Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 22 , 2026 | 06:20 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 22, 2026 21:25 IST

    ఐపీఎల్ 2026: విజృంభించిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

    • ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్

    • 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసిన హైదరాబాద్

    • అభిషేక్ శర్మ(56), క్లాసెన్(51), ఇషాన్ కిషన్(79) హాఫ్ సెంచరీలు

    • ట్రావిస్ హెడ్(26), నితీశ్ కుమార్ రెడ్డి(29*) పరుగులు

    • ఆర్సీబీ టార్గెట్ 256

  • May 22, 2026 21:25 IST

    ఉరుములు మెరుపులతో దద్దరిల్లిన చిక్కోలు

    • శ్రీకాకుళంలో గాలులు, ఉరుములు, మెరుపులు

    • కరంట్ లేక చిమ్మచీకటిలో వున్న నగరం

  • May 22, 2026 21:14 IST

    సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సింగపూర్‌ పర్యటన ఖరారు

    • ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన

    • సింగపూర్ జాతీయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు 10వ 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

    • పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు

  • May 22, 2026 21:13 IST

    హైదరాబాద్‌లో టెస్లా ఈవీ కార్ల షోరూం ఏర్పాటు దిశగా అడుగులు

    • మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా ఇండియా ప్రతినిధుల భేటీ

    • హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ సెంటర్‌పై టెస్లా ఆసక్తి

  • May 22, 2026 21:05 IST

    ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం

    • ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం

    • 16 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 209/2

    • క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(51*), ఇషాన్ కిషన్(65*)

    • 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఔటైన ఓపెనర్ అభిషేక్ శర్మ(56)

    • ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్, సుయాశ్ శర్మకు చెరొక వికెట్

  • May 22, 2026 20:13 IST

    తెలంగాణలో భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు

    • రాష్ట్రంలో 16 మంది అడిషనల్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ

    • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    • వెంటనే విధుల్లో చేరాలని బదిలీ అయిన అధికారులకు ప్రభుత్వ ఆదేశం

  • May 22, 2026 19:51 IST

    విజయనగరం: జిల్లా అంతటా భారీ ఈదురు గాలులు

    • పలు చోట్ల విరిగి పడిన చెట్ల కొమ్మలు

    • మామిడి పంటకు తీవ్ర నష్టం

    • పలు చోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

  • May 22, 2026 19:48 IST

    కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్..

    • రైతుల పేరుతో శవరాజకీయాలు మానుకోవాలి: మంత్రి ఉత్తమ్‌

    • కేటీఆర్ మాటల్లో అసహనం కనిపిస్తోంది: మంత్రి ఉత్తమ్‌

    • రైతుల్లో గందరగోళం సృష్టించేందుకు BRS కుట్ర చేస్తోంది: ఉత్తమ్

    • ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా పారదర్శకం: మంత్రి ఉత్తమ్‌

  • May 22, 2026 19:04 IST

    ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

    • ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్

    • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్‌హెచ్

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న ఆర్సీబీ

  • May 22, 2026 18:44 IST

    అమరావతి: రాజ్యసభ నోటిఫికేషన్ విడుదలతో CMOలో హడావిడి

    • ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో పెరిగిన ఆశావహులు

    • సీఎం చంద్రబాబును కలిసేందుకు నేతల ప్రయత్నాలు

    • CMOకు వచ్చిన టీడీ జనార్ధన్, సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు

  • May 22, 2026 18:43 IST

    హైదరాబాద్: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సమ్మిట్‌‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు

    • డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు తెలంగాణ రోల్‌మోడల్‌: శ్రీధర్‌బాబు

    • ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకొస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

    • భారత డిజిటల్‌ ప్రగతికి తెలంగాణ గ్రోత్‌ ఇంజిన్‌: శ్రీధర్‌బాబు

    • 2047కి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం లక్ష్యం: శ్రీధర్‌బాబు

    • అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి: శ్రీధర్‌బాబు

  • May 22, 2026 18:34 IST

    తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా

    • రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపిన ఆకునూరు మురళి

    • నాకు అప్పగించిన పని పూర్తి చేశా: ఆకునూరి మురళి

  • May 22, 2026 18:30 IST

    ఢిల్లీ: జులై 8 నుంచి అందుబాటులోకి భోగాపురం ఎయిర్‌పోర్టు!

    • జులై 5న భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం

    • జులై 8 నుంచి తమ విమానాలన్నీ భోగాపురం నుంచే నడుస్తాయని ప్రకటించిన పలు విమానయాన సంస్థలు

    • జులై 8 నుంచి అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుకే రావాలంటూ సర్క్యులర్‌ జారీ

  • May 22, 2026 18:29 IST

    గుడివాడలో కొలిక్కివచ్చిన వేంకటేశ్వరస్వామి కిరీటం వ్యవహారం

    • తాకట్టు నుంచి రూ.కోటి విలువైన కిరీటం విడిపించిన ట్రస్ట్‌ సభ్యులు

    • స్వామివారి కల్యాణ మందిరం నిర్మాణానికి నిధుల కోసం కిరీటం తాకట్టు పెట్టినట్లు అంగీకరించిన కమిటీ చైర్మన్‌ మోహనరావు

    • తప్పు జరిగింది.. మన్నించండి అని కోరిన ఆలయ కమిటీ చైర్మన్‌

  • May 22, 2026 17:36 IST

    విద్యుత్‌ను తక్కువ వాడండి: కేంద్ర ప్రభుత్వం

    • వేసవి కాలం నేపథ్యంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

    • విద్యుత్ వినియోగంలో పొదుపుగా వ్యవహరించాలన్న కేంద్ర విద్యుత్ శాఖ

    • ఈ మేరకు ప్రజలకు సూచించిన కేంద్ర విద్యుత్ శాఖ

  • May 22, 2026 17:32 IST

    ఆసిఫాబాద్‌: సిర్పూర్‌(U) సమీపంలో వాహనాల తనిఖీ

    • 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • May 22, 2026 17:30 IST

    హైదరాబాద్: బండి భగీరథ్ కేసు అప్‌డేట్

    • భగీరథ్‌ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • ఈనెల 26కి వాయిదా వేసిన మల్కాజ్‌గిరి కోర్టు

  • May 22, 2026 17:25 IST

    అమరావతి: స్త్రీ శక్తి పథకం రద్దు ప్రచారం అవాస్తవం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగుతుంది: రాంప్రసాద్ రెడ్డి

    • స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది: రాంప్రసాద్ రెడ్డి

    • RTC ఆదాయం పెరుగుదలలో స్త్రీ శక్తి కీలక పాత్ర: రాంప్రసాద్ రెడ్డి

    • స్త్రీ శక్తి పథకం వల్ల ప్రమాద మరణాలు తగ్గాయి: రాంప్రసాద్ రెడ్డి

    • కొత్తగా EV బస్సులను తీసుకొస్తున్నాం: రాంప్రసాద్ రెడ్డి

  • May 22, 2026 17:23 IST

    తిరుపతి: పాకాల మండలం ఇరంగారిపల్లిలో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యం

    • పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రామస్థులు

    • అమ్మవారి విగ్రహానికి పూజలు చేసిన ప్రజలు

  • May 22, 2026 17:21 IST

    ఢిల్లీ: జగన్‌కు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ కౌంటర్

    • జగన్‌ కొత్తగా శాంతిదూత అవతారం ఎత్తారు: శివనాథ్‌

    • జగన్‌ కుటుంబ చరిత్ర తెలియనివారు లేరు: శివనాథ్‌

    • వైసీపీ గొడ్డలి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది: శివనాథ్‌

  • May 22, 2026 17:13 IST

    ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కేటీఆర్ పని: ఎంపీ బలరాం నాయక్

    • వరి, మొక్కజొన్న కొనుగోలు యజ్ఞంలా జరుగుతోంది: ఎంపీ

    • రైతులకు సంకెళ్ళు వేసిన విషయం కేటీఆర్ మర్చిపోయారా?: ఎంపీ

    • కేటీఆర్.. వడ్లు, మక్కలు నువ్వు తీసుకొనిరా: ఎంపీ

    • కొనకపోతే అప్పుడు ప్రశ్నించు: ఎంపీ బలరాం నాయక్

  • May 22, 2026 17:05 IST

    రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

    • రూ.3.52 కోట్లు విలువచేసే హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టివేత

    • బ్యాంకాక్‌ నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన కస్టమ్స్‌

  • May 22, 2026 16:51 IST

    పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు

    • అంతర్జాతీయంగా ఇప్పటికే పెరిగిన ముడిచమురు ధరలు

    • హోర్ముజ్‌ మూసివేత కొనసాగితే మరింత పెరగనున్న ముడిచమురు ధరలు

    • బ్యారెల్‌ ముడిచమురు ధర 200 డాలర్లకు చేరనున్నట్లు ఉడ్‌ మెకెంజీ సంస్థ నివేదిక

    • తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చని హెచ్చరిక

  • May 22, 2026 16:44 IST

    విజయవాడ: కార్లతో బీభత్సం సృష్టించిన ఇద్దరు యువకుల అరెస్టు

    • అరెస్టయిన వారిలో యువకుడు బొల్లా ఓం కు డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌

    • పాజిటివ్‌ రావడంతో బొల్లా ఓం పై మరో కేసు నమోదు

    • పటమటలో మంగళవారం రాత్రి వాహనాలతో యువకులు హల్‌చల్‌

    • థార్‌ వాహనాలతో పరస్పరం ఢీకొంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన యువకులు

  • May 22, 2026 16:25 IST

    ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

    • APIIC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా యశ్వంత్‌కుమార్‌ నియామకం

    • మన్యం జిల్లా జేసీ వైశాలికి ITDA POగా అదనపు బాధ్యతలు

  • May 22, 2026 15:49 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 232 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 65 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • May 22, 2026 15:47 IST

    అమరావతి: ఏపీలో ఐదు రోజులు అతి తీవ్ర వడగాడ్పులు

    • దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ జారీ

    • ఏపీలోని 6 జిల్లాలకు ఆరెంజ్‌, 3 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

  • May 22, 2026 15:45 IST

    కడప: సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

    • దార్శనికత, నమ్మకానికి ప్రతిరూపం సెయిల్ సోలార్ ప్రాజెక్ట్: లోకేశ్

    • మా బ్రాండ్ జాబ్ క్రియేషన్, మీ బ్రాండ్ గొడ్డలి: లోకేశ్

    • సీబీఎన్ వల్లే ఏపీలో అభివృద్ధి పరుగులు తీస్తోంది: లోకేశ్

    • కడపలో క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు.. దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం: లోకేశ్‌

  • May 22, 2026 15:28 IST

    ప్రకాశం: ఒంగోలు ఇందుర్తి నగర్‌లో అర్ధరాత్రి తిరిగిన చెడ్డీ గ్యాంగ్

    • ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డు అయిన చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు

    • అప్రమత్తమైన పోలీసులు

  • May 22, 2026 15:09 IST

    రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    • తల్లిదండ్రులు IAS అధికారులైతే పిల్లలకు కోటా ఎందుకు?: సుప్రీంకోర్టు

    • రిజర్వేషన్ల పరిమితులు, క్రిమిలేయర్‌పై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు

  • May 22, 2026 14:59 IST

    హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా

    • బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ముఠా

    • నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు

    • వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు

    • నేడు ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్-ఆర్సీబీ మ్యాచ్

    IPL-Tickets.jpg

  • May 22, 2026 14:05 IST

    విశాఖ: అభినయ్‌ దర్శన్‌ అంశంలో విచారణ కొనసాగుతోంది: హోంమంత్రి అనిత

    • కుట్రకోణం లేకపోతే కడప నుంచి అల్లూరి జిల్లాకు ఎందుకొచ్చారు?

    • అమాయక గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తాడు: అనిత

    • అభినయ్ దర్శన్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి: హోంమంత్రి అనిత

  • May 22, 2026 14:04 IST

    అమరావతి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల క్యాలెండర్ విడుదల

    • ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2026-27 ఏడాదికి క్యాలెండర్‌

    • జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో జిల్లా స్థాయి జేఎస్‌సీ సమావేశాలు

    • జూన్, అక్టోబర్, ఫిబ్రవరిలో హెచ్‌వోడీ స్థాయి సమావేశాల నిర్వహణ

    • జులై, నవంబర్, మార్చిలో సచివాలయ శాఖల జేఎస్‌సీ సమావేశాలు

  • May 22, 2026 13:15 IST

    హైదరాబాద్: ప్రజాభవన్‌లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశం

    • హాజరైన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు

  • May 22, 2026 13:14 IST

    హరీష్‌రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్

    • విదేశాలకు వెళ్లి తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

    • ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే BRS ఉనికి పోతుందని విష ప్రచారం: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

    • BRS మళ్లీ అధికారంలోకి రాదు: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

    • BRSకు మనుగడ లేదనే కవిత బయటకు వెళ్లారు: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

  • May 22, 2026 13:13 IST

    ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు మధ్యంతర బెయిల్

    • తల్లి శస్త్రచికిత్స నేపథ్యంలో 3 రోజుల మధ్యంతర బెయిల్

    • ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్

  • May 22, 2026 13:12 IST

    కడప: టి.కోడూరులో మంత్రి లోకేష్‌ పర్యటన

    • రూ.3 వేల కోట్లతో సెయిల్‌ సంస్థ నిర్మించిన 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన లోకేష్‌

  • May 22, 2026 13:11 IST

    పులి దాడిలో నలుగురు మహిళల మృతి

    • మహారాష్ట్ర: గుంజవాహి అటవీప్రాంతంలో పులి దాడి

    • పులి దాడిలో నలుగురు మహిళల మృతి

    • ఆకుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన మహిళలు

  • May 22, 2026 12:09 IST

    జగన్‌ పాలనలో ఏపీలో దమనకాండ సృష్టించారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • అన్ని వ్యవస్థలనూ సర్వనాశనం చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • జగన్‌ విధ్వంసాన్ని సరిచేసి.. ఏపీని గాడిలో పెట్టాం: అచ్చెన్న

    • కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి బాట పట్టాం: అచ్చెన్న

    • కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి జగన్‌ ఓర్వలేకపోతున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

  • May 22, 2026 11:48 IST

    అమరావతి: జగన్ ఒక పిచ్చి తుగ్లక్: మంత్రి నిమ్మల

    • జగన్ మావిగన్ అంటే ప్రజలే భయపడుతున్నారు: మంత్రి నిమ్మల

    • అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారు: మంత్రి నిమ్మల

    • హత్యా రాజకీయాలు జగన్‌కు అలవాటు: మంత్రి నిమ్మల

    • అమరావతిలో అభివృద్ధి చూసి జగన్‌కు భయం పట్టుకుంది: మంత్రి నిమ్మల

  • May 22, 2026 11:42 IST

    కృష్ణా: మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ లైంగిక వేధింపులు

    • ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని లోబర్చుకునేందుకు యత్నం

    • లెక్చరర్‌కు దేహశుద్ధి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు

  • May 22, 2026 11:42 IST

    CBSE నూతన విధానంపై సుప్రీంకోర్టులో పిల్‌

    • 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలు బోధించాలని CBSE తెచ్చిన కొత్త విధానాన్ని సవాల్‌ చేస్తూ పిల్‌

    • ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వచ్చేవారం విచారణ

  • May 22, 2026 11:39 IST

    మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లల్లో ACB సోదాలు

    • డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌కు సంబంధించిన 8 ఇళ్లల్లో తనిఖీలు

    • వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

  • May 22, 2026 11:39 IST

    హైదరాబాద్: ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కేటీఆర్

    • ధాన్యం సేకరణపై సీఎం, మంత్రి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి కేటీఆర్

    • గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు: కేటీఆర్

    • ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు: కేటీఆర్

    • మంచిర్యాల జిల్లాలో నలుగురు రైతులు చనిపోయారు: కేటీఆర్

    • ఒక్కరైతు కూడా చనిపోలేదని మంత్రులు మాట్లాడటం శోచనీయం: కేటీఆర్

  • May 22, 2026 11:26 IST

    ఈతకు వెళ్లి.. ఇద్దరి మృతి

    • సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాద ఘటన

    • మిడ్‌ మానేరులో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

    • ఈతకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు

    • నీటిలో మునిగి హరిచరణ్(18), మణికంఠ(17) మృతి

  • May 22, 2026 11:25 IST

    BRS అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీష్‌రావు

    • ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చింది: హరీష్‌రావు

    • డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉంది: హరీష్‌రావు

    • ఫార్మాసిటీ కొనసాగిస్తామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది: హరీష్‌రావు

    • రేవంత్ ప్రభుత్వం కేవలం జిమ్మిక్కు చేస్తోంది: హరీష్‌రావు

  • May 22, 2026 10:48 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గాంజాయి పట్టివేత

    • 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

    • బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద గాంజా గుర్తింపు

  • May 22, 2026 10:31 IST

    నేలకొరిగిన ధ్వజస్తంభం.. తప్పిన ప్రమాదం

    • మార్కాపురం: బేస్తరవారిపేట మండలం గలిజరగుళ్లలో నేలకొరిగిన ధ్వజస్తంభం

    • ఈదురుగాలులకు నేలకొరిగిన శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం ధ్వజస్తంభం

    • ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

    • ఇటీవలే ఆలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన గ్రామస్తులు

  • May 22, 2026 10:06 IST

    ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    • జూన్ 18న పోలింగ్, అదే రోజు కౌంటింగ్

    • దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

    • ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు

  • May 22, 2026 09:57 IST

    కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

    • పాల్గొననున్న మంత్రి తుమ్మల, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు

    • డిసెంబర్ 9 నుంచి కొహెడ మార్కెట్ సేవలను ప్రారంభించాలని లక్ష్యం

    • 3 దశల్లో కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్

    • బాటసింగారం మార్కెట్‌లో జరిగే కార్యకలాపాలు సైతం కొహెడలో నిర్వహించాలని నిర్ణయం

  • May 22, 2026 09:55 IST

    మెదక్: గంగాపూర్ దగ్గర హైవేపై రైతుల ధర్నా

    • వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన

    • వడ్ల బస్తాలను రోడ్డుపై వేసి రైతుల నిరసన

    • వెంటనే ధాన్యం కొనుగొలు చేయాలని డిమాండ్

  • May 22, 2026 09:54 IST

    వడగాల్పులకు కోనసీమలో ఇద్దరి మృతి

    • అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో వడదెబ్బతో ఒకరి మృతి

    • పి.గన్నవరం మండలం గంటి పెద్దపుడిలో మరొకరి మృతి

  • May 22, 2026 09:53 IST

    హైదరాబాద్: నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్ ఏర్పాటు

    • 20 మందితో టీమ్‌ను ఏర్పాటు చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

    • నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకోవడమే టార్గెట్‌గా పనిచేయనున్న సిట్

    • జూబ్లీహిల్స్‌కు చెందిన రిటైర్డ్ IPS భార్య హత్య కేసులో పరారీలో ఉన్న నేపాలీలు

    పూర్తి కథనం..

  • May 22, 2026 09:37 IST

    రేపు యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

    • ఉదయం 9గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో పయనం

    • ఉదయం 9:30 గంటలకు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్న సీఎం

    • 10గంటలకు వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

    • కొండ మీద నిర్మించే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

  • May 22, 2026 08:58 IST

    విజయవాడ: సత్యనారాయణ పురంలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం

    • సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

    • లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లను వెంటనే బయటకు తీయడంతో తప్పిన ప్రమాదం

  • May 22, 2026 08:47 IST

    ప్రకాశం: సంతమాగులూరు మండలం ఏల్చూరు దగ్గర ప్రమాదం

    • టైరు పేలి.. టెంపో వాహనం బోల్తా

    • 9 మందికి గాయాలు, నరసరావుపేట ఆస్పత్రికి తరలింపు

  • May 22, 2026 08:44 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • నేడు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌పై సీఎం సమీక్ష

    • మధ్యాహ్నం 12:30కు రాష్ట్రంలో గ్రీన్‌కవర్ పెంపుపై సమీక్షించనున్న చంద్రబాబు

  • May 22, 2026 08:17 IST

    నేడు కర్నూలు జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

    • జొన్నగిరిలో బంగారు గనులను పరిశీలించనున్న మంత్రి

  • May 22, 2026 08:17 IST

    తిరుపతి: డ్రంకెన్ డ్రైవ్‌లో 38 మందిపై కేసులు

    • ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించిన తిరుపతి ప్రత్యేక కోర్టు

    • ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన మరో ముగ్గురికి రూ.300చొప్పున జరిమానా

  • May 22, 2026 08:16 IST

    కూలీలకు దొరికిన వజ్రం

    • కర్నూలు: తుగ్గలి మండలం పగిడిరాయిలో కూలీలకు దొరికిన వజ్రం

    • మిరపతోటలో కలుపు తీస్తుండగా మహిళా కూలీకి దొరికిన వజ్రం

    • రూ.55వేలకు కొనుగోలు చేసిన గుత్తికి చెందిన వ్యాపారి

  • May 22, 2026 08:15 IST

    మార్కాపురం: బెస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో ప్రమాదం

    • గొర్రెల మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    • 30 గొర్రెల మృతి, మరో 15 గొర్రెలకు తీవ్రగాయాలు

    • ప్రమాదం తర్వాత ఆగకుండా వెళ్లిపోయిన బస్సు

    • రూ.8లక్షలు నష్టపోయామని వాపోతున్న రైతులు

  • May 22, 2026 08:12 IST

    హీరా గ్రూప్ నౌహీరా షేక్ అరెస్ట్

    • గుర్గావ్‌లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

    • సరెండర్ కావాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశం

    • కొంతకాలంగా అజ్ఞాతంలో నౌహీరా షేక్

    • ఫేక్ ఆధార్‌తో గుర్గావ్‌లో ఉన్నట్టు గుర్తింపు

    • నౌహీరాను హైదరాబాద్‌కు తరలించనున్న ఈడీ

  • May 22, 2026 07:38 IST

    కొనసాగుతోన్న IPL బ్లాక్ టికెట్స్ దందా

    • IPL: నేడు బెంగళూరు Vs హైదరాబాద్‌ మ్యాచ్‌

    • ఉప్పల్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

    • కీలక మ్యాచ్ కావడంతో టికెట్ల ధరలు భారీగా పెంపు

    • టికెట్స్ బ్లాక్‌లో అమ్మితే చర్యలు తప్పవంటోన్న పోలీసులు

    • ఇప్పటికే టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నవారిపై పలు కేసులు

  • May 22, 2026 06:47 IST

    నేడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ కొత్త అధ్యక్షుడి ఎన్నిక

    • కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న కార్యవర్గం

  • May 22, 2026 06:46 IST

    నేడు సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ నేతల భేటీ

    • హాజరుకానున్న టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

  • May 22, 2026 06:46 IST

    నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలతో టీబీజేపీ చీఫ్‌ సమావేశం

    • రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

  • May 22, 2026 06:45 IST

    తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

    • తెలంగాణలో 244 మండలాల్లో వడగాలులు

    • నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి

    • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 9 మంది మృతి

    • ఏపీలో నేడు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం

    • మరో 219 మండలాలకు వడగాలుల ప్రభావం

  • May 22, 2026 06:44 IST

    దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత

    • 47 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

    • తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

  • May 22, 2026 06:44 IST

    థాయ్‌లాండ్‌లో భారీ అగ్నిప్రమాదం

    • పట్టాయాలోని హోటల్‌లో చెలరేగిన మంటలు

    • హోటల్‌లో చిక్కుకున్నవారిని రక్షించిన రెస్క్యూ టీమ్‌

  • May 22, 2026 06:20 IST

    నేడు కడపలో సోలార్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న మంత్రి లోకేష్‌

    • రూ.2,400 కోట్లతో సోలార్‌ విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌ ఏర్పాటు

    • జమ్మలమడుగులో మంత్రి నారా లోకేష్ సమావేశం

  • May 22, 2026 06:20 IST

    IPL: నేడు ఉప్పల్‌లో బెంగళూరు, హైదరాబాద్‌ మ్యాచ్‌

    • ఉప్పల్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌