-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 19th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 19 , 2026 | 08:06 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 19, 2026 09:26 IST
నేడు కర్నూలులో ముగ్గురు హైకోర్టు జడ్జిల పర్యటన
కొత్తగా మంజూరైన కోర్టులను ప్రారంభించనున్న జడ్జిలు
-
Apr 19, 2026 08:09 IST
బాపట్ల: బెంగళూరు-నరసాపురం రైలులో దోపిడీ
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో 4 కోచ్‌లలో అర్ధరాత్రి చోరీ
4 కోచ్‌లలో ప్రయాణికుల నుంచి 11తులాల బంగారం అపహరణ
అప్పికట్లలో రైలు ఆపి దిగిపోయిన దుండగులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు
-
Apr 19, 2026 08:08 IST
ములుగు: నేడు మేడారంలో పొంగులేటి, సీతక్క పర్యటన
మేడారం అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు
అధికారులతో సమీక్ష నిర్వహించనున్న పొంగులేటి, సీతక్క
-
Apr 19, 2026 08:08 IST
చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
నేడు తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం
ఈ నెల 23న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అనుమతి
-
Apr 19, 2026 08:08 IST
అనకాపల్లి: నక్కపల్లి జంక్షన్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఆరుగురికి తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు
క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు
భువనేశ్వర్ నుంచి 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న బస్సు
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని ప్రయాణికుల ఆరోపణ
-
Apr 19, 2026 08:06 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్లు తమన్నా, మానస వారణాసి