-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 14th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 14 , 2026 | 08:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 14, 2026 12:01 IST
హైదరాబాద్: యూనివర్సల్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది
చిమ్నీలో మంటలు రావడంతో ఎగసిపడిన మంటలు
మంటలు రావడంతో బయటికి పరుగులు తీసిన హోటల్ సిబ్బంది
-
Apr 14, 2026 11:50 IST
కామారెడ్డి: బాన్సువాడలో ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన డయల్ 100 సిబ్బంది
ఆత్మహత్యను అడ్డుకున్న పోలీసులు
ఆస్తి పంపకాలలో తనకు అన్యాయం జరిగిందంటూ ఇంట్లో ఉరి వేసుకున్న వెంకటి
ఆత్మహత్యకు ముందు డయల్ 100కు కాల్ చేసిన బాధితుడు
లొకేషన్ గుర్తించి కొన ఊపిరితో ఉన్న బాధితున్ని కాపాడిన పోలీసులు
-
Apr 14, 2026 11:49 IST
తల్లి, చెల్లి కూడా జగన్‌పై శాపనార్ధాలు పెడుతున్నారు: పార్థసారథి
ఉగ్రవాద సంస్థలకు వైసీపీకి తేడా లేదని ప్రజల అభిప్రాయం: పార్థసారథి
జగన్ తన స్వలాభం కోసం వైఎస్ కుటుంబ గౌరవాన్ని రోడ్డుపైకి ఈడ్చారు: పార్థసారథి
జగన్ చెబితే ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు: మంత్రి పార్థసారథి
వైసీపీ రాజకీయ పార్టీనా? లేక ఉగ్రవాద సంస్థనా?: పార్థసారథి
-
Apr 14, 2026 11:46 IST
హైదరాబాద్: లోయర్ ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
దేశానికి గాంధీ, అంబేద్కర్ రెండు కళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి
స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో..
దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర అంతే ఉంది: రేవంత్‌రెడ్డి
-
Apr 14, 2026 11:44 IST
యూపీ: ఘజియాబాద్‌లో యువతి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ రీల్ షూట్
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
డ్రైవ్ చేస్తున్న యువతి మృతి
రీల్ షూట్ చేస్తున్న యువకుడి పరిస్థితి విషమం
చివరి క్షణాల్లోని వీడియో వైరల్
-
Apr 14, 2026 11:43 IST
రాజస్థాన్: అల్వార్‌లో ఘోర రోడ్డుప్రమాదం
స్లీపర్ బస్సును ఢీకొట్టిన కెమికల్ ట్యాంకర్
నలుగురు మృతి, 30 మందికి గాయాలు
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ఘటన
-
Apr 14, 2026 11:10 IST
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ దగ్గర అంబేడ్కర్ జయంతి వేడుకలు
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
-
Apr 14, 2026 11:01 IST
అల్లూరి జిల్లాలో విషాదం
ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు బాలిక మృతి
తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతుండగా మెడకు చుట్టుకున్న ఉచ్చు
ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల మాధవి
-
Apr 14, 2026 11:01 IST
ఉత్తరప్రదేశ్: నోయిడాలో 300 మంది కార్మికులు అరెస్టు
విచారణ నిమిత్తం అదుపులోకి మరో 100 మందికి పైగా కార్మికులు
సోమవారం నాడు హింసాత్మక ఘటనలకు పాల్పడిన కార్మికులు
వాహనాలు తగులబెట్టి, రోడ్లు బ్లాక్ చేసిన కార్మికులు
-
Apr 14, 2026 10:59 IST
జగిత్యాల: రాష్ట్రంలో కరవు వస్తే రేవంత్‌రెడ్డిదే బాధ్యత: జీవన్‌రెడ్డి
మేడిగడ్డను సాకుగా చూపి.. కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టారు: జీవన్‌రెడ్డి
ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనే సోయి కాంగ్రెస్‌కు లేదు
కాళేశ్వరంపై వాస్తవం గ్రహించి.. రేవంత్ కళ్లు తెరిచారు: జీవన్‌రెడ్డి
ఏడాదిలో మేడిగడ్డ మరమ్మతులు పూర్తిచేయాలి: జీవన్‌రెడ్డి
-
Apr 14, 2026 10:58 IST
నిర్మల్ జిల్లాలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ
మహిళా కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు అందజేత
'పోలీస్ అక్క' అనుభవాలు తెలుసుకున్న డీజీపీ శివధర్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అక్కలు, శివంగి టీమ్‌లను ఏర్పాటు చేస్తాం
బాలికలు, మహిళల రక్షణకు అన్ని రకాల చర్యలు: డీజీపీ శివధర్‌రెడ్డి
-
Apr 14, 2026 10:47 IST
ఇరాన్ విదేశాంగ మంత్రికి రష్యా విదేశాంగ మంత్రి ఫోన్
ఘర్షణలు పునరావృతం కాకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది
సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయానికి సిద్ధం: రష్యా
సమస్యల పరిష్కారం కోసం ఇరాన్‌కు మద్దతు ఉంటుంది: రష్యా
-
Apr 14, 2026 10:43 IST
గురువారం యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు!
ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలకు ఛాన్స్
జెనీవాలో కూడా మీటింగ్ జరగవచ్చంటూ మీడియాలో కథనాలు
సీజ్‌ఫైర్ ఒప్పందం ముగిసేలోపే త్వరపడాలనుకుంటున్న యూఎస్, ఇరాన్
-
Apr 14, 2026 09:51 IST
ఐప్యాక్ డైరెక్టర్ వినేష్ చండేల్‌కు 10 రోజుల ఈడీ కస్టడీ
మనీలాండరింగ్ కేసులో నిన్న వినేష్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
-
Apr 14, 2026 09:50 IST
లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' సినిమా ప్రదర్శన
ఛానల్ ఓనర్‌ను అరెస్ట్ చేసిన కోయంబత్తూర్ పోలీసులు
-
Apr 14, 2026 09:49 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షే: కవిత
ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగానే తెలంగాణ ఏర్పాటుకు పునాది పడింది
అంబేడ్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు.. ఆయన ఒక ఐడియాలజీ
-
Apr 14, 2026 09:47 IST
నల్లగొండ: అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి
మర్రిగూడ బైపాస్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
-
Apr 14, 2026 09:46 IST
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో అగ్నిమాపక వారోత్సవాలు
తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
వట్టినాగులపల్లిలో ఫైర్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫైర్ సర్వీస్ వీక్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
-
Apr 14, 2026 09:44 IST
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్
భారత రాజ్యాంగ ప్రధాన రూపకర్త, ముసాయిదా కమిటీ అధ్యక్షులు, స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రి, దూరదృష్టి కలిగిన నాయకులు, పండితులు
'భారత రత్న' బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను.
సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం మనకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది.
-
Apr 14, 2026 09:33 IST
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి
దేశం గర్వించే అత్యున్నత స్థాయికి అంబేడ్కర్ ఎదిగారు
బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే అంబేడ్కర్‌కు మనం ఇచ్చే ఘన నివాళి: సీఎం చంద్రబాబు
-
Apr 14, 2026 09:33 IST
అమరావతి: జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: అనగాని
దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌గా..
జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతోంది: మంత్రి అనగాని
రూ.288.80కోట్ల పెట్టుబడితో షిప్పింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేశాం
-
Apr 14, 2026 09:31 IST
వరంగల్: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మిల్స్ కాలనీలో వ్యక్తి హత్యకు యత్నించిన గ్యాంగ్ అరెస్ట్
సురేష్ అనే వ్యక్తిని చంపేందుకు రూ.5వేల సుపారీ
మంత్రాలు చేసి కూతురిని చంపాడని సుపారీ ఇచ్చిన మహిళ
సురేష్‌పై దాడిచేసిన కళ్యాణ్‌గ్యాంగ్, వీడియోలు వైరల్
కళ్యాణ్ గ్యాంగ్ దాడిపై ABN ఆంధ్రజ్యోతి వరుస కథనాలు
ముగ్గురి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు నిందితులు
-
Apr 14, 2026 09:31 IST
అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్ నివాళులు
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు
హాజరైన భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి
అంబేడ్కర్ ఆశయాలతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ విడుదల
-
Apr 14, 2026 09:28 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు
జాతీయస్థాయిలో సగటున 3.40 శాతం ద్రవ్యోల్బణం
తొలి రెండు స్థానాల్లో నిలిచిన తెలంగాణ, ఏపీ
తెలంగాణలో 5.83, ఏపీలో 4.05 శాతం ద్రవ్యోల్బణం
-
Apr 14, 2026 08:12 IST
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రత
నేడు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
-
Apr 14, 2026 08:10 IST
తిరుపతి: ఇవాళ, రేపు తిరుపతిలో మంత్రి లోకేష్ పర్యటన
NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్న లోకేష్
అనంతరం నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణంలో..
ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించనున్న మంత్రి లోకేష్
-
Apr 14, 2026 08:09 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,450
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,740
కిలో వెండి ధర రూ.2,59,900
-
Apr 14, 2026 08:04 IST
బిహార్‌లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
రేపు ఉ.11 గంటలకు నూతన సీఎం ప్రమాణస్వీకారం
నేడు NDA సమావేశంలో బిహార్ నూతన సీఎం ఎన్నిక
-
Apr 14, 2026 08:04 IST
నేడు ఉత్తరాఖండ్, యూపీలో ప్రధాని మోదీ పర్యటన
ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోదీ
-
Apr 14, 2026 08:00 IST
సంగారెడ్డి: మానూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రమాదం
ASI గోవింద్ నాయక్‌పైకి దూసుకెళ్లిన పోలీస్ వాహనం
ఆస్పత్రికి తరలింపు, చికిత్స పొందుతూ గోవింద్ మృతి
పరారీలో పోలీస్ వాహనం డ్రైవర్, హోంగార్డు రామారావు
ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్న ASI కుటుంబ సభ్యులు
ASIపై కక్షతోనే హోంగార్డు వాహనంతో ఢీకొట్టాడని ఆరోపణ