Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 22 , 2026 | 05:52 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 22, 2026 07:38 IST

    నేడు కాళేశ్వరం కమిషన్‌పై తుది తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

    • ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించనున్న సీజేఐ బెంచ్

    • తీర్పు వ్యతిరేకంగా వస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్

    • ఇప్పటికే ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన హరీష్ రావు బృందం

  • Apr 22, 2026 07:37 IST

    పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

    • పల్నాడు జిల్లా: బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో నాటు బాంబుల కలకలం

    • పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • గతంలో హత్య చేసిన వ్యక్తి ఇంట్లో నాటు బాంబులు దొరకడంపై పలు అనుమానాలు

    • గ్రామంలో పలు చోట్ల బాంబు స్క్వాడ్ తనిఖీలు

  • Apr 22, 2026 07:34 IST

    హైదరాబాద్: కాసేపట్లో గన్‌పార్క్ దగ్గరకు ఆర్టీసీ జేఏసీ నేతలు

    • అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న జేఏసీ నేతలు

  • Apr 22, 2026 07:34 IST

    ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

    • ప్రముఖ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

    • అర్ధరాత్రి గుండెపోటుతో త్రిపురనేని చిట్టిబాబు మృతి

  • Apr 22, 2026 07:33 IST

    సింగపూర్‌లో కొనసాగుతోన్న ఏపీ మంత్రుల బృందం పర్యటన

    • సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో ఏపీ మంత్రుల భేటీ

    • సింగపూర్‌లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రులకు వివరించిన షణ్ముగం

    • నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణ

  • Apr 22, 2026 07:32 IST

    మా సమస్యలను అధికారులకు వివరించాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

    • IAS అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరింది..

    • మా డిమాండ్లు కొత్తవి కావు.. గతంలో ఇచ్చిన హామీలే..

    • తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నాం..

    • 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ సమ్మె: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

  • Apr 22, 2026 07:30 IST

    మేఘాలయ పర్యటనకు బయలుదేరిన మంత్రి సీతక్క

    • స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్యంలో భాగంగా రెండు రోజుల పర్యటన

    • అంగన్‌వాడీ సేవలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పరిశీలన

    • మిషన్ 1000 డేస్, ECD కార్యక్రమాలపై అధ్యయనం

    • మేఘాలయ హ్యాపీనెస్ సెంటర్లను సందర్శించనున్న మంత్రి సీతక్క

    • షిల్లాంగ్‌లో జరిగే ADB సమావేశాల్లో పాల్గొనున్న మంత్రి సీతక్క

  • Apr 22, 2026 07:00 IST

    హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రోకు ఫుల్ డిమాండ్

    • ప్రయాణికులతో కిటకిటలాడుతున్న మెట్రో స్టేషన్లు

    • మెట్రో రైల్ 3 కారిడార్ల పరిధిలో ప్రయాణికుల రద్దీ

  • Apr 22, 2026 06:58 IST

    కర్నూలు: హోలగుంద మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

    • నేలకూలిన అరటి, మామిడి చెట్లు, విద్యుత్ స్తంభాలు

    • నేల రాలిన మామిడి కాయలు.. తీవ్రంగా నష్టపోయిన రైతులు

  • Apr 22, 2026 06:56 IST

    తూ.గో.నల్లజర్ల మండలం వీరవల్లిలో రోడ్డు ప్రమాదం

    • టోల్‌గేట్‌ దగ్గర 500 మీటర్ల సూచిక బోర్డును ఢీకొట్టిన కారు

    • కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి

    • ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం

    • ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన

  • Apr 22, 2026 06:35 IST

    తిరుపతి: జిల్లాలో నేడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

    • రాచర్ల, తుకివాకం వద్ద సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న మంత్రి

    • శ్రీసిటిలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం

  • Apr 22, 2026 06:31 IST

    మహబూబ్ నగర్: కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

    • ఉమ్మడి జిల్లాలో డిపోలకే పరిమితమైన 850 బస్సులు

    • అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన 3,850 మంది కార్మికులు

  • Apr 22, 2026 06:30 IST

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సమ్మె

    • నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల వద్ద కార్మికుల ఆందోళన

    • డిపోల్లోనే నిలిచిపోయిన బస్సులు..

    • ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

  • Apr 22, 2026 06:29 IST

    ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

    • అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన RTC కార్మికులు

    • ఖమ్మం, సత్తుపల్లి మధిర డిపోల ఎదుట బైఠాయించి కార్మికుల ధర్నా

  • Apr 22, 2026 06:29 IST

    సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

    • RTC డిపోల ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు

    • సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల పరిధిలో సమ్మెలో కార్మికులు

    • మెదక్, నర్సాపూర్ బస్ డిపోల ఎదుట RTC కార్మికుల సమ్మె

    • రోడ్డెక్కని బస్సులు, ప్రయాణికుల ఇబ్బందులు

  • Apr 22, 2026 06:28 IST

    ఆదిలాబాద్ రీజియన్‌లో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

    • ఆదిలాబాద్, నిర్మల్, భైంసా తదితర డిపోల్లో నిలిచిన 641 బస్సులు

    • సమ్మెలో పాల్గొంటున్న 1,946 మంది కార్మికులు

    • డిపోల దగ్గర కార్మిక సంఘాల నిరసనలు

    • అద్దె బస్సులు నడిపించేందుకు అధికారుల కసరత్తు

  • Apr 22, 2026 05:55 IST

    కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం: TGS RTC ఎండీ

    • ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఎండీ వై.నాగిరెడ్డి పిలుపు

    • సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధం: నాగిరెడ్డి

  • Apr 22, 2026 05:54 IST

    తెలంగాణలో సమ్మెలోకి RTC కార్మికులు

    • కమిటీతో చర్చలు విఫలం కావడంతో సమ్మె

    • అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన RTC, JAC కార్మికులు

  • Apr 22, 2026 05:53 IST

    అమరావతి: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం

    • సమావేశానికి హాజరుకానున్న పలు శాఖల ఉన్నతాధికారులు

  • Apr 22, 2026 05:53 IST

    రేపు తమిళనాడు, బెంగాల్‌(తొలిదశ)లో ఎన్నికల పోలింగ్‌

    • రేపు తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌

    • రేపు బెంగాల్‌(తొలిదశ)లో 152 స్థానాలకు పోలింగ్‌

    • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

  • Apr 22, 2026 05:52 IST

    హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

    • కమిషన్‌ ఏర్పాటును సవాల్‌ చేసిన కేసీఆర్‌, హరీష్‌రావు

    • జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్‌