గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 10 , 2026 | 06:40 AM
అంతర్జాతీయ అనిశ్చితులు తొలగిపోతాయన్న అంచనాల నడుమ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులు తొలగిపోతాయన్న అంచనాల నడుమ బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజుల్లో పసిడి ధరలు ఓ మోస్తరు స్థాయిలో తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 10) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,39,650కు చేరింది. నగరంలో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2.8 లక్షలుగా ఉంది. ఇక విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి (Gold, Silver Rates on May 10).
చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర అత్యధికంగా రూ.1,54,370గా ఉంది. ముంబైలో రూ.1,52,350 వద్ద, ఢిల్లీలో రూ.1,52,500 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,41,500గా, ముంబైలో రూ.1,39,650గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,800 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి గరిష్ఠంగా రూ.2.80 వద్ద ట్రేడవుతుండగా ఇతర నగరాల్లో సగటున రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా