Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 01 , 2026 | 07:44 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 01, 2026 21:58 IST

    కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

    • మహిళల బాక్సింగ్‌లో ప్రియా ఘంఘాస్‌కు పసిడి పతకం

    • 60 కిలోల విభాగంలో ప్రియా ఘంఘాస్‌కు బంగారు పతకం

    • 51 కిలోల విభాగంలో సాక్షి చౌదరికి బంగారు పతకం

    • 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్‌కు స్వర్ణ పతకం

    • 57 కేజీల బాక్సింగ్‌ విభాగాల్లో జాస్మిన్‌కు గోల్డ్‌ మెడల్‌

    • ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 10 బంగారు పతకాలు

    • మహిళల బాక్సింగ్‌ విభాగంలో ఇవాళ 4 స్వర్ణ పతకాలు

  • Aug 01, 2026 21:58 IST

    ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

    • 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం, 175 గేట్ల ఎత్తివేత

    • సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల విడుదల

    • ధవళేశ్వరం దగ్గర అంతకంతకూ పెరుగుతున్న వరద ఉధృతి

  • Aug 01, 2026 21:28 IST

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం విజయవంతమైనందుకు మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు

    • గుడ్ జాబ్.. ఎక్సెలెంట్ టీం వర్క్: సీఎం చంద్రబాబు

    • మోదీకి థింసాతో స్వాగతం నుంచి సభ వరకు అన్నీ గ్రాండ్ సక్సెస్

    • కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములయ్యారు: చంద్రబాబు

    • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం వైభోగంగా జరిగింది: చంద్రబాబు

  • Aug 01, 2026 21:04 IST

    కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

    • మహిళల బాక్సింగ్‌ సాక్షి చౌదరికి పసిడి పతకం

    • 51 కిలోల విభాగంలో సాక్షి చౌదరికి బంగారు పతకం

    • ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 9 బంగారు పతకాలు

  • Aug 01, 2026 20:52 IST

    నంద్యాల: రూ.30 కోట్ల ఆర్థిక నేరం కేసులో కీలక పరిణామం

    • పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆర్‌ఎంపీ నాగేశ్వరరావు

    • కుమారుడు సాయికల్యాణ్ ఆత్మహత్యాయత్నంతో అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన RMP నాగేశ్వరరావు

    • షేర్ మార్కెట్ పేరిట రూ.30 కోట్లకుపైగా వసూలు చేసి జూన్ 20న కుటుంబంతో సహా పరారైన ఆర్‌ఎంపీ నాగేశ్వరరావు

  • Aug 01, 2026 20:43 IST

    సూర్యాపేట: చిలుకూరు దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా

    • ఇద్దరు యువకుల మృతి

  • Aug 01, 2026 20:05 IST

    ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా దుర్మరణం

    • పీఓకేలోని బ్రాడ్ పీక్ పర్వతారోహణ సమయంలో ప్రమాదం

    • మంచుచరియ విరిగిపడటంతో చిక్కుకుపోయి కన్నుమూత

  • Aug 01, 2026 20:03 IST

    ప్రధాని మోదీ 'ఎక్స్‌' పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు రిప్లై

    • ఏపీ పట్ల ప్రధాని మోదీకి ఆప్యాయత, ప్రత్యేక శ్రద్ధ: సీఎం చంద్రబాబు

    • ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

  • Aug 01, 2026 20:03 IST

    చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్‌

  • Aug 01, 2026 20:02 IST

    హైదరాబాద్: బస్టాండ్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

    • కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన నాగోల్‌ పోలీసులు

  • Aug 01, 2026 19:57 IST

    ధరణి అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • భూ అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ: మంత్రి పొంగులేటి

    • పేదల భూములు కాజేసినవారిని వదిలిపెట్టం: పొంగులేటి

    • 276 గ్రామాల్లో భూమి రీసర్వే పూర్తి: మంత్రి పొంగులేటి

    • ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక 'భూధార్' నంబర్: పొంగులేటి

  • Aug 01, 2026 19:49 IST

    ఏలూరు: నూజివీడు IIITలో ప్రవేశంపై మీడియాకు నిషేధాజ్ఞలు

    • క్యాంపస్‌లో సమస్యలపై ABN ఆంధ్రజ్యోతి వరుస కథనాలు

    • IIITలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో నేతల సిఫార్సులు

    • విద్యార్థుల భోజనంలో గుడ్డు, చికెన్ అందించకుండా బిల్లులు చేసుకోవడంపై ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు

    • వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్న IIIT ఉద్యోగులు

  • Aug 01, 2026 19:44 IST

    అమరావతి: రాజధానిలో ఆస్ట్రేలియా మంత్రి జూలియన్‌ హిల్‌ పర్యటన

    • రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం పరిశీలన

  • Aug 01, 2026 19:30 IST

    హైదరాబాద్ పరిధిలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూస్తాం: పొన్నం

    • కొన్ని పార్టీలు ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నాయి: మంత్రి పొన్నం

    • అర్హత ఉన్నవారు తమ ఓటు కోల్పోకూడదు: మంత్రి పొన్నం

  • Aug 01, 2026 19:14 IST

    రాష్ట్రాలకు పన్నుల వాటా కింద కేంద్రం అదనపు నిధులు విడుదల

    • మూలధన, అభివృద్ధి పనుల కోసం రూ.1,09,019 కోట్లు విడుదల

    • ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు విడుదల

    • అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బిహార్‌కు రూ.10,845 కోట్లు

  • Aug 01, 2026 19:08 IST

    కాంగ్రెస్‌ హయాంలోనే SRSP, కడెం, ఎల్లంపల్లి నిర్మించాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

    • BRS హయాంలో కట్టిన మేడిగడ్డ, కాళేశ్వరం కూలిపోతున్నాయి: మంత్రి ఉత్తమ్

    • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పటిష్టంగా ఉంది: మంత్రి ఉత్తమ్‌

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: ఉత్తమ్‌

    • NDSA నివేదిక మేరకే నీరు నిల్వ చేయడం లేదు: మంత్రి ఉత్తమ్‌

    • సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫౌండేషన్ సరిగాలేదు: ఉత్తమ్

  • Aug 01, 2026 18:49 IST

    గాంధీభవన్: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి నేతల భేటీ

    • పాల్గొన్న మంత్రులు పొన్నం, అజారుద్దీన్, ఎంపీ మల్లు రవి, SIRపై చర్చ

  • Aug 01, 2026 18:43 IST

    నీటివనరులను కాపాడటానికే చెరువుల పరిరక్షణ: 'ఎక్స్‌'లో సీఎం రేవంత్‌

    • చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్‌ను చూడటం ఎంతో సంతృప్తినిచ్చింది: సీఎం రేవంత్‌

    • హైదరాబాద్ CURE పరిధిని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ, భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అంకితం చేస్తోంది హైడ్రా: రేవంత్‌

  • Aug 01, 2026 18:36 IST

    జెన్ జీ నిరసనలు.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

    • అజిత్ డోభాల్‌‌కు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు

    • ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదురు కీలక వ్యాఖ్యలు

    • స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించే హక్కు కాదన్న వైనం

    • స్వాతంత్ర్య పోరాట విలువలను యువత ప్రతిబింబించాలని వ్యాఖ్య

  • Aug 01, 2026 17:58 IST

    భోగాపురం బాబు విజన్.. వైసీపీది జగన్నాటకం: సత్యకుమార్

    • చరిత్రను అబద్ధాలతో మార్చలేరు జగన్: మంత్రి సత్యకుమార్

    • ఐదేళ్లూ అడ్డుపడి.. ఇప్పుడు క్రెడిట్ కోసం జగన్‌ దుష్ప్రచారo: సత్యకుమార్

    • పనులు నిలిపివేసి.. ప్రారంభ ఘనత మీదేనని ఎలా అంటారు?

    • శంకుస్థాపనలతో కాలయాపన చేసిన వైసీపీకి భోగాపురం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: సత్యకుమార్‌

  • Aug 01, 2026 17:58 IST

    అన్నమయ్య: వాల్మీకిపురం మండలం చింతపర్తి దగ్గర మహిళ హత్య

    • మహిళకు మద్యం తాగించి బైక్‌పై తీసుకెళ్లిన నిందితుడు నాగరాజు

    • చింతపర్తి-నిమ్మనపల్లి మార్గంలో బండరాయితో కొట్టిచంపిన నాగరాజు

  • Aug 01, 2026 17:47 IST

    మెదక్: డాన్ బాస్కో స్కూల్ విద్యార్థులకు తప్పిన ప్రమాదం

    • పుష్పాలవాగు దగ్గర కుంగిన మట్టి రోడ్డు

    • డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

    • స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు

    • ప్రమాద సమయంలో బస్సులో 32 మంది చిన్నారులు

    • బ్రేకులు వేయకపోతే బస్సు వాగులో పడేదని చెబుతున్న స్థానికులు

  • Aug 01, 2026 17:39 IST

    అన్నమయ్య: నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాల ముఠా అరెస్టు

    • మదనపల్లిలో రూ.5 కోట్ల విలువైన భూమిని రూ.14 లక్షలకే విక్రయించేలా అగ్రిమెంట్‌

    • ఐదుగురు నిందితుల అరెస్ట్

  • Aug 01, 2026 17:31 IST

    చిత్తూరు: కాణిపాకంలో ఉద్రిక్తత

    • కాణిపాకంలో ప్రమాణానికి టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు

    • రెండురోజులుగా ఇరుపార్టీల నేతల పరస్పర ఆరోపణలు

    • కర్ణాటక వాసులపై చిత్తూరు MLA వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడతున్నారంటూ టీడీపీ ఆరోపణ

  • Aug 01, 2026 17:24 IST

    హైదరాబాద్‌: రౌడీ షీటర్లకు అత్తాపూర్ పోలీసుల కౌన్సెలింగ్

    • వినాయకచవితి, బోనాల నేపథ్యంలో శాంతిభద్రతలపై ఫోకస్

    • నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరిక

  • Aug 01, 2026 17:24 IST

    హైదరాబాద్: చంపాపేట్‌ ఐరా జూ.కాలేజ్‌ విద్యార్థుల ఘర్షణ

    • రెండు గ్రూప్‌లుగా విడిపోయి పరస్పరం భౌతిక దాడులు

    • పోలీసుల ఎదుటే కొట్టుకున్న విద్యార్థులు

  • Aug 01, 2026 17:23 IST

    సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం

    • సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం రేవంత్‌కు పొన్నం ధన్యవాదాలు

    • గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు పర్యావరణ అనుమతుల కొనసాగింపునకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

    • ప్రభుత్వ న్యాయపోరాట ఫలితమే ఈ తీర్పు: మంత్రి పొన్నం

  • Aug 01, 2026 17:22 IST

    హైదరాబాద్: చందానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న బిహార్‌ వాసి సన్నీకుమార్‌ అరెస్ట్

    • 14.77 కిలోల గంజాయి స్వాధీనం

  • Aug 01, 2026 17:22 IST

    నిర్మల్: కడెం మండలం ఉడుంపూర్‌లో పోడు రైతుల ఆందోళన

    • అటవీశాఖ ఆఫీస్‌లో అధికారులను నిర్బంధించిన పోడు రైతులు

    • హక్కు పత్రాలున్నా సాగును అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం

    • అటవీశాఖ వేధింపులు అరికట్టాలంచూ పోడు రైతుల నిరసన

  • Aug 01, 2026 17:21 IST

    భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

    • 55.90 అడుగుల వద్ద 15,84,657 క్యూసెక్కుల వరద

    • కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

  • Aug 01, 2026 17:02 IST

    మీ సేవలో కొత్త రికార్డు.. ఒక్కరోజులోనే 2.20 లక్షల లావాదేవీలు

    • తొలిసారిగా 2 లక్షలు దాటిన మీసేవ సేవల వినియోగం

    • దేశంలోనే నంబర్ వన్ ప్రభుత్వ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ మీసేవ: శ్రీధర్‌బాబు

    • అందుబాటులోకి మరిన్న పౌర సేవలు: మంత్రి శ్రీధర్‌బాబు

    • సాంకేతికతతో సేవల నాణ్యత, వేగం పెంచుతాం: మంత్రి శ్రీధర్‌బాబు

  • Aug 01, 2026 16:52 IST

    మంత్రి సంధ్యారాణికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభినందనలు

    • గిరిజన బాలికలు థింసా నృత్యం అద్భుత ప్రదర్శన సందర్భంగా ప్రధాని మోదీకి సంధ్యారాణిని పరిచయం చేసిన సీఎం చంద్రబాబు

    • 'కంగ్రాట్స్' అంటూ మంత్రి సంధ్యారాణిని అభినందించిన మోదీ

  • Aug 01, 2026 16:47 IST

    హైదరాబాద్: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసాలకు పాల్పడిన సయ్యద్‌ సల్మాన్‌ అరెస్ట్

    • 52 నకిలీ 2BHK కేటాయింపు పత్రాల స్వాధీనం

  • Aug 01, 2026 16:45 IST

    మంచిర్యాల: కోటపల్లి మండలం రాజారంలో ఉద్రిక్తత

    • పోడు భూముల్లో పట్టు పురుగుల సాగును అడ్డుకున్న అటవీశాఖ అధికారులపై గిరిజనుల ఆగ్రహం

    • పోలీసులు, ఆదివాసీల వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం

  • Aug 01, 2026 16:32 IST

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవంపై జగన్‌ పోస్ట్‌

    • భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయని 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పా: జగన్‌

    • అప్పటి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన జగన్‌

  • Aug 01, 2026 16:19 IST

    రాజమండ్రి: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

    • గోదావరి బండ్‌పై కోతకు గురవుతున్న రివర్‌బండ్‌పై ABN కథనం

    • ABN ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన జిల్లా అధికారులు

    • కోతకు గురవుతున్న గట్టు దగ్గర రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు

  • Aug 01, 2026 16:16 IST

    సంగారెడ్డి: వట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి

    • పోలీస్‌ స్టేషన్‌ అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన దరఖాస్తుపల్లి వాసులు

    • వట్‌పల్లిలో చెట్టుకు ఉరివేసుకుని బీరప్ప(22) అనుమానాస్పద మృతి

    • వట్‌పల్లిలో ఓ దాబాలో పనిచేస్తున్న దరఖాస్తుపల్లి యువకుడు వీరప్ప(22)

    • సమాచారం ఇవ్వకుండా చెట్టు పైనుంచి మృతదేహాన్ని దించారంటూ పోలీసులపై దరఖాస్తుపల్లి వాసుల ఆగ్రహం

    • వట్‌పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తం

  • Aug 01, 2026 16:09 IST

    గాంధీభవన్‌: కాసేపట్లో కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం

    • పాల్గొననున్న మహేశ్ గౌడ్, మంత్రి తుమ్మల, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

    • హాజరుకానున్న తెలంగాణ వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లు

    • డైరెక్టర్ల నియామకాలపై విధివిధానాలు రూపొందించనున్న నేతలు

  • Aug 01, 2026 16:07 IST

    కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో 2 స్వర్ణ పతకాలు

    • 54 కేజీల మహిళల బాక్సింగ్‌ విభాగంలో ప్రీతి పవార్‌కు గోల్డ్‌ మెడల్‌

    • 57 కేజీల మహిళల బాక్సింగ్‌ విభాగంలో జాస్మిన్‌కు పసిడి పతకం

    • ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 7 బంగారు పతకాలు

  • Aug 01, 2026 15:59 IST

    వ్యవసాయ మార్కెట్ల డిజిటలీకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు

    • 206 మార్కెట్ కమిటీలను పూర్తిగా ఆటోమేషన్ చేయాలని నిర్ణయం

    • ఇకపై పూర్తి డిజిటల్‌ విధానంలోనే మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు

    • మార్కెట్ యార్డుల్లో నంబర్‌ప్లేట్ స్కానింగ్ వ్యవస్థ: మంత్రి తుమ్మల

    • పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చర్యలు: తుమ్మల

  • Aug 01, 2026 15:56 IST

    ఖమ్మం: వైరా మండలం సోవరం దగ్గర యాసిడ్‌ డ్రమ్ముల లోడ్‌ లారీ బోల్తా

    • యాసిడ్‌ రోడ్డుపై పడడంతో చెలరేగిన మంటలు

    • మంటల్ని అదుపుచేసిన పోలీసులు

  • Aug 01, 2026 15:54 IST

    సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్ ముస్కాన్

    • జులైలో 664 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

    • 162 మంది తెలంగాణ, 502 మంది ఇతర రాష్ట్రాల చిన్నారులు

    • 7 ప్రత్యేక పోలీసు బృందాలతో విస్తృత తనిఖీలు

  • Aug 01, 2026 15:45 IST

    తెలంగాణ: జులై వాణిజ్య పన్నుల వసూళ్లలో ఆల్‌టైమ్ రికార్డ్

    • ఒక్క నెలలోనే రూ.7,865 కోట్ల కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లు

    • గతేడాది జులైతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదు

    • GST వసూళ్లు రూ.4,452 కోట్లు.. 22 శాతం వృద్ధి

    • తెలంగాణ నుంచి మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.5,819 కోట్లు

  • Aug 01, 2026 15:42 IST

    కొత్త శిఖరాలకు రైజింగ్‌ తెలంగాణ: 'ఎక్స్‌'లో సీఎం రేవంత్‌

    • 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం.. రూ.4,18,931: రేవంత్‌

    • గతేడాదితో పోలిస్తే రూ.38,900 పెరిగిన తలసరి ఆదాయం: రేవంత్

    • ఒకే ఏడాదిలో 10.23 శాతం వృద్ధి నమోదు: రేవంత్

    • పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధితోనే ఈ ఫలితాలు: రేవంత్

  • Aug 01, 2026 15:27 IST

    ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ దగ్గర ఒకటో ప్రమాద హెచ్చరిక

    • 12.60 అడుగులకు చేరిన నీటిమట్టం, 175 గేట్ల ఎత్తివేత

    • సముద్రంలోకి 10.94 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

    • ధవళేశ్వరం దగ్గర అంతకంతకూ పెరుగుతున్న వరద ఉధృతి

  • Aug 01, 2026 15:13 IST

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై 'ఎక్స్‌'లో సీఎం చంద్రబాబు పోస్ట్

    • 'The future? Yeah.. it's that way!" అంటూ పోస్ట్

    • #NewGatewayToAP హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ అభివృద్ధిపై సీఎం పోస్ట్

    • #GatewayToUttarandhra హ్యాష్‌ట్యాగ్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధిపైనా ట్వీట్

    • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చూపిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్

  • Aug 01, 2026 15:09 IST

    భోగాపురంలో థింసా నృత్యంపై ప్రధాని మోదీ ట్వీట్

    • 13 వేల మంది నృత్యం నన్ను కదిలించింది: మోదీ

    • ఈ అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక: మోదీ

    • సాంస్కృతిక వారసత్వాన్ని థింసా ప్రతిబింబించింది: మోదీ

    • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని థింసా నృత్యం చిరస్మరణీయంగా మార్చింది: మోదీ

  • Aug 01, 2026 15:04 IST

    డొనాల్డ్‌ ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట

    • ఇండో-పాక్‌ యుద్ధం నేనే ఆపాను: ట్రంప్‌

    • యుద్ధం ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించా సుంకాల భయంతోనే యుద్ధం ఆపారు: ట్రంప్‌

  • Aug 01, 2026 14:57 IST

    ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం

    • ఇథనాల్ బ్లెండింగ్‌ను సమర్థించుకున్న పెట్రోలియం శాఖ

    • ఈ విధానంతో లీటరుకు రూ.30 ఆదా అవుతోందని వెల్లడి

  • Aug 01, 2026 14:25 IST

    జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు

    • జులైలో GST కలెక్షన్లు రూ.2.11 లక్షల కోట్లు

  • Aug 01, 2026 14:21 IST

    సూర్యాపేట: చిలుకూరు మం. సీతారాంపురం వద్ద ఆటో-బైక్‌ ఢీ

    • ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

    • మృతుడు మఠంపల్లి మండల వాసిగా గుర్తింపు

  • Aug 01, 2026 14:03 IST

    50 దేశాలకు వీసాలపై అమెరికా ప్రకటన

    • 20వేల డాలర్లు చెల్లిస్తేనే వీసాలని స్పష్టం చేసిన అమెరికా

    • B-1(వ్యాపారం), B-2( పర్యాటకం) వీసాల జారీకి అమెరికా శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్‌

    • ఎల్లుండి నుంచి అమల్లోకి కొత్త వీసా నిబంధనలు

    • వీసా ఓవర్‌స్టే జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలు

  • Aug 01, 2026 13:46 IST

    హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

    • ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులు

    • మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

  • Aug 01, 2026 13:09 IST

    విజయనగరం: సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు: ప్రధాని మోదీ

    • 13 వేలమంది గిరిజన మహిళల నృత్యం అద్భుతం: ప్రధాని

    • అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించారు: ప్రధాని

    • ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం: ప్రధాని

  • Aug 01, 2026 13:00 IST

    విజయనగరం: ఇవాళ స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు: ప్రధాని మోదీ

    • దాదాపు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం: మోదీ

    • ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయి: మోదీ

    • కొత్త ప్రాజెక్టులు ఎయిర్‌, రోడ్‌ కనెక్టివిటీని పెంపొందిస్తాయి: మోదీ

  • Aug 01, 2026 12:57 IST

    విజయనగరం: అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

    • రూ.27 కోట్లతో పెంచలకోన-ఎర్రపాడు హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన

    • రూ.763 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజీ-4 ప్రారంభం

    • రూ.933 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్యాకేజీ-5 ప్రారంభం

    • రూ.160 కోట్లతో తాడిపత్రి 4 లేన్ బైపాస్ నిర్మాణానికి శ్రీకారం

  • Aug 01, 2026 12:56 IST

    విజయనగరం: అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

    • రూ.5,550 కోట్ల వ్యయంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు

    • కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ప్రారంభం

    • రూ.3,547 కోట్ల వ్యయంతో కర్నూలు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు

    • అనంతపురం, కర్నూలులో రూ.823 కోట్ల వ్యయంతో చేపట్టిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకం ప్రారంభం

  • Aug 01, 2026 12:56 IST

    విజయనగరం: రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

    • రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

    • విశాఖ తర్లువాడలో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

    • సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ తొలిదశకు శ్రీకారం

    • రూ.468 కోట్ల వ్యయంతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టు నిర్మాణం

  • Aug 01, 2026 12:48 IST

    విజయనగరం: కష్టాల్లో ఉన్న ఏపీకి ఆక్సిజన్‌ ఇచ్చిన వ్యక్తి.. మోదీ: సీఎం చంద్రబాబు

    • రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలిచారు: చంద్రబాబు

    • 2028 నాటికి అమరావతి తొలిదశ పనులు పూర్తి: చంద్రబాబు

    • పోలవరం, రైల్వే జోన్‌, విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి.. మోదీ: చంద్రబాబు

    • ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయి: చంద్రబాబు

  • Aug 01, 2026 12:46 IST

    విజయనగరం: దేశాన్ని మోదీ 12 ఏళ్లుగా సమర్థంగా నడిపిస్తున్నారు: సీఎం చంద్రబాబు

    • దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చే ఘనత మోదీదే: సీఎం చంద్రబాబు

    • సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్‌ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారు: చంద్రబాబు

    • దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు

    • ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉంది: సీఎం చంద్రబాబు

  • Aug 01, 2026 12:33 IST

    విజయనగరం: ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికాం: సీఎం చంద్రబాబు

    • గూగుల్‌, స్టీల్‌ కంపెనీలతోపాటు చాలా సంస్థలు వచ్చాయి: చంద్రబాబు

    • ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది: సీఎం చంద్రబాబు

    • రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాం: సీఎం చంద్రబాబు

  • Aug 01, 2026 12:30 IST

    విజయనగరం: ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి: సీఎం చంద్రబాబు

    • ఎయిర్‌పోర్ట్‌కు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు: చంద్రబాబు

    • రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం.. చేస్తున్నాం: చంద్రబాబు

    • ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారు: చంద్రబాబు

    • అవహేళన చేసినవారు అడ్రస్‌ లేకుండా పోయారు: సీఎం చంద్రబాబు

  • Aug 01, 2026 12:19 IST

    విజయనగరం: 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారు: పవన్‌

    • భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తున్న నేత మన ప్రధాని మోదీ: డిప్యూటీ సీఎం పవన్

    • దేశాన్ని మోదీ వికసిత్‌ భారత్‌ దిశగా నడిపిస్తున్నారు: పవన్‌

    • ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న నేత మన మోదీ: పవన్

    • మోదీని మించిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు: పవన్‌

  • Aug 01, 2026 12:08 IST

    విజయనగరం: నమో అంటే నాయుడు, మోదీ జోడీ: మంత్రి లోకేశ్

    • ఎర్రబస్సు రాదన్న చోటుకి ఎయిర్ బస్ వచ్చింది: మంత్రి లోకేశ్

    • విభజన వల్ల చాలా నష్టపోయాం: మంత్రి లోకేశ్

    • విశాఖ ఉక్కును కాపాడింది మన ప్రధాని మోదీ: మంత్రి లోకేశ్

  • Aug 01, 2026 12:00 IST

    విజయనగరం: ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయి: రామ్మోహన్‌

    • ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సింహద్వారం: రామ్మోహన్‌

    • ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం మారనుంది: రామ్మోహన్‌

  • Aug 01, 2026 11:51 IST

    విజయనగరం: ఉత్తరాంధ్రను సువర్ణాక్షరాలతో లిఖించేరోజు ఇది: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

    • ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక వరం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

    • ఏపీ అభివృద్ధిని మోదీ తన భుజలపైకి ఎత్తుకున్నారు: శ్రీనివాసవర్మ

    • నవ్యాంధ్ర ప్రయాణంలో ఇదో మైలురాయి: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

    • ఎన్డీయే హయాంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పెరిగింది: శ్రీనివాసవర్మ

  • Aug 01, 2026 11:43 IST

    భోగాపురం: ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు

    • ప్రధాని మోదీకి బొబ్బిలి వీణ కానుక

  • Aug 01, 2026 11:34 IST

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    • ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

    • ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌

    • రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

  • Aug 01, 2026 11:33 IST

    లక్కీ నంబర్‌ సెంటిమెంట్‌.. రూ.9.5 కోట్ల జాక్‌పాట్

    • అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన టోమస్‌ మునోజ్‌కు జాక్‌పాట్‌

    • స్క్రాచ్‌-ఆఫ్‌ టికెట్‌తో 1 మిలియన్‌ డాలర్ల బహుమతి

    • చిన్నప్పటి నుంచి ‘7’ తన అదృష్ట సంఖ్య అంటున్న మునోజ్‌

    • 1977లో 7వ తేదీన జన్మించినట్లు వెల్లడి

    • ట్రిపుల్‌ 777 జాక్‌పాట్‌ టికెట్‌ కొనుగోలు చేసిన మునోజ్‌

    • లాటరీ గేమ్‌లో రూ.9.5 కోట్ల విజేతగా రికార్డు

  • Aug 01, 2026 11:18 IST

    కామన్వెల్త్ గేమ్స్: ఓడిపోయినా దక్కిన పతకం

    • బాక్సింగ్ సెమీస్‌లో భారత బాక్సర్ లవ్లీనాపై తరోనా తఫాకీ ఓటమి

    • అయినప్పటికీ ఇద్దరికీ కాంస్యం.. దీంతో తరోనాకు దక్కిన పతకం

    • కామన్వెల్త్ గేమ్స్‌లో దక్షిణ పసిఫిక్‌కు తొలి పతకం అందించిన తరోనా

  • Aug 01, 2026 11:13 IST

    భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ

    • ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనం ప్రారంభం

    • టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించిన మోదీ

    • ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌

    • టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించిన మోదీ

  • Aug 01, 2026 11:11 IST

    మహారాష్ట్రలో వరదల బీభత్సం

    • జల్‌గావ్‌లో భారీ వర్షాలు.. అంజనీ నదికి పోటెత్తిన వర

    • చేపల వేటకు వెళ్లి నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి

    • ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుపై 7 గంటలు కూర్చున్న వ్యక్తి

    • బాధితుడిని కాపాడిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది

  • Aug 01, 2026 11:00 IST

    భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం

    • 56 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

    • ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10.01 లక్షల క్యూసెక్కులు

    • ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    • పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

    • పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటొద్దని హెచ్చరిక

    • ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న అధికారులు

  • Aug 01, 2026 10:57 IST

    అమరావతి: పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వైసీపీ నేత ముస్తఫా

    • గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆచూకీ తెలపాలంటూ సోషల్‌ మీడియాలో పోలీసుల ప్రచారం

  • Aug 01, 2026 10:48 IST

    భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

    • మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు

    • కాసేపట్లో ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • Aug 01, 2026 10:15 IST

    తగ్గిన బంగారం ధరలు

    • రూ.380 తగ్గి రూ.1,44,220కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.350 తగ్గి రూ.1,32,200కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,35,000..

  • Aug 01, 2026 10:14 IST

    కర్నూలు: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

    • పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు

    • ప్రస్తుతం నీటి మట్టం:1610.56 అడుగులు

    • ఇన్‌ఫ్లో 24,968 క్యూసెక్కులు

    • అవుట్‌ఫ్లో 3,003 క్యూ సెక్కులు

    • పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు

    • ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 38.688 టీఎంసీలు

  • Aug 01, 2026 10:13 IST

    విశాఖ నుంచి భోగాపురానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు

    • పోర్టు గెస్ట్ హౌస్ నుంచి నావల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకొని.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో భోగాపురం వెళ్లిన చంద్రబాబు

    • అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Aug 01, 2026 10:11 IST

    సంజయ్‌ దత్‌పై ప్రేమను చాటుకున్న సల్మాన్‌ ఖాన్‌

    • దశాబ్దాల స్నేహాన్ని గుర్తుచేస్తూ ఫొటోలు షేర్‌ చేసిన సల్మాన్‌

    • ‘నా పెద్ద అన్నయ్య సంజయ్‌ దత్‌’ అంటూ సల్మాన్‌ భావోద్వేగ పోస్ట్‌

  • Aug 01, 2026 10:05 IST

    కేరళలో భారీ వర్షాలు..

    • కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి

    • ఇడుక్కి జిల్లాలో ఇంటిపై విరిగిపడిన కొండచరియలు

  • Aug 01, 2026 09:58 IST

    నిర్మల్‌: కడెం మండలం నవాబ్‌పేటకు చెందిన రైతు గంగన్న కోసం గాలింపు

    • నిన్న అడవుల్లోకి వెళ్లి అదృశ్యం

    • డ్రోన్ల సాయంతో గంగన్న కోసం గాలింపు

  • Aug 01, 2026 09:57 IST

    అమెరికా వీసా బాండ్‌పై కీలక నిర్ణయం

    • అమెరికా వీసా బాండ్‌ పైలట్‌ ప్రోగ్రామ్‌ శాశ్వతం

    • 50 దేశాల పౌరులపై కొత్త నిబంధన ప్రభావం

    • జాబితాలో ఆఫ్రికా దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌

    • భవిష్యత్తులో మరిన్ని దేశాలను జాబితాలో చేర్చే అవకాశం

    • వీసా బాండ్‌ గరిష్ఠ మొత్తం 20 వేల డాలర్లకు పెంపు

    • వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా

  • Aug 01, 2026 09:41 IST

    ఏపీ అభివృద్ధిపై ఎన్డీయే ప్రభుత్వానికి ధృడ సంకల్పం: డిప్యూటీ సీఎం పవన్‌

    • ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి: పవన్

    • ఏపీలో సమగ్రాభివృద్ధితో పాటు నూతన శకం ప్రారంభం: పవన్‌

    • వికసిత్ భారత్‌ దిశగా ఏపీ చరిత్రాత్మక ప్రయాణం: పవన్‌

  • Aug 01, 2026 09:39 IST

    పశ్చిమ విదర్భ-మధ్యప్రదేశ్‌ దగ్గర వాయుగుండం

    • పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణం

    • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌కు భారీ వర్ష సూచన

  • Aug 01, 2026 09:24 IST

    నిజామాబాద్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు పర్యటన

    • కడెం, SRSP, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన

    • వరద పరిస్థితులు, నీటి నిల్వలపై మంత్రులు సమీక్ష

  • Aug 01, 2026 09:23 IST

    విజయనగరం: ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం

    • ప్రత్యేక అతిథులుగా రైతులకు ఆహ్వానం

    • ప్రధాని సభలో VVIP గ్యాలరీలో రైతులకు చోటు

    • 403 మంది రైతులకు ఆహ్వానం

    • ఇళ్లు ఇచ్చిన 1,600 మందికి ప్రత్యేక గుర్తింపు

  • Aug 01, 2026 09:23 IST

    ఢిల్లీ: రూ.200 తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

    • హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,985

  • Aug 01, 2026 09:22 IST

    ఇరాన్‌పై మళ్లీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు

    • ఇరాన్‌లో విద్యుత్ మౌలిక సదుపాయాలే టార్గెట్‌

  • Aug 01, 2026 09:22 IST

    జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు కార్మికులను కాల్చిచంపిన ఉగ్రవాదులు

    • కుల్గాం జిల్లాలోని కెల్లమ్‌ గ్రామంలో ఘటన, ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల గాలింపు

  • Aug 01, 2026 09:21 IST

    ఢిల్లీ: భద్రతా కారణాలతో కర్తార్‌పూర్ కారిడార్ మూసివేత: కేంద్రం

  • Aug 01, 2026 09:15 IST

    హైదరాబాద్: రిటైర్డ్‌ ఐపీఎస్ కుమార్తెకు అత్తింటి వేధింపులు

    • రెండేళ్ల క్రితం కార్తీక్‌తో బాధితురాలికి వివాహం

    • పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు వరకట్నం కోసం వేధింపులు

    • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

    • కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు

  • Aug 01, 2026 09:13 IST

    విజయనగరం: ఏపీ కళలు, సంస్కృతితో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణానికి అలంకరణ

    • ఎయిర్‌పోర్ట్ స్వాగత ద్వారం దగ్గర భారీ ఏటికొప్పాక కళాకృతి

    • ఎయిర్‌పోర్ట్ లోపల తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, బంగినపల్లి మామిడి చిత్రాల అలంకరణ

    • టెర్మినల్ భవనం ప్రారంభించిన తర్వాత ఏపీ సాంస్కృతిక వైభవాన్ని తిలకించనున్న ప్రధాని మోదీ

  • Aug 01, 2026 09:09 IST

    గుంటూరు: సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం

    • మహిళా ఎస్‌ఐ‌పై దాడి అమానుషం

    • పోలీసు శాఖకు సంఘీభావం ప్రకటిస్తున్నా: ఎమ్మెల్సీ ఏసురత్నం

  • Aug 01, 2026 09:08 IST

    ఏలూరు: పోలవరం దగ్గర వరద ఉధృతి

    • పోలవరం స్పిల్‌వే ఎగువన 33.5 మీటర్ల ప్రవాహం

    • కాఫర్‌ డ్యాం ఎగువన 33.6గా నీటిమట్టం

    • 46 గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

  • Aug 01, 2026 07:55 IST

    నేడు భోగాపురంలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్‌

    • ఉ.10:45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ రాక

    • ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ నజీర్‌, సీఎం చంద్రబాబు

    • ఉ.11 నుంచి 11:15 వరకు ఎయిర్‌పోర్ట్‌ పరిశీలన

    • ఉ.11:30 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం, బహిరంగసభ

  • Aug 01, 2026 07:54 IST

    నేడు ఏపీ, కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన

    • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న మోదీ

    • మైసూర్‌లో వివేకా స్మారకం ప్రారంభించనున్న మోదీ

    • యువత సాధికారతే మా లక్ష్యం: ప్రధాని మోదీ

  • Aug 01, 2026 07:54 IST

    విజయనగరంలో నేడు విద్యాసంస్థలకు సెలవు

    • ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సెలవు

  • Aug 01, 2026 07:53 IST

    విశాఖ: నేడు ఏయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా

    • ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వాయిదా

  • Aug 01, 2026 07:53 IST

    ములుగు: జిల్లాలో గోదావరి మహోగ్రరూపం

    • మంగపేట మండలం రామన్నగూడెం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

    • లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

    • కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

    • చాలా గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • Aug 01, 2026 07:52 IST

    రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

    • రహదారులపై పొంగి ప్రవహించిన వర్షపునీరు

    • కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్ శ్యామల సెంటర్లలో జలమయమైన రహదారులు

    • తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు

  • Aug 01, 2026 07:50 IST

    జెర్సీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ

    • నాలుగు పేజీల సమాధానం పంపిన డైరెక్టర్ జనరల్ కమాండర్

    • కార్యవర్గ సభ్యుల సమ్మతితోనే జెర్సీ రంగును మార్చామంటూ వివరణ

  • Aug 01, 2026 07:49 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.1,44,610కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,32,560కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,34,900

  • Aug 01, 2026 07:49 IST

    కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం

    • జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు నిరాశ

    • 85.83 మీటర్ల త్రో వేసి సిల్వర్ సాధించిన నీరజ్

    • భారత్‌కే చెందిన యశ్వీర్ సింగ్(85.41)కు కాంస్యం

    • శ్రీలంకకు చెందిన రమేశ్ పతిరగె(89.75)కు స్వర్ణం

  • Aug 01, 2026 07:47 IST

    మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 5 గేట్ల ఎత్తివేత

    • ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 48వేలు, ఔట్‌ఫ్లో 24వేల క్యూసెక్కులు

    • ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.175 TMCలు, ప్రస్తుతం 19.536 TMCలు

  • Aug 01, 2026 07:46 IST

    ఢిల్లీ: నేటినుంచి ఇండియా పోస్ట్‌ లాస్ట్‌ మైల్ సేవలు

    • బల్క్ బుకింగ్‌ ధరల్ని ప్రకటించిన కేంద్రం

    • కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చిన పోస్టాఫీస్‌

  • Aug 01, 2026 07:46 IST

    ఢిల్లీ: అమెరికా నుంచి 4,800 మంది భారతీయుల రిటర్న్‌

    • ఈ ఏడాది ఇప్పటివరకు 1,278 మంది బహిష్కరణ: కేంద్రం

  • Aug 01, 2026 07:45 IST

    భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్ర రూపం

    • 55.10 అడుగులకు గోదావరి వరద ఉధృతి

    • భద్రాచలం దగ్గర 15,40,412 క్యూసెక్కుల ప్రవాహం

    • భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

  • Aug 01, 2026 07:45 IST

    రాజమండ్రి: ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి

    • ఒకటో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం

    • ధవళేశ్వరంలో 10.60 అడుగుల ప్రవాహం

    • బ్యారేజ్‌ నుంచి 8.65 లక్షల క్యూసెక్కుల వరద విడుదల

  • Aug 01, 2026 07:45 IST

    నేడు భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • రూ.17,912 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ

    • రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

    • విశాఖ తర్లువాడలో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

    • సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ తొలిదశకు శ్రీకారం

    • రూ.468 కోట్ల వ్యయంతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టు నిర్మాణం

    • కర్నూలు జిల్లాలో 4 రెన్యువబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

    • రూ.5,550 కోట్ల వ్యయంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు

    • కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ప్రారంభం

  • Aug 01, 2026 07:44 IST

    విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి ఎయిరిండియా ప్లయింగ్‌ షెడ్యూల్‌

    • ఈ నెల 17 నుంచి 24 అక్టోబర్‌ వరకు ఎయిరిండియా ప్లైట్‌ షెడ్యూల్‌

    • హైదరాబాద్‌-భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా

    • బెంగళూరు-భోగాపురం మధ్య రోజూ రెండు సర్వీసులు నడపనున్న ఎయిరిండియా

    • ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు.. బెంగళూరు-భోగాపురం మధ్య మరో సర్వీస్‌

    • విజయవాడ-భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులు