-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 24th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 24 , 2026 | 06:05 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 24, 2026 07:15 IST
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సెల్యూట్.. పోలీసు అధికారిపై చర్యలు
యూపీలోని సహరన్‌పూర్‌లో ఘటన
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి ఇచ్చిన అధికారి
విచారణ అనంతరం సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు
-
Nov 24, 2026 07:10 IST
వరంగల్: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి
శైవక్షేత్రాల్లో దీపాలు వెలిగించి అభిషేకాలు చేస్తున్న భక్తులు
కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్న భక్తులు
-
Nov 24, 2026 07:05 IST
బాపట్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల సముద్ర తీరాల్లో భక్తుల రద్దీ
వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం తీరాల్లో భక్తుల పుణ్యస్నానాలు
పొట్టి సుబ్బయ్యపాలెం తీరంలోనూ భక్తుల సందడి
కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు
-
Nov 24, 2026 07:00 IST
ములుగు: ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత
మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెంలో దట్టమైన పొగమంచు
గోదావరి తీర ప్రాంతమంతా మంచు దుప్పటి
పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు
చలిగాలులతో చిన్నారులు, వృద్ధుల అవస్థలు
-
Nov 24, 2026 06:40 IST
పల్నాడు: ఊటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి
క్రోసూరుకు చెందిన దాడి పూర్ణచంద్ర (50), దగ్గుబాటి శ్రీనివాసరావు (48) మృతి
ఊటుకూరు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైన కారు
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Nov 24, 2026 06:35 IST
తిరుపతి: ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తికి ఏడాది జైలు
గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కిన నిజామాబాద్ వాసి కె. తిరుపతికి జైలు
మూడు ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేసిన కేసులో తీర్పు
ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించిన కోర్టు
తీర్పు వెలువరించిన తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి జి. లెనిన్‌బాబు
-
Nov 24, 2026 06:30 IST
వికారాబాద్: పరిగి పరిసరాల్లో చిరుత సంచారం
అడవి పందిని తరుముతూ ఓ ఉద్యోగికి కనిపించిన చిరుత
చిరుతను బంధించేందుకు అటవీ అధికారుల యత్నం
-
Nov 24, 2026 06:25 IST
తూ.గో. జిల్లా: కొవ్వూరు గోష్పాద క్షేత్రం కార్తీక పౌర్ణమి సందడి
భక్తులతో కిటకిటలాడిన ఆలయం
గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
నదిలో కార్తీక దీపాలు వదిలిన భక్తజనం
శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు
-
Nov 24, 2026 06:20 IST
నేడు ఉమెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్
చైనా Vs భారత్ హాకీ జట్టు మ్యాచ్
ఇప్పటికే సెమీస్ బెర్త్ సొంతం చేసుకున్న భారత్
-
Nov 24, 2026 06:17 IST
నేడు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే మ్యాచ్
UAE Vs భారత్-A మ్యాచ్
మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు వెళ్లనున్న భారత్
-
Nov 24, 2026 06:15 IST
నేటి నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్
స్విట్జర్లాండ్ వేదికగా చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ
తొలిగేమ్‌లో సిందరోవ్‌తో తలపడనున్న గుకేష్
-
Nov 24, 2026 06:13 IST
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
గురునానక్ జయంతి సందర్భంగా సెలవు
-
Nov 24, 2026 06:12 IST
నేడు ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కటక్, భువనేశ్వర్‌లో 2 రోజుల పర్యటన
బాలి జాత్ర ఉత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి
-
Nov 24, 2026 06:10 IST
నేడు ఏపీలో SIPB, CRDA సమావేశాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ
ఏపీకి కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చ
మధ్యాహ్నం 2:45కు జరగనున్న CRDA సమావేశం
-
Nov 24, 2026 06:07 IST
తిరుపతి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
అయ్యప్ప భక్తుల మినీబస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
విళుప్పురం జిల్లా దిండివనం సమీపంలో ప్రమాదం
పాదిరికుప్పానికి చెందిన లక్ష్మీపతి, డ్రైవర్ జనార్దన్ మృతి
మరో 13 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
-
Nov 24, 2026 06:05 IST
ఏపీలో 87 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు పూర్తి: SEC
నేడు 13 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు: APSEC
పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నంలో పరోక్ష ఎన్నికలు
మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరంలో పరోక్ష ఎన్నికలు
జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డలో పరోక్ష ఎన్నికలు
గూడూరు, ఆత్మకూరు పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు