-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International Breaking Live Updates of 16th May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 16 , 2026 | 05:57 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 16, 2026 21:05 IST
బండి భగీరథ్‌ను అరెస్టు చేశాం: సైబరాబాద్ సీపీ రమేష్
అప్పా జంక్షన్ దగ్గర భగీరథ్ అరెస్టు: సీపీ రమేష్
పేట్‌బషీరాబాద్ పోలీసులకు భగీరథ్‌ను అప్పగించాం: సీపీ
-
May 16, 2026 20:28 IST
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
పోక్సో కేసులో బండి భగీరథ్ లొంగుబాటు
పేట్ బషీరాబాద్ పీఎస్‌లో లొంగిపోయిన బండి భగీరథ్
న్యాయవాదుల సమక్షంలో బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు
-
May 16, 2026 20:01 IST
కేంద్రం సంచలన నిర్ణయం
వెండి దిగుమతులపై బ్యాన్
-
May 16, 2026 19:37 IST
మహారాష్ట్రలో 8 మంది మావోయిస్టులు అరెస్టు
తెలంగాణ, గడ్చిరోలికి చెందిన 8 మంది అరెస్టు
-
May 16, 2026 19:37 IST
జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం
పహల్గామ్-అనంతనాగ్ మధ్య లోయలో పడ్డ బస్సు
ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
May 16, 2026 19:02 IST
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
అమెరికన్ నుంచి 3.5 కిలోల బంగారం సీజ్
-
May 16, 2026 19:01 IST
నీట్ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్
పుణె లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారే అరెస్ట్
NTA బోటనీ, జువాలజీ పేపర్ల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన లెక్చరర్ మనీష
పుణెలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న లెక్చరర్ మనీష
నీట్ పేపర్ లీక్ కేసులో 9కి చేరిన అరెస్టులు
-
May 16, 2026 18:17 IST
బండి భగీరథ్ కేసులో మేడ్చల్ కోర్టుకు బాధితురాలు
మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితురాలు
ఇప్పటికే రెండుసార్లు వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు
బాధితురాలితో పాటు తల్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్
-
May 16, 2026 18:16 IST
యాదాద్రి: పంతంగి టోల్‌ప్లాజా దగ్గర సోదాలు
431 కిలోల గంజాయి సీజ్ చేసిన నార్కొటిక్ పోలీసులు
రాజమండ్రి నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా పట్టివేత
ఇద్దరు అరెస్టు, పరారీలో మరో ఇద్దరు
-
May 16, 2026 18:16 IST
మహబూబ్‌నగర్: నిమ్మబాయిగడ్డలో దారుణం
యువతి వైష్ణవిపై దాడిచేసి చంపిన యువకుడు
యువకుడిని చితకబాదిన స్థానికులు, పరిస్థితి విషమం
-
May 16, 2026 18:10 IST
పరాన్న జీవి వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ
నిన్న ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: సీజేఐ
నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశా: సీజేఐ
మీడియాలోని ఓ వర్గం నా వ్యాఖ్యలను వక్రీకరించింది: సీజేఐ
నా వ్యాఖ్యలను వక్రీకరించిన తీరుపై ఎంతో బాధపడ్డా: సీజేఐ
-
May 16, 2026 18:09 IST
ఢిల్లీ: రాహుల్‌గాంధీని కలిసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించాలని రాహుల్‌ని కోరా: రామ్మోహన్‌రెడ్డి
మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నాయి: రామ్మోహన్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు: రామ్మోహన్‌రెడ్డి
మూడు తరాల నుంచి మేం కాంగ్రెస్‌లో ఉన్నాం: రామ్మోహన్‌రెడ్డి
మంత్రి పదవిపై రాహుల్‌గాంధీ పరిశీలిస్తామన్నారు: రామ్మోహన్‌రెడ్డి
-
May 16, 2026 17:21 IST
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్
తెలంగాణలో త్వరలో భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
కనీసం రూ.15లక్షలు పెరిగే అవకాశం: మంత్రి
IRR, ORR పరిధి ప్రామాణికంగా ధరలు పెంపు: మంత్రి
అరవింద్ సుబ్రహ్మణ్యం నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం రెండుసార్లు భూముల ధరలు పెంచింది: మంత్రి
2022 నుంచి భూములు ధరలు పెంచలేదు: పొంగులేటి
-
May 16, 2026 17:00 IST
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు
సీఎం విజయ్ దగ్గరే హోం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు
సెంగొట్టయన్‌కు ఆర్థిక శాఖ కేటాయింపు
కీర్తనకు పరిశ్రమల శాఖ
-
May 16, 2026 16:40 IST
మే 17వ తేదీన తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల
ఉ.11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కేకే
-
May 16, 2026 16:03 IST
మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో దారుణం
ఇద్దరు మహిళల దారుణ హత్య
మహిళలను వికారాబాద్ నుంచి తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
తాండూరులో అదృశ్యమైన మహిళల హత్య
ఫైనాన్స్ డబ్బు విషయంలో మహిళలను హత్య చేసినట్లు సమాచారం
-
May 16, 2026 16:00 IST
ఈ నెల 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్‌రెడ్డి
వేద పాఠశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్
-
May 16, 2026 16:00 IST
కరీంనగర్: బండి భగీరథ్ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
బండి సంజయ్ బావమరిది డా.వంశీకృష్ణ నివాసంలో తనిఖీలు
టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో భగీరథ్ కోసం ఆరా
-
May 16, 2026 16:00 IST
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
ఈనెల 26న కేరళను తాకనున్న రుతుపవనాలు
-
May 16, 2026 15:59 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి నాలుగో ఫేజ్‌లో అగ్నిప్రమాదం
లోధా బెల్లెజ్జా గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ప్లాట్‌లో మంటలు
2B టవర్‌లోని ఫ్లాట్ నెంబర్ 29, 30 డూప్లెక్స్ ఇంట్లో అగ్నిప్రమాదం
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం
-
May 16, 2026 15:08 IST
యాదాద్రి: బైకును ఢీకొన్న టిప్పర్ లారీ
బైక్ పైనుంచి పడి మహిళ స్పాట్ డెడ్
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాసుకుంట వద్ద ఘటన
మృతురాలు మోటకొండూరు మండలం ఆరెగూడెంకు చెందిన మహిళగా గుర్తింపు
-
May 16, 2026 14:34 IST
లక్ష్యాలను అధిగమించి NRIలు పనిచేస్తున్నారు: ప్రధాని మోదీ
కాలం మారినా.. భారతీయ సంస్కృతి మారలేదు: మోదీ
డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్: మోదీ
నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు: మోదీ
భారత్‌లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవి: మోదీ
-
May 16, 2026 14:32 IST
హైదరాబాద్: KPHBలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం
-
May 16, 2026 14:31 IST
కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలంటున్నారు: కేటీఆర్
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు: కేటీఆర్
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్పొరేషన్లలో BRS గెలుస్తుంది: కేటీఆర్
ప్రజల్లో ఎవరుంటారో.. వారికే టికెట్: కేటీఆర్
-
May 16, 2026 14:25 IST
ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత లేఖ
బండి సంజయ్‌ని కేబినెట్ నుంచి తప్పించాలని విజ్ఞప్తి
బండి భగీరథ్ కేసు విచారణ నిష్పాక్షికంగా జరగడానికి సంజయ్‌ను కేబినెట్ నుంచి తప్పించాలని కోరిన కవిత
-
May 16, 2026 14:12 IST
నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ పర్యటన
నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని మాటామంతీ
-
May 16, 2026 13:16 IST
కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసంలో సోదాలు
భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసుల తనిఖీలు
పేట్ బషీరాబాద్ పీఎస్‌లో భగీరథ్ లొంగిపోయే అవకాశం
ఇప్పటికే బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ
నాలుగు బృందాలుగా భగీరథ కోసం ముమ్మర గాలింపు
-
May 16, 2026 13:15 IST
హైదరాబాద్: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ
నాలుగు బృందాలుగా భగీరథ్ కోసం ముమ్మర గాలింపు
కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో గాలిస్తున్న పోలీసులు
-
May 16, 2026 12:52 IST
తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తున్నాం: చంద్రబాబు
భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం మొత్తాన్ని పెంచుతాం: సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ అరాచకం చూశాం..
ప్రజల ఆస్తుల్ని మార్చేసి గందరగోళం సృష్టించారు..
ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
-
May 16, 2026 12:50 IST
ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం చెప్పాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యగా మారింది: సీఎం చంద్రబాబు
మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు ఇస్తాం..
నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే రూ.40 వేలు ఇస్తాం..
పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద: సీఎం చంద్రబాబు
-
May 16, 2026 12:48 IST
ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల
ఐసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
ఐసెట్ ఫలితాల్లో 91.41 శాతం ఉత్తీర్ణత: మంత్రి లోకేష్
-
May 16, 2026 12:46 IST
తెలంగాణలో SIR ప్రక్రియ ప్రారంభమైంది: CEO సుదర్శన్ రెడ్డి
ప్రతి ఇంటినీ BLOలు కనీసం మూడు సార్లు సందర్శిస్తారు: CEO
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యుమరేషన్‌కు అవకాశం..
హెల్ప్‌లైన్ 1950తో పాటూ బుక్ ఏ కాల్ విత్ BLO సదుపాయం: CEO సుదర్శన్ రెడ్డి
-
May 16, 2026 12:19 IST
పాకిస్థాన్‌కు.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక
చరిత్రలో ఉంటారో లేదో.. పాక్ డిసైడ్ చేసుకోవాలి: ఉపేంద్ర ద్వివేది
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై ప్రయోగిస్తే ఊరుకునేది లేదు..
ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి: ద్వివేది
-
May 16, 2026 12:18 IST
యూపీ: లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్
డార్లింగ్ నీ కోసం పేపర్ లీక్ చేస్తానంటూ మెసేజ్‌లు
సోషల్ మీడియాలో ప్రొఫెసర్ ఆడియో, వీడియోలు వైరల్
ప్రొఫెసర్ పరంజీత్ సింగ్‌పై కేసు నమోదు, అరెస్ట్
-
May 16, 2026 11:25 IST
నల్లగొండ: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు
బాలుడిని రక్షించేందుకు వెళ్లి గుంతలో ఇరుక్కున్న తాత
ఇద్దరినీ కాపాడిన పోలీసులు, వృద్ధుడికి తీవ్ర ఆస్వస్థత
ఆస్పత్రికి తరలిస్తుండగా వృద్ధుడు వెంకన్న మృతి
మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఘటన
-
May 16, 2026 11:23 IST
ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన TMC అధినేత్రి మమతా బెనర్జీ
పార్టీలో ఉండాలనుకున్న వారు ఉండొచ్చు.. లేకుంటే వెళ్లిపోవచ్చు
ఉన్నవారు పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి: మమతా బెనర్జీ
-
May 16, 2026 11:22 IST
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ హతం
సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించిన ట్రంప్
ఐసిస్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో రెండోస్థానంలో అబూ బిలాల్
అమెరికా, నైజీరియా దళాల సంయుక్త ఆపరేషన్‌లో హతం
ఆఫ్రికా ప్రజలను అతడు ఇక భయపెట్టలేడంటూ ట్రంప్ పోస్ట్
-
May 16, 2026 11:21 IST
ఎన్టీఆర్: RRRపై అనుచిత పోస్టుల కేసులో ఇద్దరి అరెస్ట్
నిందితులను అరెస్ట్ చేసిన ఏలూరు జిల్లా కాళ్ల పీఎస్ పోలీసులు
ఉండి నియోజకవర్గంలో ఇటీవల తొలగించిన నిర్మాణాల అంశంపై రెచ్చగొట్టేలా పోస్టులు
పోస్టులు పెట్టిన తిరువూరుకు చెందిన యువకులు నవీన్, ప్రవీణ్
నిందితులు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ ఫాలోవర్స్
-
May 16, 2026 11:19 IST
ఈడీని ప్రభుత్వం నడుపుతోంది: వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా
ప్రభుత్వ ఆదేశాలతోనే ఈడీ ముందుకు సాగుతోంది: రాబర్ట్ వాద్రా
నేను ఇక్కడే ఉంటా.. దాచడానికి ఏమీ లేదు..
అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా..
కేసును ఎదుర్కొనే సామర్థ్యం నాకుంది: రాబర్ట్ వాద్రా
-
May 16, 2026 10:47 IST
నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె
మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 5వరకూ బంద్
పెరిగిన ఇంధన ధరలపై కార్మికుల నిరసన
-
May 16, 2026 10:44 IST
రైల్లో ప్రయాణించి పొదుపు పాటించిన ఎమ్మెల్యే
తూ.గో.: అనపర్తి నుంచి రాజమండ్రికి రైల్లో ప్రయాణించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రెండు రోజులుగా కాన్వాయ్ వినియోగించకుండా బైక్‌పైనే ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే
-
May 16, 2026 10:42 IST
ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
హైకోర్టు CJ కుమారుడి రిసెప్షన్‌కు హాజరుకానున్న రేవంత్
-
May 16, 2026 10:42 IST
బావిలో మృతదేహం లభ్యం
నెల్లూరు: కొండాపురం మండలం సత్యవోలులో షాకింగ్ ఘటన
బావిలో మృతదేహం లభ్యం, మృతుడు జడ రసూల్(35)గా గుర్తింపు
రసూల్‌ను కొట్టి చంపి, బావిలో పడేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ.. కేసు నమోదు
-
May 16, 2026 10:40 IST
దేశవ్యాప్తంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్
15 రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఆక్టోపస్ 3.0 ఆపరేషన్
సైబర్ ఛీటర్స్‌కు సిమ్ కార్డులు అందజేస్తున్న ముఠాలపై ఫోకస్
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న 10 మంది ఏజెంట్స్ అరెస్ట్
-
May 16, 2026 10:34 IST
వరంగల్: రాయపర్తి మండలం మర్రితండాలో ఘర్షణ
రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య మధ్య భూతగాదాలు
రెండువర్గాలుగా విడిపోయి కత్తులతో పరస్పరం దాడి
పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 16, 2026 10:32 IST
రౌస్ అవెన్యూ కోర్టులో హాజరైన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా
షీకోపూర్ భూ ఒప్పంద PMLA కేసులో కోర్టుకు హాజరు
కేసులో రాబర్ట్ వాద్రా సహా 8 మందిపై ఈడీ చార్జ్‌షీట్..
చార్జ్‌షీట్‌ను నిన్న సుమోటోగా స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
-
May 16, 2026 10:31 IST
హైదరాబాద్: ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ చేరకముందే విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండింగ్
తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చిన భద్రతా సిబ్బంది
మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానం
-
May 16, 2026 10:11 IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సమర్థనీయం కాదు: రేవంత్‌రెడ్డి
ధరల పెంపుతో ప్రజలపై భారం పడుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
-
May 16, 2026 10:08 IST
ట్రంప్ మరో కీలక నిర్ణయం
ఇరాన్‌పై మరోసారి భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా
ఎపిక్ ఫ్యూరీ 2.O పేరుతో ఇరాన్‌పై దాడులకు ప్లాన్
ట్రంప్ చైనా పర్యటన తర్వాత మారిన పరిస్థితులు
పరిస్థితులు తీవ్రతరం అవుతాయంటూ నివేదికలు
-
May 16, 2026 10:06 IST
కడప టూటౌన్ పీఎస్ సీఐ ప్రసాద్‌రావుపై బదిలీ వేటు
ఈనెల 9న అల్మాస్‌పేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
సకాలంలో స్పందించలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం
సీఐని బదిలీ చేసిన కర్నూలు రేంజ్ DIG ప్రవీణ్
-
May 16, 2026 10:05 IST
బండి భగీరథ్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
వచ్చే గురువారం తీర్పు వెల్లడిస్తామన్న హైకోర్టు
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన భగీరథ్
-
May 16, 2026 09:14 IST
హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్యకేసులో పురోగతి
కీలక నిందితుడు సునీల్ పర్యార్‌ను ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు
హత్య తర్వాత కాజీపేటలో రైలు దిగిన నేపాలీ గ్యాంగ్
వాటాలు పంచుకుని వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్టు గుర్తింపు
-
May 16, 2026 09:13 IST
బండి భగీరథ్ కేసులో కొనసాగుతోన్న పోలీసుల దర్యాప్తు
మధ్యంతర బెయిల్ రాకపోవడంతో అరెస్ట్ చేసే అవకాశం
బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కోర్టు ఎదుట రికార్డు చేయాలని నిర్ణయం
భగీరథ్ పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు
-
May 16, 2026 08:34 IST
కాకినాడ: కొవ్వూరు కొత్త హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు దాటుతున్న ఉపాధి కూలీలను ఢీకొట్టిన లారీ
నలుగురి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
మృతులంతా స్థానిక చీడిగ ప్రాంతానికి చెందినవారిగా గుర్తింపు
-
May 16, 2026 08:32 IST
నేడు కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్
పార్లమెంట్‌వారీగా సమీక్ష చేయనున్న మహేష్‌గౌడ్
SIR, BLA ట్రైనింగ్, పార్టీ నియామకాలపై చర్చ
-
May 16, 2026 07:16 IST
నెదర్లాండ్స్‌కు ప్రధాని మోదీ
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన
కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాను కలవనున్న మోదీ
నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
నెదర్లాండ్స్ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
May 16, 2026 07:12 IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా CPI ఆధ్వర్యంలో ధర్నాలు
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్
-
May 16, 2026 06:24 IST
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై నిరసన
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పొదుపు చర్యలు
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప్రణాళికలు
-
May 16, 2026 06:23 IST
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 11 గంటలకు నరసన్నపేటలో బహిరంగ సభ
అనంతరం సత్యవరం కూడలి దగ్గర చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలన
సిబ్బందికి పనిముట్లను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
-
May 16, 2026 06:22 IST
నేడు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
-
May 16, 2026 06:22 IST
రేపు దేశవ్యాప్తంగా JEE అడ్వాన్స్‌డ్
పరీక్ష రాయనున్న 1.90 లక్షల మంది అభ్యర్థులు
తెలుగు రాష్ట్రాల నుంచి 45 వేల మంది అభ్యర్థులు
జూన్ 1న ఫలితాల వెల్లడి
-
May 16, 2026 06:21 IST
IPL: నేడు కోలకతా Vs గుజరాత్
కోల్‌కతాలో రాత్రి 7:30కు మ్యాచ్
-
May 16, 2026 06:01 IST
చెరువులో పడి వ్యక్తి మృతి
నెల్లూరు: పొదలకూరులోని చిట్టేపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి
మృతుడు పొదలకూరుకి చెందిన యామయ్య(65) గా గుర్తింపు
-
May 16, 2026 06:01 IST
నెల్లూరు: రాపూరు మండలం సిద్ధవరం జాతీయ రహదారిపై ప్రమాదం
ఆటో, బొలోరో క్యాంపర్ ఢీ.. పద్మ అనే మహిళ మృతి
ప్రమాదంలో నలుగురికి గాయాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 16, 2026 05:57 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
4 వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్
ట్రాఫిక్ మధ్యనే వెళ్లనున్న సీఎం రేవంత్