-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 1st October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 01 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 01, 2026 08:35 IST
వికారాబాద్ జిల్లా: నవాబ్‌పేట మండలం మాదిరెడ్డిపల్లిలో దారుణం
గ్రామ శివారులోని పంట పొలాల్లో శిశువు లభ్యం
మాదిరెడ్డిపల్లి పొలాల్లో ఆడ శిశువును పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
శిశువును గుర్తించి, పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
చైల్డ్ లైన్ అధికారుల సహాయంతో శిశువును హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన అధికారులు
-
Oct 01, 2026 08:30 IST
రష్యా సైన్యంలో భారతీయుల నియామక వార్తలపై విదేశాంగశాఖ స్పందన
రష్యా సైన్యంలో స్వచ్ఛందంగానే చేరుతున్నట్టు మా దృష్టికి వచ్చింది: భారత విదేశాంగశాఖ
రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరం: భారత విదేశాంగశాఖ
తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు: విదేశాంగశాఖ
కొందరు పౌరసత్వం వదులుకొని చేరేందుకు ప్రయత్నిస్తున్నారు: విదేశాంగశాఖ
-
Oct 01, 2026 08:25 IST
ఆసియా క్రీడలు: నేడు టీ20 క్రికెట్ సెమీస్
ఉదయం 10గంటలకు శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్
-
Oct 01, 2026 08:20 IST
ప.గో.: నేడు భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన
చినరంగనిపాలెంలో పెన్షన్లు పంపిణీ చేయనున్న మంత్రి గొట్టిపాటి
-
Oct 01, 2026 08:15 IST
తిరుపతి: స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు
అధిక లాభాల ఆశచూపి రూ.లక్ష కాజేసిన వర్ణం సూర్య అనే నిందితుడు
రూ.1 లక్షకు గాను కేవలం రూ.27 వేలు మాత్రమే చెల్లించి మిగతా సొమ్ము ఎగ్గొట్టిన నిందితుడు
అక్కరంపల్లికి చెందిన జోయెల్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు
-
Oct 01, 2026 08:00 IST
రాజమండ్రి: రాజేంద్రనగర్‌లో బాలిక కిడ్నాప్
గురువారం రాత్రి బాలికను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 01, 2026 07:40 IST
శ్రీకాకుళం: అరసవల్లి ఆలయంలో భక్తులకు నిరాశ
శ్రీ సూర్యనారాయణస్వామిని తాకని సూర్యకిరణాలు
ఆకాశం మేఘావృతంగా ఉండడంతో మూలవిరాట్‌ను తాకని కిరణాలు
సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం కోసం తరలివచ్చిన భక్తులు
రేపు సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందన్న అర్చకులు
-
Oct 01, 2026 07:35 IST
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను హీరోగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత పైలట్‌కు సెల్యూట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
-
Oct 01, 2026 07:30 IST
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక నిజమైన వీరుడు: ఇజ్రాయెల్ MFA
కత్తిపోట్లకు గురైనా మచ్చార్ ఎదురుతిరిగి పోరాడారు: ఇజ్రాయెల్
మచ్చార్ ధైర్యంతో వందలమంది ప్రాణాలు కాపాడారు: ఇజ్రాయెల్
కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలి: ఇజ్రాయెల్ MFA
-
Oct 01, 2026 07:25 IST
ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
ఫ్లై దుబాయ్ పైలట్, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించిన మోదీ
కోపైలట్‌ను ఎదుర్కొని ప్రమాదాన్ని నివారించిన స్మిత్ మచ్చర్
తీవ్ర గాయాలైనా వందలమంది ప్రాణాలు కాపాడారు: మోదీ
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను చూసి భారత్ గర్విస్తోంది: ప్రధాని మోదీ
-
Oct 01, 2026 07:20 IST
మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
19కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.62.50 పెంపు
ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,810
ప్రస్తుతం చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,983
ప్రస్తుతం ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,764
ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,996
-
Oct 01, 2026 07:15 IST
కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
పులుల సంతాన ప్రక్రియలో భాగంగా మూడు నెలలపాటు మూతపడిన జంగిల్ సఫారీ
సీజన్ గడువు ముగియడంతో జంగిల్ సఫారీతో పాటు నల్లమలలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు అనుమతి
-
Oct 01, 2026 07:00 IST
కర్నూలు: ఆలూరులోని వెంకటలక్షీ సిల్క్ హౌస్‌లో అగ్నిప్రమాదం
భారీగా చెలరేగిన మంటలు... అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం
-
Oct 01, 2026 06:45 IST
ప.గో: నేడు భీమవరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి పర్యటన
ఉదయం 9గంటలకు చినరంగనిపాలెంలో పెన్షన్లను పంపిణీ చేయనున్న మంత్రి
అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే డీఆర్సీ సమావేశంలో పాల్గొనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
-
Oct 01, 2026 06:40 IST
పల్నాడు: సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో ఓ ఇంట్లో భారీ చోరీ
రూ.6 లక్షల నగదు, సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 01, 2026 06:35 IST
ఢిల్లీ: నేడు UPSC శతాబ్ధి వేడుకలు
శతాబ్ధి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్న మోదీ
UPSCపై ప్రత్యేక పుస్తకం ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
-
Oct 01, 2026 06:30 IST
తిరుపతి నగర శివార్లలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం
తిరుచానూరు మండలం కొత్తపాలెంలో అర్ధరాత్రి సంచారం.. భయాందోళనలో స్థానికులు
కొత్తపాలెంలో సీసీటీవీ కెమెరాలో నమోదైన చెడ్డీ గ్యాంగ్ కదలికలు
అప్రమత్తమైన తిరుపతి, నెల్లూరు జిల్లాల పోలీసులు
అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపు
-
Oct 01, 2026 06:20 IST
నేటి నుంచి తెరుచుకోనున్న అమ్రాబాద్ టైగర్ సఫారీ
జంతువుల సంతానోత్పత్తి దృష్ట్యా 3 నెలలుగా సఫారీ సేవల నిలిపివేత
-
Oct 01, 2026 06:15 IST
నేటి నుంచి LPG సిలిండర్ బుకింగ్‌కు KYC తప్పనిసరి
KYC చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిపివేత
-
Oct 01, 2026 06:12 IST
నేటి నుంచి SBI ఏటీఎం ఉచిత లావాదేవీల తగ్గింపు
నెలకు 10 నుంచి 5కు తగ్గించిన SBI
-
Oct 01, 2026 06:10 IST
స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు ఏపీ హైకోర్టు తీర్పు
నేడు నిర్ణయం వెల్లడించనున్న CJ నేతృత్వంలోని ధర్మాసనం
బీసీలకు 34% రిజర్వేషన్ల జీఓను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై నేడు తీర్పు
-
Oct 01, 2026 06:07 IST
ఏపీ PRC చైర్మన్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ నియామకం
సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం
-
Oct 01, 2026 06:05 IST
భారీ వర్షంతో బెంగళూరులో అస్తవ్యవస్తమైన జనజీవనం
నిన్న సాయంత్రం నుంచి రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం
మహదేవపుర, వైట్‌ఫీల్డ్, మారతహళ్లి, వర్తూరు, హూడీలో వర్షం
హెబ్బాళ్, యశ్వంత్‌పూర్, మల్లేశ్వరం ప్రాంతాల్లో భారీ వర్షం
ఆర్.టి.నగర్, రిచ్‌మండ్ టౌన్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం
-
Oct 01, 2026 06:02 IST
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించనున్న కేబినెట్
మెట్రో ఫేజ్-1 స్వాధీనం అంశంపై కీలక చర్చ
మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయంపైనా చర్చ
మూసీ రివర్ ఫేజ్-1 ప్రాజెక్టు భూసేకరణపై చర్చ
-
Oct 01, 2026 06:00 IST
బాపట్ల: రేపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన
పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు