-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 5th October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 05 , 2026 | 06:14 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 05, 2026 07:30 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను
ఈ నెలాఖరు లోపల నూతన ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తా: దర్శకుడు బోయపాటి శ్రీను
ప్రాజెక్ట్ ప్రారంభానికీ ముందు శ్రీవారి ఆశీస్సులు పొందా: బోయపాటి శ్రీను
అఖండా 3 కూడా ఉంటుంది: బోయపాటి శ్రీను
సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వివరాలు ప్రకటిస్తాం: బోయపాటి శ్రీను
అవకాశం వస్తే చిరంజీవి, బాలకృష్ణతో మల్టీ స్టారర్ సినిమా కచ్చితంగా చేస్తా: బోయపాటి శ్రీను
-
Oct 05, 2026 07:15 IST
నేడు MCRHRDలో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాయంత్రం జరిగే సమీక్షకు హాజరుకానున్న మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ అధికారులు
కాళేశ్వరం పునరుద్ధరణ, SLBC పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
-
Oct 05, 2026 07:07 IST
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్
నేడు ఏపీ ప్రభుత్వ పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం
34 శాతం బీసీ రిజర్వేషన్లపై వాదనలు వినిపించనున్న ఏపీ
-
Oct 05, 2026 07:05 IST
నేడు హైకోర్టులో ట్రైనీ IPS ఉదయ్ బెయిల్‌పై విచారణ
బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు విననున్న హైకోర్టు
-
Oct 05, 2026 07:02 IST
నేడు, రేపు విశాఖలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ పర్యటన
హిందుస్థాన్ షిప్‌యార్డ్ సందర్శించనున్న రాజ్‌నాథ్
HSLలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్
నేవీ ప్రాజెక్టులను ప్రారంభించనున్న రాజ్‌నాథ్
-
Oct 05, 2026 07:00 IST
నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-
Oct 05, 2026 06:55 IST
నేడు అనంతపురం జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన
సింగనమల నియోజకవర్గంలో అనిత పర్యటన
-
Oct 05, 2026 06:50 IST
అనకాపల్లి: యలమంచిలి మండలం పులపర్తి దగ్గర ప్రమాదం
వాహనం ఢీకొని దంపతుల మృతి
మృతులు పులవర్తి గ్రామానికి చెందిన పాపారావు, అమ్మాజీగా గుర్తింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 05, 2026 06:45 IST
అమెరికా: జార్జియాలో కాల్పుల కలకలం
పార్టీలో కాల్పులు జరిపిన దుండగుడు
ఇద్దరు మృతి, మరో 35 మందికి గాయాలు
పోలీసుల పెట్రోలింగ్ సమయంలో ఘటన
-
Oct 05, 2026 06:35 IST
కర్నూలు: ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ప్రమాదం
యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. బోల్తాపడిన లారీ
బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
-
Oct 05, 2026 06:30 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,170
22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,740
కిలో వెండి రూ.2,44,900
-
Oct 05, 2026 06:25 IST
సీఈసీపై ఇండియా కూటమి కార్యాచరణ
రేపు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
9న దేశవ్యాప్తంగా చలో రాజ్‌భవన్ కార్యక్రమం
నవంబర్ 1న చలో ఢిల్లీ నిర్వహించాలని నేతల నిర్ణయం
-
Oct 05, 2026 06:20 IST
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం
వేకువజామున మోకాళ్ల మెట్టు మండపం ప్రాంతంలో సంచరించిన చిరుత
ఆ సమయంలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-
Oct 05, 2026 06:15 IST
ఢిల్లీ: నేడు ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం
సాయంత్రం 4 గంటలకు కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన భేటీ
హాజరుకానున్న పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు
SIRపై చేపట్టనున్న ఆందోళనల కార్యాచరణపై చర్చ
6న ఈసీ కార్యాలయానికి మార్చ్ నిర్వహించాలని నిర్ణయం
-
Oct 05, 2026 06:10 IST
కడప: నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత తాగునీటి పథకానికి శ్రీకారం
అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం
పొద్దుటూరులో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Oct 05, 2026 06:07 IST
నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నేడు పీసీసీ చీఫ్‌లు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం
సమావేశంలో పాల్గొననున్న మహేశ్ గౌడ్
SIRలో అక్రమాలు, భవిష్యత్ ఉద్యమాలపై చర్చ
-
Oct 05, 2026 06:05 IST
ఢిల్లీ: నేడు జంతర్‌మంతర్ దగ్గర NSUI ఆందోళన
NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నేతృత్వంలో “ఓటు చోరీ”కి వ్యతిరేకంగా నిరసన
ఎన్నికలు, ఓటు హక్కు సంబంధిత అంశాలపై నిరసన
-
Oct 05, 2026 06:03 IST
నేడు CEC జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంకోర్టు కీలక విచారణ
CJI ధర్మాసనం ముందు నేడు రెండు పిటిషన్ల విచారణ
ECల అనుమతి లేకుండా SIRపై నిర్ణయాలను తీసుకున్నారా? లేదా ? అన్నదే ప్రధాన ప్రశ్న
ECలు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు ప్రస్తావన
-
Oct 05, 2026 06:00 IST
హైదరాబాద్: బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
నబిల్‌కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు
ప్లాస్టిక్ గోదాంలో పేలిన కెమికల్ డ్రమ్ములు
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ఎలాంటి ప్రాణనష్టం లేదని ఫైర్ సిబ్బంది వెల్లడి