-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International and Breaking Live Updates of 7th May 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 07 , 2026 | 07:17 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 07, 2026 21:43 IST
LSG vs RCB: ఆగినట్టే ఆగి మళ్లీ ప్రారంభమైన వర్షం
మైదానాన్ని కవర్లతో కప్పుతున్న సిబ్బంది
మ్యాచ్ ఆగే సమయానికి లఖ్‌నవూ స్కోర్ 145-1(14 ఓవర్లు)
-
May 07, 2026 21:28 IST
LSG vs RCB: సెంచరీ చేసిన లఖ్‌నవూ ఓపెనర్ మార్ష్
49 బంతుల్లో సెంచరీ చేసిన మార్ష్
వర్షం కారణంగా మరోసారి ఆగిన మ్యాచ్
14 ఓవర్లకు లఖ్‌నవూ స్కోర్ 145/1
-
May 07, 2026 20:46 IST
టీడీపీ మహానాడు నిర్వహణకు కమిటీల నియామకం
అమరావతి: నెల్లూరులో టీడీపీ మహానాడు నిర్వహణకు కమిటీలను నియమించిన పార్టీ హైకమాండ్
మొత్తం 21 కమిటీలను నియమించిన టీడీపీ అధిష్టానం
సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
-
May 07, 2026 20:19 IST
చెన్నై: DMK శాసనసభాపక్ష సమావేశంలో కీలక తీర్మానాలు
కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ డీఎంకే తీర్మానం..
పాత రాజకీయ స్వభావాన్ని కాంగ్రెస్ మార్చుకోలేదు: DMK
కూటమి నుంచి వైదొలగాలన్న కాంగ్రెస్ నిర్ణయం సరికాదు: DMK
-
May 07, 2026 20:18 IST
అమరావతిలో వైద్య రంగ అభివృద్ధికి మరో ముందడుగు
అమరావతిలో ఏర్పాటుకానున్న కిమ్స్ ఆసుపత్రి
KIMS సంస్థ, APCRDAతో లీజు ఒప్పందం
500 పడకల సామర్థ్యంతో కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
నిడమర్రులో 2 ఎకరాల భూమి కేటాయించిన APCRDA
-
May 07, 2026 20:13 IST
తండ్రైన టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సూర్య భార్య దేవిశా
అధికారికంగా ప్రకటించిన సూర్య దంపతులు
-
May 07, 2026 19:56 IST
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు
అమరావతి: 2028 నాటికి ప్లాంట్ పనిచేసేలా చేస్తాం..
అధికారులు కూడా స్పీడ్‌గా పనిచేయాలి..
కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
-
May 07, 2026 19:52 IST
అమరావతి: కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
90% సంతృప్తి లక్ష్యం కాదు… అది తప్పనిసరి బాధ్యత..
ప్రజల సంతృప్తే మీ అసలైన ప్రోగ్రెస్ రిపోర్ట్..
నివేదికలు కాదు ఫలితాలు ఇవ్వండి: సీఎం చంద్రబాబు
-
May 07, 2026 19:51 IST
ఢిల్లీ: ఏపీలో తగ్గిన పాఠశాల డ్రాపౌట్ల సంఖ్య: నీతి ఆయోగ్ రిపోర్టు
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల చేరికలు..
సత్ఫలితాలనిస్తున్న ఏపీ ప్రభుత్వ విద్యా విధానాలు: నీతి ఆయోగ్ రిపోర్టు
-
May 07, 2026 19:49 IST
మమతకు షాక్.. అసెంబ్లీ రద్దు
బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి
రాజ్యాంగంలోని సెక్షన్ 174 ప్రకారం రద్దు చేశానని ఆదేశాలు
-
May 07, 2026 19:03 IST
ఐపీఎల్ 2026: లఖ్‌నవూ, బెంగళూరు మధ్య మ్యాచ్
టాస్ నెగ్గిన బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
మొదట బ్యాటింగ్ చేయనున్న లఖ్‌నవూ
పాయింట్ల పట్టికల్లో చిట్ట చివరిస్థానంలో లఖ్‌నవూ
మూడో స్థానంలో బెంగళూరు
-
May 07, 2026 18:52 IST
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వర్షం
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో కురుస్తున్న వర్షం
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుందని రైతుల ఆందోళన
నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, దాస్తురాబాద్ మండలాల్లో వర్షం
కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యంపై కవర్లు కప్పుకొంటున్న రైతులు
-
May 07, 2026 18:48 IST
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు
కామారెడ్డి: పొందుర్తి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, ఐదుగురికి స్వల్ప గాయాలు
-
May 07, 2026 18:47 IST
10న పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: కిషన్‌రెడ్డి
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి..
పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
May 07, 2026 18:44 IST
కరీంనగర్ MLA క్యాంప్ ఆఫీస్‌పై దాడి ఘటనలో 13 మందిపై కేసు
కార్యాలయ ఇన్‌చార్జ్ రాజు ఫిర్యాదుతో కేసు నమోదు
వివిధ సెక్షన్లతో పాటూ పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు
-
May 07, 2026 18:19 IST
చెన్నై: కాసేపట్లో AIADMK MLAల సమావేశం
పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న MLAలు
-
May 07, 2026 18:18 IST
చెన్నై: AIADMK సీనియర్ నేత అన్బళగన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో అద్భుతం జరగబోతోంది: అన్బగళన్
AIADMKకు 118 మంది MLAల మద్దతు లభిస్తుంది: అన్బగళన్
అందరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: AIADMK నేత అన్బళగన్
-
May 07, 2026 18:00 IST
అంబేద్కర్ కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహనరావు పేటలో ఫుడ్ పాయిజన్
వివాహ వేడుకలో భోజనం చేసిన 44 మందికి అస్వస్థత
38 మందికి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు
బాధితులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శ
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు
-
May 07, 2026 17:24 IST
వివాదంలో పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్
విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్
గతంలో వేపింగ్ చేస్తూ కనిపించిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
-
May 07, 2026 17:21 IST
మెదక్: పిల్లికొట్టాల్‌లో విషాదం
పిల్లికొట్టాల్ శివారులో కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరి గల్లంతు
యాదగిరి(38) మృతదేహం గుర్తింపు
మరో మృతదేహం కోసం గాలింపు
-
May 07, 2026 17:18 IST
మహిళా స్వయం సహాయక బృందాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
వడ్డీ లేని రుణాలు రూ. 5 నుంచి 10 లక్షల వరకు పెంపు: మంత్రి సీతక్క
-
May 07, 2026 17:17 IST
తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2026 మెరిట్ లిస్ట్ విడుదల
6 నుంచి 10వ తరగతి అడ్మిషన్లకు అందుబాటులో ఫలితాలు
రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం అడ్మిషన్లు
-
May 07, 2026 17:16 IST
అమరావతిలో వైద్య కళాశాల, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఒప్పందం
ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ, సీఆర్డీఏ మధ్య లీజ్ ఒప్పందం
నిడమర్రులో 23 ఎకరాలను లీజు ప్రాతిపదికన సీఆర్డీఏ కేటాయింపు
-
May 07, 2026 16:39 IST
తమిళనాడు గవర్నర్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అసంతృప్తి
ప్రజల తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారు: మహేష్ గౌడ్
TVKను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరం
-
May 07, 2026 16:24 IST
హుజూరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి ఆఫీస్‌లోకి దూసుకొచ్చిన BJP శ్రేణులు
BJP, BRS శ్రేణుల పరస్పర దాడులు
లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
BRS శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు
-
May 07, 2026 16:18 IST
తమిళనాడు: గవర్నర్ ఆహ్వానించకపోవడంపై.. రాష్ట్రపతికి టీవీకే కార్యకర్త లేఖ
టీవీకే చీఫ్ విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడంపై రాష్ట్రపతికి లేఖ రాసిన ఆ పార్టీ కార్యకర్త
లేఖలో తమ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ మెయిల్ పంపిన కార్యకర్త
-
May 07, 2026 16:03 IST
తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహం
రేపు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తమిళనాడు కాంగ్రెస్
జిల్లా, మండల కేంద్రాలలో రేపు ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం
-
May 07, 2026 16:00 IST
తమిళనాడు: టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ కీలక వ్యాఖ్యలు
మాకు వామపక్షాలు, వీసీకే మద్దతిస్తాయని నమ్ముతున్నాం..
అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా ఇస్తాం..
ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో సంప్రదింపులు జరపబోం..
అలాంటి ఉద్దేశం మాకు లేదు: నిర్మల్ కుమార్
2 రోజుల్లో అన్ని అంశాలపై క్లారిటీ వస్తుంది: టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్
-
May 07, 2026 15:58 IST
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన నిర్ణయం
అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సైకియా
-
May 07, 2026 15:34 IST
బిహార్‌లో సామ్రాట్ చౌదరి కేబినెట్ విస్తరణ
32 మందికి కేబినెట్‌లో చోటు
మంత్రిగా నితీష్‌కుమార్ తనయుడు నిశాంత్ ప్రమాణం
-
May 07, 2026 15:25 IST
తమిళనాడు: వామపక్ష నేత వీరపాండియన్‌తో TVK నేత నిర్మల్ కుమర్ భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దుత ఇవ్వాలని కోరిన నిర్మల్ కుమార్
స్టాలిన్‌తో సమావేశం తర్వాత మారుతున్న వామపక్షాల నిర్ణయాలు
రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత నిర్ణయం
-
May 07, 2026 15:24 IST
తమిళనాడు రాజకీయాలపై నటుడు విశాల్ ట్వీట్
2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకలో పరిణామాలను గుర్తు చేసిన విశాల్
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత బలనిరూపణకు అవకాశం ఇచ్చారు..
ఇప్పుడు విజయ్‌కి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి: విశాల్
-
May 07, 2026 15:13 IST
కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ట్విస్ట్
దుండగులు వాడిన బైక్‌కు హైదరాబాద్ నంబర్ ప్లేట్..
హైదరాబాద్‌కు చెందిన మొబైల్ షాపు వ్యాపారి బైక్ నెంబర్ వాడినట్లు గుర్తింపు
వ్యాపారిని విచారించిన కరీంనగర్, హైదరాబాద్ పోలీసులు
-
May 07, 2026 15:04 IST
పొగాకు వేలం.. రైతుల ఆందోళన
మార్కాపురం: పొదిలిలో పొగాకు వేలం కేంద్రం వద్ద రైతుల ఆందోళన
గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వేలాన్ని బహిష్కరించిన రైతులు
-
May 07, 2026 15:03 IST
కౌశిక్‌పై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీష్‌రావు
తెలంగాణలో శాంతిభద్రతలు ఉన్నాయా?: హరీష్‌రావు
దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి వస్తారు: హరీష్‌రావు
-
May 07, 2026 15:00 IST
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై లోక్‌భవన్ ప్రకటన
ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన పూర్తి మెజారిటీ లేదు: లోక్‌భవన్
మెజారిటీ ఫిగర్‌తో రావాలని విజయ్‌ను కోరినట్టు లోక్‌భవన్ ప్రకటన
విజయ్‌తో భేటీ తర్వాత ప్రెస్‌నోట్ విడుదల చేసిన తమిళనాడు లోక్‌భవన్
-
May 07, 2026 14:43 IST
ఎన్టీఆర్: కోనాయపాలెంలో అదృశ్యమైన మహిళ నాగలక్ష్మి హత్య
గతనెల 24న నాగలక్ష్మి అదృశ్యమైనట్లు చందర్లపాడు పీఎస్‌లో కేసు నమోదు
నాగలక్ష్మిని బావ గోవిందయ్య, అతని భార్య కలిసి హత్య చేసినట్లు గుర్తింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 07, 2026 13:36 IST
పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా తొలగించడంపై స్పందించిన వర్మ
రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయి: వర్మ
అంతిమంగా పార్టీ బాగుండాలనేదే చూడాలి: వర్మ
అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: వర్మ
-
May 07, 2026 13:35 IST
కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని ఖండిస్తున్నా: ఎంపీ మల్లు రవి
కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: మల్లు రవి
రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు: మల్లు రవి
-
May 07, 2026 13:34 IST
కరీంనగర్: నన్ను హత్య చేయాలని కుట్ర చేశారు: కౌశిక్‌రెడ్డి
బండి సంజయ్, రేవంత్‌రెడ్డి మాట్లాడుకుని నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్‌రెడ్డి
నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు: కౌశిక్‌రెడ్డి
అసలు నేను చేసిన తప్పేంటి?: కౌశిక్‌రెడ్డి
కేటీఆర్‌ను ఎవరికి పుట్టావ్ అని బండి సంజయ్ అనొచ్చా?: కౌశిక్‌రెడ్డి
బండి సంజయ్ మాట్లాడిన దానికే నేను మాట్లాడా: కౌశిక్‌రెడ్డి
-
May 07, 2026 13:07 IST
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ని గవర్నర్ పిలవాలి: కమల్‌హాసన్
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం ప్రజలను అవమానించడమే
ఎన్నికైన ప్రతినిధులు ఇంకా ప్రమాణస్వీకారం చేయకపోవడం రాష్ట్రానికి అవమానకరం
-
May 07, 2026 13:03 IST
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
బల నిరూపణ అసెంబ్లీలోనే జరగాలి: స్టాలిన్
బల నిరూపణ లోక్‌భవన్‌లో కాదు: స్టాలిన్
-
May 07, 2026 12:41 IST
పంజాబ్: పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు
భూకుంభకోణం కేసులో సీఎం ఓఎస్‌డీ ప్రమేయంపై ఆరోపణలు
భారీగా డబ్బులు చేతులు మారినట్లు గుర్తించిన ఈడీ అధికారులు
పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
ఈడీ తనిఖీల సమయంలో ఓ బిల్డింగ్ నుంచి డబ్బుల కట్టలు బయటకు విసిరిన వైనం
సోషల్ మీడియాలో నగదు సంచుల వీడియో వైరల్
-
May 07, 2026 12:12 IST
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసిన సీఎం ఎన్.రంగస్వామి
రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేసిన రంగస్వామి
-
May 07, 2026 12:04 IST
కేటీఆర్‌కు ఫినాయిల్ పంపిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి
కేటీఆర్ ఫినాయిల్‌తో నోరు కడుక్కోవాలి: సాయి
-
May 07, 2026 12:04 IST
నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు
అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ల ఏర్పాటు
జూన్ 8 నుంచి పూర్తిస్థాయి విచారణ పునఃప్రారంభం
సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2న అత్యవసర పిటిషన్ల దాఖలుకు హైకోర్టు అవకాశం
మే 14, 21, 28, జూన్ 4న వెకేషన్ బెంచ్‌ల విచారణ
-
May 07, 2026 11:58 IST
పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో మార్పులు
నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు
ఎస్‌వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం
-
May 07, 2026 11:53 IST
కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి
కేంద్రమంత్రి బండి సంజయ్ మీద కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం
కౌశిక్‌రెడ్డి కారు, గంగుల ఆఫీస్‌లోని అద్దాల ధ్వంసం
-
May 07, 2026 11:44 IST
విద్యుత్ రంగంలో యూనిట్‌కు 30పైసలు తగ్గించాం: చంద్రబాబు
ఈ ఏడాది 30పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తాం: చంద్రబాబు
పంచాయతీల్లో 90శాతం ట్యాక్స్‌ను ఆన్‌లైన్‌లో కట్టారు: చంద్రబాబు
సంజీవని ప్రాజెక్ట్ ద్వారా వైద్యరంగంలో విప్లవం రాబోతోంది: చంద్రబాబు
-
May 07, 2026 11:43 IST
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్‌కి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్
-
May 07, 2026 11:06 IST
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
ప్రస్తుతం రూ.9.74లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి
గత ప్రభుత్వం రూ.10వేల కోట్ల కేంద్ర పథకాల నిధులను మళ్లించింది
నిధుల మళ్లింపుతో కేంద్రం నిధులు ఇవ్వడం ఆపేసింది
వైసీపీ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది
ఏపీని పునఃనిర్మిస్తామని నేను, పవన్ హామీ ఇచ్చాం
-
May 07, 2026 11:05 IST
తమిళనాడు: గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్
-
May 07, 2026 11:01 IST
కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శలు
సీపీ చేతగానితనంతో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది
5 రోజులైనా దొంగలను పట్టుకోరా?
అల్గునూరులో ఓ లాయర్‌ను యూపీ ముఠా బెదిరించింది
వెపన్స్‌తో లాయర్‌ను చంపే ప్రయత్నం చేశారు
లాయర్‌పై హత్యాయత్నం జరిగితే సీపీ ఏం చేస్తున్నారు?
కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను సస్పెండ్ చేయాలి
-
May 07, 2026 10:49 IST
సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన మంత్రి లోకేశ్
'ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?' అంటూ లోకేశ్ పోస్ట్
'రాయల్ ఎన్‌ఫీల్డ్' సంస్థ రాబోతుందంటూ బుల్లెట్ బైక్ డ్రైవ్ వీడియో పోస్ట్ చేసిన మంత్రి లోకేశ్
-
May 07, 2026 10:47 IST
కరీంనగర్: సీఎం రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
రేవంత్ ఏది మాట్లాడితే.. బండి సంజయ్ అదే మాట్లాడుతున్నారు: కౌశిక్‌రెడ్డి
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి రూ.కోట్లు ఎక్కడివి?
బండి సంజయ్‌కి దమ్ముంటే కేటీఆర్‌తో చర్చకు రావాలి: కౌశిక్‌రెడ్డి
కేటీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం: పాడి కౌశిక్‌రెడ్డి
-
May 07, 2026 10:45 IST
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత
సీఎం కాకుండా విజయ్‌ని అడ్డుకుంటున్నారని ప్రచారం
సోషల్ మీడియాలో విజయ్‌కి నెటిజన్ల మద్దతు
జల్లికట్టు ఉద్యమం తరహాలో మెరీనా బీచ్‌లో నిరసన తెలపాలంటూ పోస్టులు
సోషల్ మీడియాలో పోస్టులపై అప్రమత్తమైన పోలీసులు
మెరీనా బీచ్‌లో భారీగా పోలీసుల మోహరింపు
-
May 07, 2026 10:27 IST
జోహో కో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు: శ్రీధర్ వెంబు
పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం: శ్రీధర్ వెంబు
రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
ఈసారి ఓటర్లకు డబ్బు పంచకుండా కఠినంగా వ్యవహరించాలి: శ్రీధర్ వెంబు
విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి గెలుస్తారని భావిస్తున్నా: శ్రీధర్ వెంబు
-
May 07, 2026 10:24 IST
చెన్నై: మెజార్టీని చట్ట సభల్లోనే నిర్ణయించాలి: న్యాయవాది సంజయ్ హెగ్డే
లోక్‌భవన్‌లో మెజార్టీని నిరూపించాల్సిన అవసరం లేదు: సంజయ్ హెగ్డే
-
May 07, 2026 10:17 IST
చెన్నై: మరోసారి గవర్నర్‌ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్
ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్‌తో విజయ్ భేటీ కానున్నట్లు సమాచారం
-
May 07, 2026 10:11 IST
స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 90, నిఫ్టీ 15 పాయింట్లకుపైగా నష్టం
-
May 07, 2026 10:10 IST
కృష్ణా: మచిలీపట్నంలో సివిల్ సప్లయ్ అధికారుల మెరుపు దాడులు
అక్రమంగా వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
-
May 07, 2026 09:55 IST
'ఎక్స్' ఖాతా డీపీ మార్చిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ చిత్రాన్ని డీపీగా పెట్టిన ప్రధాని
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అసాధారణ విజయం సాధించింది: ప్రధాని
మన సైనికుల దేశభక్తికి ఆపరేషన్ సిందూర్ ఉదాహరణ: ప్రధాని
భద్రత విషయంలో రాజీపడబోమని భద్రతాదళాలు చాటిచెప్పాయి: ప్రధాని
ఉగ్రవాదాన్ని ఓడించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం: ప్రధాని
-
May 07, 2026 09:53 IST
విశాఖ: బీచ్ రోడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో అల్లూరి స్ఫూర్తి యాత్ర
అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి కార్లు, బైక్‌లతో ర్యాలీ
పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు
-
May 07, 2026 09:52 IST
హైదరాబాద్: ధాన్యం రవాణాపై రవాణాశాఖ కీలక ఆదేశాలు
వరి ధాన్యం తరలింపు కోసం వాహనాల సమీకరణకు ఆదేశాలు
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణాకు చర్యలు
సరిపడా గూడ్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం
-
May 07, 2026 09:03 IST
హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు
రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
సెక్షన్ 504, 505 కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
-
May 07, 2026 08:47 IST
బెంగాల్‌లో ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయని మమతా బెనర్జీ
నేటితో ముగియనున్న బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి
కాలపరిమితి ముగిస్తే రద్దుకానున్న TMC ప్రభుత్వం
మమత సీఎం పదవికి రాజీనామా చేయకపోయినా ప్రభుత్వం రద్దయినట్లు గుర్తించనున్న గవర్నర్
-
May 07, 2026 08:44 IST
నేడు బెంగాల్‌కు అమిత్ షా
బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు
బీజేఎల్పీ నేత ఎంపికకు పరిశీలకుడిగా ఉన్న అమిత్ షా
-
May 07, 2026 08:15 IST
కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ సన్నాహాలు
ఉదయం 10:30కు కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ
కేరళ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్
-
May 07, 2026 07:52 IST
ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్
పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్
-
May 07, 2026 07:51 IST
యుద్ధ విరమణకు 14 అంశాలతో అమెరికా కొత్త ప్రతిపాదన
అమెరికా ప్రతిపాదనలను నిశితంగా సమీక్షిస్తున్నట్టు ఇరాన్ ప్రకటన
తమ నిర్ణయాన్ని పాక్ ద్వారా తెలియజేస్తామన్న ఇరాన్
-
May 07, 2026 07:19 IST
ప్రజాప్రతినిధులతో ముగిసిన సీఎం చంద్రబాబు జిల్లాలవారీ రివ్యూలు
3 నెలల్లో 28 జిల్లాల రివ్యూలు చేపట్టిన సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లాతో ప్రారంభమై.. విశాఖతో ముగిసిన సమీక్షలు
సమీక్షల్లో వెయ్యికిపైగా సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
ప్రాధాన్యతలను బట్టి పనులు చేపట్టేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు
-
May 07, 2026 07:17 IST
నేడు స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఎమ్మెల్యేల భేటీ
హాజరుకానున్న కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు