-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 22th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 22 , 2026 | 07:59 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 22, 2026 08:42 IST
ఇరాన్‌కు విమానాలు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్
అమెరికా ఆంక్షలతో ఇరాన్‌కు విమానాలు నిలిపివేయనున్న పలు విమానాయాన సంస్థలు
-
Sep 22, 2026 08:41 IST
లిక్కర్ రవాణా కేసులో రెండో రోజు కారుమూరి నాగేశ్వరరావు కస్టడీ
మొదటి రోజు కస్టడీలో కారుమూరిని 5 గంటలు ప్రశ్నించిన ED
అక్రమ లిక్కర్ రవాణా కేసులో కీలకంగా మారిన కారుమూరి కస్టడీ విచారణ
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ రవాణా టెండర్లపై కారుమూరిని ప్రశ్నిస్తున్న ED
-
Sep 22, 2026 08:38 IST
హైదరాబాదులో ACB సోదాలు
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్న ఏసీబీ
మూడు జిల్లాల్లో 12 చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ
-
Sep 22, 2026 08:13 IST
హైదరాబాద్: విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం
బోర్డు తిప్పేసిన బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్
తెలంగాణ, ఏపీకి చెందిన వందలాది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయల వసూలు
-
Sep 22, 2026 08:13 IST
ఆదిలాబాద్: రిమ్స్ ప్రమాద ఘటనలో మరో చిన్నారి మృతి
రెండుకు చేరిన మృతుల సంఖ్య
మరో ఐదుగురి పరిస్థితి విషమం
-
Sep 22, 2026 08:12 IST
నేడు ఢిల్లీలో యాంటీ నార్కోటిక్స్ (ANTF) చీఫ్‌ల సదస్సు
ANTF సదస్సును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా
లక్నో, డెహ్రాడూన్‌లో NCB జోనల్ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపన
డ్రగ్స్ నుంచి రక్షించడమే లక్ష్యంగా ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’పై కేంద్రం దృష్టి
-
Sep 22, 2026 08:11 IST
చిత్తూరు: కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన
కృష్ణా జలాలలకు జలహారతి కార్యక్రమానికి హాజరు
టీడీపీ నేతలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబు
నేడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సీఎం చంద్రబాబు భేటీ
-
Sep 22, 2026 08:10 IST
నేడు అల్లూరి, పోలవరం, విశాఖలో భారీ వర్షాలు
కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
-
Sep 22, 2026 08:10 IST
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం
కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
రేపు అర్ధరాత్రి తీరం దాటనున్న తీవ్రవాయుగుండం
విశాఖ-గపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
-
Sep 22, 2026 08:09 IST
ఏషియన్ గేమ్స్: నేడు భారత్ Vs శ్రీలంక ఫైనల్
ఉ.10:30కు శ్రీలంకతో ఫైనల్లో తలపడనున్న భారత మహిళల జట్టు
-
Sep 22, 2026 08:09 IST
నేడు కేటీఆర్, హరీష్‌రావు ఆధ్వర్యంలో కీలక సమావేశం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ MLC ఎన్నికపై చర్చ
-
Sep 22, 2026 08:08 IST
ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
ఐదురోజుల వయసు చిన్నారి మృతి
నవజాత శిశువుల ప్రత్యేక రక్షణ వార్డు SNCUలో షార్ట్ సర్క్యూట్
ఏసీ పేలుడుతో భారీగా వ్యాపించిన మంటలు
ప్రమాదం సమయంలో వార్డులో 27 మంది చిన్నారులు
మంటలు, పొగతో పలువురికి అస్వస్థత
బాధిత చిన్నారులకు కొనసాగుతున్న చికిత్స
-
Sep 22, 2026 08:06 IST
నాని ది ప్యారడైజ్ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
రేపు ప్రత్యేక ప్రీమియర్ షో మల్టీప్లెక్స్‌లలో రూ.400, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.300 పెంపునకు అనుమతి
ఎల్లుండి నుంచి అక్టోబర్ 3 వరకు 5 షో లకు అనుమతి
మల్టీప్లెక్స్‌లలో టికెట్‌కు రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి
-
Sep 22, 2026 08:04 IST
తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేటి నుంచి 26 వరకు పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాల సందర్భంగా విశేష పూజలు
ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలు తాత్కాలికంగా రద్దు
-
Sep 22, 2026 08:04 IST
పల్నాడు: ముప్పాళ్ల మం. చాగంటివారిపాలెంలో దారుణం
ఎనిమిదేళ్ల బాలుడిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి
బాలుడి తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసులు
-
Sep 22, 2026 07:59 IST
విజయవాడ: శాప్ ఆఫీస్ ముట్టడి కేసులో వైసీపీ నేతలపై కేసులు
సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పీఎస్‌లలో కేసులు నమోదు
మాచవరం పీఎస్‌లో వైసీపీ నేతలపై 2 కేసులు నమోదు
కృష్ణలంక పీఎస్‌లో పరిధిలో 2 కేసులు నమోదు
మాచవరం పీఎస్‌లో శాప్ డైరెక్టర్ ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు