Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 10 , 2026 | 05:57 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 10, 2026 21:14 IST

    మా నివాసానికి మోదీ రావడం మాకు గొప్ప గౌరవం: పవన్ కల్యాణ్

    • నా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చిన మోదీకి కృతజ్ఞతలు: పవన్‌

    • మోదీతో సమావేశం ఎంతో విలువైనది, ఎప్పటికీ గుర్తుంచుకుంటా: పవన్‌

  • May 10, 2026 19:47 IST

    తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం: మోదీ

    • జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నాం: మోదీ

    • కాంగ్రెస్‌, BRS పాలనను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు: మోదీ

    • హైదరాబాద్‌ను అన్ని రకాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోంది: మోదీ

  • May 10, 2026 19:47 IST

    దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోంది: ప్రధాని మోదీ

    • కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు కాదు విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారు: మోదీ

    • పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు: మోదీ

    • ఒకప్పుడు BJPకి రెండే ఎంపీ సీట్లు ఉండేవి.. అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి: మోదీ

  • May 10, 2026 19:09 IST

    అస్సాంలో మూడోసారి అధికారంలోకి వచ్చాం: ప్రధాని మోదీ

    • కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతే: మోదీ

    • బెంగాల్‌ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్‌ పార్టీలను తిరస్కరించారు: మోదీ

    • మమత నియంతృత్వాన్ని బెంగాల్‌ ప్రజలు ఎదిరించారు: మోదీ

  • May 10, 2026 19:08 IST

    సికింద్రాబాద్‌: బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

    • బెంగాల్‌లో తొలిసారి అద్భుత విజయం సాధించాం: మోదీ

    • బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతోంది: మోదీ

    • తెలంగాణలోనూ బెంగాల్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి: మోదీ

    • కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగింది: మోదీ

    • తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారు: మోదీ

    • సుపరిపాలనతోనే దేశ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు: మోదీ

    • అబ్‌ కీ బార్‌ తెలంగాణ మే బీజేపీ సర్కార్‌: మోదీ

  • May 10, 2026 18:40 IST

    పరేడ్ గ్రౌండ్‌‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    • కాసేపట్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

  • May 10, 2026 18:33 IST

    తెలంగాణను రక్షించుకోవాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి: కిషన్‌రెడ్డి

    • తెలంగాణ ఆగమవుతోంది.. అప్పులమయమైంది: కిషన్ రెడ్డి

    • అందరికీ కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది: కిషన్‌రెడ్డి

    • కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు ఏమయ్యాయి?: కిషన్‌రెడ్డి

  • May 10, 2026 18:32 IST

    కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌: ఎంపీ లక్ష్మణ్‌

    • కాంగ్రెస్‌, బీఆర్ఎస్ తోడుదొంగలు: ఎంపీ లక్ష్మణ్‌

    • ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీదే గెలుపు: ఎంపీ లక్ష్మణ్‌

    • అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్‌లో గెలిచాం.. వై నాట్‌ తెలంగాణ: లక్ష్మణ్‌

  • May 10, 2026 18:30 IST

    హైదరాబాద్: ముగిసిన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ భేటీ

    • గంటకు పైగా ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో గడిపిన ప్రధాని మోదీ

    • తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ

    • చంద్రబాబు నివాసం నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రధాని

    • బేగంపేట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు వెళ్ళనున్న మోదీ

  • May 10, 2026 18:20 IST

    బహిరంగ సభా వేదికపై బండి సంజయ్‌ కంటతడి

    • నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్

    • మేము సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాం: బండి సంజయ్

    • మా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేదిలేదు: బండి సంజయ్

    • పార్టీకి తలవంపులు తెచ్చే పనులు నేను చేయను: బండి సంజయ్

    • రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దుష్ప్రచారం: బండి సంజయ్

    • భయపడడానికి నేను ఫామ్‌హౌస్‌లోని ఎలుకను కాను: బండి

    • నేను తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు: బండి సంజయ్

  • May 10, 2026 18:18 IST

    కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి?: కేంద్రమంత్రి బండి సంజయ్

    • రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: బండి సంజయ్

    • బీజేపీ నేతలు భేదాభిప్రాయాలు వీడాలి: బండి సంజయ్

    • తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోరాడాలి: బండి సంజయ్

    • మోదీ లేనిదే తెలంగాణలో ప్రభుత్వం నడవదు: బండి సంజయ్

    • బెంగాల్‌లో బీజేపీకి గెలుపు అంత సులభంగా రాలేదు: బండి

    • 300 మంది బీజేపీ కార్యకర్తలు బలిదానం చేశారు: బండి సంజయ్

    • కేరళలోనూ బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి: బండి సంజయ్

    • నిధులు ఇచ్చేది మనం.. అభివృద్ధి చేసేదీ మనమే: బండి సంజయ్

  • May 10, 2026 18:18 IST

    జై శ్రీరామ్‌ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టాం: కేంద్రమంత్రి బండి సంజయ్‌

    • జై శ్రీరామ్‌ అంటే కడుపు నిండుతుందా అని కొందరు అన్నారు

    • జై శ్రీరామ్‌ అంటే కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు: బండి

    • జై శ్రీరామ్‌ నినాదంతోనే బెంగాల్‌లో అధికారంలోకి వచ్చాం

    • జై శ్రీరామ్‌ నినాదంతోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

    • జై శ్రీరామ్‌ నినాదమే మాలో పోరాటపటిమ నింపింది: బండి

  • May 10, 2026 18:06 IST

    సికింద్రాబాద్‌: పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ

    • కాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ

    • బీజేపీ సభకు 2 వేల మంది పోలీసులతో భద్రత

  • May 10, 2026 17:15 IST

    హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ

    • మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు

    • ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆత్మీయ సమావేశం

  • May 10, 2026 17:00 IST

    హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ

    • పవన్‌ను పరామర్శించిన మోదీ

    • ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్

    • పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ

  • May 10, 2026 16:45 IST

    హైదరాబాద్: గచ్చిబౌలిలో సింధు ఆస్పత్రి ప్రారంభం

    • సింధు ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

    • ఆస్పత్రి పరిశీలించి వైద్యులను పరామర్శించిన మోదీ

  • May 10, 2026 16:28 IST

    రాజకీయాలు మాట్లాడబోనని సీఎం రేవంత్ అన్నారు.. నేనూ మాట్లాడను: ప్రధాని మోదీ

    • పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు: ప్రధాని

    • గుజరాత్‌కు ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇచ్చేందుకు సిద్ధం: ప్రధాని

    • గుజరాత్ తరహాలో చేస్తే మీకు సగం నిధులే వస్తాయి: ప్రధాని

    • ఈ నిధులే మీకు సరిపోతాయా?: ప్రధాని

    • ఈ ప్రతిపాదన నచ్చితే సీఎం రేవంత్ మాతో కలిసి నడవాలి: ప్రధాని

    • అభివృద్ధిలో మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేదు: ప్రధాని

    • రాజకీయంగా కాదు.. నాతో అభివృద్ధిలో కలవండి: ప్రధాని

  • May 10, 2026 16:22 IST

    రాజకీయంగా కాదు.. అభివృద్ధిలో మాతో రేవంత్‌ కలవాలి: ప్రధాని మోదీ

  • May 10, 2026 16:17 IST

    గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు: ప్రధాని మోదీ

    • రాజకీయంగా కాదు.. అభివృద్ధిలో మాతో రేవంత్‌ కలవాలి: ప్రధాని

    • ప్రపంచం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని

    • ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసుకున్నాం: ప్రధాని

    • పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా చేశాం: ప్రధాని

  • May 10, 2026 16:03 IST

    నేను చెప్పేది సీఎం రేవంత్‌రెడ్డి వినాలి: ప్రధాని మోదీ

    • ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం వెయ్యి కోట్లే ఇచ్చారు: ప్రధాని

    • మేం రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,500 కోట్లు కేటాయించాం: ప్రధాని

    • తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి: ప్రధాని

    • తెలంగాణకు 6 అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం: ప్రధాని

    • వేల కోట్లతో ఖాజీపేట జంక్షన్‌ అభివృద్ధి: ప్రధాని

  • May 10, 2026 15:57 IST

    దేశాభివృద్ధిలో నగరాలవి కీలక పాత్ర: ప్రధాని మోదీ

    • సైబరాబాద్‌ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది: మోదీ

    • దేశాభివృద్ధిలో సైబరాబాద్‌ పాత్ర కీలకం: మోదీ

    • అతిపెద్ద ఉపాధి కేంద్రం.. సైబరాబాద్‌: మోదీ

  • May 10, 2026 15:55 IST

    అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ

    • కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభం

    • గుడెబల్లూర్‌-మహబూబ్‌నగర్‌ 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన

    • కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ పనులకు శ్రీకారం

    • రూ.3,180 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన

    • రూ.2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన

    • రూ.610 కోట్లతో IOL టెర్మినల్‌కు శ్రీకారం

    • రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులు

    • రూ.1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం

    • రూ.300 కోట్లతో నిర్మించిన అండర్ రైల్ బైపాస్ లైన్ ప్రారంభం

  • May 10, 2026 15:47 IST

    ఇది వికాస ఉత్సవం: సీఎం రేవంత్‌

    • వికసిత్ భారత్‌కు అనుగుణంగానే తెలంగాణ రైజింగ్: సీఎం రేవంత్‌

  • May 10, 2026 15:46 IST

    హైదరాబాద్: 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించాం: సీఎం రేవంత్‌

    • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కావాలి: సీఎం

    • 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి ఇకపై రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిపెట్టాలి: సీఎం

    • మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు: సీఎం

    • తెలంగాణను నెంబర్‌వన్‌ చేయడమే మా లక్ష్యం: సీఎం

    • వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు తెలంగాణ కీలకం: సీఎం

    • తెలంగాణ అభివృద్ధి విషయంలో పెద్ద హృదయంతో వ్యవహరించాలి: సీఎం

    • తెలంగాణ కోసం ప్రధానిని రెండుగంటల సమయం కోరిన సీఎం రేవంత్‌

  • May 10, 2026 15:39 IST

    హైదరాబాద్: మోదీ నేతృత్వంలో వికసిత్‌ భారత్‌ అందుకోనున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్రమంత్రి

    • తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రమంత్రి

    • త్వరలోనే రీజనల్‌ రింగ్‌ రోడ్‌ పనులు: కేంద్రమంత్రి

  • May 10, 2026 15:30 IST

    హైదరాబాద్: ప్రధాని మోదీని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

    • రూ.9,500 కోట్లతో అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ

  • May 10, 2026 15:24 IST

    హెచ్ఐసీసీకి చేరుకున్న ప్రధాని న‌రేంద్ర మోదీ

    • స్వాగ‌తం ప‌లికిన రాష్ట్ర గ‌వ‌ర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • May 10, 2026 15:17 IST

    HICCకి చేరుకున్న ప్రధాని మోదీ

    • రూ.9,500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని

    • అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌

  • May 10, 2026 15:12 IST

    హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..

  • May 10, 2026 15:05 IST

    IPL 2026: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన సీఎస్కే

    • చెపాక్ వేదికగా సీఎస్కే-ఎల్ఎస్‌జీ మ్యాచ్

    • టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

    • తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న లఖ్‌నవూ జట్టు

  • May 10, 2026 14:52 IST

    బేగంపేట్: హైదరాబాద్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    • రోడ్డు మార్గంలో HICCకి ప్రధానమంత్రి

  • May 10, 2026 13:52 IST

    కాసేపట్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

    • ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

    • ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం

  • May 10, 2026 13:49 IST

    విజయనగరం: జామి మండలం జన్నీ గ్రామం వద్ద ప్రమాదం

    • ఆటోని ఢీ కొట్టిన లారీ.. ఇద్దరి మృతి, ముగ్గురుకి గాయాలు

    • మృతులు లావేటి పైడిరాజు (48), మట్టా సన్యాసిరావు (42)గా గుర్తింపు

  • May 10, 2026 12:25 IST

    బెంగళూరు: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు

    • అధికారం కోసం DMKకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ

    • 30 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్‌ను DMK బయటపడేసింది..

    • కాంగ్రెస్ కోసం DMK ఎన్నో త్యాగాలు చేసింది..

    • ఇప్పుడు అధికార వ్యామోహంతో DMKను వెన్నుపోటు పొడిచింది..

    • కాంగ్రెస్‌ అవకాశవాది.. పవర్‌ కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది: ప్రధాని మోదీ

  • May 10, 2026 12:24 IST

    అస్సాం శాసనసభా పక్షనేతగా హిమంత్‌ బిశ్వశర్మ

    • 12న అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న బిశ్వశర్మ

  • May 10, 2026 12:23 IST

    నేడు ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ

    • ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్

    • ప్రధాని మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం: చంద్రబాబు

    • ప్రధాని మోదీకి స్వగృహంలో ఆతిథ్యం ఇవ్వడం మా కుటుంబానికి ప్రత్యేకమైన సందర్భం..

    • ఈ రోజు మా కుటుంబానికి చిరస్మరణీయమైన రోజు: సీఎం చంద్రబాబు

  • May 10, 2026 12:08 IST

    తమిళనాడు సీఎం విజయ్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

    • తమిళనాడును అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నా..

    • సమన్యాయం, సంక్షేమంతో కూడిన పాలన అందిస్తారని ఆకాంక్షిస్తున్నా: సీఎం రేవంత్

  • May 10, 2026 12:06 IST

    తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • విజయ్ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా: ప్రధాని మోదీ

    • తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తుంది: ప్రధాని మోదీ

  • May 10, 2026 12:03 IST

    నెల్లూరు: వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఆగ్రహం

    • మహానాడు నిర్వహణ పార్టీకి సంబంధించిన విషయం: మంత్రి నారాయణ

    • మహానాడును ఏడాదికో జిల్లాలో నిర్వహిస్తాం..

    • మా అభ్యర్థనతో ఈసారి నెల్లూరులో నిర్వహిస్తున్నారు..

    • మహానాడుపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం: మంత్రి నారాయణ

  • May 10, 2026 12:00 IST

    తమిళనాడు సీఎం విజయ్‌కి త్రిష శుభాకాంక్షలు

    • నేను చాలా ఆనందంగా ఉన్నా: నటి త్రిష

    • నా మద్దతు ఎప్పటికీ విజయ్‌కే ఉంటుంది: త్రిష

  • May 10, 2026 11:21 IST

    వేదిక పైనుంచి సెల్ఫీ తీసుకున్న తమిళనాడు సీఎం విజయ్..

    • ప్రజలనుద్దేశించి ప్రసంగం అనంతరం తమిళనాడు సీఎం విజయ్.. వేదిక పైనుంచి సెల్ఫీ తీసుకున్నారు.

  • May 10, 2026 11:09 IST

    చెన్నై: నేను చాలా కష్టాలు అనుభవించా: సీఎం విజయ్

    • ఆకలి బాధలు అంటే ఏంటో నాకు తెలుసు: విజయ్

    • నేను మీ కుటుంబ సభ్యుడి వంటి వాడిని..

    • సినిమాల్లో నన్ను ఉన్నతస్థాయిలో నిలిపారు..

    • తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చా..

    • నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: విజయ్

  • May 10, 2026 10:58 IST

    తమిళనాడు: సీఎంగా విజయ్ సంచలన నిర్ణయాలు

    • 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం

    • మహిళా భద్రతపై రెండో సంతకం చేసిన విజయ్

    • షీటీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు

    • డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై మూడో సంతకం

  • May 10, 2026 10:52 IST

    తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.

  • May 10, 2026 10:32 IST

    తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్

    • ' నాన్ సి. జోసేఫ్ విజయ్..' అంటూ ప్రమాణస్వీకారం చేసిన విజయ్

  • May 10, 2026 09:53 IST

    సాంబారులో ఉప్పు తక్కువైందని పెళ్లిలో ఘర్షణ

    • మార్కాపురం: గిద్దలూరు మండలం బురుజుపల్లిలో జరిగిన వివాహ వేడుకలో ఘర్షణ

    • సాంబారులో ఉప్పు తక్కువైందని గొడవపడ్డ వధువు, వరుడి బంధువులు

    • ముగ్గురికి గాయాలు

  • May 10, 2026 09:49 IST

    మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు: Xలో నారా లోకేశ్‌

    • కనిపించే ప్రతి స్త్రీ.. కనిపెంచిన అమ్మతో సమానం..

    • నా తల్లి స్ఫూర్తితోనే విద్యా శాఖలో నైతిక విలువల పాఠాలు ప్రవేశపెట్టాం: Xలో మంత్రి నారా లోకేశ్‌

  • May 10, 2026 09:27 IST

    తమిళనాడు: విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

    • సీఎం విజయ్‌ – హోం, ప్రజాపాలన శాఖలు

    • ఆధవ అర్జున్‌ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ

    • సెంగొట్టాయన్‌ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్

    • వెంకట్రామన్‌ – పాఠశాల విద్యాశాఖ

    • ఎన్‌. ఆనంద్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌

    • నిర్మల్ కుమార్‌ – విద్యుత్ శాఖ

    • రాజమోహన్‌ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ

    • అరుణ్ రాజ్‌ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్

    • కీర్తన, టీకే ప్రభు‌లకు ఇంకా శాఖలు కేటాయించని విజయ్‌

  • May 10, 2026 09:23 IST

    కరీంనగర్: జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో పురోగతి

    • పశ్చిమబెంగాల్‌లో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు

    • బంగారాన్ని బెంగాల్‌లో అమ్మినట్టు పోలీసుల నిర్ధారణ

    • మిగతా నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు

  • May 10, 2026 08:52 IST

    చెన్నై: సీఎం కాన్వాయ్‌లో నెహ్రూ స్టేడియానికి బయలుదేరిన విజయ్‌

    • ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం

    • విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

  • May 10, 2026 08:12 IST

    జేసీబీ బకెట్‌ మీదపడి వ్యక్తి మృతి

    • ఏలూరు జిల్లా: పెదపాడు మండలం కొత్తూరులో విషాదం

    • జేసీబీకి గ్రీజ్‌ పెడుతుండగా.. బకెట్‌ ఊడి మీదపడి శ్రీకాంత్‌ అనే వ్యక్తి మృతి

  • May 10, 2026 08:00 IST

    తలసేమియాతో చిన్నారుల చాలా మంది చనిపోతున్నారు: నారా భువనేశ్వరి

    • హైదరాబాద్‌: తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గం: నారా భువనేశ్వరి

    • రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావు..

    • దేశంలో ఏటా 12 వేలమంది తలసేమియాతో జన్మిస్తున్నారు..

    • హైదరాబాద్‌లో జరిగిన తలసేమియా రన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నారా భువనేశ్వరి

  • May 10, 2026 07:46 IST

    విశాఖ: గాజువాకలో అగ్నిప్రమాదం

    • ఆటోనగర్‌ ఎఫ్‌బ్లాక్‌లోని రాధాకృష్ణ ట్రేడర్స్‌లో మంటలు

    • మంటలార్పుతున్న నాలుగు ఫైర్‌ ఇంజిన్లు

  • May 10, 2026 06:48 IST

    రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

    • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు

    • జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు

    • సీఎం వెంట మంత్రి నిమ్మల, సీఎస్‌ సాయిప్రసాద్‌ ఇతర అధికారులు

    • పోలవరం పురోగతి, పునరావాసం, రెండోదశ పనులపై చర్చించనున్న సీఎం

    • అనంతరం సీఐఐ వార్షిక సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

  • May 10, 2026 06:47 IST

    హైదరాబాద్‌లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650

    • కిలో వెండి ధర రూ. 2.8 లక్షలు

    పూర్తి కథనం..

  • May 10, 2026 06:27 IST

    నేడు యూపీ కేబినెట్‌ విస్తరణ

    • కొత్తగా ఆరుగురికి కేబినెట్‌లో చోటు

  • May 10, 2026 06:24 IST

    నేడు నిజామాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ పర్యటన

    • మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం కసరత్తు

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మహేష్‌గౌడ్‌

  • May 10, 2026 06:13 IST

    హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ నివాసాలకు ప్రధాని మోదీ

    • ప్రత్యేకంగా భేటీ కానున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ప్రధాని మోదీ పరామర్శ

  • May 10, 2026 06:01 IST

    ప్రధాని మోదీ కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

    • నేడు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం

    • గుడెబల్లూర్–మహబూబ్‌నగర్ 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన

    • కాజీపేట–విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులకు శ్రీకారం

    • HICC వేదికగా వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

  • May 10, 2026 06:00 IST

    నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

    • మధ్యాహ్నం 2:50కి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీ

    • మధ్యాహ్నం 3:25కు HICCకి చేరుకోనున్న ప్రధాని మోదీ

    • అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

    • సాయి సింధు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ

    • సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగసభ

    • మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు మోదీ

  • May 10, 2026 05:59 IST

    నేడు తమిళనాడులో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

    • ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం

    • చెన్నై నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం

    • విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం

    • ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం

    • బల నిరూపణకు మూడు రోజుల గడువు

  • May 10, 2026 05:59 IST

    నేడు హైదరాబాద్‌లో NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా రన్‌

    • జలవిహార్‌ నెక్లెస్ రోడ్డు నుంచి తలసేమియా రన్‌ ప్రారంభం

    • 3 విభాగాల్లో తలసేమియా రన్‌ నిర్వహిస్తున్న NTR ట్రస్ట్

    • తలసేమియా రన్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నారా భువనేశ్వరి

  • May 10, 2026 05:57 IST

    నేడు IPLలో చెన్నై Vs లక్నో మ్యాచ్‌

    • చెన్నైలో మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌

    • రాయపూర్‌లో రాత్రి 7:30 గంటలకు బెంగళూరు Vs ముంబై మ్యాచ్‌