంట గ్రామాల దగ్గర ఘటన
-
May 24, 2026 20:29 IST
హైదరాబాద్: నార్సింగి పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం
మూవీ టవర్స్‌లోని సి-బ్లాక్ సెల్లార్‌లో చెలరేగిన మంటలు
మంటల్ని అదుపుచేసేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
-
May 24, 2026 20:24 IST
నల్లగొండ : చండూర్ మున్సిపాలిటిలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ
ఒకరిపై ఒకరు కత్తులతో దాడి, శివ అనే వ్యక్తికి గాయాలు
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
-
May 24, 2026 20:17 IST
ఖమ్మం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
తల్లాడలో అక్రమంగా డీసీఎం వ్యాన్‌లో తరలి 50 కింట్వాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
-
May 24, 2026 20:02 IST
ఖమ్మం పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
మధిరలో అభివృద్ధి పనులను పరిశీలించిన భట్టి విక్రమార్క
గడువులోగా వైరా నది రక్షణ గోడ పనులను పూర్తి చేయాలి: భట్టి
శివాలయం వద్ద రూ.7 కోట్లతో వైకుంఠధామం సుందరీకరణ: భట్టి
-
May 24, 2026 19:49 IST
ఐపీఎల్ 2026: ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్
ముంబైపై 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం
206 పరుగుల ఛేదనలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసిన ఎంఐ
దీంతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్
ఎలిమినేటర్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో తలపడనున్న ఆర్ఆర్
ఆర్ఆర్ విజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన పంజాబ్, కేకేఆర్
-
May 24, 2026 19:23 IST
తాలు, తరుగు పేరుతో కోతలు వేస్తే కఠిన చర్యలు: ఉత్తమ్
రైతుకు నష్టం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదు: మంత్రి ఉత్తమ్
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఉత్తమ్
రైతుల్లో గందగోళం సృష్టించవద్దని అధికారులకు ఆదేశాలు
ఖరీఫ్, రబీ రైతులకు రూ.45 వేల కోట్లు చెల్లింపు: ఉత్తమ్
మిగులు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఉత్తమ్
-
May 24, 2026 19:07 IST
విజయవాడ: పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం
వర్షంతో చల్లబడిన విజయవాడ వాతావరణం
-
May 24, 2026 18:57 IST
ఏలూరు: వడదెబ్బ కారణంగా ఇద్దరి మృతి
కుకునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ(35) వడదెబ్బకు మృతి
వడదెబ్బ తగలడంతో బంజరగూడేనికి చెందిన పెరుమాళ్లు(80) మరణం
-
May 24, 2026 18:44 IST
ఖమ్మం: గంగాదేవిపాడులో అగ్నిప్రమాదం
ప్రమాదవశాత్తూ వరి కొయ్యలకు అంటుకున్న అగ్ని సమీపంలో మామిడి తోటకు పాకిన మంటలు
12 ఎకరాల మామిడి తోట దగ్ధం
-
May 24, 2026 18:37 IST
సూర్యాపేట: తుంగతుర్తి మం. వెంపటి గ్రామ శివారులోని పంట పొలాల్లో అగ్నిప్రమాదం
బైక్ దగ్ధం, IKP కేంద్రానికి తప్పినముప్పు
మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
-
May 24, 2026 18:36 IST
నెల్లూరు: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు మండలం ముస్తాపురం వద్ద ఘటన
కారు బోల్తాపడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలు
-
May 24, 2026 18:28 IST
సీఎం రేవంత్‌ను కలిసిన తమిళనాడు మంత్రి పి. విశ్వనాథన్
-
May 24, 2026 18:28 IST
రేపటి నుంచి తెలంగాణవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు
మే 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాల నిర్వహణ
-
May 24, 2026 18:07 IST
కర్ణాటక: ఉత్తర కన్నడ జిల్లాలో పడవ బోల్తా
నదిలోకి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
మృతుల్లో ఏడుగురు మహిళలు
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
May 24, 2026 17:44 IST
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్
కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు
ధాన్యం సేకరణ వేగవంతంపై అధికారులకు దిశానిర్దేశం
కొనుగోలు కేంద్రాల పనితీరుపై జిల్లాల వారీగా సమీక్ష
-
May 24, 2026 17:36 IST
ఐపీఎల్ 2026: రాణించిన ఆర్ఆర్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసిన ఆర్ఆర్
ఆఖరిలో జోఫ్రా ఆర్చర్(32), రవీంద్ర జడేజా(19*) మెరుపులు
ముంబై బౌలర్లలో చాహర్, శార్దూల్‌కు తలో 2 వికెట్లు
జాక్స్, ఘజన్‌ఫర్, బాష్‌లకు తలొక వికెట్
ముంబై ఇండియన్స్ టార్గెట్ 206
-
May 24, 2026 17:29 IST
న్యాయవాది ఖాజా హత్య కేసులో ఆలం ఖాన్ ఆచూకీ లభ్యం
ఆలం ఖాన్ ఊటిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
ఊటీలో ఉన్న ఆలం ఖాన్ హైదరాబాద్ రప్పించిన పోలీసులు
అడ్వకేట్ ఖాజా హత్య కేసులో ఆలం ఖాన్ ప్రశ్నిస్తున్న పోలీసులు
-
May 24, 2026 17:22 IST
అమరావతి: ఏపీలో తీవ్రరూపం దాల్చిన ఎండలు
ఇవాళ చిట్యాల(తూర్పుగోదావరి)లో 48.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
మరో మూడు రోజుల పాటు ఇలాంటి పరిస్థితులేని విపత్తుల సంస్థ హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
-
May 24, 2026 17:12 IST
మెదక్ జిల్లా: పెద్దశంకరంపేట మం. చీలపల్లిలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఈనెల 14న గ్రామంలోని 5 ఇళ్లలో దొంగతనం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితుల అరెస్ట్
నిందితుల నుంచి 92 తులాల బంగారం, కేజీన్నర వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
-
May 24, 2026 16:55 IST
అమరావతి: ఏపీలో ‘ఎబోలా’పై అప్రమత్తమైన ప్రభుత్వం
కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలపై ప్రత్యేక నిఘా
విశాఖ, తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ప్రయాణికులకు స్క్రీనింగ్
వైరస్ లక్షణాలు ఉన్న వారికి క్వారంటైన్: మంత్రి సత్యకుమార్
-
May 24, 2026 16:53 IST
కడప: వెంకటరాజంపేట ఆలయంలో చోరీకి యత్నం
హుండీని పగులగొట్టేందుకు దొంగల విఫలయత్నం
చోరీ సాధ్యంకాకపోవడంతో వెనుదిరిగిన దొంగలు
సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
-
May 24, 2026 16:42 IST
విజయవాడ: ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ది సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
అధ్యక్షునిగా భరత్ భూషణ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన హీరో సుమన్, సినీ డైరెక్టర్ మెహర్ రమేశ్ తదితర సభ్యులు
పాల్గొన్న మంత్రి కందుల దుర్గేశ్, MLA నందమూరి బాలకృష్ణ
-
May 24, 2026 16:36 IST
హైదరాబాద్: ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
కవాడిగూడకు చెందిన వినయ్ అరెస్ట్
మరో నలుగురిని కల్వకుర్తి, గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు
-
May 24, 2026 16:28 IST
భూపాలపల్లి: ఎల్ అండ్ టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం
కార్యాలయంలో ఎగసిపడుతున్న మంటలు
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి తాత్కాలిక షెడ్లు దగ్ధం
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఘటన
-
May 24, 2026 15:52 IST
హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ
హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
కేసు నమోదు చేసిన పోలీసులు
-
May 24, 2026 15:29 IST
తిరుపతి: కాలినడకన తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న రామ్మోహన్ నాయుడు
-
May 24, 2026 15:13 IST
కృష్ణాజిల్లా: బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడికి జైలు శిక్ష
తొలిసారి బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడికి జైలు శిక్ష
గుడివాడ వాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలింపు
సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో ఉన్న నిందితుడు
మే 15న మళ్లీ నేరానికి పాల్పడటంతో క్రైమ్ నం.132/2025 కింద కేసు నమోదు
-
May 24, 2026 15:04 IST
ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన ముంబై
వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండయన్స్ మ్యాచ్
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న రాజస్థాన్
ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే రాజస్థాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి
-
May 24, 2026 15:03 IST
నిజామాబాద్: నందిపేట్‌లో అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
ఆస్పత్రికి తరలించిన స్థానికులు
చికిత్స పొందుతూ శిశువు మృతి
-
May 24, 2026 14:38 IST
పాలకుర్తిలో విభేదాలపై విచారణ జరుపుతున్నాం: ఎంపీ మల్లురవి
కిశోర్, హరిప్రసాద్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చాం: ఎంపీ రవి
క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి: మల్లురవి
ఇరువర్గాలను పిలిచి కమిటీ మాట్లాడుతుంది: మల్లురవి
ఝాన్సీరెడ్డిని కూడా పిలిచి మాట్లాడాం: మల్లురవి
MLA యశస్వినీరెడ్డిని విచారణకు పిలుస్తాం: మల్లు రవి
ఈనెల 30న మరోసారి కమిటీ సమావేశం: మల్లు రవి
-
May 24, 2026 14:03 IST
నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లో దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మనూర్ మండలం ఎల్గోయి శివారులో ముత్యంరెడ్డిని హతమార్చిన కల్పన, చింటూ అరెస్ట్
-
May 24, 2026 13:39 IST
రెండు కార్ల ఢీ.. వ్యక్తి మృతి
సూర్యాపేట: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి దగ్గర ప్రమాదం
రెండు కార్ల ఢీ.. మద్దిరాలకు చెందిన మెడుదల యాకస్వామి(30) మృతి
-
May 24, 2026 13:37 IST
ఢిల్లీ: జైశంకర్‌తో ముగిసిన మార్కో రుబియో సమావేశం
భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం
భారత్-అమెరికా వ్యూహాత్మక ఒప్పందాలు కొనసాగుతాయి
పశ్చిమాసియా పరిస్థితులపై మోదీ, రుబియో చర్చించారు: జైశంకర్
-
May 24, 2026 13:37 IST
కేబినెట్ భేటీలో ధాన్యంపై కనీసం చర్చ చేయలేదు: కేటీఆర్
ప్రధాని మోదీ తానా అంటే.. రేవంత్ తందానా అంటున్నారు
తెలంగాణ వ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ పెడతారట: కేటీఆర్
డిసెంబర్‌లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలుంటాయి: కేటీఆర్
మరో ఏడాది ఆగితే మనదే అధికారం: కేటీఆర్
-
May 24, 2026 13:34 IST
రైతులతో రాజకీయాలు చేయడం రేవంత్‌కు అలవాటు: ఎంపీ రఘునందన్‌రావు
80శాతం కొనుగోలు ఎక్కడ జరిగిందో సీఎం చెప్పాలి: రఘునందన్
రేపటి నుంచి రైతు గోసా-బీజేపీ భరోసా పేరుతో యాత్ర: ABNతో ఎంపీ రఘునందన్‌రావు
ప్రభుత్వ వైఫల్యాలపై రైతులతోనే మాట్లాడిస్తాం: ABNతో రఘునందన్
-
May 24, 2026 13:10 IST
USతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి: జైశంకర్
త్వరలో అమెరికా బృందం భారత్‌కు రాబోతోంది: జైశంకర్
ఒప్పందంలోని కొన్ని అంశాలపై అభ్యంతరం ఉంది: జైశంకర్
దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం: భారత విదేశాంగ మంత్రి జైశంకర్
-
May 24, 2026 13:09 IST
భారత్, US ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు: మార్కో రుబియో
భారత్‌లో పర్యటించడం గర్వకారణం: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో
గల్ఫ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించాం: రుబియో
ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తాయి: రుబియో
భారత్, అమెరికా.. రెండూ ఉగ్రవాదబాధిత దేశాలే: రుబియో
-
May 24, 2026 12:24 IST
నెల్లూరు: రక్తచరిత్ర ఎవరిదో ప్రజలందరికీ తెలుసు: మంత్రి నారాయణ
రక్తచరిత్ర ఎవరిదో తెలుసు కాబట్టే.. వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి జీరో తప్పదు: మంత్రి నారాయణ
-
May 24, 2026 12:23 IST
కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముసాయిదా విడుదల
జులై 1 నుంచి అమల్లోకి ఉపాధి హామీ చట్టం VB-G RAM
ముసాయిదాపై జూన్ 21 వరకు అభిప్రాయాల సేకరణ
కొత్త చట్టం ప్రకారం పెద్ద, పేద రాష్ట్రాలకు భారీగా పెరగనున్న కేంద్ర నిధుల కేటాయింపు
-
May 24, 2026 11:56 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో మల్లు రవి అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష
గోషామహల్ ఇన్‌చార్జ్ సునీతారావు లేకుండా రివ్యూ పెట్టడంపై పలువురు ఆగ్రహం
కో-ఆర్డినేటర్ మల్లు రవితో కార్పొరేటర్ల వాగ్వాదం
పార్లమెంట్ రివ్యూ మీటింగ్ వాయిదా
-
May 24, 2026 11:56 IST
పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేపట్టాలని సీఎం నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రూ.1,800 కోట్ల కేటాయింపు
మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
రూ.1,100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధం
-
May 24, 2026 11:43 IST
పాకిస్థాన్: బలూచిస్థాన్‌లో ఉగ్రదాడి
ట్రైన్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
23 మంది మృతి, 47 మందికిపైగా తీవ్రగాయాలు
-
May 24, 2026 11:34 IST
వైఎస్ కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైంది: బీటెక్ రవి
1968లో రాజారెడ్డి భార్య పులివెందుల సర్పంచ్‌గా పోటీచేశారు: బీటెక్ రవి
వార్డు మెంబర్‌గా పోటీ చేసి కృష్ణమూర్తి చేతిలో జయమ్మ ఓడిపోయారు
1962లోనే పులివెందుల పీఎస్‌లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉంది: బీటెక్ రవి
నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను హత్య చేసిన చరిత్ర మీది: బీటెక్ రవి
-
May 24, 2026 11:21 IST
పంజాబ్: కపుర్తలా జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ
ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన బలగాలు
కొన్ని గంటల తర్వాత అదుపులోకి వచ్చిన పరిస్థితి
-
May 24, 2026 10:46 IST
ఏలూరు: నేడు ద్వారకాతిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
ఐ ఎస్ జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం
అనంతరం రాజమండ్రి బయలుదేరి వెళ్లనున్న డిప్యూటీ సీఎం
-
May 24, 2026 10:37 IST
నంద్యాల : శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్‌కో కాలనీ సమీపంలో చిరుతపులి సంచారం
తెల్లవారుజామున ఓ ఇంటి ముందు కోడిని తినేందుకు ప్రయత్నించిన చిరుతపులి
చిరుత పులిని ఫోన్లలో వీడియోలు తీసిన స్థానికులు
సున్నిపెంట శివార్లలో తరచూ సంచరిస్తున్న చిరుతపులులు
భయాందోళనలో సున్నిపెంట ప్రజలు
-
May 24, 2026 10:31 IST
రంగారెడ్డి: చేవళ్ల మండలం కందవాడ గేట్ దగ్గర రోడ్డుప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు-కారు
ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం
-
May 24, 2026 10:30 IST
సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం
నిన్న ప్రధాన గుట్ట దగ్గర దిగాల్సిన సీఎం హెలికాప్టర్.. 2 కి.మీ. దూరంలో ల్యాండింగ్
అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ సీరియస్
సీఎస్, డీజీపీ నుంచి వివరణ కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
R&B, ఏవియేషన్ అధికారుల వివరణ కోరిన ఉన్నతాధికారులు
-
May 24, 2026 10:29 IST
హైదరాబాద్: న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు
కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తింపు
నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు
నిన్న కారుతో ఢీకొట్టి న్యాయవాదిని హత్య చేసిన ప్రత్యర్థులు
3 రోజులు రెక్కీ చేసి న్యాయవాదిని చంపిన ప్రత్యర్థులు
వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని గుర్తింపు
-
May 24, 2026 10:28 IST
నెల్లూరు: మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి బోల్తా పడ్డ మినీ ట్రక్కు
ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
-
May 24, 2026 09:41 IST
ప్రముఖ పంపిణీదారుడు బి. హరి (47) హఠాన్మరణం
ఆదివారం ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్‌లో మృతి
హరి నెల్లూరు జిల్లా పంపిణీదారుడు, డబ్బింగ్ చిత్రాల నిర్మాత
-
May 24, 2026 09:18 IST
మంచిర్యాల: నస్పూర్‌లో విషాదం
ధాన్యం అన్‌లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ మృతి
ప్రమాదవశాత్తు లారీ పైనుంచి పడి శంకర్ మృతి
శంకర్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా మున్నార్
-
May 24, 2026 09:17 IST
భద్రాద్రి: కామేపల్లి మండలంలో బంగారం పేరుతో మోసం
తక్కువ ధరకే బంగారం ఇస్తామని రూ.50లక్షల వసూలు
పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు
నిందితులు లక్ష్మీనారాయణ, సాయికుమార్‌పై కేసు నమోదు
-
May 24, 2026 08:55 IST
కృష్ణా: గూడూరు మండలం మచిలీపట్నం-విజయవాడ రహదారిపై పోలీసుల తనిఖీలు
పోలీస్ సిబ్బందిని దాటుకుని బైక్‌పై పారిపోయిన యువకులు
చేజ్ చేసిన పోలీసులు, బారికేడ్లను ఢీకొట్టి కిందపడిన యువకులు
ఒకరికి తీవ్రగాయాలు, యువకుల దగ్గర 12 కేజీల గంజాయి లభ్యం, కేసు నమోదు
-
May 24, 2026 08:53 IST
సూర్యాపేట: కోదాడలో లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఆరుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు
కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన
-
May 24, 2026 08:47 IST
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
ఆమ్‌స్టర్‌డామ్ విమానంలో బాంబు ఉందని మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా విమానం ల్యాండింగ్
విమానంలో తనిఖీ చేసి.. బాంబు లేదని తేల్చిన సెక్యూరిటీ
-
May 24, 2026 08:46 IST
నంద్యాల : శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం
భక్తులతో నిండిపోయిన ఆలయ క్యూలైన్లు
వేకువజాము నుంచే స్వామిఅమ్మవార్ల దర్శనానికి క్యూలలో వేచి ఉన్న భక్తులు
వేసవి సెలవులు, ఆదివారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
May 24, 2026 06:52 IST
మహారాష్ట్రలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం ధ్వంసం
పోమ్కే-బినగుండ అడవిలో ఆయుధ తయారీ కేంద్రం గుర్తింపు
లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో స్పెషల్ ఆపరేషన్
ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, సామగ్రి స్వాధీనం
-
May 24, 2026 06:43 IST
నేడు పాయకరావుపేటలో హోం మంత్రి అనిత పర్యటన
పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో మహానాడు ఏర్పాట్ల పరిశీలన
CMRF చెక్కులను పంపిణీ చేయనున్న హోం మంత్రి అనిత
-
May 24, 2026 05:55 IST
రేపటి నుంచి కెనడాలో భారత బృందం పర్యటన
రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటన
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో కెనడా వెళ్లనున్న భారత్ బృందం
-
May 24, 2026 05:51 IST
రాజమండ్రిలో నేడు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించనున్న పవన్
-
May 24, 2026 05:50 IST
IPL: నేడు ముంబై ఇండియన్స్ Vs రాజస్థాన్ రాయల్స్
ముంబైలో మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్
ఈడెన్‌గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా Vs ఢిల్లీ మ్యాచ్
-
May 24, 2026 05:49 IST
అమెరికా వైట్‌హౌస్ దగ్గర కాల్పుల కలకలం
వైట్‌హౌస్ దగ్గర 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో కాల్పులు
20 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు
దుండగులపై సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు
కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉన్న డొనాల్డ్ ట్రంప్
కాల్పుల ఘటనపై 'X'లో వెల్లడించిన FBI డైరెక్టర్ కాష్ పటేల్
వైట్‌హౌస్ దగ్గర భారీగా బలగాల మోహరింపు