Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 01 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 01, 2026 09:10 IST

    ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ప్రారంభమైన మున్సిపల్‌ పోలింగ్‌

    • జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్‌ విషయంలో వివాదం

    • వైసీపీ పోలింగ్‌ ఏజెంట్‌గా రౌడీషీటర్‌ ఉన్నారంటూ టీడీపీ ఏజెంట్‌ అభ్యంతరం

    • ఫిర్యాదుతో సదరు ఏజెంట్‌ను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు

  • Nov 01, 2026 09:07 IST

    తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్‌

    • ఉదయం 9 గంటల వరకు 11.72 శాతం ఓటింగ్‌ నమోదు

    • పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల భాగస్వామ్యం

    • పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తున్న అధికారులు

  • Nov 01, 2026 09:05 IST

    కృష్ణా జిల్లా పెడనలో ఊపందుకున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

    • ఉదయం 8.30 తర్వాత పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

    • సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు

    • మూడో వార్డులో ఓటు వేసిన శతాధిక వృద్ధురాలు

    • ట్రైసైకిళ్లు లేక ఇబ్బందులు పడిన దివ్యాంగులు

  • Nov 01, 2026 09:00 IST

    అనంతపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

    • మారుతీనగర్‌లోని ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలో పోలింగ్

    • భార్యతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే

  • Nov 01, 2026 08:59 IST

    చేవెళ్ల మండలం పామెన గేటు వద్ద కారు బోల్తా పడి ఒకరి మృతి

    • షాబాద్‌ మండలం పొత్గల్‌కు చెందిన రాజ్‌కుమార్‌ గౌడ్‌ మృతి

    • ఇద్దరికి తీవ్ర గాయాలు.. మరొకరికి స్వల్ప గాయాలు

  • Nov 01, 2026 08:58 IST

    పులివెందుల: నాడు బాబాయిని చంపి టీడీపీపై నెపం నెట్టే కుట్ర: బీటెక్ రవి

    • నేడు వాహనాలు తగలబెట్టి మళ్లీ కుట్రకు యత్నం: బీటెక్ రవి

    • జగన్ డైరెక్షన్‌లో వాహనాల దహనం, ఆ తర్వాత దాడి ప్రచారం

    • ఓటమి భయంతోనే జగన్ కొత్త డ్రామాలు: బీటెక్ రవి

    • ఫ్యాక్షన్ రాజకీయాలకు పులివెందులలో కాలం చెల్లింది: బీటెక్ రవి

  • Nov 01, 2026 08:55 IST

    ప్రకాశం: చీమకుర్తిలో MLA బూచేపల్లి శివ హౌస్ అరెస్ట్‌

    • చీమకుర్తిలోని నివాసంలో దర్శి MLA హౌస్ అరెస్ట్‌

    • చీమకుర్తి మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అరెస్ట్‌

  • Nov 01, 2026 08:52 IST

    కృష్ణా: మచిలీపట్నం 32వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

  • Nov 01, 2026 08:50 IST

    విజయవాడ 55వ డివిజన్‌లో నిలిచిన పోలింగ్.. ఉదయం 10.30కు పునఃప్రారంభం

    • బ్యాలెట్‌ పత్రాల్లో గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్‌ నిలిపివేత

    • తప్పులు సరిచేసి కొత్త బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తున్న అధికారులు

    • పోలింగ్‌ సమయాన్ని కూడా పొడిగించనున్నట్లు వెల్లడి

  • Nov 01, 2026 08:47 IST

    ఎన్టీఆర్: నందిగామ పోలింగ్ ఏజెంట్ విషయంలో వివాదం

    • 10వ వార్డు పోలింగ్ ఏజెంట్ వైసీపీకి చెందిన రౌడీషీటర్ షేక్ షరీఫ్

    • షరీఫ్‌పై రౌడీషీట్ ఉండటంతో టీడీపీ అభ్యంతరం

    • షరీఫ్‌ను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు

  • Nov 01, 2026 08:45 IST

    ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

    • కొవ్వూరు, నిడదవోలు, మండపేట పట్టణాల్లో పోలింగ్

    • పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి మొబైల్స్ అనుమతించని పోలీసులు

    • మొబైల్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ఓటర్లు

  • Nov 01, 2026 08:40 IST

    సత్యసాయి: పనిచేసే నేతకే ప్రజలు పట్టం కట్టాలి: నందమూరి బాలకృష్ణ

    • హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ

    • అభివృద్ధి చేయనివారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలి: MLA బాలకృష్ణ

    • పార్టీలను కాదు.. అభివృద్ధిని చూసి ఓటేయాలి: MLA బాలకృష్ణ

  • Nov 01, 2026 08:30 IST

    అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం వద్ద క్యూలో ఓటర్లు

    elections.jpg

    electons-1'.jpg

  • Nov 01, 2026 08:20 IST

    రాప్తాడు ఘటన తర్వాత విద్యార్థులకు కౌన్సెలింగ్

    • 20 మంది కౌన్సెలర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసిన మంత్రి లోకేశ్

  • Nov 01, 2026 08:15 IST

    ఎన్టీఆర్: తిరువూరులో వైసీపీ ప్రలోభాలు

    • సర్వోదయ హైస్కూళ్ల దగ్గర వైసీపీకి ఓటేయాలని బహిరంగంగా ప్రలోభాలు

    • పట్టించుకోని పోలీసులు, అధికారులు

  • Nov 01, 2026 08:10 IST

    కడప: పులివెందులలో ఉద్రిక్తత

    • పోలింగ్ బూత్‌పై అల్లరిమూకల రాళ్ల దాడి

    • లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు

  • Nov 01, 2026 08:05 IST

    నెల్లూరు: వెంకటగిరి మున్సిపాలిటీలో గందరగోళం

    • 35వ వార్డులో గుర్తులు తారుమారు

    • టీడీపీ అభ్యర్థి పేరు ముందు వైసీపీ గుర్తు

    • వైసీపీ అభ్యర్థి పేరు ముందు టీడీపీ గుర్తు

  • Nov 01, 2026 08:00 IST

    విజయవాడ 55వ వార్డులో గుర్తులు తారుమారు

    • వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గుర్తులు తారుమారు

    • బ్యాలెట్ పేపర్‌లో పొరపాటుపై అధికారులకు ఫిర్యాదు

    • 55వ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేత

    • కాసేపట్లో తిరిగి ప్రారంభం కానున్న పోలింగ్

  • Nov 01, 2026 06:35 IST

    హైదరాబాద్‌లో స్పేర్‌ వీల్స్‌ దొంగ అరెస్ట్

    • ఎంబీఏ విద్యార్థి సోబన్‌ అలీ ఖాన్‌ అదుపులోకి

    • పార్క్ చేసిన థార్ వాహనాలే టార్గెట్

    • 15 వీల్స్‌ స్వాధీనం.. 11 కేసుల్లో ప్రమేయం

    • నాంపల్లి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్‌ రిమాండ్

  • Nov 01, 2026 06:33 IST

    గాయపడిన ప్లేయర్ల స్థానంలోనే వైభవ్‌కు అవకాశాలు ఇస్తారా?: ఆకాశ్ చోప్రా

    • టీమ్ మేనేజ్‌మెంట్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి

    • వైభవ్‌కు అవకాశాలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే స్వదేశానికి పంపించేయండి: ఆకాశ్ చోప్రా

  • Nov 01, 2026 06:31 IST

    ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేడు మున్సిపల్ ఎన్నికలు

    • ఒంగోలు కార్పొరేషన్‌లో మేయర్ స్థానంతో పాటు 59 డివిజన్లకు ఎన్నికలు

    • ఇప్పటికే మూడు డివిజన్‌లలో ఏకగ్రీవమైన టీడీపీ అభ్యర్థులు

    • అద్దంకి మున్సిపాలిటీలో చైర్మన్ స్థానంతో పాటు 29 వార్డులకు ఎన్నికలు

    • మూడు వార్డుల్లో ఏకగ్రీవమైన టీడీపీ అభ్యర్థులు

  • Nov 01, 2026 06:30 IST

    పార్వతీపురం: పాలకొండ నగర పంచాయితీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు

    • ఓటు హక్కు వినియోగించుకోనున్న 23,466 మంది ఓటర్లు

  • Nov 01, 2026 06:29 IST

    శ్రీకాకుళం: పలాస, ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు

    • పలాస మున్సిపాలిటీలో ఓటు వేయనున్న 49,420 మంది ఓటర్లు

    • 36 వార్డులకుగాను 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • ఇచ్చాపురంలో ఓటుహక్కు వినియోగించుకోనున్న 31452 మంది ఓటర్లు

  • Nov 01, 2026 06:28 IST

    అనంతపురం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

    • మొత్తం 262 వార్డులు, 689 పోలింగ్ స్టేషన్లు

  • Nov 01, 2026 06:26 IST

    కృష్ణా: మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్‌, 60 డివిజన్ల కార్పొరేటర్ స్థానాలకు పోలింగ్

    • పెడన మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు 28 వార్డు కౌన్సిలర్ల ఎన్నికలు

    • ఉయ్యూరు మున్సిపల్ ఛైర్మన్‌ స్థానానికి ఎన్నిక

    • జిల్లాలో 240 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

  • Nov 01, 2026 06:25 IST

    గ్రేటర్ విశాఖ: 120 వార్డులకు పోలింగ్ నిర్వహణ

    • ఈ సారి ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకోనున్న గ్రేటర్ ఓటర్లు

    • మేయర్‌కు పింక్, వార్డు సభ్యుడికి వైట్ బ్యాలెట్ పేపర్

    • రెండు ఓట్లనూ ఒకే బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉందని వెల్లడి

  • Nov 01, 2026 06:20 IST

    నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

    • గుంటూరు కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    • గుంటూరు కార్పొరేషన్‌, తెనాలి, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో పోలింగ్‌

    • రేపల్లె, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్‌

  • Nov 01, 2026 06:15 IST

    యాదాద్రి: చౌటుప్పల్ మార్కండేయనగర్ కాలనీలో దారుణ హత్య

    • జోగిని రాళ్ళబండి సుధాకర్(48)ను చంపిన అసోంకు చెందిన దుండగులు

    • కిలో బంగారం, అర కిలో వెండి నగలు, సుధాకర్‌ కారుతో సహా దుండగుల పరారీ

    • సిద్దిపేట సమీపంలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

  • Nov 01, 2026 06:12 IST

    నేడు కడప జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు

    • పులివెందుల్లో టెన్షన్ టెన్షన్.. పోలీసుల అలర్ట్‌

    • కడప కార్పొరేషన్‌తో పాటు... పులివెందుల, జమ్మలమడుగు చైర్మన్ స్థానాల్లో ఎన్నికలు

    • జిల్లాలో 7 మున్సిపల్ స్థానాల్లో 175 వార్డులకు ఎన్నికలు

    • మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 4,39,035 లక్షల మంది ఓటర్లు

    • 560 పోలింగ్ కేంద్రాలు, 3,864 మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు

    • 155 అత్యంత సమస్యా త్మక ప్రదేశాల గుర్తింపు

  • Nov 01, 2026 06:10 IST

    ఏపీలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

    • తుఫాన్‌ నష్టాల పరిశీలనకు వచ్చిన బృందం

    • ఏడుగురు సభ్యులతో ఏపీకి వచ్చిన బృందం

    • కోనసీమ, కాకినాడ, గోదావరి జిల్లాల్లో పరిశీలన

    • రెండు బృందాలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన

  • Nov 01, 2026 06:08 IST

    నేడు బెంగళూరులో మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి లోకేశ్ పరామర్శ

  • Nov 01, 2026 06:07 IST

    ఢిల్లీ: నేడు రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ ర్యాలీ

    • ఓట్ బచావో, దేశ్ బచావో పేరుతో ర్యాలీ నిర్వహణ

    • హాజరుకానున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతలు

  • Nov 01, 2026 06:05 IST

    ఏపీలో నవంబర్‌ 5న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్

    • నవంబర్‌ 7న MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు

    • అవసరమైనచోట నవంబర్‌ 6న రీపోలింగ్‌

  • Nov 01, 2026 06:02 IST

    అమరావతి: ఏపీలో 92 చోట్లే పురఎన్నికలు

    • 8 చోట్ల చైర్‌పర్సన్‌ సహా కౌన్సిలర్లూ ఏకగ్రీవం

    • 2,382 మేయర్‌, చైర్‌పర్సన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాలకు పోలింగ్‌

    • పోటీలో 6,669 మంది అభ్యర్థులు

    • 11,705 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేయనున్న 99.36 లక్షల మంది

    • ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

  • Nov 01, 2026 06:00 IST

    నేడు ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

    • 13 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్

    • నవంబర్‌ 3న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు