Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 25 , 2026 | 06:49 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 25, 2026 08:01 IST

    హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4, 5 దగ్గర భారీ ఏర్పాట్లు

    • ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి బాహుబలి క్రేన్ సిద్ధం

    • మధ్యాహ్నం లోపు బడా గణేశ్ నిమజ్జనం చేసేందుకు సర్వం సిద్ధం

  • Sep 25, 2026 07:22 IST

    మరికాసేపట్లో బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట

    • గతేడాది రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ

    • బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ తర్వాత శోభాయాత్ర ప్రారంభం

    • ఉ.9 గంటలకు బొడ్రాయి దగ్గరికి బాలాపూర్ గణేశ్

    • ఉ.9:30 గంటలకు లడ్డూ వేలం ప్రారంభం

  • Sep 25, 2026 07:08 IST

    ఆలస్యం కానున్న ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర

    • బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య

    • సాంకేతిక లోపంతో ఆలస్యంగా వెల్డింగ్ పనులు

    • విరిగిన బాహుబలి క్రేన్ పైప్

    • ఇంకా టస్కర్ పైకి చేరని మహాగణపతి

    • కాసేపట్లో క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చే అవకాశం

  • Sep 25, 2026 07:07 IST

    నేడు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు

    • విశాఖ, అనకాపల్లి, ప.గో., ఏలూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటన

  • Sep 25, 2026 07:06 IST

    దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

    • ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న వాయుగుండం

    • రేపు ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం

    • ఇవాళ, రేపు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు అతి భారీ వర్షాలు

    • నేడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు

    • నేడు ఉ.11:30 వరకు పలు జిల్లాల్లో ఆకస్మిక వరద సూచన

  • Sep 25, 2026 07:05 IST

    నేడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా క్యూర్ పరిధిలో సెలవు

    • హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు ప్రకటన

    • నవంబర్‌ 14న రెండో శనివారం పనిదినంగా ప్రకటించిన ప్రభుత్వం

  • Sep 25, 2026 07:05 IST

    హైదరాబాద్: గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా మెట్రో సేవల పొడిగింపు

    • అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు

  • Sep 25, 2026 06:49 IST

    హైదరాబాద్‌లో నేడు మహా నిమజ్జన కార్యక్రమం

    • గణేశ్ నిమజ్జనాలకు విస్తృత ఏర్పాట్లు

    • హుస్సేన్‌సాగర్‌, ఇతర చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు

    • ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు

    • గణేశుని శోభాయాత్రకు 20 వేలమంది పోలీసులతో భద్రత

    • 10 వేల కెమెరాలు, 24 డ్రోన్లతో పోలీసులు నిరంతర నిఘా

    • నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 40కి పైగా క్రేన్లు

    • క్రేన్‌ నెంబర్‌-4 దగ్గర ఖైరతాబాద్‌ బడా గణేశ్ నిమజ్జనం