Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 29 , 2026 | 07:15 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 29, 2026 10:12 IST

    నంద్యాల: బండి ఆత్మకూరు మండలం కడమకుంట్లలో దారుణం

    • మద్యం మత్తులో భార్యను చంపేందుకు కత్తితో వెంటపడిన భర్త

    • అడ్డుకున్న అత్త కళావతిని కత్తితో పొడిచిన అల్లుడు

    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళావతి మృతి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Mar 29, 2026 10:09 IST

    ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్!

    • తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

    • ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా షాపుల బంద్

    • ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు

    • మార్జిన్ పెంచే వరకూ షాపులు తెరిచేది లేదన్న అసోసియేషన్

  • Mar 29, 2026 09:35 IST

    కడప: ఘనంగా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

    • ఎల్లుండి సీతారాముల కళ్యాణం

    • పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

    • ఇవాళ వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కోదండరాముడు

  • Mar 29, 2026 09:30 IST

    తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది టీడీపీ: మంత్రి లోకేశ్

    • అమరావతి: ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది: లోకేశ్

    • టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో బడుగు, బలహీనవర్గాలకు గుర్తింపు

    • దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే: మంత్రి నారా లోకేశ్

  • Mar 29, 2026 09:29 IST

    టీడీపీ రాజకీయ సంచలనం సృష్టించింది: పవన్‌ కల్యాణ్

    • అమరావతి: తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో..

    • ఉమ్మడి ఏపీలో టీడీపీ రాజకీయ సంచలనం సృష్టించింది: పవన్‌

    • 4 దశాబ్దాల పైబడి ప్రజాక్షేత్రంలో టీడీపీ బలంగా నిలబడింది

    • టీడీపీ ప్రస్థానంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

  • Mar 29, 2026 09:00 IST

    నేడు ప్రధాని మోదీ 132వ మన్‌ కీ బాత్

    • దేశాభివృద్ధి సహా కీలక అంశాలపై మాట్లాడనున్న ప్రధాని మోదీ

  • Mar 29, 2026 08:59 IST

    శ్రేణులకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • అమరావతి: ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ: సీఎం చంద్రబాబు

    • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ.. తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం

    • టీడీపీ.. కార్యకర్తల పార్టీ: ఏపీ సీఎం చంద్రబాబు

  • Mar 29, 2026 08:40 IST

    నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

    • ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేయనున్న సీఎం చంద్రబాబు

    • పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు

  • Mar 29, 2026 08:40 IST

    నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలులు

    • 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం

    • 87 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం

    • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం

    • అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం

  • Mar 29, 2026 07:46 IST

    తెలంగాణలో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తి

    • ఈ సందర్భంగా మార్చి 30న తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక భోజన కార్యక్రమం

    • పీడీఎస్ సన్నబియ్యంతో అసెంబ్లీలో లంచ్ ఏర్పాటు

  • Mar 29, 2026 07:44 IST

    IPL: నేడు ముంబై, కోల్‌కతా మధ్య మ్యాచ్‌

    • ముంబైలో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌

  • Mar 29, 2026 07:18 IST

    నేటి నుంచి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ

    • పురుషుల విభాగంలో భారత్ నుంచి బరిలో ప్రజ్ఞానంద

    • మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్, వైశాలి పోటీ

  • Mar 29, 2026 07:17 IST

    రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ కన్నుమూత

    • ముంబైలో విజయ్‌పత్ సింఘానియా మృతి

    • ఎక్స్‌లో వెల్లడించిన కుమారుడు గౌతమ్ సింఘానియా

    • 2006లో పద్మభూషణ్ అందుకున్న విజయ్‌పత్ సింఘానియా

  • Mar 29, 2026 07:16 IST

    తమిళనాడులో TVK ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి

    • రేపు పెరంబూరు నుంచి TVK ఎన్నికల ప్రచారం

    • చెన్నైలో ఐదు చోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు

    • నేడు అభ్యర్థులను ప్రకటించనున్న TVK చీఫ్‌ విజయ్

  • Mar 29, 2026 07:15 IST

    కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

    • నేడు త్రిసూర్, పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ సభలు