-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Breaking Live Updates of 15th May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 15 , 2026 | 06:33 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 15, 2026 21:49 IST
బండి భగీరథ్ పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు విచారణ
వాదనలు వినిపిస్తున్న భగీరథ్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి
విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
మాపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి: హైకోర్టు
మరొక బెంచ్‌కు కేసును బదిలీ చేస్తాం: హైకోర్టు ధర్మాసనం
-
May 15, 2026 21:49 IST
కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలింపు
గచ్చిబౌలి మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స
శకుంతలకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్న వైద్యులు
మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న బండి సంజయ్
తల్లి ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆరా
-
May 15, 2026 21:48 IST
రైల్వే శాఖకు విజయవాడ పశ్చిమ MLA సుజనాచౌదరి లేఖ
విజయవాడ నుంచి వెళ్లే రైలుకు దుర్గమ్మ పేరు పెట్టాలని విజ్ఞప్తి
గత నెలలోనే రైల్వేశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖ
సుజనా ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామన్న రైల్వే శాఖ
-
May 15, 2026 21:47 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
4 వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్
ట్రాఫిక్ మధ్యనే వెళ్లనున్న సీఎం రేవంత్
-
May 15, 2026 21:41 IST
అత్యచారం కేసులో సీఐ చిన్నమల్లయ్యకు ఏపీ హైకోర్టు షాక్
సీఐ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
పిటిషనర్‌పై ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ పిటిషన్ కొట్టివేత
-
May 15, 2026 20:54 IST
సైబర్ నేరాల నివారణపై ఏపీ పోలీసుల ఫోకస్
ఏపీ సైబర్ గార్డ్ ఆపరేషనల్ ప్లాన్‌తో పాటు సైబర్ క్రైమ్ నిర్వహణ, వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సమీక్ష
-
May 15, 2026 20:53 IST
హైదరాబాద్: హరిత నిధి 7వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం
నర్సరీలు, అర్బన్ పార్కులు, ఎకోటూరిజం ప్రాజెక్టులకు ఆమోదం
అటవీ సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణపై ఫోకస్: మంత్రి సురేఖ
పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదిక: మంత్రి సురేఖ
పట్టణాల్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు: మంత్రి సురేఖ
ఎకోటూరిజం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: సురేఖ
-
May 15, 2026 20:52 IST
హైదరాబాద్: భూగర్భ జలాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
భూగర్భ జలాల సంరక్షణకు పటిష్ఠ చర్యలు: ఉత్తమ్
తాగునీటి భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: ఉత్తమ్
ఫ్లోరైడ్, నైట్రేట్ సమస్యలపై ఫోకస్: మంత్రి ఉత్తమ్
నీటి వృథా నివారణకు ప్రత్యేక ప్రణాళికలు: ఉత్తమ్
16 జిల్లాల్లో భూగర్భ జలాల ఒత్తిడి అధికం: ఉత్తమ్
-
May 15, 2026 20:29 IST
అడవుల నుంచి Ai వరకు గిరిజనాభివృద్ధి: మంత్రి అడ్లూరి
ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో AI, Coding Labs: మంత్రి అడ్లూరి
గిరిజన విద్యార్థులకు AI ఆధారిత స్మార్ట్ లెర్నింగ్: మంత్రి అడ్లూరి
వర్చువల్ టీచర్లు, డిజిటల్ ట్యూటర్లకు ప్రణాళికలు: మంత్రి అడ్లూరి
గిరిజన భాషల్లో ఈ-లెర్నింగ్ కంటెంట్ అభివృద్ధి: మంత్రి అడ్లూరి
తండాలకు AI ఆధారిత టెలిమెడిసిన్ సేవలు: మంత్రి అడ్లూరి
-
May 15, 2026 20:21 IST
సంగారెడ్డి: కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది: మంత్రి శ్రీధర్‌బాబు
మధ్యతరగతి ప్రజలపై పెట్రో భారం పడుతోంది: శ్రీధర్‌బాబు
ఇటీవల ఎన్నికల తర్వాత వసూళ్లు మొదలుపెట్టారు: శ్రీధర్‌బాబు
కేంద్ర ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలు: శ్రీధర్‌బాబు
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ టార్గెట్: శ్రీధర్‌బాబు
కాలుష్య నివారణ కోసమే హిల్ట్ పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు
-
May 15, 2026 20:09 IST
ఈనెల 18-23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు
పర్యాటక వారోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
మే 18న హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఘనంగా వారోత్సవాలు
తెలంగాణ టూరిజం అవకాశాలను చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు
-
May 15, 2026 19:52 IST
నాంపల్లి: జైపుర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్ నుంచి జైపుర్ వెళ్తున్న రైలు
మూడు ఫైరింజిన్లతో మంటలార్పిన సిబ్బంది
ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-
May 15, 2026 19:48 IST
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ నూతన జోనల్ కో-ఆర్డినేటర్లు
అరిమిల్లి రాధాకృష్ణ - శ్రీకాకుళం, విజయనగరం, అరకు
బెందాళం అశోక్ - అనకాపల్లి, విశాఖ
సుజయకృష్ణ రంగారావు - కాకినాడ, అమలాపురం
ప్రత్తిపాటి పుల్లారావు - నరసాపురం, ఏలూరు, రాజమండ్రి
ఎంవీ సత్యనారాయణ రాజు - మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ
బీటీ నాయుడు - బాపట్ల, నరసరావుపేట
మద్దిపాటి వెంకట రాజు - నెల్లూరు, ఒంగోలు
దామచర్ల సత్య - చిత్తూరు, రాజంపేట, తిరుపతి
రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి - అనంతపురం, హిందూపురం
పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి - కర్నూలు, నంద్యాల, కడప
-
May 15, 2026 19:37 IST
బండి భగీరథ్ కేసులో ఇంప్లీడ్ అయ్యే యోచనలో కాంగ్రెస్
బాలిక తరఫున కేసులో ఇంప్లీడ్ కావాలని చర్చిస్తున్న కాంగ్రెస్
ఇంప్లీడ్ అయ్యే విషయంపై న్యాయ నిపుణులతో చర్చించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
-
May 15, 2026 19:29 IST
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
కేంద్ర మంత్రులను కలవనున్న గవర్నర్ శుక్లా
-
May 15, 2026 19:06 IST
పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
టీడీపీ మహానాడు వర్చవల్‌గా నిర్వహణ
2 రోజులు పాటు మహానాడు వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయం
రాష్ట్ర కమిటీ మొత్తం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉండాలని నిర్ణయం
-
May 15, 2026 18:51 IST
విజయ్‌తో పోలుస్తూ వైసీపీ నేతల విమర్శలపై పవన్ కౌంటర్
దశాబ్దంపాటు నలిగాను.. రౌడీలను తట్టుకుని నిలబడ్డా: పవన్
-
May 15, 2026 18:47 IST
నీట్ పేపర్ లీక్ కేసులో కింగ్‌పిన్ అరెస్ట్
పుణెలో ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని అరెస్ట్ చేసిన CBI
నీట్ పేపర్ రూపకల్పనలో కులకర్ణి కీలకపాత్ర
-
May 15, 2026 18:42 IST
సంగారెడ్డి: పెట్రో ధరల పెంపుపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
ఆటోకి తాడు కట్టి లాగుతూ సీపీఎం నాయకుల నిరసన
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్
-
May 15, 2026 18:34 IST
మంగళగిరి: జనసేన సాధక్‌లతో పవన్ ఆత్మీయ సమావేశం
సాధక్‌లనుద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగం
పార్టీ బలోపేతం, లక్ష్యాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
150 మందితో ప్రారంభమైన జనసేన 21 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకోగలిగింది: పవన్
-
May 15, 2026 18:21 IST
జూన్ 2న ఆదిలాబాద్ నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు: పొంగులేటి
ప్రతి నియోజకవర్గానికి 3,500 నివాసాల మంజూరు
ITDA ప్రాంతాలకు అదనపు నివాసాల కేటాయింపు
పాత ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా కొత్త ఇళ్ల మంజూరు: పొంగులేటి
-
May 15, 2026 18:19 IST
తెలంగాణ: ఉద్యోగ సంఘాలతో టీజీ సీఎస్ రామకృష్ణారావు భేటీ
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై విస్తృత చర్చ
పెండింగ్ బిల్లులు, సర్వీస్ అంశాలు, 317 జీఓ బదిలీలపై చర్చ
త్వరలో PRC నివేదిక తెప్పిస్తామని సీఎస్ హామీ
-
May 15, 2026 18:11 IST
తమిళనాడు సీఎం విజయ్ నివాసంపై జనాల అభ్యంతరం
తక్షణమే సీఎం ఇల్లు మారాలని ప్రజల ఆందోళన
సీఎం ఇల్లు, సెక్రటేరియట్‌కు దూరం 18 కిలోమీటర్లు
రోజూ 18 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్
18 కిలోమీటర్ల ప్రయాణంలో ట్రాఫిక్ ఆంక్షలు
నిలిచిపోతున్న వాహనాలు, ఇక్కట్లు పడుతున్న ప్రజలు
-
May 15, 2026 18:05 IST
చెన్నై: AIADMKలో కొనసాగుతున్న లుకలుకలు
కరూర్‌లో రోడ్డెక్కిన AIADMK నేతలు
పార్టీ జిల్లా ఆధిపత్యం కోసం రెండువర్గాల కొట్లాట
26 జిల్లాల అధ్యక్షులను తొలగించిన పళనిస్వామి
కొత్త అధ్యక్షులను నియమించిన పళనిస్వామి
-
May 15, 2026 18:02 IST
బండి భగీరథ్‌పై పోక్సో కేసులో పోలీసుల సీరియస్
బాధిత బాలిక వివరాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంపై మరో కేసు నమోదు
జువైనల్ జస్టిస్ యాక్ట్, BNS, POCSO చట్టాల కింద కేసులు
బాధితురాలు సహా తల్లిదండ్రుల ఫొటోలు, వీడియోలు ప్రచురించిన వారిపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కేసులు
-
May 15, 2026 17:58 IST
హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించే కథనాలపై కేసు
తన కుమారుడు పోక్సో కేసు సహా తనపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ పిటిషన్
సోషల్ మీడియా కథనాలను తొలగించాలని అభ్యర్థన
తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి కథనాలు ప్రచురించొద్దన్న కోర్టు
-
May 15, 2026 17:53 IST
బండి భగీరథ్ కేసులో బాధితురాలు మైనర్
ఆస్పత్రి జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా GHMC రికార్డులు పరిశీలించి మైనర్‌గా తేల్చిన పోలీసులు
-
May 15, 2026 17:51 IST
ప.గో.: భీమవరంలో మట్టి మాఫియా ఆగడాలు
సోమేశ్వరాలయ భూమిలో అక్రమంగా మట్టి తరలింపు
రియల్ ఎస్టేట్ స్థలాలకు యథేచ్ఛగా మట్టి తరలింపు
రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన ఆలయ సిబ్బంది
జేసీబీ సహా మూడు ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు
-
May 15, 2026 17:46 IST
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాహుల్ గాంధీ స్పందన
ఇవి ఆత్మహత్యలు కావు, వ్యవస్థ చేసిన హత్యలు: రాహుల్
2015 నుంచి 2026 వరకు 148 ఎగ్జామ్స్‌లో స్కాంలు: రాహుల్
17 కేసులు CBI, 11 కేసులు ఈడీ విచారించినా శిక్షలు పడలేదు: రాహుల్
-
May 15, 2026 17:22 IST
రంగారెడ్డి: ఆదిభట్ల దగ్గర భారీ అగ్నిప్రమాదం
కొంగర కలాన్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
కన్వెన్షన్ సెంటర్ గోడౌన్‌లో డెకరేషన్ సామాగ్రి దగ్ధం
-
May 15, 2026 17:09 IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
మునీరాబాద్ దగ్గర బ్రిడ్జి పైనుంచి పడిన ట్రాక్టర్
ఆరుగురి మృతి, పలువురికి గాయాలు
10 మంది పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
May 15, 2026 17:04 IST
పొదుపు చర్యలు మొదలుపెట్టిన సుప్రీంకోర్టు
వారంలో రెండ్రోజులు ఆన్‌లైన్‌లో కేసులు విచారణ చేపట్టాలని నిర్ణయం
సోమ, శుక్రవారాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ
-
May 15, 2026 16:59 IST
అమరావతి: కొనసాగుతున్న జనసేన సమావేశం
హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ప్రజాప్రతినిధులు
సభ్యత్వాలు నమోదులో కీలకపాత్ర పోషించిన ప్రదాతలు, సాధక్‌లతో భేటీ
-
May 15, 2026 16:53 IST
విశాఖ: కాపులుప్పాడలో గతంలో స్వాధీనం చేసుకున్న భారీ గంజాయి ధ్వంసం
ఉమ్మడి జిల్లాకు చెందిన 2,300 కిలోల గంజాయి ధ్వంసం
-
May 15, 2026 16:44 IST
ఏపీ దేవదాయ శాఖ అధికారి శాంతి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన అధికారి శాంతి
గతంలో రెండుసార్లు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన అధికారులు
-
May 15, 2026 16:38 IST
విజయవాడ: దుర్గగుడిలో బాలికకు తప్పిన ముప్పు
దుర్గగుడి మెట్లకు కుటుంబం పూజ చేస్తుండగా బాలికపై ఊడిపడిన శ్లాబ్ పెచ్చులు
బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
గుంటూరు నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబం
-
May 15, 2026 16:31 IST
హైదరాబాద్: జవహర్‌నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసులో పురోగతి
పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు మమత, ఆమె భర్త రమేశ్
నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇద్దరు నిందితులు
రేపటిలోగా ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు తరలింపు
ఇదే కేసులో మరో నలుగురు నిందితుల కోసం ముమ్మర గాలింపు
ఈ కేసుతో సంబంధం ఉన్న ఏజెంట్ భీమ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
-
May 15, 2026 16:26 IST
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడు ధనుంజయ్‌కు రిమాండ్
నిందితుడికి 6 రోజుల కస్టడీకి అనుమతించిన ఢిల్లీ కోర్టు
నిన్న ఐదుగురు నిందితులకు వారం రోజుల కస్టడీ
-
May 15, 2026 16:19 IST
నీట్ పేపర్ లీక్ దోషులపై చర్యలపై IMA డిమాండ్
నీట్ ఎగ్జామ్‌ను వికేంద్రీకరించాలి: ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్
పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థ కింద రాష్ట్రాలు, యూటీలకు బాధ్యతలు అప్పగించాలి: IMA
నీట్ ఎగ్జామ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి: IMA
ఎగ్జామ్ అవకతవకలపై కఠిన శిక్షలు పడేలా కాలపరిమితితో కూడిన CBI దర్యాప్తు జరపాలి: IMA
-
May 15, 2026 16:18 IST
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో శక్తి కేంద్రంగా ఏపీ: పవన్‌కల్యాణ్
రక్షణ శాఖలో స్వావలంబన దిశగా ముందడుగు: పవన్
-
May 15, 2026 16:10 IST
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు
ఈ నెల 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
సాధారణం కంటే 5 రోజుల ముందే కేరళను తాకే అవకాశం: IMD
-
May 15, 2026 16:06 IST
అమరావతి: కాసేపట్లో జనసేన సాధక్‌లతో పవన్ సమావేశం
సాధక్‌లనుద్దేశించి ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం పవన్
పార్టీ బలోపేతం, లక్ష్యాలను వివరించనున్న పవన్ కల్యాణ్
300కిపైగా సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్‌లకు ఆహ్వానం
-
May 15, 2026 15:56 IST
గుంటూరు: చేబ్రోలు మం. కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్
పాడైన ఆహారం తిని 50 మందికిపైగా అస్వస్థత
ఆరుగురి పరిస్థితి విషమం, తెనాలి ఆస్పత్రికి తరలింపు
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న స్థానికులు
-
May 15, 2026 15:49 IST
నీట్ విద్యార్థి రితిక్ మృతిపై స్పందించిన ఎంపీ ప్రియాంక గాంధీ
బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రియాంక గాంధీ
నీట్ పరీక్ష రద్దుతో రితిక్ మానసిక ఒత్తిడికి గురయ్యాడు: ప్రియాంక
పరీక్షల్లో పెరుగుతున్న అవినీతి యువత ప్రాణాలను బలి తీసుకుంటోంది: ప్రియాంక
-
May 15, 2026 15:44 IST
2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ
నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరమేమీ లేదు: కోహ్లీ
నన్ను నేను నిరూపించుకోవాలని అడిగే పరిస్థితులను కోరుకోవడం లేదు: కోహ్లీ
జట్టుకు నా అవసరం ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తేనే ఆడతాను: కోహ్లీ
-
May 15, 2026 15:42 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
161 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
46 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
May 15, 2026 15:36 IST
మధ్యప్రదేశ్: భోజ్‌శాల ఆలయ కేసులో ఇండోర్ కోర్టు తీర్పు
వివాదాస్పద స్థలం ఆలయానిదే: ఇండోర్ కోర్టు ద్విసభ్య ధర్మాసనం
సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు: ఇండోర్ కోర్టు
ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకోవాలి: కోర్టు
దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల ఆలయ వివాదం
వివాదాస్పద స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాల వాదన
స్థల వివాదంపై ఇండోర్ కోర్టును ఆశ్రయించిన ఇరువర్గాలు
-
May 15, 2026 15:30 IST
సంగారెడ్డి: పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్‌బాబు సహకరించారు: జగ్గారెడ్డి
పరిశ్రమ ద్వారా 1500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు: జగ్గారెడ్డి
సంగారెడ్డిలో నన్ను ఓడించినందుకు సంతోషం: జగ్గారెడ్డి
నేను ఓడినందునే నా భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చింది: జగ్గారెడ్డి
-
May 15, 2026 15:28 IST
సంగారెడ్డి: తొగర్‌పల్లిలో KJS ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ
జహీరాబాద్‌ను పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తాం: శ్రీధర్‌బాబు
యువతలో నైపుణ్య విలువలు పెంచేందుకు కృషి: శ్రీధర్‌బాబు
-
May 15, 2026 15:19 IST
హైదరాబాద్: నీట్ పరీక్ష లీకేజీ విషయంలో NSUI నిరసన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన NSUI
NSUI శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
-
May 15, 2026 15:16 IST
జూన్ 4న రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా విడుదల
ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న 'పెద్ది'
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది'
-
May 15, 2026 15:07 IST
డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి
ఇంట్రాడేలో 96.07 వద్ద కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ
చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటమే కారణం
-
May 15, 2026 14:46 IST
శ్రీనగర్‌లో రేపటి నుంచి 3 రోజులపాటు 'శక్తి సంవాద్' సదస్సు
జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
మహిళా సాధికారత, భద్రత, అభివృద్ధి అంశాలపై చర్చ
హాజరుకానున్న ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
-
May 15, 2026 14:36 IST
మెదక్: మాసాయిపేట మం. హకీంపేట దగ్గర ఇద్దరు బాలుర గల్లంతు
క్వారీ గుంతలో ఈతకు వెళ్లి నీటమునిగిన కిశోర్, భాను
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
-
May 15, 2026 14:33 IST
అమరావతి స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ దుష్ప్రచారం: ADCL
స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో పొడవైన గడ్డర్లు జాయింట్ చేస్తారు: ADCL
జాయింట్ చేసేటప్పుడు బేరింగ్‌లపై గడ్డర్లు అనుసంధానిస్తారు: ADCL
ఒక్కోసారి గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తాం: ADCL
స్టీల్ బ్రిడ్జి సురక్షితం, బలంగా ఉంది: అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL)
-
May 15, 2026 14:21 IST
హైస్పీడ్ రైల్ కారిడార్లపై తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సమీక్ష
ముంబై, చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశం
రైల్వే శాఖతో కలిసి DPRలు సిద్ధం చేయాలి: సీఎస్ రామకృష్ణారావు
-
May 15, 2026 14:00 IST
UAEపై ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ
యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంది: ప్రధాని మోదీ
చర్చలతోనే సమస్యల పరిష్కారం..
హోర్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలి..
హోర్ముజ్‌పై అంతర్జాతీయ చట్టాలకు అంతా కట్టుబడి ఉండాలి
కష్టకాలంలో భారతీయులకు UAE అండగా నిలిచింది..
UAEతో భారత్ అనుబంధం కొనసాగుతుంది: ప్రధాని మోదీ
-
May 15, 2026 13:44 IST
ఇకపై డ్రోన్ హబ్‌గా కర్నూలు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
కర్నూలులో ప్రారంభానికి సిద్ధమైన డ్రోన్ సిటీ: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్..
ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
-
May 15, 2026 12:51 IST
పుట్టపర్తి దేశం గర్వించే రక్షణ కేంద్రంగా మారుతోంది: సీఎం చంద్రబాబు
AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ..
దేశానికే రక్షణ కవచంగా ఏపీ..
భవిష్యత్‌లో పుట్టపర్తిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: సీఎం చంద్రబాబు
-
May 15, 2026 12:49 IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అమెరికా-ఇరాన్ యుద్ధం వల్లే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
క్రూడాయిల్ దిగుమతికి ఖర్చు భారీగా పెరగడంతో కేంద్రం నిర్ణయం..
పనీపాటాలేని కాంగ్రెస్, BRS.. దీనిపై రాజకీయం చేస్తున్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
May 15, 2026 12:47 IST
ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కుల్దీప్‌కు జీవతఖైదు శిక్ష నిలిపివేత నిర్ణయం రద్దు చేసిన సుప్రీం
-
May 15, 2026 12:46 IST
ఏలూరు: ఇంధన ధరల పెంపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య: నాదెండ్ల
ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
నిత్యావసరాల ధరల నియంత్రణకు సమీక్షలు చేస్తున్నాం..
పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గించేలా ప్రయత్నాలు: మంత్రి నాదెండ్ల మనోహర్
-
May 15, 2026 12:45 IST
హైదరాబాద్: నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడి భేటీ
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై చర్చ
పర్సంటేజ్ విధానంపై కమిటీ వేయాలని ప్రతిపాదన
పర్సంటేజ్ కోసం 2008 నుంచి పోరాడుతున్నామన్న ఎగ్జిబిటర్స్
-
May 15, 2026 12:33 IST
అమరావతి: రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
పనుల పురోగతిపై అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థలతో మంత్రి చర్చ
-
May 15, 2026 12:26 IST
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణలో జరగనున్న SIR ప్రక్రియపై చర్చించిన నేతలు
పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, కాంగ్రెస్ ఎంపీలు, MLAలు
బీజేపీకి పడని ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
ఎవరి ఓట్లను వారే కాపాడుకోవాలని ప్రజలకు టీపీసీసీ చీఫ్ పిలుపు
జూన్ 25 నుంచి తెలంగాణలో SIR ప్రక్రియ
-
May 15, 2026 12:25 IST
హైదరాబాద్: బండి భగీరథ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని నిర్ణయం
ఇప్పటికే పోలీసులు, భరోసా సెంటర్‌లో స్టేట్‌మెంట్స్ రికార్డు
బాధితురాలి బర్త్ సర్టిఫికేట్ పరిశీలిస్తున్న పోలీసులు
-
May 15, 2026 12:24 IST
పుట్టపర్తి: కరవు నేలకు కార్ల తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి CBN: మంత్రి లోకేష్
ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలు ఏపీకి తెచ్చిన వ్యక్తి CBN: మంత్రి నారా లోకేష్
ఒకప్పుడు పుట్టపర్తిలో వంద ఇళ్లు కూడా లేవు..
ఇప్పుడు ప్రపంచానికే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి: మంత్రి నారా లోకేష్
-
May 15, 2026 11:29 IST
శ్రీసత్యసాయి: పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమిపూజ
భూమి పూజ చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్, సీఎం చంద్రబాబు
రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్ట్, 7,500 మందికి ఉద్యోగావకాశాలు
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, DRDO భాగస్వామ్యంతో నిర్మాణం
డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్, సీఎం చంద్రబాబు
-
May 15, 2026 11:10 IST
నీట్ రీ ఎగ్జామ్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన
విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు: ధర్మేంద్ర ప్రధాన్
పరీక్ష సమయం పావు గంట పెంపు..
అభ్యర్థులు ఏ నగరంలో అయినా పరీక్ష రాయొచ్చు..
మాల్ ప్రాక్టీస్ కట్టడికి కఠిన చర్యలు..
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష: ధర్మేంద్ర ప్రధాన్
-
May 15, 2026 10:58 IST
వికారాబాద్ జిల్లా: తాండూర్ యాలాల మండల పరిధిలో దారుణం
ఫోన్ ఛార్జర్ కోసం ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
-
May 15, 2026 10:56 IST
ముంబై ఇండియన్స్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు షాక్
జరిమానా విధించిన బీసీసీఐ
అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా
మ్యాచ్ అధికారులపై అనుచితల వ్యాఖ్యలు చేసిన కీరన్
-
May 15, 2026 10:55 IST
హైదరాబాద్: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కేటీఆర్
టిమ్స్‌లో వైద్య సేవల గురించి కేటీఆర్ ఆరా
హైదరాబాద్‌లో 4 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు: కేటీఆర్
BRS ప్రభుత్వం ఉండి ఉంటే రెండేళ్ల క్రితమే టిమ్స్ పూర్తయ్యేది: కేటీఆర్
-
May 15, 2026 10:52 IST
UAE బయల్దేరిన ప్రధాని మోదీ
ఆరు రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్న మోదీ
UAE, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటన
ఈనెల 20 వరకు సాగనున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన
-
May 15, 2026 10:51 IST
విజయవాడ: ఇంధన ధరల పెంపుపై CPI ఆగ్రహం
ఏపీ వ్యాప్తంగా నిరసనలకు CPI పిలుపు
5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెంచారు: CPI
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి: CPI ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
-
May 15, 2026 10:50 IST
చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ వివరణ
కుల వ్యవస్థ నిర్మూలించాలన్నదే నా ఉద్దేశం: ఉదయనిధి
-
May 15, 2026 10:49 IST
ఏపీలో పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియామకాలు: మాధవ్
-
May 15, 2026 10:48 IST
చిత్తూరు: పూతలపట్టు మండలం పి.కొత్తకోటలో రోడ్డుప్రమాదం
రైల్వే బ్రిడ్జి దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
ఇద్దరు మహిళలు మృతి, మరో ఆరుగురికి గాయాలు
ఆస్పత్రికి తరలింపు, బాధితులు తెలంగాణ వాసులుగా సమాచారం
-
May 15, 2026 10:47 IST
శ్రీసత్యసాయి: పుట్టపర్తికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
-
May 15, 2026 10:47 IST
హైదరాబాద్: లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ చేరకముందే విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండింగ్
తనిఖీలు చేసి.. బాంబు లేదని తేల్చిన భద్రతా సిబ్బంది
-
May 15, 2026 09:59 IST
నీట్ రీ ఎగ్జామ్ తేదీ ప్రకటించిన NTA
జూన్ 21న నీట్ యూజీ పరీక్ష
పేపర్ లీక్‌తో రద్దయిన ఈనెల 3న జరిగిన పరీక్ష
-
May 15, 2026 09:24 IST
బండి భగీరథ్ మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
బాధితురాలి పుట్టిన తేదీ వివరాలను కోర్టుకు సమర్పించిన పీపీ
మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినిపించనున్న బాధితురాలి తరఫు లాయర్
-
May 15, 2026 09:22 IST
విశాఖ: అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్‌లో జరిగిన పార్వతి హత్యకేసును ఛేదించిన పోలీసులు
నిందితుడు రాము అరెస్ట్, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు గుర్తింపు
డబ్బు, బంగారం కోసమే హత్య చేసినట్టు అనుమానం
-
May 15, 2026 07:56 IST
మెదక్: పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో భారీ చోరీ
ఓ ఇంట్లో 120 తులాల బంగారం చోరీ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 15, 2026 07:26 IST
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్ట్
కడప: వన్‌టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్ట్
1,200 గ్రాముల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 15, 2026 07:25 IST
హైదరాబాద్: బండ్లగూడ పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు
స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన టిప్పర్
స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 15, 2026 07:23 IST
ప్రకాశం: కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు, బస్సు దగ్ధం
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం
ఉలవపాటు మండలం భీమవరం దగ్గర బస్సులో చెలరేగిన మంటలు
బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులు సురక్షితం
-
May 15, 2026 06:59 IST
నేడు ఏపీలో నో వెహికల్ డే
కేబినెట్ నిర్ణయంతో ప్రతి శుక్రవారం అమలు
-
May 15, 2026 06:59 IST
హైదరాబాద్: నేడు మెట్రోలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ప్రయాణం
తార్నాక-అమీర్‌పేట వరకు ప్రయాణించనున్న రాంచందర్‌రావు
పొదుపు చర్యల్లో భాగంగా మెట్రోలో ప్రయాణం
-
May 15, 2026 06:56 IST
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.3 మేర పెంపు
పెంచిన ధరలు తక్షణం అమల్లోకి
-
May 15, 2026 06:38 IST
నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం సమావేశం
15 ఏళ్ల తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీకానున్న సర్కార్
CS అధ్యక్షతన భేటీ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చ
-
May 15, 2026 06:38 IST
శ్రీసత్యసాయి: పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు నేడు భూమిపూజ
పుట్టపర్తి-కోడూరు రోడ్డులోని 130 ఎకరాల విస్తీర్ణంలో డిఫెన్స్ పరిశ్రమ
భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్
-
May 15, 2026 06:36 IST
అమరావతి: నేడు జనసేన సాధక్‌లతో పవన్ కల్యాణ్ భేటీ
జనసేన సభ్యత్వ నమోదులో సాధక్‌లది క్రియాశీలపాత్ర
సాధక్‌లను ఉద్దేశించి ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం పవన్
300కిపైగా సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్‌లకు ఆహ్వానం
-
May 15, 2026 06:34 IST
నేడు సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, వివేక్
జహీరాబాద్‌లో వేం టెక్నాలజీస్ పరిశ్రమకు భూమిపూజ
తోగరిపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన
-
May 15, 2026 06:33 IST
హైదరాబాద్: నేడు ఫిల్మ్‌చాంబర్‌లో కీలక భేటీ
నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో సమావేశంకానున్న ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు సురేష్‌బాబు
-
May 15, 2026 06:33 IST
IPL: నేడు లక్నో సూపర్ జెయింట్స్ Vs చెన్నై సూపర్‌కింగ్స్
లక్నోలో రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్