Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 29 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 29, 2026 08:25 IST

    అనకాపల్లి: మైనర్ శారదా నది ఉధృతి

    • నారాయణపురం దగ్గర వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద

    • ఎలమంచిలి-అచ్యుతాపురం మధ్య రాకపోకల నిలిపివేత

  • Oct 29, 2026 08:15 IST

    నంద్యాల కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

    • పాల్గొన్న కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షోరాన్

    • డ్రగ్స్‌పై అవగాహనకు 5, 10 కి.మీ. మారథాన్ ర్యాలీ

    • కలెక్టరేట్ నుంచి గాంధీ చౌక్ వరకూ ర్యాలీ

    • యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ పిలుపు

  • Oct 29, 2026 08:10 IST

    నాగబాబుకు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు

    • శాసనమండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్‌ ఛైర్మన్‌గా మరింత సేవలు అందించాలని ఆకాంక్ష

    • పర్యావరణ పరిరక్షణపై నాగబాబుకు ప్రత్యేక అభిరుచి ఉందన్న పవన్‌

  • Oct 29, 2026 07:30 IST

    అనకాపల్లి: కోనాం జలాశయం నుంచి వరద నీటి విడుదల

    • జలాశయం పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు

    • ప్రస్తుతం నీటిమట్టం 99.70 మీటర్లుగా నమోదు

    • 2,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,500 క్యూసెక్కుల నీరు విడుదల

  • Oct 29, 2026 07:20 IST

    ప.గో.: తుఫాన్ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష

    • తుఫాన్‌తో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలకు ఆదేశం

    • ప.గో. జిల్లాలో 3,700 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి: గొట్టిపాటి

    • 400 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

  • Oct 29, 2026 07:15 IST

    తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన ఆర్నబ్ తుఫాన్

    • మల్కన్‌గిరికి 60కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం

    • వాయుగుండంగా బలహీనపడే అవకాశం

    • సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం

  • Oct 29, 2026 07:00 IST

    పశ్చిమగోదావరి: అంతర్వేది వద్ద సముద్రంలో నిలిచిన ఫిలిప్పీన్స్ షిప్

    • నౌకలో భారతీయులతో పాటు 24 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం

    • తుఫాన్ ప్రభావంతో నౌకలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తింపు

    • సిబ్బందిని హెలికాప్టర్‌ ద్వారా మొగల్తూరు హెలిప్యాడ్‌కు తరలించేందుకు కోస్ట్‌గార్డ్‌ చర్యలు

  • Oct 29, 2026 06:50 IST

    ఏలూరు జిల్లాలో తుఫాను కారణంగా భారీగా పంట నష్టం

    • 35 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట

    • నాలుగు వేల ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు

    • ఈ రోజు పంట నష్టం అంచనా వేయనున్న అధికారులు

  • Oct 29, 2026 06:45 IST

    మెదక్: పాపన్నపేట మండలం ఎనికెపల్లి శివారులో మొసలి కలకలం

    • పంట పొలాల్లో మొసలి కలకలం

    • అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన రైతు

    • మొసలిని పట్టుకుని తరలించిన ఫారెస్ట్ సిబ్బంది

  • Oct 29, 2026 06:40 IST

    ప.గో.: నర్సాపురంలో తగ్గిన వర్షం, గాలుల తీవ్రత

    • కొనసాగుతున్న విద్యుత్ పునరుద్ధరణ చర్యలు

    • తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    • పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు బయల్దేరిన ప్రజలు

  • Oct 29, 2026 06:35 IST

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

    • 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

    • శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.34కోట్లు

  • Oct 29, 2026 06:30 IST

    ఆర్నబ్ తుఫాన్‌తో కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం

    • జిల్లా వ్యాప్తంగా 35,273 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

    • అత్యధికంగా 34,864 హెక్టార్లలో నేలకొరిగిన వరి పంట

    • 358 హెక్టార్లలో మినుము, 25 హెక్టార్లలో చెరకు పంట నష్టం

    • 23 హెక్టార్లలో వేరుశనగ, 3 హెక్టార్లలో నువ్వుల పంట నష్టం

  • Oct 29, 2026 06:25 IST

    ఏపీలోని 9,829 MPTC స్థానాల్లో 1,985 ఏకగ్రీవం

    • మిగిలిన 7,844 MPTC స్థానాలకు బరిలో 18,952 మంది అభ్యర్థులు

    • 659 ZPTC స్థానాల్లో 77 ఏకగ్రీవం

    • మిగిలిన 582 ZPTC స్థానాలకు బరిలో 2,169 మంది అభ్యర్థులు

  • Oct 29, 2026 06:20 IST

    నేడు మూడో రోజు ఎంపీ ఈటల పాదయాత్ర

    • జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలించాలని డిమాండ్

  • Oct 29, 2026 06:17 IST

    నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

    • తుఫాన్ సహాయక చర్యలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

    • వెట్లపాలెంలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి

    • బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్న సీఎం చంద్రబాబు

  • Oct 29, 2026 06:15 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,43,960

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,31,960

    • కిలో వెండి ధర రూ.2,19,900

  • Oct 29, 2026 06:10 IST

    మెదక్: ఎనికెపల్లి శివారులో పంట పొలాల్లో మొసలి కలకలం

    • మంజీరా నది నుంచి పొలాల్లోకి వచ్చిన భారీ మొసలి

    • మొసలిని చూసిన రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం

    • గంటసేపు శ్రమించి మొసలిని పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది

  • Oct 29, 2026 06:05 IST

    ఢిల్లీలో నేడు RSS ఆధ్వర్యంలో 'రాష్ట్ర వందనం' కార్యక్రమం

    • రోహిణి సెక్టార్ 23లో 'సమరస్తా స్థల్'లో భారీ బహిరంగ సభ

    • సభలో కీలక ఉపన్యాసం చేయనున్న RSS చీఫ్ భాగవత్

  • Oct 29, 2026 06:03 IST

    కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్‌

    • నాలుగు ఎమ్మెల్సీలు ఎన్డీయేకే

    • బీజేపీకి 3, జేడీఎస్‌కు ఒక స్థానం

    • యూపీలో బీజేపీకి 6, ఎస్పీకి 3 స్థానాలు

  • Oct 29, 2026 06:00 IST

    నేడు ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమం

    • గ్లోబల్‌ సమ్మిట్ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

    • సమ్మిట్‌కు హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌

    • సీఎం వెంట ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి