-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 17th June 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 17 , 2026 | 05:59 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jun 17, 2026 21:02 IST
అమరావతి: రైతు సంక్షేమం, పంటల ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష
'అన్నదాత సుఖీభవ' పథకంపై ఉన్నతస్థాయి సమావేశం
ఆక్వా, మామిడి, పొగాకు పంటల ధరల పరిస్థితిపై సమీక్ష
వ్యవసాయం, మత్స్య, ఉద్యానవన రంగాల పరిస్థితిపై రివ్యూ
ఆక్వా రైతుల సమస్యలు, ఫీడ్ ధరల అంశాలపై చర్చ
మామిడి రైతులకు మార్కెటింగ్, ధరల స్థిరీకరణపై సమీక్ష
-
Jun 17, 2026 21:01 IST
గుంటూరు: వేములూరుపాడు దగ్గర రోడ్డుప్రమాదం
బైక్‌ను ఢీకొన్న లారీ, దంపతులు కోటేశ్వరరావు, పద్మావతి మృతి
మృతులు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం వాసులు
-
Jun 17, 2026 20:38 IST
టీ20 ప్రపంచ కప్: నెదర్లాండ్స్ టార్గెట్ 210
20 ఓవర్లకు భారత మహిళల స్కోర్ 209/5
స్మృతి మంధాన(74), షఫాలీ వర్మ(55) హాఫ్ సెంచరీలు
ఆఖరిలో రిచా ఘోష్(20*) మెరుపులు
-
Jun 17, 2026 20:36 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు బెంగళూరు కోర్టులో ఊరట
తెలంగాణలోని 'కోడి చెరువు' భూముల వ్యవహారంలో ఊరట
భూ ఆక్రమణ ఆరోపణల పోస్టులపై కోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తక్షణమే తొలగించాలంటూ ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు బెంగళూరు కోర్టు ఆదేశం
తదుపరి విచారణ జులై 24కి వాయిదా
-
Jun 17, 2026 20:18 IST
భారత్-అమెరికా మధ్య త్వరలో ట్రేడ్ డీల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం: ట్రంప్
బేరసారాల్లో ప్రధాని మోదీ నిక్కచ్చిగా ఉంటారు: ట్రంప్
ప్రతి విషయంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోంది: ట్రంప్
మోదీ సహకారం అభినందనీయం: ట్రంప్
మాకు మోదీ చిరకాల మిత్రుడు: ట్రంప్
త్వరలో భారత్‌లో పర్యటిస్తా: ట్రంప్
-
Jun 17, 2026 19:26 IST
పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు
రైతులకు పెట్టుబడి సాయం అందించనున్న కేంద్రం
ఈనెల 20న విడుదలకానున్న పీఎం కిసాన్ నిధులు
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ
-
Jun 17, 2026 19:16 IST
బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని
విద్యార్థినికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jun 17, 2026 19:12 IST
మహబూబ్‌నగర్: దేవరకద్రలో విషాదం
వర్షాలకు కారుపై గోడ కూలి ఇద్దరు మృతి
-
Jun 17, 2026 19:11 IST
రేపు తెలంగాణ కేబినెట్ అనధికారిక సమావేశం
ఉ.11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ
రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం
IRFC నుంచి మెట్రో లోన్ విడుదలలో జాప్యం, తదుపరి చర్యలపై చర్చ
ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Jun 17, 2026 19:10 IST
కడప: పొద్దుటూరులోని ఓ బంగారం దుకాణంలో రూ.23 లక్షల చోరీ
24 గంటల్లో చోరీ కేసును చేధించిన పోలీసులు
షాపులో గుమస్తా బాబా సాహెబ్, అతని ఫ్రెండ్ చంద్రకాంత్ దొంగలించినట్లు తేల్చిన పోలీసులు
ఇరువురిని అరెస్ట్ చేసి.. దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Jun 17, 2026 19:02 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ
మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్
-
Jun 17, 2026 19:01 IST
అమరావతి: కృష్ణలంక పీఎస్ పరిధిలో సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వం సీరియస్
కృష్ణలంక ఘటనపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఉన్నతస్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి సీఎం ఆదేశం
-
Jun 17, 2026 18:41 IST
మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్
లీడ్స్ వేదికగా భారత్-నెదర్లాండ్స్ మహిళల మ్యాచ్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
భారత తరఫున అరంగేట్రం చేయనున్న నందిని శర్మ
-
Jun 17, 2026 18:27 IST
అమరావతి: బీచ్‌లో బార్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల
బీచ్ షాక్ పేరిట బార్లు ఏర్పాటు చేయడానికి G.O 362 విడుదల
ఏపీలోని 12 తీరప్రాంత జిల్లాల్లో APTDC గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్
-
Jun 17, 2026 18:06 IST
రేపు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: ఇంటర్మీడియట్ బోర్డు
రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల: ఇంటర్మీడియట్ బోర్డు
జూన్ 15వ తేదీతో ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం: ఇంటర్మీడియట్ బోర్డు
-
Jun 17, 2026 18:04 IST
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్
శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్‌తో వైభవ్ వాగ్వాదం
వైభవ్ సూర్యవంశీపై చర్యలు తీసుకున్న బీసీసీఐ
అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించిన బీసీసీఐ
భారత్-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మకు 30 శాతం జరిమానా
-
Jun 17, 2026 17:56 IST
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీస్
అనుమతిలేని లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని లీగల్ నోటీస్
-
Jun 17, 2026 17:42 IST
అమరావతి: మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నాని: మంత్రి కొల్లు రవీంద్ర
పేర్ని నానికి వయస్సు పెరిగింది.. జ్ఞానం పేరగలేదు: కొల్లు రవీంద్ర
8 వేల బస్తాల పేదల బియ్యాన్ని పేర్ని నాని కొట్టేశాడు: కొల్లు రవీంద్ర
బెయిల్‌పై వచ్చి దోరలా మాట్లాడుతున్నాడు: కొల్లు రవీంద్ర
-
Jun 17, 2026 17:41 IST
అమరావతి: ఈనెల 21న యోగాంధ్ర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
పాల్గొన్న మంత్రి సత్యకుమార్, ఆయుష్ శాఖ అధికారులు
యోగా దినోత్సవ ఏర్పాట్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచన
-
Jun 17, 2026 17:36 IST
అబుదాబిలో భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్
షార్జా ఇస్లామిక్ బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్ విజేతగా నిలిచిన షజీర్ వెంగా
2 మిలియన్ల దిర్హమ్స్ బహుమతిగా గెలుచుకున్న షజీర్
రెండు నెలల క్రితం కొత్త బ్యాంక్ ఖాతా తెరిచిన షజీర్
-
Jun 17, 2026 17:35 IST
ముక్కోణపు సిరీస్: భారత్-ఎ ఘన విజయం
అఫ్గాన్-ఎపై 101 పరుగుల భారీ తేడాతో భారత్-ఎ విజయం
320 పరుగుల లక్ష్య ఛేదనలో 218 పరుగులకే అఫ్గాన్-ఎ ఆలౌట్
4 వికెట్లతో చెలరేగిన నిశాంత్ సింధు
-
Jun 17, 2026 17:34 IST
ఢిల్లీ: సైబర్ నేరగాళ్లు పరాన్న జీవుల్లాంటి వారని సుప్రీంకోర్టు వ్యాఖ్య
సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ
అమాయక ప్రజలను మోసగించి భారీ మొత్తాలు దోచుకుంటున్నారని ఆగ్రహం
ఇలాంటి నేరాలపై కఠిన చట్టాలు, కఠిన చర్యలు అవసరమని అభిప్రాయం
-
Jun 17, 2026 17:32 IST
జీ-7 సదస్సులో అభివృద్ధిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
‘ఎవరిది వృద్ధి.. ఎవరికి వృద్ధి?’ అంటూ ప్రశ్నించిన ప్రధాని
కేవలం జీడీపీ, వృద్ధిరేటు లెక్కలతోనే అభివృద్ధిని అంచనా వేయకూడదన్న మోదీ
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వృద్ధే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య
సమగ్ర, సమాన అవకాశాల వృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపు
జీ-7 వేదికగా అభివృద్ధి నమూనాలపై భారత దృక్పథాన్ని వివరించిన ప్రధాని
-
Jun 17, 2026 16:48 IST
కాకినాడ: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం
ప్రత్తిపాడు, పిఠాపురం, అన్నవరం, తొండంగి, రౌతులపూడిలో ఉరుములు మెరుపులతో వర్షం
పలుచోట్ల రోడ్లపై పడిపోయిన చెట్లు
ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం
-
Jun 17, 2026 16:02 IST
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్‌తో కానిస్టేబుల్ హల్‌చల్
డీఎల్‌ఎఫ్ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మెమోస్ డిలైట్ ఫుడ్ కోర్ట్ యజమానిని గన్‌తో బెదిరించిన కానిస్టేబుల్ వివేక్
ఘటనపై విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు
-
Jun 17, 2026 15:57 IST
హైదరాబాద్: SIRతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం: మంత్రి అజారుద్దీన్
పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ముస్లింల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది: అజారుద్దీన్
తెలంగాణలోనూ అలాంటి కుట్రచేసే అవకాశం: అజారుద్దీన్
ఓట్ల అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అజారుద్దీన్
-
Jun 17, 2026 15:55 IST
లఖ్‌నవూ: అఫ్గానిస్థాన్‌పై ఇషాన్ కిషన్ సెంచరీ
71 బంతుల్లో ఇషాన్ కిషన్ సెంచరీ
వన్డేల్లో రెండో సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్
-
Jun 17, 2026 15:51 IST
భారత్-అఫ్గాన్ రెండో వన్డే: శుభ్‌మన్ గిల్ సెంచరీ
బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్
77 బంతుల్లో 103 పరుగులు చేసిన గిల్
మరోవైపు సెంచరీ దిశగా ఇషాన్ కిషన్(91*)
32.2 ఓవర్లకు టీమిండియా స్కోర్ 253/2
-
Jun 17, 2026 15:45 IST
హైదరాబాద్: అంబర్‌పేట్ డీడీ కాలనీలో చైన్ స్నాచింగ్ యత్నం
60 ఏళ్ల మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నం
ఇంటి వద్ద కారు దిగిన సమయంలో ఘటన
బాధితురాలి కుమారుడు స్పందించడంతో పరారైన నిందితుడు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 17, 2026 15:40 IST
భారత్-అఫ్గాన్ రెండో వన్డే: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ
52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్(51*)
సెంచరీ దిశగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(88*)
28 ఓవర్లకు టీమిండియా స్కోర్ 193/2
-
Jun 17, 2026 15:37 IST
మళ్లీ గ్యాస్ ఎగుమతుల జోరు పెంచనున్న ఖతార్
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎగుమతులు తగ్గించిన ఖతార్
అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదరడంతో మారిన పరిస్థితులు
ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులు పెంచేందుకు ఖతార్ సన్నాహాలు
-
Jun 17, 2026 15:36 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
342 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
96 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 17, 2026 15:09 IST
ముంబై: శివసేన మాకు తల్లిలాంటిది: ఎంపీ సంజయ్ రౌత్
తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తే వదిలేదిలేదు: సంజయ్ రౌత్
యూబీటీ ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తోంది: సంజయ్ రౌత్
మా ఎంపీలకు బీజేపీ రూ.50 కోట్లు చొప్పున లంచం ఎర: సంజయ్‌రౌత్
ఇప్పటికే రూ.15 కోట్లు చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు: సంజయ్‌రౌత్
-
Jun 17, 2026 15:08 IST
టెలిగ్రామ్ బ్యాన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా?: రాహుల్
తాత్కాలిక బ్యాన్‌తో పేపర్ లీక్ మాఫియా ఆగదు: రాహుల్
వాట్సాప్‌ను కూడా బ్యాన్ చేస్తారా?: రాహుల్
విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదు: రాహుల్
అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి: రాహుల్
-
Jun 17, 2026 15:06 IST
హైదరాబాద్: డెంటల్ కాలేజీలో ర్యాగింగ్‌పై ఫిర్యాదు అందింది: ఖైరతాబాద్ డీసీపీ
డెంటల్ విద్యార్థుల హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగింది: డీసీపీ శిల్పవల్లి
BDS ఫస్టియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు: డీసీపీ శిల్పవల్లి
ఐదారు నెలలుగా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు: డీసీపీ శిల్పవల్లి
-
Jun 17, 2026 15:01 IST
వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!
మరోసారి వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ
షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టిన ఫరూదూన్
రీప్లేలో బంతి నేలకు తాకినట్లు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
దీంతో మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన అఫ్గాన్ ప్లేయర్లు
-
Jun 17, 2026 14:55 IST
ముంబై ఐనాక్స్ గ్రూప్స్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
డైరెక్టర్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ద్వారా సందేశాలు పంపి విడతల వారీగా నగదు కాజేసిన వైనం
63 విడతల్లో మొత్తం రూ.10.4 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంట్స్ ఉద్యోగి గిరీశ్ అమీన్
-
Jun 17, 2026 14:41 IST
హైదరాబాద్‌లో నేడు సాయంత్రం లేదా రాత్రికి వర్ష సూచన
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం
-
Jun 17, 2026 14:40 IST
ఏపీకి భారీ వర్ష సూచన..
మరో 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్
తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
-
Jun 17, 2026 14:38 IST
భారత్ Vs అఫ్గానిస్థాన్ రెండో వన్డే: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్
48 పరుగుల వద్ద ఔటైన రోహిత్
15 ఓవర్లకు భారత్ స్కోర్: 102/2
-
Jun 17, 2026 14:37 IST
ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం
36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో గెలుపు రుచి చూసిన ఆస్ట్రియా
జోర్డాన్‌పై 3-1 తేడాతో ఆస్ట్రియా ఘన విజయం
-
Jun 17, 2026 14:37 IST
చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి
త్వరలోనే ఎస్‌పీలో చీలిక ఉంటుందన్న ఓం ప్రకాష్ రాజ్‌భర్
సమాజ్‌వాదీ పార్టీ మొత్తం బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉందని వెల్లడి
-
Jun 17, 2026 14:30 IST
మహారాష్ట్ర: శివసేన ఉద్ధవ్ వర్గంలో చీలిక
స్పీకర్ ఓంబిర్లాకు ఆరుగురు రెబల్ ఎంపీల లేఖ
శివసేన షిండే వర్గంలో తమను విలీనం చేయాలని లేఖ
రెబల్స్ తీరుపై సంజయ్‌రౌత్ ఆగ్రహం
ఆరుగురు ఎంపీలు అమ్ముడుపోయారని రౌత్ విమర్శలు
-
Jun 17, 2026 14:16 IST
హైదరాబాద్: SIRపై GHMC కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో సమావేశం
SIR అమలు విధానం, షెడ్యూల్, క్షేత్రస్థాయి చర్యలపై చర్చ
ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలకు వివరాలు అందజేసిన అధికారులు
రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు
-
Jun 17, 2026 14:02 IST
IND vs AFG: ముగిసిన భారత్-ఏ బ్యాటింగ్
50 ఓవర్లకు భారత్ ఏ స్కోర్: 319/8
అఫ్గానిస్థాన్ టార్గెట్ 320
హాఫ్ సెంచరీలతో రాణించిన ప్రియాంశ్(58), తిలక్ వర్మ(59), కుమార్ కుషాగ్రా(58)
-
Jun 17, 2026 13:27 IST
కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన FSSAI
కత్తుల వాడకంపై హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ కంపెనీలకు సూచనలు
వంట తయారీ కోసం పాడైన కత్తులను వాడకూడదని తేల్చి చెప్పిన FSSAI
-
Jun 17, 2026 13:26 IST
అమెరికా తాజా చర్యతో క్వాడ్ అంతం మరో మెట్టు పైకెక్కిందన్న శశిథరూర్
అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ స్పందన
ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన థరూర్
ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక పరిణామాలపై చర్చకు దారితీసిన వ్యాఖ్యలు
ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై కొత్త చర్చ
-
Jun 17, 2026 13:25 IST
దిల్లీ-రాయ్‌పూర్ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొన్న పక్షి
రాయ్‌పూర్‌లో ల్యాండింగ్ సమయంలో ఘటన
పక్షి ఢీకొనగానే ఎస్‌వోపీ అమలు చేసిన పైలట్లు
అప్రమత్తంగా వ్యవహరించిన విమాన సిబ్బంది
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం
-
Jun 17, 2026 13:24 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: కన్నీరు పెట్టుకున్న మెస్సీ
అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి గోల్ కొట్టిన మెస్సీ
ఆనందంలో కన్నీరు పెట్టుకున్న అర్జెంటీనా స్టార్ మెస్సీ
ఈ మ్యాచ్ ముందు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా: మెస్సీ
మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా: మెస్సీ
-
Jun 17, 2026 13:21 IST
అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న ఇండో-అమెరికన్ వ్యోమగామి అనిల్ మేనన్
240 రోజుల పాటు కక్ష్యలో గడపనున్న అనిల్
ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్, మెకానికల్ ఇంజినీర్, అమెరికా స్పేస్ ఫోర్స్ కర్నల్‌గా సేవలు
మిషన్‌లో అనిల్‌తో పాటు పాల్గొననున్న ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా
జూన్ 22న మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వనున్న అనిల్ మేనన్
జులై 14న ప్రారంభమవనున్న అంతరిక్ష యాత్ర
-
Jun 17, 2026 12:04 IST
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
తూ.గో.జిల్లా: దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గర ప్రమాదం
డ్రైవర్ నిద్ర మత్తుతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు
-
Jun 17, 2026 12:02 IST
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు
ఇన్‌ఫ్లో 6,710 క్యూసెక్కులు
సుంకేశుల నుంచి 6,710 క్యూసెక్కుల వరద
-
Jun 17, 2026 12:02 IST
మంగళగిరిలో మంత్రి లోకేశ్ పర్యటన
కాజా ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన లోకేశ్, పెమ్మసాని
రూ.3.3 కోట్ల సెల్‌కాన్ సంస్థ CSR నిధులతో పార్క్ నిర్మాణం
-
Jun 17, 2026 12:00 IST
రక్షణ ఉత్పత్తుల్లో భారత్ రికార్డ్
రూ.1.78 లక్షల కోట్లకు చేరిక: రాజ్‌నాథ్‌సింగ్
2020-21 కంటే 110 శాతం మేర వృద్ధి: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
-
Jun 17, 2026 12:00 IST
అమెరికా వైట్‌హౌస్‌పై దాడి కుట్ర భగ్నం
అధ్యక్షుడు ట్రంప్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా UFC ఈవెంట్
UFC ఈవెంట్‌పై కొందరు వ్యక్తులు దాడికి యత్నం
కుట్రను భగ్నం చేసిన ఫెడరల్ ఏజెంట్లు
-
Jun 17, 2026 11:59 IST
బ్యాన్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టెలిగ్రామ్ యాప్
నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం
బ్యాన్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ అత్యవసర పిటిషన్
అత్యవసర విచారణకు అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు
-
Jun 17, 2026 11:56 IST
కాకినాడ: 12వ రోజుకు చేరిన.. తుని చిన్నారి ఆచూకీ కోసం గాలింపు
జంతువుల జాడ కోసం నైట్ విజన్ కెమెరాలు అమర్చినా కానరాని ఫలితం
అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన రెండు బొమ్మల ద్వారా కూడా చిక్కని క్లూ
రెండు బొమ్మల్లో మాంసం ఉంచి ఎర వేసినా జంతువులు రాని వైనం
అపహరణ కోణంలోనూ 6 బృందాలతో పోలీసుల గాలింపు
-
Jun 17, 2026 11:31 IST
టెక్సాస్ హైవేపై కుప్పకూలిన చిన్న విమానం
ప్రమాదం అనంతరం విమానం నుంచి భారీగా ఎగసిపడ్డ మంటలు
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర సిబ్బంది
విమానంలో ఎంత మంది ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది
ప్రమాదానికి గల కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు
-
Jun 17, 2026 11:26 IST
కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ
అఫ్గానిస్థాన్ -ఏ , భారత్-ఏ మ్యాచ్
38 పరుగులకే ఔటైన వైభవ్
ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్‌లో వైభవ్ ఔట్
12 ఓవర్లకు భారత్- ఏ స్కోర్: 97/1
-
Jun 17, 2026 10:32 IST
కరీంనగర్: స్కాం జరిగినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: మంత్రి అడ్లూరి
హరీష్‌రావుకు మేం కనబడటం లేదా?: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
బీసీల పట్ల అవహేళనగా మాట్లాడతారా?: మంత్రి అడ్లూరి
దళితులు మంత్రులు అయితే మీకెందుకు బాధ: మంత్రి అడ్లూరి
-
Jun 17, 2026 10:31 IST
కృష్ణా: దసరా నాటికి అందుబాటులోకి కొత్త టెర్మినల్: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం: శ్రీనివాసవర్మ
NDA పాలనలో ఏపీలో 8,500 కి.మీ. నేషనల్ హైవేల విస్తరణ: శ్రీనివాసవర్మ
విమాన సేవల విస్తరణకు కేంద్రం కృషి: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
-
Jun 17, 2026 09:26 IST
విజయవాడ: రెయిన్‌బో హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం
ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు
వార్డులోని చిన్నారులను మరో వార్డుకు తరలింపు
ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా దగ్ధం, మంటలార్పిన ఫైర్ సిబ్బంది
-
Jun 17, 2026 09:20 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: అర్జెంటీనా ఘన విజయం
3-0తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా
హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన లియోనల్ మెస్సీ
మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్
-
Jun 17, 2026 09:06 IST
కాసేపట్లో హైదరాబాద్ గచ్చిబౌలి AIG ఆస్పత్రికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు
AIG ఆస్పత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం రానున్న చంద్రబాబు
ప్రతి ఏడాది చేయించుకునే హెల్త్ చెకప్‌లో భాగంగా AIG ఆస్పత్రికి బాబు
దాదాపు గంటకు పైగా ఆస్పత్రిలో ఉండే అవకాశం
-
Jun 17, 2026 09:04 IST
ఫిఫా ప్రపంచ కప్‌ను ఘనంగా ఆరంభించిన ఫ్రాన్స్
సెనెగల్‌పై 3-1 తేడాతో ఫ్రాన్స్ విజయం
రెండు గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె
-
Jun 17, 2026 08:59 IST
సంగారెడ్డి: ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులపై RTA కొరడా
జిల్లాలో మొత్తం 17 బస్సులపై కేసు నమోదు
-
Jun 17, 2026 08:53 IST
‘సింగరేణి బాయిబాట’ను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు: కవిత
మూసివేస్తున్న భూగర్బగనులను కేంద్ర ప్రభుత్వం తెరవాలి: కవిత
సింగరేణిలో షాప్ట్ మైన్స్‌ను ఏర్పాటుచేయాలి: కవిత
సింగరేణి మెడికల్ కాలేజీలో కార్మికులకు 25 శాతం సీట్లు ఇవ్వాలి: కవిత
-
Jun 17, 2026 08:52 IST
ప్రకాశం : జె.పంగులూరు మండలం ముప్పవరం దగ్గర ప్రమాదం
RTC వోల్వో బస్సు ఢీకొని మహిళ మృతి
ముప్పవరం గ్రామానికి చెందిన మృతురాలు రమణమ్మ (60)గా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 17, 2026 08:50 IST
కర్నూలు: ఈ నెల 25న తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం
కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటూ పాల్గొననున్న తెలంగాణ, కర్నాటక సీఎంలు
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న టీబీ బోర్డు అధికారులు
-
Jun 17, 2026 08:39 IST
అనంతపురం: బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
తెల్లవారుజామున రాడ్లతో ధ్వంసం చేసి మిషన్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
ఏటీఎం మిషన్‌ను శింగనమల మండలం ఆకులోడు గ్రామం వద్ద పడేసిన దొంగలు
మిషన్‌పై పెట్రోల్ పోసి బాక్స్‌ను తగలబెట్టినట్లు గుర్తించిన పోలీసులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 17, 2026 08:26 IST
పెద్దపల్లి జిల్లా: సింగరేణి బాయిబాటలో పాల్గొన్న కవిత
గోదావరిఖని 11ఇంక్లైయిన్‌లో పర్యటించిన కవిత
గేట్ మీటింగ్‌లో కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కవిత
-
Jun 17, 2026 08:25 IST
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం
కళాశాల హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల ర్యాగింగ్
ర్యాగింగ్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులకు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ ఫిర్యాదు
ఫైనలియర్ స్టూడెంట్స్ 12 మందిపై కేసు నమోదు
ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని 6 నెలల పాటు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
-
Jun 17, 2026 08:08 IST
ఈ నెల 23 నుంచి తెలంగాణలో రైతు భరోసా
9 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
ఖమ్మం రైతు సభలో నిధులను విడుదల చేయనున్న సీఎం రేవంత్
-
Jun 17, 2026 08:07 IST
నేడు రాజస్థాన్ కోటాలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్న రాహుల్ గాంధీ
-
Jun 17, 2026 08:07 IST
హైదరాబాద్: నేటి నుంచి గాంధీభవన్‌లో 'ప్రజలతో మంత్రి' కార్యక్రమం
నేడు పాల్గొననున్న మంత్రి అజారుద్దీన్
ప్రజా సమస్యలపై నేరుగా వినతులను స్వీకరించనున్న మంత్రి అజారుద్దీన్
-
Jun 17, 2026 07:37 IST
నేటి నుంచి కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్
APL సీజన్-5లో భాగంగా కడపలో మ్యాచ్‌లు
5 రోజుల్లో 9 మ్యాచ్‌లు నిర్వహణ, అభిమానులకు ఉచిత ప్రవేశం
-
Jun 17, 2026 07:37 IST
ఖమ్మం: నేడు పాలేరులో కేటీఆర్ నేతృత్వంలో BRS నేతల భేటీ
SIR ప్రక్రియపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం
-
Jun 17, 2026 07:23 IST
కడప: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
కడప -కర్నూలు జాతీయ రహదారిపై దువ్వూరు మండలం బయనపల్లి సమీపంలో చోటు చేసుకున్న ఘటన
అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
-
Jun 17, 2026 07:18 IST
నేడు కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
శృంగేరి పీఠం శిష్య బృందం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రూ.198 కోట్లతో కాళేశ్వరం క్షేత్ర అభివృద్ధి పనులు
2027 గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి
-
Jun 17, 2026 07:13 IST
అమెరికా: కాలిఫోర్నియా బీచ్‌లో విషాదం
అలల తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ యువతులు
మృతులు హర్షిత నాయర్, మహియాల్ శ్రాన్
-
Jun 17, 2026 07:11 IST
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
లీడ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్
లీడ్స్‌లో రాత్రి 7 గంటలకు భారత్ Vs నెదర్లాండ్స్
బర్మింగ్‌హామ్‌లో రాత్రి 11 గంటలకు పాకిస్థాన్ Vs సౌతాఫ్రికా
-
Jun 17, 2026 06:50 IST
రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో చిన్నారులకు అస్వస్థత
పానీపూరీ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది చిన్నారులకు అనారోగ్యం
బాధిత చిన్నారులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స
-
Jun 17, 2026 06:49 IST
తెలంగాణ అంతటా ఇంకా విస్తరించని నైరుతి రుతుపవనాలు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ
పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల కదలిక మందగించడంతో ఎండల తీవ్రత
మరో నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
-
Jun 17, 2026 06:49 IST
దక్షిణ కోస్తాంధ్ర వరకూ విస్తరించిన ద్రోణి
నేడు ఏపీలోని పలు జిల్లాలకు పిడుగల హెచ్చరిక
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు
మిగతా జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
-
Jun 17, 2026 06:48 IST
రేపు మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన
సెలంగోర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణలో విజయాలపై అధ్యయనం
సింగపూర్ నుంచి మలేషియా వెళ్లనున్న మంత్రి నారాయణ
-
Jun 17, 2026 06:47 IST
నేడు భారత్ Vs ఆఫ్గానిస్థాన్ రెండో వన్డే
లక్నోలో మధ్యాహ్నం 1:30కు మ్యాచ్
-
Jun 17, 2026 06:03 IST
తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం
ఈనెల 19న హైదరాబాద్ మల్కం చెరువు సమీపంలో కార్యాలయం ప్రారంభం
తెలంగాణలో పార్టీ విస్తరణకు నూతన కార్యాలయంతో శ్రీకారం
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై జనసేన ఫోకస్
-
Jun 17, 2026 06:00 IST
రంగారెడ్డి: నేడు ఆరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న రేవంత్
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 17, 2026 05:59 IST
నేడు హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌కు పరామర్శ
అభిమాన హీరో, నాయకుడు పవన్‌ను కలవాలని కోరిన నిరంజన్