Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 11 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 11, 2026 21:11 IST

    ఎస్. జానకి మృతి.. సంతాపం తెలిపి చిరంజీవి..

  • Jul 11, 2026 21:00 IST

    గాయని ఎస్. జానకి కన్నుమూతపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

    • జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

  • Jul 11, 2026 20:20 IST

    బెంగళూరు: ప్రముఖ గాయని ఎస్‌.జానకి కన్నుమూత

    • గుండెపోటుతో గాయని జానకి మృతి

    • మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన జానకి

    • రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన జానకి

    • పలు భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన ఎస్‌.జానకి

    • 4 జాతీయ అవార్డులు అందుకున్న ఎస్‌.జానకి

    • కెరీర్‌లో ఎస్‌.జానకికి మొత్తం 32 అవార్డులు

  • Jul 11, 2026 19:44 IST

    వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    • తమిళనాడు బాధితులకు పూర్తి సహాయం అందించాలని ఆదేశం

    • కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయాలని అధికారులకు సూచన

  • Jul 11, 2026 19:35 IST

    భారత్ జట్టులో కీలక మార్పు

    • 5వ టీ20కి వైభవ్ సూర్యవంశీకి ఉద్వాసన

    • మూడు మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన వైభవ్

    • వైభవ్ స్థానంలో జట్టులోకి తిరిగి సంజు శాంసన్

    • సౌతాంప్టన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ 5వ టీ20

  • Jul 11, 2026 19:33 IST

    వియత్నాంలో బోటు ప్రమాదం..

    • మృతుల వివరాలు ప్రకటించిన ఇండియన్ ఎంబసీ

  • Jul 11, 2026 19:30 IST

    వియత్నాం బోటు ప్రమాదంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ దిగ్భ్రాంతి

    • ఏపీకి చెందిన పర్యాటకుల మృతిపై తీవ్ర సంతాపం

    • బాధితులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

    • మచిలీపట్నం, కడపకు చెందిన పర్యాటకుల మృతి విషాదకరం

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పీవీఎన్ మాధవ్

  • Jul 11, 2026 19:26 IST

    నంద్యాల: నందికొట్కూరు నియోజకవర్గంలో ఘరానా మోసం

    • పశువుల రుణాల పేరుతో రూ.40 లక్షలకు పైగా టోకరా

    • వర్ధన్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో డబ్బుల వసూళ్లు

    • పలు గ్రామాల ప్రజలను నమ్మించి మోసం చేసిన ఉద్యోగి కాటం బాబు

    • నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

    • తమ డబ్బులు ఇప్పించి, న్యాయం చేయాలని బాధితుల డిమాండ్

  • Jul 11, 2026 19:06 IST

    ఇండియా-ఇంగ్లాండ్ 5వ టీ20కి టాస్ ఆలస్యం

    • సౌతాంప్టన్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లు

    • భారత జట్టు ఆలస్యంగా రావడంతో టాస్ వాయిదా

    • సాయంత్రం 6:30కు జరగాల్సిన టాస్ 7:15కు నిర్వహణ

    • రాత్రి 7:30కు ప్రారంభం కానున్న మ్యాచ్

  • Jul 11, 2026 19:04 IST

    అమరావతి: వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

    • రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం

    • ప్రమాద బాధితులకు సహాయం అందించాలని అధికారులకు ఆదేశం

  • Jul 11, 2026 18:39 IST

    నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • పెద్దవూర మండలం లింగంపల్లి సమీపంలో ప్రమాదం

    • అతివేగంతో లారీని ఢీకొట్టిన కారు

    • ఘటనా స్థలంలో ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • Jul 11, 2026 18:37 IST

    హైదరాబాద్: వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

    • వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా: రేవంత్‌

    • అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నా: రేవంత్‌

    • కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారత్‌ ఎంబసీ అధికారులతో సంప్రదిస్తున్నాం: రేవంత్‌

    • అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం: సీఎం రేవంత్‌

    • బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌

  • Jul 11, 2026 18:35 IST

    అనిల్ అంబానీకి బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ

    • రూ.1,021 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

    • రిలయన్స్ పవర్ షేర్లు, రుణ బకాయిలు స్వాధీనం చేసుకున్న ఈడీ

    • రూ.15,548 కోట్ల నిధుల మళ్లింపుపై కొనసాగుతున్న దర్యాప్తు

    • మనీలాండరింగ్ కేసులో ఇప్పటివరకు రూ.20,367 కోట్ల ఆస్తుల అటాచ్

    • FEMA కింద రూ.77.86 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేసిన ఈడీ

  • Jul 11, 2026 18:23 IST

    హైదరాబాద్: కాళేశ్వరం విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం: సీఎం రేవంత్‌

    • ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్‌

    • హరీష్‌రావు సూచనల మేరకే ఈటల రాజేందర్ మాట్లాడారు: రేవంత్‌

    • కాళేశ్వరంపై ఎంపీ ఈటల అవాస్తవాలు చెప్పారు: రేవంత్‌

    • ఎంపీ ఈటల అంటే మాకు గౌరవమే: సీఎం రేవంత్‌

    • తన వ్యాఖ్యలతో ఈటల తన గౌరవం పోగొట్టుకున్నారు: రేవంత్‌

    • ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మా ప్రయత్నం: సీఎం రేవంత్

  • Jul 11, 2026 18:21 IST

    కర్నూలులో పట్టపగలే చోరీ

    • విష్ణు టౌన్‌షిప్‌లోని ఇంట్లో భారీ దోపిడీ

    • 12 తులాల బంగారం, అర కిలో వెండి, రూ.1.20 లక్షల నగదు అపహరణ

    • బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 11, 2026 18:06 IST

    వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

    • బాధితులకు భారత రాయబార కార్యాలయం ద్వారా సహాయం

    • అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపడతామన్న ప్రధాని

  • Jul 11, 2026 18:01 IST

    వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

    • ఫు క్వోక్ ద్వీపం వద్ద భారతీయుల బోటు బోల్తా

    • తెలంగాణ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం

    • బాధితుల కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    • 4 హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసిన ప్రభుత్వం

    • సమాచారం కోసం వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచన

    • సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

    • 9885371189, 7997959754, 9989654807, 7997959779

  • Jul 11, 2026 17:57 IST

    రంగారెడ్డి: షాబాద్‌ ఘటనలో పోలీసులు కీలక ప్రకటన

    • పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ఆచూకీ తెలిపినవారికి రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన ఫ్యూచర్‌ సిటీ పోలీసులు

    • పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం తెలుగు రాష్ట్రాలు సహా పొరుగు రాష్ట్రాల్లోనూ పోలీసుల గాలింపు

  • Jul 11, 2026 16:39 IST

    వియత్నాంలో బోటు ప్రమాదంపై మంత్రి లోకేశ్ ఆరా

    • రాష్ట్ర, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడిన లోకేశ్

    • ఏపీ నుంచి విహార యాత్రకు వెళ్లిన పర్యాటకుల వివరాలపై ఆరా

    • వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నట్లు మంత్రి లోకేశ్‌కు తెలిపిన అధికారులు

    • కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని మంత్రి లోకేశ్ సూచన

  • Jul 11, 2026 16:32 IST

    స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌కు చెందిన దంపతులు

    • జూన్ 22న విహారయాత్రకు వెళ్లిన దంపతులు

    • జూలై 8 తర్వాత కుటుంబంతో సంబంధాలు కట్

    • రూ.50 కోట్ల పెట్టుబడుల వ్యవహారంపై అనుమానాలు

    • అదృశ్యమైన దంపతుల ఆచూకీ కోసం పోలీసుల

  • Jul 11, 2026 16:29 IST

    ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన

    • న్యూజిలాండ్‌ నుంచి భారత్‌ బయల్దేరిన ప్రధాని మోదీ

  • Jul 11, 2026 16:28 IST

    అమరావతి: కడప జిల్లాలో కరోనా కేసులపై ఇన్‌చార్జి మంత్రి సవిత ఆరా

    • కలెక్టర్ శ్రీధర్, DMHO రవిబాబుతో ఫోన్‌లో మాట్లాడిన సవిత

    • కరోనా వ్యాప్తిపై శాంపిళ్లను పుణె ల్యాబ్‌కు పంపామన్న కలెక్టర్‌

    • ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికి మెరుగైన అందించాలని ఆదేశం

    • కేసులు నమోదైన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు అమలుకు ఆదేశం

    • కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సవిత ఆదేశం

  • Jul 11, 2026 16:27 IST

    వియత్నాం బోటు ప్రమాదంలో కడప వాసి శ్రీధర్‌ మృతి

    • ప్రమాదంలో బందరు వాసి జయశ్రీ మృతి

    • మచిలీపట్నం వాసి కిషోర్‌ పరిస్థితి విషమం

  • Jul 11, 2026 16:27 IST

    వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా

    • ప్రమాద సమయంలో బోటులో 32 మంది భారతీయులు సహా 70 మంది

    • పలువురిని కాపాడిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది

    • భారత ఎంబసీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

    • కంట్రోల్‌ రూమ్: +84 913089165, 362817930

    • కంట్రోల్‌ రూమ్: +84 915523714, 334520414

  • Jul 11, 2026 16:26 IST

    వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా

    • మొబైల్‌ కంపెనీ బిజినెస్‌ ట్రిప్‌లో విషాదం

    • 15 మంది మృతి, కొనసాగుతున్న రెస్క్యూ

    • మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు

    • మృతుల వివరాలు సేకరిస్తున్న అధికారులు

  • Jul 11, 2026 15:32 IST

    న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • భారత్, న్యూజిలాండ్‌లో అవకాశాలకు కొదవలేదు: మోదీ

    • ఇరుదేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి: మోదీ

    • న్యూజిలాండ్‌ ఒక అద్భుతమైన దేశం: మోదీ

    • న్యూజిలాండ్‌ నలుమూలలా భారతీయులు ఉన్నారు: మోదీ

    • మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్‌: మోదీ

    • ఎకానమీకి వ్యవసాయం ఎలా బలం చేకూర్చుతుందో ప్రపంచ దేశాలకు న్యూజిలాండ్‌ చూపింది: మోదీ

  • Jul 11, 2026 15:29 IST

    అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీతో మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ చర్చలు

    • మొత్తం 23 డిమాండ్లపై చర్చించాం: మంత్రి పార్థసారథి

    • ఈనెల 21న మరోసారి సమావేశం అవుతాం: పార్థసారథి

    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరాం: పార్థసారథి

    • రేపటి ఉద్యమ సన్నాహక సభ వాయిదా వేసుకున్నారు: పార్థసారథి

  • Jul 11, 2026 15:24 IST

    హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 14, 15 వ తేదీల్లో సింగరేణి భరోసా యాత్ర

    • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో సేవ్ సింగరేణి పేరిట యాత్ర

    • పాల్గొననున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.

  • Jul 11, 2026 15:15 IST

    సంగారెడ్డి జిల్లాలో ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు

    • జోగిపేట వద్ద నర్సాపూర్ డిపో బస్సును వెనుక నుంచి ఢీకొన్న హైదరాబాద్ డిపో బస్సు

    • రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఒకవైపు ట్రాఫిక్ ఉండటంతో ఘటన

    • ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు

    • క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • Jul 11, 2026 15:08 IST

    వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా

    • ఫు క్వాక్ దీవి సమీపంలో ప్రమాదం

    • సహాయక చర్యలు చేపట్టిన స్థానిక అధికారులు

    • ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న భారత రాయబార కార్యాలయం

    Boat-carrying-Indian-touris.jpg

  • Jul 11, 2026 14:33 IST

    హైదరాబాద్: సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు

    • హైదరాబాద్‌లో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ ప్రారంభం

    • టీ-వర్క్స్‌లో హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

    • జపాన్ తోహో కోకి సంస్థ సహకారంతో హబ్ ఏర్పాటు

  • Jul 11, 2026 14:20 IST

    షాబాద్‌ ఘటనపై NHRCకి న్యాయవాది రామారావు ఫిర్యాదు

    • షాబాద్‌ CI కాంతారెడ్డి, SI రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరిన పిటిషనర్‌

    • గతంలో బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న పిటిషనర్‌

    • నిందితుడికి కఠినశిక్షలు పడేలా చూడాలని కోరిన పిటిషనర్‌

    • బాధితులకు రక్షణ కల్పించి, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్‌

  • Jul 11, 2026 13:45 IST

    రంగారెడ్డి: షాబాద్ SI రమేశ్ సస్పెన్షన్

    • SI సస్పెన్షన్‌తో ఆందోళన విరమించిన నిరసనకారులు

    • 6 హత్యల నిందితుడు రాజ్‌కుమార్ కారు గుర్తింపు

    • నందిగామ దగ్గర కారును గుర్తించిన పోలీసులు

    • నందిగామ రైల్వేస్టేషన్ వైపు వెళ్లినట్టు గుర్తింపు

  • Jul 11, 2026 13:17 IST

    గుంటూరు జిల్లా: మంగళగిరిలో అత్త, మామపై అల్లుడి దాడి

    • భార్యను కాపురానికి పంపడంలేదని అత్త, మామను కారుతో ఢీకొట్టిన అల్లుడు

    • దాడిలో శ్రీనివాసరావు, పద్మావతికి తీవ్ర గాయాలు

    • నిందితుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్

  • Jul 11, 2026 13:14 IST

    రంగారెడ్డి: షాబాద్ పీఎస్‌ దగ్గర కొనసాగుతున్న ఆందోళన

    • రోడ్డుపై బైఠాయించి బాలిక కుటుంబ సభ్యుల నిరసన

    • షాబాద్ పీఎస్‌కు కలెక్టర్, చేవెళ్ల MLA కాలే యాదయ్య

    • కలెక్టర్, MLAతో బాలిక బంధువుల వాగ్వాదం

    • రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలని బాలిక బంధువుల డిమాండ్

  • Jul 11, 2026 13:13 IST

    సంగారెడ్డి: ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత

    • బీఫ్ షాపుల ఏర్పాటులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

    • పరస్పరం కర్రలు, కత్తులతో దాడులు

    • పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • ఆస్పత్రికి వచ్చిన బాధితులపై మరోసారి దాడి

    • ఇరువర్గాలను చెదరగొట్టిన జోగిపేట పోలీసులు

  • Jul 11, 2026 13:10 IST

    రంగారెడ్డి: షాబాద్ హత్యల ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

    • రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీతక్క... సీపీకి ఫోన్

    • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

    • బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశం

  • Jul 11, 2026 12:34 IST

    అమరావతి: గొడ్డలి పార్టీ ఉగ్రవాద సంస్థ లాంటిది: పట్టాభిరామ్

    • ఉగ్రవాద సంస్థలకు, గొడ్డలి పార్టీకి తేడా ఏంటి?: పట్టాభి

    • జోసెఫ్‌ రావణ్‌కు గొడ్డలి పార్టీ నేతలు మద్దతిస్తున్నారు: పట్టాభి

    • విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

  • Jul 11, 2026 12:23 IST

    గుంటూరు: తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత

    • సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇవ్వని భూములను స్వాధీనం చేసుకుంటున్న CRDA

    • భారీగా మోహరించిన పోలీసులు

    • ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన CRDA

  • Jul 11, 2026 12:18 IST

    విశాఖలో యుద్ధనౌక 'మహేంద్రగిరి' కమిషనింగ్ వేడుక

    • యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

    • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నీలగిరి శ్రేణినౌక: రాజ్‌నాథ్

    • మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగా ఉంది: రాజ్‌నాథ్‌సింగ్

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 12:17 IST

    రంగారెడ్డి: షాబాద్‌ వెళ్తున్న BRS నాయకుల అరెస్ట్

    • సబిత, RS ప్రవీణ్ సహా పలువురు నేతల అరెస్ట్

    • షాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో అరెస్ట్ చేసిన పోలీసులు

    • చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు BRS నేతల తరలింపు

  • Jul 11, 2026 12:17 IST

    కాసేపట్లో యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

    • కొండపైకి చేరుకున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్, మెంబర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు

    • ఆలయ ముఖ మండపం దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

    • ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత మొదటి ట్రస్టు బోర్డు మీటింగ్

  • Jul 11, 2026 12:16 IST

    స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌ సంస్థలకు FSSAI నోటీసులు

    • పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై వినియోగదారుల ఫిర్యాదులతో నోటీసులు ఇచ్చిన FSSAI

  • Jul 11, 2026 12:15 IST

    ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్: విక్రయానికి పిచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

    • న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్

    • మ్యాచ్ అనంతరం ఆ స్టేడియంలోని పిచ్‌ను ముక్కలు చేసి విక్రయించేందుకు ఫిఫా నిర్ణయం

    • ఒక్క ముక్క ధర 450 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38 వేలు)

    • పిచ్‌ను కూడా అమ్మకానికి పెట్టిందంటూ ఫిఫాపై విమర్శలు

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 11:28 IST

    నిర్మల్: దివ్య నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ

    • రెండు ఫ్లాట్లలో నివసిస్తున్నవారిని బెదిరించి మరీ దోపిడీ

    • 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరాణలను ఎత్తుకెళ్లిన దండుగులు

    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 11, 2026 11:26 IST

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్

    • పవన్ సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు

    • పవన్‌కు ఆయురారోగ్యాలు చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: సీఎం చంద్రబాబు

  • Jul 11, 2026 11:07 IST

    హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఆట మొదలు పెట్టారు: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

    • 117 సీట్లు గెలిపించుకునే ప్లాన్‌ను సీఎం రేవంత్ సిద్ధం చేశారు: జగ్గారెడ్డి

    • రేవంత్ వ్యూహాలు, నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది: జగ్గారెడ్డి

    • సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం.. సీఎం, పీసీసీ చీఫ్, ఇన్‌చార్జ్ నిర్ణయిస్తారు: జగ్గారెడ్డి

    • సర్వేలు చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు: జగ్గారెడ్డి

    • ఎమ్మెల్యేల పనితీరు దృష్టిలో పెట్టుకునే సీఎం పలువురికి సూచనలు ఇస్తున్నారు: జగ్గారెడ్డి

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 10:57 IST

    నారా బ్రాహ్మణికి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • 'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో బ్రాహ్మణికి చోటు దక్కడం అభినందనీయం: చంద్రబాబు

    • బ్రాహ్మణి నాయకత్వం, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపు

    • భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 10:55 IST

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముంబైలో శస్త్ర చికిత్స

    • రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్

    • కుడి భుజానికి సంబంధించిన ఆపరేషన్ పూర్తి

    • ఎడమ భుజానికి 2 నెలల వ్యవధిలో మరో శస్త్ర చికిత్స

    • ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పవన్ కల్యాణ్

  • Jul 11, 2026 10:33 IST

    బ్రాహ్మణి సాధించిన విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం

    • 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి నిలవడం గర్వకారణం: ఎక్స్‌లో లోకేశ్

    • ప్రతిభ కొనసాగిస్తూ అవరోధాలను అధిగమించాలి: మంత్రి నారా లోకేశ్

  • Jul 11, 2026 10:25 IST

    'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు

    • దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో నారా బ్రాహ్మణి

    • ఢిల్లీలో జరిగిన సదస్సులో అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి

    • హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానంలో రైతుల పాత్ర ఎనలేనిది: బ్రాహ్మణి

    • అన్నదాతల జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం: నారా బ్రాహ్మణి

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 10:20 IST

    రంగారెడ్డి: షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట కొనసాగుతున్న ఉద్రిక్తత

    • చేవెళ్ల షాబాద్ ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

    • న్యాయం చేయాలంటూ హత్యకు గురైన బాలిక బంధువుల డిమాండ్

    • 12 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జామ్

    • పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

  • Jul 11, 2026 10:12 IST

    వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్

    • సెమీస్‌లో సినర్‌పై నొవాక్ జకోవిచ్ ఓటమి

    • రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై స్పందించిన జకోవిచ్

    • నా ప్రయాణం ఇంకా ముగియలేదు: జకోవిచ్

  • Jul 11, 2026 10:09 IST

    భద్రాద్రి: ఫలించిన మంత్రి తుమ్మల స్వప్నం

    • దశాబ్దాల సాగునీటి కల సాకారం

    • సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు

    • సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ లింక్ కెనాల్‌కు జలాలు

  • Jul 11, 2026 10:08 IST

    నిజామాబాద్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో చైన్ స్నాచింగ్

    • ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు నగలు లాక్కెళ్లిన దుండగులు

    • కారులో వచ్చిన నలుగురు దుండగులు.. అడ్రస్ అడిగే నెపంతో మహిళలపై దాడి

    • దుండగుల కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు

  • Jul 11, 2026 10:05 IST

    రంగారెడ్డి: మా మేనకొడలిని రాజ్‌కుమార్ లైంగికంగా వేధించాడు: షాబాద్ బాలిక మేనమామ

    • పోలీసులకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు: బాలిక మేనమామ

    • మే 16న షాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాం: బాలిక మేనమామ

    • మా ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు: బాలిక మేనమామ

    • ABNతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక మేనమామ నరేష్

  • Jul 11, 2026 10:03 IST

    న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

    • రోడ్‌మ్యాప్ 2030 ఆవిష్కరణ

    • ప్రతిష్ఠాత్మక, సుదీర్ఘకాల దార్శనికతకు ఇరు దేశాల అంగీకారం

  • Jul 11, 2026 10:02 IST

    రంగారెడ్డి: షాబాద్ హత్యలపై వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి

    • రాజ్‌కుమార్ ఒక్కడే ఆరుగురిని హత్య చేశాడు: సీపీ తరుణ్ జోషి

    • రాత్రి 11 నుంచి 11:30 సమయంలో ఆరుగురి హత్యలు: సీపీ

    • బాధితురాలి ఇంట్లో బాలిక తల్లి, నానమ్మను హత్య చేశాడు: సీపీ

    • రాత్రి 11గంటలకు బాలికను బలవంతంగా తీసుకెళ్లాడు: సీపీ

    • దైవాలగూడ చెరువు దగ్గర బాలికను హత్య చేశాడు: సీపీ

    • ఆ తర్వాత ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను చంపాడు: సీపీ

    • హత్యల తర్వాత తండ్రికి రాజ్‌కుమార్ ఫోన్ చేశాడు: సీపీ తరుణ్ జోషి

  • Jul 11, 2026 09:59 IST

    కామారెడ్డి: ఎన్యూమరేషన్ ఫామ్స్ విషయంలో ఘర్షణ

    • సైలానీబాబా కాలనీలో BLOపై ఓటర్లు దాడికి యత్నం

    • ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫామ్స్‌ పంపిణీ చేస్తున్న BLO

    • ఫామ్ ఎలా పూరించాలని BLOతో ఓ వ్యక్తి వాగ్వాదం

    • సూపర్‌వైజర్, BLOపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్యూమరేషన్ ఫామ్స్‌ లాక్కునే యత్నం

    • పలువురు ఓటర్లపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన BLO

  • Jul 11, 2026 09:58 IST

    అమరావతి: మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అస్వస్థత

    • డీహైడ్రేషన్, సర్వైకల్ సమస్యలతో బాధపడుతున్న మంత్రి

    • ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్టు ప్రకటన

  • Jul 11, 2026 09:58 IST

    ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!

    • వింబుల్డన్ వీక్షించిన సచిన్, కోహ్లీ, గిల్

    • ఆ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో పెట్టి వింబుల్డన్ చేసిన పోస్ట్ వైరల్

    • మూడు తరాల క్రికెట్ రాయల్టీ అంటూ వింబుల్డన్ క్యాప్షన్

  • Jul 11, 2026 08:30 IST

    రంగారెడ్డి: షాబాద్ పీఎస్ దగ్గర బాలిక బంధువుల ఆందోళన

    • ఆరుగురి హత్యలకు పోలీసుల అలసత్వమే కారణమని ఆరోపణ

    • మే 16న రాజ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశామంటున్న మృతుల బాధితులు

    • అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది: మృతుల బాధితులు

    • బయటే తిరుగుతూ చాలా సార్లు బెదిరించాడు: మృతుల బాధితులు

  • Jul 11, 2026 08:15 IST

    రంగారెడ్డి: షాబాద్ ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు

    • నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే కేసు

    • భూతగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించిన రాజ్‌కుమార్

    • షాబాద్ పీఎస్‌లోనే రాజ్‌కుమార్‌పై కేసు నమోదు

  • Jul 11, 2026 08:00 IST

    ఖమ్మం: సత్తుపల్లి JVR ఓసీ-2 దగ్గర TRS చీఫ్‌ కవిత ఆందోళన

    • కవితను లోపలకు అనుమతించని సింగరేణి అధికారులు

    • గేటు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన కవిత, కార్యకర్తలు

    • కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది: కవిత

    • HMS యూనియన్ నిజాలు చెబుతుంటే జీర్ణించుకోలేక పోతున్నారు: కవిత

  • Jul 11, 2026 07:45 IST

    నంద్యాల: వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి భూకబ్జాలపై ప్రభుత్వం సీరియస్

    • ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మృతి వనం నిర్మించడంపై నోటీసులు జారీ చేయాలని ఆదేశం

    • తక్షణమే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌కు CCLA ఉత్తర్వులు

    • త్వరలో వైసీపీ నేత కాటసాని రామిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం

  • Jul 11, 2026 07:40 IST

    అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

    • నేడు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నేతలతో మంత్రుల భేటీ

    • ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చించే అవకాశం

    • బకాయిలు, డీఏ, పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చ

  • Jul 11, 2026 07:30 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం 11:45కు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

    • సాయంత్రం 4:30కు అంబేద్కర్ కళా వేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొననున్న సీఎం

  • Jul 11, 2026 07:14 IST

    ఎన్టీఆర్ జిల్లా: తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య

    • ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో విషాద ఘటన

    • తల్లిదండ్రులు మందలించారని ఫ్యాన్‌కు ఉరేసుకుని నల్లమోతు రమేష్‌(25) ఆత్మహత్య

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 11, 2026 07:12 IST

    తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం

    • రాత్రి నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుత సంచారం

    • చిరుతను చూసి కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు

    • అప్రమత్తమైన టీటీడీ, అటవీ సిబ్బంది

    • నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచన

  • Jul 11, 2026 06:33 IST

    ఇరాన్‌కు అమెరికా 24 గంటల డెడ్‌లైన్‌

    • తప్పు చేశామని బహిరంగంగా అంగీకరించాలని అల్టిమేటం

    • నౌకలపై కాల్పులు ఆపేస్తామని చెప్పాలని డిమాండ్‌

    • హోర్ముజ్‌ తెరిచి ఉండడంతో పాటు ఫీజు ఉండదని చెప్పాలని సూచన

    • నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

    • చర్చల కోసం తాము అభ్యర్థించలేదంటున్న ఇరాన్‌

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 06:19 IST

    రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం

    • ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్ కుమార్(28)

    • పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చి కేసుపెట్టిన వారి హత్య

    • బాలిక, భార్య, ఇద్దరు పిల్లలు, నానమ్మ, అమ్మమ్మ హత్య

    • పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం

    పూర్తి కథనం..

  • Jul 11, 2026 06:18 IST

    అమరావతి: పవిత్ర సంగమానికి గోదావరి జలాల పరుగులు

    • నేడు కృష్ణానది పవిత్ర సంగమానికి చేరుకోనున్న గోదావరి జలాలు

    • వరదతో పోలవరం స్పిల్‌వే నుంచి గోదావరి జలాల విడుదల

    • పట్టిసీమ పంప్‌హౌస్ నుంచి 7వేల క్యూసెక్కుల తరలింపు

  • Jul 11, 2026 06:18 IST

    నేడు తెలంగాణలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పర్యటన

    • ఉదయం పారిశ్రామికవేత్తలతో భేటీకానున్న అశ్వినీ వైష్ణవ్‌

    • మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కొండగల్‌లో రైల్వే మంత్రి పర్యటన

    • మేధా రైల్వే బోగీల ఫ్యాక్టరీని సందర్శించనున్న అశ్వినీ వైష్ణవ్‌

  • Jul 11, 2026 06:01 IST

    నేడు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మంత్రి నారాయణ పర్యటన

    • రాజమండ్రి, నర్సాపురం, గాజువాకలో మంత్రి నారాయణ పర్యటన

    • రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించనున్న మంత్రి

    • నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ చెరుకూరి లక్ష్మణ రావు విగ్రహావిష్కరణ

    • సాయంత్రం 4 గంటలకు గాజువాక GVMC జోనల్ ఆఫీస్‌లో మంత్రి నారాయణ సమీక్ష