-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 14th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 14 , 2026 | 07:19 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 14, 2026 21:50 IST
విజయనగరం: రేపు పోలీస్ క్రీడా మైదానంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ
హాజరుకానున్న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిత, మంత్రి కొండపల్లి, జిల్లా కలెక్టర్ తదితరులు
-
Jun 14, 2026 21:29 IST
కర్నూలు: మంత్రాలయం మండలం వగరూరు చెరువుకు గండి
గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్న రైతులు
భయాందోళనలో గ్రామస్తులు
-
Jun 14, 2026 21:27 IST
నంద్యాల: నందికొట్కూరు మండలం బొల్లవరంలో రెచ్చిపోయిన దొంగలు
వరుసగా వ్యవసాయ బోరు వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ
వారం రోజుల్లోనే నలుగురు రైతులకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ
పంటలకు నీరు అందక లక్షల్లో నష్టం వాటిల్లిందని బొల్లవరం రైతుల ఆవేదన
విద్యుత్ శాఖ ఏఈ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
-
Jun 14, 2026 21:25 IST
ఉద్యోగం నుంచి తొలగించడం అనేది కఠినమైన శిక్ష: సుప్రీంకోర్టు
దుష్ప్రవర్తన నిరూపితమైతేనే ఉద్యోగ బహిష్కరణ శిక్ష వేయాలి: సుప్రీంకోర్టు
చిన్నచిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తొలగించటం అన్యాయం: సుప్రీం
శిక్ష అనేది చేసిన తప్పునకు తగినట్లుగా ఉండాలి: సుప్రీంకోర్టు
ఉద్యోగిపై ఆరోపణల తీవ్రతను బట్టే క్రమశిక్షణ చర్యలు ఉండాలి: సుప్రీం
-
Jun 14, 2026 21:13 IST
సింగపూర్‌లో స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు: సీఎం చంద్రబాబు
మీ ఆదరణకు కృతజ్ఞుడిని: 'X'లో ఏపీ సీఎం చంద్రబాబు
-
Jun 14, 2026 21:12 IST
తెలంగాణలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షాలు..
కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
4-5 రోజుల్లో తెలంగాణలో రుతుపవనాలు విస్తరించే అవకాశం
-
Jun 14, 2026 20:20 IST
చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాదం
నీటి గుంతలో మునిగి తల్లీకుమారుడి మృతి
ఈత నేర్చుకునేందుకు గుంతలోకి దిగిన కుమారుడు సిద్ధు (15)
కుమారుడు మునిగిపోవడం చూసి కాపాడేందుకు నీటిలో దూకిన తల్లి రేవతి(35)
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ మృతి
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 14, 2026 19:40 IST
విజయనగరం: సంతకవిటి మండలంలో పిడుగుపడి ఇద్దరి మృతి
మిర్తివలస పొలంలో విత్తనాలు చల్లుతుండగా పిడుగుపడి రామినాయుడు అనే రైతు మృతి
లింగాపురంలో గొర్రెలను మేపుతుండగా పిడుగుపడి యుగంధర్ అనే యువకుడి మృతి
-
Jun 14, 2026 19:26 IST
'SIR' పేరుతో విపక్షాల ఓట్లు తీసేస్తున్నారు: హరీష్‌రావు
కొన్ని రాష్ట్రాలపై బీజేపీ పగట్టింది: హరీష్‌రావు
'SIR' పేరుతో ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని యత్నం
'SIR' విషయంలో అప్రమత్తంగా ఉండాలి: హరీష్‌రావు
-
Jun 14, 2026 19:25 IST
మధ్యప్రదేశ్: రైలు ఢీకొని నలుగురు ప్రయాణికుల మృతి
మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి
ఉదయ్‌పూర్ రైల్లో మంటలు చెలరేగాయని ప్రచారం
చైన్ లాగి రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు
పట్టాలపై ఉన్నవారిని ఢీకొన్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్
పలువురి పరిస్థితి విషమం, కొనసాగుతున్న సహాయక చర్యలు
మధ్యప్రదేశ్‌లో హేతంపూర్ దగ్గర ఘటన
-
Jun 14, 2026 19:23 IST
మహారాష్ట్ర: పండరీపూర్‌లో రోడ్డు ప్రమాదం
వ్యవసాయ బావిలో పడిన వ్యాన్, 14 మంది భక్తుల మృతి
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jun 14, 2026 19:22 IST
అమరావతి: DSCపై మరో కుట్రకు తెర లేపిన వైసీపీ
ఓ కులానికి చెందినవారికి టీచర్ పోస్టులంటూ జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారం
గతంలోనూ ఇదే తరహా ప్రచారం చేసిన జగన్ టీం
ఇప్పుడు DSC-2025 అంశంలో విషం చిమ్ముతోన్న వైసీపీ
-
Jun 14, 2026 18:22 IST
ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ఏపీ ఆరోగ్య శాఖలో 'అవినీతి క్యాన్సర్' పేరుతో వరుస కథనాలు
కథనాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ బదిలీ
సెలవు రోజు అయినా ఉత్తర్వులు జారీ
సౌరభ్ గౌర్‌కు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
పోస్టింగ్ కోసం GADకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
-
Jun 14, 2026 17:58 IST
నిజామాబాద్: నందిపేట్‌లో కత్తిపోట్ల కలకలం
నయీం అనే యువకుడిపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి
తీవ్రంగా గాయపడిన షేక్ నయీం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
-
Jun 14, 2026 17:53 IST
రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ దిశగా NDA
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత TMCలో పరిణామాలతో పార్లమెంట్ ఉభయ సభల్లో పెరుగుతున్న NDA బలం
-
Jun 14, 2026 17:52 IST
సీఎం రేవంత్‌కు ఎంపీ రఘునందన్‌రావు సవాల్
దమ్ముంటే అసెంబ్లీని రేవంత్‌రెడ్డి రద్దు చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు
శాసనసభను రేవంత్‌రెడ్డి రద్దు చేస్తే 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధం
రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదు: ఎంపీ రఘునందన్‌రావు
-
Jun 14, 2026 17:25 IST
తూర్పుగోదావరి: గోకవరం మండలం వెదురుపాకలో చుక్కల జింక మృతి
కొమ్ము విరిగిపోవడంతో రక్తస్రావమై మృతి చెందినట్లుగా అటవీశాఖ అధికారుల నిర్ధారణ
తిరుమలయపాలెం అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వెదురుపాకలోకి వచ్చిన జింక
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు
-
Jun 14, 2026 16:30 IST
సంగారెడ్డి జిల్లా: చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద రోడ్డు ప్రమాదం
బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
బైక్‌పై ప్రయాణిస్తున్న పుర్ర వైష్ణవి(13) అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి గాయాలు
మృతురాలి స్వస్థలం సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామం
ఫసల్వాదిలోని విద్యాపీఠంలో భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం
-
Jun 14, 2026 16:28 IST
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై చర్చ
-
Jun 14, 2026 16:27 IST
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్‌తో ప్రధాని మోదీ సమావేశం
భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాలపై మంతనాలు
భారత్ ఇన్నేవేట్స్‌ను ప్రారంభించిన మోదీ, మాక్రన్
భారతీయ స్టార్టప్‌లకు వేదికగా ఇన్నోవేట్స్
-
Jun 14, 2026 16:26 IST
ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ బదిలీ
GADలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
-
Jun 14, 2026 15:52 IST
విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి దిగిన యువకుడి మృతి
గల్లంతైన వ్యక్తి అభిషేక్ మృతదేహం లభ్యం
యువకుడి మృతదేహాన్ని గుర్తించిన నేవీ సిబ్బంది, పోలీసులు
మృతుడు గాజువాక భానోజీతోటకు చెందిన విద్యార్థి అభిషేక్‌గా గుర్తింపు
-
Jun 14, 2026 15:38 IST
అన్నమయ్య జిల్లా: పుంగనూరు(మం)ఈడిగిపల్లే వద్ద రోడ్డు ప్రమాదం
బైక్‌ను ఢీకొన్న బొలెరో.. దంపతుల మృతి
మృతులు మదనపల్లికి చెందిన అమీర్ (45), సల్మా (40)గా గుర్తింపు
కొడుకు ముస్తాఖిర్‌కు తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు
-
Jun 14, 2026 15:36 IST
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
మెట్రోరైల్‌కి కేంద్రం నిధులు: కిషన్‌రెడ్డి
మెట్రోకి నిధులు ఇవ్వకపోతే మేం రాజీనామా చేస్తాం: కిషన్‌రెడ్డి
హామీలు అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా?: కిషన్‌రెడ్డి
నన్ను తరిమికొడతానని రేవంత్ అంటున్నారు: కిషన్‌రెడ్డి
నేను BRS కార్యకర్తని కాదు..BJP కార్యకర్తని: కిషన్‌రెడ్డి
నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
Jun 14, 2026 15:35 IST
ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్
అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
-
Jun 14, 2026 15:34 IST
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదు: షబ్బీర్ అలీ
నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర: షబ్బీర్ అలీ
క్రమశిక్షణ కమిటీ వివరణ కోరక ముందే ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు: షబ్బీర్ అలీ
పార్టీకి నష్టం చేకూర్చే పనిచేయను: షబ్బీర్ అలీ
-
Jun 14, 2026 15:05 IST
విజయవాడ: మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు
ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద నీరు
ప్రకాశం బ్యారేజీ 4 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల
-
Jun 14, 2026 15:04 IST
గుంటూరు మిర్చికి చైనా షాక్
మూడు కంటైనర్ల మిర్చిని వెనక్కి పంపిన చైనా
పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన చైనా
మిర్చిలో మిథామిడోపాస్ అధికంగా ఉన్నట్లు గుర్తింపు
మిథామిడోపాస్ ఉన్న పురుగు మందులపై నిషేధం విధించాలని రైతు సంఘాల డిమాండ్
-
Jun 14, 2026 15:03 IST
రేపటి నుంచి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
తొలి సర్వీస్ బెంగళూరుకు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్
నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి 16 చోట్లకు విమాన సర్వీసులు
-
Jun 14, 2026 14:54 IST
పల్నాడు: అచ్చంపేట మండలం కోనూరులో విషాదం
పడవ బోల్తా పడి నలుగురి మృతి
కోనూరులో బంధువుల ఫంక్షన్‌కి వచ్చిన మృతులు
నదిలో చిన్న బోటుపై విహారయాత్రకు వెళ్లిన 10 మంది
తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడి నీట మునిగిన వైనం
ఆరుగురిని కాపాడిన స్దానికులు.. నలుగురి గల్లంతు
రెండు మృతదేహాల లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు
-
Jun 14, 2026 14:14 IST
టాటాఏస్ వాహనం బోల్తా.. ఒకరి మృతి
యాదాద్రి: యాదగిరిపల్లి దగ్గర డివైడర్‌ను ఢీకొని టాటాఏస్ వాహనం బోల్తా
ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 14, 2026 14:10 IST
యాదాద్రి: ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి
వీకెండ్ కావడంతో నిన్న గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్న హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
పార్టీలో పాల్గొన్న యువకులను ప్రశ్నిస్తోన్న పోలీసులు
మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము(27)
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఘటన
-
Jun 14, 2026 14:03 IST
AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా
పార్టీ పదవి, సభ్యత్వానికి రాజీనామా చేసిన గౌతమి
రాజీనామా లేఖను పళనిస్వామికి పంపిన గౌతమి
ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పార్టీని వీడుతున్నట్టు వెల్లడి
-
Jun 14, 2026 13:25 IST
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీ
రామచంద్రాపురం మండలం చల్లావారిపల్లి ముత్యాలమ్మ గుడిలో చోరీ
8 గ్రాముల బంగారు కాసులు, రూ.20 వేల నగదు అపహరణ
తాటితోపు కండ్రిగ రాములవారి, అంకాలమ్మ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు చోరీ
-
Jun 14, 2026 13:22 IST
కాకినాడలో ముగిసిన పెంపుడు కుక్క పోస్టుమార్టం
వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన పరీక్షలు
కుక్క మృతికి గల కారణాలపై దర్యాప్తు
పోస్టుమార్టం అనంతరం నమూనాల సేకరణ
విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాల తరలింపు
ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ
సహజ మరణమా..? విషప్రయోగమా..? తేలనున్న నిజాలు
-
Jun 14, 2026 13:21 IST
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు
విశాఖ ఎయిర్‌పోర్టును మూసేయొద్దు
భోగాపురం, విశాఖలోనూ విమాన సర్వీసులు కొనసాగించాలి
విశాఖకు కంపెనీలు వస్తున్నప్పుడు.. ఎయిర్‌పోర్టు లేకపోతే ఎలా?
అంతర్జాతీయ విమానాలు భోగాపురం నుంచి నడపాలి
దేశీయ సర్వీసులు విశాఖ నుంచి నడపాలి: విష్ణుకుమార్‌రాజు
-
Jun 14, 2026 13:17 IST
చిత్తూరు: గంగవరం మండలానికి చెందిన వ్యాపారి రవి కిడ్నాప్
బెంగళూరులో వ్యాపారం చేస్తున్న రవి
జాతరకు వచ్చిన రవి పలమనేరు సమీపంలోని పెంగరగుంటలో స్నేహితులతో డిన్నర్
అక్కడి నుంచి రవిని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
మూడు కార్లలో తీసుకెళ్లినట్లు సమాచారం
-
Jun 14, 2026 13:15 IST
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ముసుగు దొంగల కలకలం
హెచ్‌పీ రోడ్డు తదితర ప్రాంతాల్లో సంచరించిన ముసుగు దొంగలు
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు
ముసుగు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
Jun 14, 2026 13:14 IST
హైదరాబాద్: గంజాయి డాన్ నీతూ భాయ్ డ్రైవర్ అరెస్ట్
నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయిస్తున్న నీతూ భాయ్
-
Jun 14, 2026 13:13 IST
కృష్ణా: కంకిపాడు మండలం కొల్వవెన్నులో దంపతుల మధ్య వివాదం
అడ్డుకునేందుకు వెళ్లిన మామపై అల్లుడి దాడి
మామకు తీవ్రగాయాలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
-
Jun 14, 2026 13:12 IST
తిరుపతి: వైసీపీకి ఇక జైత్ర యాత్రలు ఉండవు..
ఓదార్పు యాత్రలే: బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి
తప్పుడు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపాలి
గతంలో ఉన్నది స్కామ్‌ల ప్రభుత్వం
ఇప్పుడు ఉన్నది స్కీమ్‌ల ప్రభుత్వం: భానుప్రకాష్‌రెడ్డి
-
Jun 14, 2026 13:12 IST
మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు
ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన (UBT) నేతల భేటీ
సమావేశానికి ముగ్గురు ఎంపీలు దూరం
బెంగాల్ మాదిరి ఆపరేషన్ టైగర్ జరుగుతోందని ప్రచారం
మా నేతలందరూ మాతోనే ఉన్నారు: సంజయ్‌రౌత్
సమావేశానికి రానివారు వర్చువల్‌గా హాజరవుతారు
మేం అధికారంలోకి వస్తే బీజేపీ ఉనికిలో ఉండదు
బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేరు: సంజయ్‌రౌత్
-
Jun 14, 2026 13:11 IST
సీఎం రేవంత్‌రెడ్డికి టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సవాల్
ధాన్యం కొనుగోలు చేయాలని కిషన్‌రెడ్డి, మా ఎంపీలను అడుగుతున్నారు
మీకు చేతగాకపోతే మీ పాలన కూడా కిషన్‌రెడ్డే చేస్తారు
దీనికి మీరు సిద్ధమా తేల్చుకోండి
బీజేపీని అడ్డుకోవాలని BRS, MIMతో కలిసి కాంగ్రెస్ కుట్రలు: రాంచందర్‌రావు
-
Jun 14, 2026 13:10 IST
హైదరాబాద్: ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
తెలంగాణలో ఏ వర్గం సంతృప్తిగా లేదు: రాంచందర్‌రావు
అమలు చేయలేని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: రాంచందర్‌రావు
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాంచందర్‌రావు
-
Jun 14, 2026 13:10 IST
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరిస్తే మాపై ఆరోపణలు చేస్తున్నారు: ఎంపీ లక్ష్మణ్
నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ అంతర్గత కొట్లాటే కారణం: లక్ష్మణ్
నామినేషన్ ఈసీ తిరస్కరిస్తే.. సీట్ చోరీ అని మాపై ఆరోపణలు చేస్తున్నారు: లక్ష్మణ్
పటేల్ ప్రధాని పదవిని నెహ్రూ లాక్కొని సీట్ చోరీకి పాల్పడ్డారు: లక్ష్మణ్
-
Jun 14, 2026 12:33 IST
నెల్లూరు: వరికుంటపాడులో వికలాంగురాలి ఇంటిపై పెదనాన్న దాడి
ఉపాధి హామీ పనికి వెళ్లి వచ్చేసరికి ఇంటి ముందు భాగం ధ్వంసం
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న బాధితురాలు
40 ఏళ్లుగా నివాసంగా ఉన్న ఇంటి గోడలు, రేకులు కూల్చివేత
ఆస్తి స్వాధీనం కోసం చాలాకాలంగా వేధింపులు జరుగుతున్నాయంటూ వాపోయిన సావిత్రి
-
Jun 14, 2026 12:27 IST
యూఎస్‌తో డీల్‌పై ఇరాన్‌లో నిరసనలు
ఇరాన్ విదేశాంగ మంత్రి, పార్లమెంటు స్పీకర్‌పై జనాల గుస్సా
ఇరాన్ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారంటూ జనాల ఆగ్రహం
టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు
-
Jun 14, 2026 12:25 IST
బెంగళూరు: ప్రియురాలిని గొంతుకోసి చంపిన ప్రియుడు
వేరే వ్యక్తితో అక్రమం సంబంధం ఉందని అనుమానించిన ప్రియుడు
మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన అటి హంగ్మా సుబ్బ(21)గా గుర్తింపు
నిందితుడు పుర్బా లెప్చా(25)ను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jun 14, 2026 12:03 IST
ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ ప్లేయర్ల సామగ్రి చోరీ.. 24 గంటల్లో రికవరీ!
ఫిఫా ప్రపంచ కప్‌లో ఆశ్చర్యకర ఘటన
ఇంగ్లండ్ ప్లేయర్ల బూట్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లిన దొంగలు
24 గంటల్లోనే వస్తువులను రికవరీ చేసిన పోలీసులు
టెక్సాస్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jun 14, 2026 12:01 IST
గొప్ప మనసు చాటుకున్న విజయ్, రష్మిక దంపతులు
180 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం
ఆర్థిక సాయానికి ఎంపికైన విద్యార్థుల లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
-
Jun 14, 2026 11:57 IST
సిరిసిల్ల: బీఆర్ఎస్ హయాంలో రోడ్ల నిర్మాణం సరిగా జరగలేదు: కేంద్రమంత్రి బండి సంజయ్
కేంద్రం నిధులు ఇచ్చినా.. కేసీఆర్ సర్కార్ సహకరించలేదు: బండి సంజయ్
కేంద్రానికి బీఆర్ఎస్ సహకరించి ఉంటే తెలంగాణ అద్దంలా మెరిసేది: బండి సంజయ్
ఎన్నికల వరకే రాజకీయాలు, విమర్శలు.. తర్వాత అభివృద్ధిపైనే దృష్టి: బండి సంజయ్
రోడ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ వెంటనే అనుమతులిస్తోంది: బండి సంజయ్
-
Jun 14, 2026 11:54 IST
బ్రెజిల్‌లోని సావో పాలోలో విషాద ఘటన
యువతి ప్రాణం తీసిన స్వింగ్ జంప్ సరదా
40 మీటర్ల ఎత్తునుంచి పడి యువతి మృతి
-
Jun 14, 2026 11:54 IST
బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన
ఆసుపత్రుల్లో డీజిల్ జనరేటర్‌ల వినియోగం ఎక్కువని అంటున్న ప్రతినిధులు
ఐటీ, టెలికం రంగాలకూ డీజిల్ జనరేటర్లు కీలకమంటున్న ఇండస్ట్రీ వర్గాలు
ఆంక్షల సడలింపు కోసం వివిధ సంస్థల ప్రతినిధుల ప్రయత్నాలు
-
Jun 14, 2026 11:24 IST
హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
పాల్గొన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, యువత
పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ నిరసన
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని CJP డిమాండ్
-
Jun 14, 2026 10:36 IST
వర్షంలోనూ జోరుగా సాగుతున్న ఏపీ రాజధాని నిర్మాణం
టాప్ గేర్‌లో పనులు కొనసాగుతున్నాయన్న మంత్రి నారా లోకేశ్
అమరావతిలో జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన మంత్రి
-
Jun 14, 2026 10:31 IST
అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌మీట్‌కు నితీశ్‌కుమార్ రెడ్డి బ్రేక్
అఫ్గాన్‌తో తొలి వన్డే అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన
నితీశ్ కుమార్ రెడ్డికి తల్లి నుంచి ఫోన్
దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌ను మధ్యలో ఆపి తల్లితో మాట్లాడిన నితీశ్
‘అమ్మా.. 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను’ అంటూ తెలుగులో మాట్లాడిన నితీశ్
-
Jun 14, 2026 10:20 IST
విజయవాడ: కేశినేని నాని ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
కేశినేని నాని రూ.120కోట్ల స్కామ్ చేశారు: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాంక్ స్కామ్: కేశినేని చిన్ని
IOB నుంచి నాని రూ.120కోట్ల రుణం తీసుకున్నారు: కేశినేని చిన్ని
NPA చేసి 11 ఏళ్లు అవుతుంది: ఎంపీ కేశినేని చిన్ని
అయినా బ్యాంక్ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు: చిన్ని
-
Jun 14, 2026 10:19 IST
తూ.గో.: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు
ఎస్పీతో మాట్లాడి ఆరా తీసిన హోంమంత్రి అనిత
రంగంలోకి NDRF, SDRF బృందాలు
అధికారులకు పలు సూచనలు చేసిన హోంమంత్రి
-
Jun 14, 2026 10:19 IST
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి
నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Jun 14, 2026 10:19 IST
విశాఖ: సుజాతనగర్‌లో అధిక వడ్డీ పేరుతో మోసం
రూ.కోటి వసూలు చేసి సన్యాసినాయుడు పరారీ
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
-
Jun 14, 2026 10:18 IST
సంగారెడ్డి: కల్హేర్ మండలంలో జొన్న రైతుల ఆందోళన
జొన్నల కొనుగోలు ఆలస్యం కావడంపై ఆగ్రహం
కొనుగోలు కేంద్రానికి వెళ్తున్న డీసీఎంను అడ్డుకుని 12 వేల గోనె సంచులు తీసుకెళ్లిన రైతులు
-
Jun 14, 2026 10:18 IST
విజయవాడ: ఫేస్‌బుక్‌లో మాజీ ఎంపీ కేశినేని నాని పోస్ట్
ఓ కంపెనీకి రూ.వేలకోట్ల విలువైన భూములు కట్టబెడుతుంటే ప్రశ్నించినందుకు నాపై 14నెలల తర్వాత కేసు పెట్టారు: కేశినేని నాని
నేను సీఎంకు లేఖ రాయడంతో ఆ కంపెనీకి భూ కేటాయింపు నిలిచింది: కేశినేని నాని
డీల్ అడ్డం తిరిగి రూ.వేల కోట్లు నష్టపోయేసరికి ఫ్రస్టేషన్‌లో నాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు: కేశినేని నాని
నా జీవితంలో ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశా: కేశినేని నాని
నా లేఖతో ఆ స్కామ్‌ను ఆపగలిగినందుకు, రాష్ట్ర ప్రజల సంపద కాపాడినందుకు గర్వపడుతున్నా: కేశినేని నాని
మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు: కేశినేని నాని
-
Jun 14, 2026 10:16 IST
కర్నూలు: మాధవరంలో భారీగా పోలీస్ బందోబస్తు
వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
9 మంది టీడీపీ, ఆరుగురు వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు
-
Jun 14, 2026 09:39 IST
మధ్యాహ్నం ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈనెల 16 వరకు ఢిల్లీలో జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు
సమావేశాలకు హాజరై దిశానిర్దేశం చేయనున్న పవన్
ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలను, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్న పవన్ కల్యాణ్
-
Jun 14, 2026 09:38 IST
నెల్లూరు: చింతామణి దగ్గర రోడ్డుప్రమాదం
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
10 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపో బస్సు
-
Jun 14, 2026 09:36 IST
అనకాపల్లి: అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో విషాదం
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి మత్స్యకారుడు పేర్ల దేముడు(42) మృతి
-
Jun 14, 2026 09:35 IST
హైదరాబాద్: మీర్‌పేట్ పీఎస్ పరిధిలో రోడ్డుప్రమాదం
లారీ ఢీకొని ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
ఆస్పత్రికి తరలింపు,
మృతుడు సంతోష్‌గా గుర్తింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 14, 2026 09:21 IST
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన
నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్‌తో మోదీ భేటీ
భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాలపై మంతనాలు
భారత్ ఇన్నోవేట్స్‌ను ప్రారంభించనున్న మోదీ, మక్రాన్
-
Jun 14, 2026 08:45 IST
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే
మహిళల టీ20 ప్రపంచ కప్: నేడు భారత్-పాక్ మ్యాచ్
హ్యాండ్‌షేక్ వివాదంపై స్పందించిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం: హర్మన్
-
Jun 14, 2026 08:30 IST
నేడు హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
నిరసనకు అనుమతి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద నిరసన
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యా వ్యవస్థలో అవకతవకలకు నిరసన
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
-
Jun 14, 2026 07:47 IST
కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
-
Jun 14, 2026 07:24 IST
ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
నేడు ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం: ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్
ఒప్పందం కుదిరిన వెంటనే హోర్ముజ్ జలసంధిని తెరుస్తాం: ట్రంప్
పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతే మా లక్ష్యం: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ దగ్గర ఇక అణ్వాయుధం ఉండదు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఒప్పందం విఫలమైతే ప్రత్యామ్నాయ చర్యలు: డొనాల్డ్ ట్రంప్
-
Jun 14, 2026 07:23 IST
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ జారీపై నిషేధం
చొరబాటుదారులు ఆధార్ పొందకుండా నిరోధించేందుకు నిర్ణయం
-
Jun 14, 2026 07:22 IST
నేడు సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు
అమరావతి, పట్టణ ప్రణాళిక, పెట్టుబడులపై చర్చలు
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశాలు
-
Jun 14, 2026 07:22 IST
కాకినాడ: తుని చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు
ఎనిమిదిరోజులుగా గాలిస్తున్నా దొరకని బాలిక ఆచూకీ
తుని బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
కాకినాడ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్ కల్యాణ్
గాలింపు చర్యలకు NDRFను వినియోగించుకోవాలని సూచన
-
Jun 14, 2026 07:21 IST
నేటి నుంచి పాపికొండలు విహారయాత్రల నిలిపివేత
గండిపోచమ్మ దగ్గర బోట్లు నిలిపివేయాలని ఆర్డీవో సూచన
బోటు ఫిట్‌నెస్ నివేదికల తర్వాతే యాత్రలపై నిర్ణయం: ఆర్డీవో
-
Jun 14, 2026 07:19 IST
భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు
అర్ధరాత్రి 2:26 గంటల సమయంలో కంపించిన భూమి
పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కంపించిన భూమి
భూప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు