Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 13 , 2026 | 07:25 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 13, 2026 20:38 IST

    అల్లూరి సీతారామరాజు జిల్లా: అల్లూరి ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత

    • ముంచంగిపుట్టు మం. కుజపంగి జంక్షన్ వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 1,373 కిలోల గంజాయి స్వాధీనం

    • ఒడిశా నుంచి పెదబయలు మం. జామి గుడా-రోడకోట మార్గంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

    • 43 బస్తాల్లో తరలిస్తున్న 1,373 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు

  • Jul 13, 2026 20:13 IST

    షాబాద్‌ వరుస హత్యల కేసులో మరో ట్విస్ట్‌

    • బాండ్‌ పేపర్‌పై సూసైడ్ నోట్ రాసిన రాజ్‌కుమార్‌

    • తన చావుకు నలుగురు కారణం: రాజ్‌కుమార్‌

    • సూసైడ్ నోట్‌లో నలుగురి పేర్లు రాసిన రాజ్‌కుమార్‌

    • 4 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • Jul 13, 2026 19:57 IST

    ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జోసెఫ్ రావణ్ సతీమణి

    • మార్ఫింగ్, అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయకుండా నియంత్రించాలంటూ జోసెఫ్ సతీమణి పిటిషన్‌

    • హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కాకినాడ, కృష్ణా జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్‌

  • Jul 13, 2026 19:53 IST

    సాయికృష్ణ అదృశ్యం కేసుపై సుప్రీంకోర్టులో CBI పిటిషన్‌

    • సాయికృష్ణ కేసును తమకు అప్పగించాలని దాఖలైన PILపై CBI కౌంటర్

    • కేసు దర్యాప్తును తమను అప్పగించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది: CBI

    • కేసుల భారంతో సరిగా దర్యాప్తు చేయలేక విశ్వసనీయత కోల్పోతుందని సుప్రీంకోర్టు వెల్లడించిన అంశాన్ని గుర్తుచేసిన CBI

    • కేసును తమకు బదిలీ చేయాలని కోర్టు భావిస్తే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన CBI

  • Jul 13, 2026 19:41 IST

    రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

    • హైదరాబాద్‌కు IIM కోసం బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి: సీఎం రేవంత్‌

    • మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి

    • మెట్రో విస్తరణ రుణాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలి: సీఎం రేవంత్

    • RRR భూసేకరణ కొలిక్కి వచ్చింది: సీఎం రేవంత్‌

    • కేంద్ర నిధులతో RRRను పూర్తి చేసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం అనుమతులకు కృషి చేయాలి: రేవంత్‌

  • Jul 13, 2026 19:28 IST

    హైదరాబాద్‌: కొనసాగుతున్న అఖిలపక్ష ఎంపీల భేటీ

    • సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం

    • హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌

  • Jul 13, 2026 19:27 IST

    ఢిల్లీ పర్యటనలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    • కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఉత్తమ్‌ భేటీ

    • తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ

  • Jul 13, 2026 19:19 IST

    అమ‌రావ‌తి: ఏపీలో ప్రభుత్వ వైద్య కాలేజీలకు అద‌నంగా మరో 175 MBBS సీట్లు

    • పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్లతో అనుమతి

    • సీట్లకు అనుమతిస్తూ NMC లేఖ విడుదల: మంత్రి స‌త్యకుమార్

    • విజ‌య‌వాడ ప్రభుత్వ సిద్దార్ధ వైద్య కాలేజీకి అద‌నంగా 75 సీట్లు: మంత్రి స‌త్యకుమార్

    • ఈ విద్యా సంవత్సరంలోనే 4 ప్రభుత్వ కాలేజీల్లో అద‌నంగా 325 సీట్లు: మంత్రి స‌త్యకుమార్

  • Jul 13, 2026 19:11 IST

    భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర హోంశాఖ గుర్తింపు

    • ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 పరిధిలోకి భోగాపురం ఎయిర్‌పోర్ట్

    • అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

    • కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో భోగాపురం

    • అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమం

  • Jul 13, 2026 18:51 IST

    హైదరాబాద్‌: రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్‌

    • ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం

    • నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్‌

  • Jul 13, 2026 18:44 IST

    అమరావతి: ఈ నెల 15న కూటమి పార్టీ నేతల కీలక భేటీ

    • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల భేటీ

    • సీట్ల సర్దుబాటు, జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీల నేతలతో సమన్వయ కమిటీల నియామకంపై చర్చ

    • జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలపై కమిటీ దృష్టి

  • Jul 13, 2026 18:37 IST

    ముంబై ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన సీఎం ఫడణవీస్‌

    • పవన్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం ఫడణవీస్

  • Jul 13, 2026 18:29 IST

    ఏపీలో నెల రోజులుగా కొనసాగుతున్న SIR ప్రక్రియ

    • 4 కోట్ల 16 లక్షల 26 వేల 144 ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తి

    • ఇప్పటివరకు 88 శాతం SIR ప్రక్రియ పూర్తి

    • 3 కోట్ల 69 లక్షల 50 వేల 812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి

    • పెండింగ్‌లో 1.67 శాతం ఎన్యుమరేషన్‌ ఫామ్స్

    • 14 లక్షల 19 వేల 644 మంది ఓటర్లు చనిపోయినట్టు గుర్తింపు

    • పర్మినెంట్‌గా షిఫ్ట్ అయిన ఓటర్లు 12 లక్షల14 వేల 994 మంది

  • Jul 13, 2026 18:22 IST

    అమరావతి: ఈసీకి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి లేఖ

    • SIR గడువు పొడిగించాలని లేఖలో కోరిన రాష్ట్ర CEO వివేక్‌ యాదవ్‌

    • రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ECకి రాష్ట్ర CEO లేఖ

    • ఇప్పటివరకు 88 శాతం SIR ప్రక్రియ పూర్తయిందన్న CEO

  • Jul 13, 2026 18:16 IST

    హత్యలకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేసిన రాజ్‌కుమార్‌

    • రాజ్‌కుమార్‌ ఫోన్‌లో వీడియో గుర్తించిన పోలీసులు

    • నన్ను ఆ కుటుంబం అన్నివిధాలా వాడుకుంది: రాజ్‌కుమార్‌

    • జీవితంపై విరక్తి వచ్చింది: రాజ్‌కుమార్‌

  • Jul 13, 2026 18:11 IST

    యూఎస్ డీల్‌ను మేము తిరస్కరించలేదు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

    • మధ్యంతర డీల్‌ను భారత్‌ తిరస్కరించిందన్న వార్తపై మంత్రి స్పందన

    • అది పూర్తి నిరాధార, అసత్య వార్త అని స్పష్టీకరణ

    • డీల్‌పై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని వెల్లడి

  • Jul 13, 2026 18:02 IST

    అమరావతి: రెండో దశ జాబ్ క్యాలెండర్‌ రూపకల్పనపై ఏపీ సీఎస్ సమావేశం

    • హాజరైన కార్యదర్శులు, శాఖాధిపతులు

    • భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం, అన్ని కేడర్లలో ప్రాధాన్య కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా రూపొందాలని సీఎస్‌ ఆదేశం

  • Jul 13, 2026 17:52 IST

    పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు బీజేపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు

  • Jul 13, 2026 17:49 IST

    ఇరాన్ సైనిక దళం ఐఆర్‌జీసీతో దేశభద్రతకు ముప్పు: యూకే

    • యూకే హోం శాఖ సెక్రటరీ ప్రకటన

    • దేశ భద్రతకు ముప్పు తెచ్చే సంస్థగా ఐఆర్‌జీసీపై త్వరలో నిషేధం

    • ఐఆర్‌జీసీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయన్న హోం శాఖ

  • Jul 13, 2026 17:39 IST

    కృష్ణా: గన్నవరం DSP ఆఫీస్‌లో జోసెఫ్ రావణ్ కేసులో గమన, ఇంద్రసేనా చౌదరి విచారణ పూర్తి

    • ఈనెల 17న విచారణకు హాజరు కావాలని కోరిన పోలీసులు

  • Jul 13, 2026 17:34 IST

    తిరుపతి: టీడీపీ సమావేశంలో మీడియాపై దాడి కేసు

    • ఒకరి అరెస్ట్, మరో వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

  • Jul 13, 2026 17:31 IST

    లిక్కర్ రవాణా స్కాంలో ED అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల కోసం సిట్‌ PT వారెంట్

    • విజయవాడ ACB కోర్టులో PT వారెంట్ దాఖలు చేసిన సిట్

    • లిక్కర్ రవాణా స్కాంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్, వాసుదేవరెడ్డి అరెస్ట్‌

    • హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులు

    • నిందితులను PT వారెంట్‌లో తమకు అప్పగించాలని కోరిన సిట్

  • Jul 13, 2026 17:20 IST

    అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌

    • అవగాహన ఒప్పందాన్ని అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోంది: ఇరాన్‌

    • ఉల్లంఘనలు కొనసాగినంతకాలం ఒప్పందంలోని అంశాలను మేం నెరవేర్చే ప్రసక్తే లేదు: ఇరాన్‌

  • Jul 13, 2026 17:15 IST

    డ్యాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెస్‌మీట్‌లో గందరగోళం

    • తెరపైకి లోకల్‌, నాన్‌లోకల్‌ వివాదం

    • ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదన్న జానీ మాస్టర్‌

    • డ్యాన్స్ మాస్టర్ల మధ్య వాగ్వాదం

  • Jul 13, 2026 17:14 IST

    గోదావరి నీటిని ఎత్తిపోయకపోతే హైదరాబాద్‌కు తాగునీటి కష్టం: కేటీఆర్‌

    • రైతులకు నీళ్లు ఇస్తే కరెంట్‌, యూరియా, బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందని రేవంత్‌రెడ్డి భయం: కేటీఆర్‌

    • పంట కొనాల్సి వస్తుందని రేవంత్‌రెడ్డి భయం: కేటీఆర్‌

  • Jul 13, 2026 17:11 IST

    ఎల్‌నినో సవాళ్లకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి తుమ్మల

    • రైతులు నష్టపోకుండా 3 దశల్లో కార్యాచరణ అమలు: తుమ్మల

  • Jul 13, 2026 17:08 IST

    లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

    • లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు అద్భుత విజయం

    • 270 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

  • Jul 13, 2026 17:03 IST

    మొఘలుల నాటి లూటీతో పోలిస్తే విరాళాల చోరీ చిన్న అంశం: అనుపమ్ ఖేర్

    • మొఘలుల కాలంలో ఇంకా ఎక్కువ లూటీ జరిగిందన్న బాలీవుడ్ నటుడు

    • అప్పటి దోపిడీతో పోలిస్తే రామమందిర విరాళాల చోరీ చిన్నదని వ్యాఖ్య

    • ఈ సమస్యనూ సమాజం అధిగమిస్తుందని వ్యాఖ్య

    • నటుడి వ్యాఖ్యలపై నెట్టింట ఆగ్రహం

  • Jul 13, 2026 16:47 IST

    దేశ విద్యా వ్యవస్థపై ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్

    • విద్యా వ్యవస్థ నిజాయతీలేని దోపిడీ యంత్రాంగంగా మారింది: రాహుల్ గాంధీ

    • దేశంలో అవినీతే పేపర్ లీక్ మాఫియాకు కారణమైంది: ఎంపీ రాహుల్

    • జులై 17న డెహ్రాడూన్‌లో ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమం: రాహుల్

    • విద్యా వ్యవస్థలో లోపాలను ప్రశ్నించేందుకే ఈ కార్యక్రమం: రాహుల్

  • Jul 13, 2026 16:34 IST

    'డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2025-26' విడుదల చేసిన కేంద్రం

    • టార్గెట్ ఇండియా.. కేవలం వ్యక్తులే కాదు, ప్రభుత్వాలు, జాతీయ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సైబర్ యుద్ధం

    • దేశ డిజిటల్ భద్రతపై కేంద్రం కీలక హెచ్చరిక

    • స్వదేశీ AI, సైబర్ భద్రతా సామర్థ్యాల పెంపు తప్పనిసరి: కేంద్రం

  • Jul 13, 2026 16:21 IST

    ఈ నెల 15న కేటీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి BRS బృందం

    • ఆదిలాబాద్‌ CCI పునఃప్రారంభం కోరుతూ ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు

  • Jul 13, 2026 16:15 IST

    విమాన ఛార్జీల నియంత్రణకు కేంద్రం కీలక అడుగు

    • విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

    • నెలరోజుల్లోగా పార్లమెంట్‌ ముందుకు కొత్త విమానయాన నిబంధనలు

    • సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

    • పార్లమెంట్‌తో సంబంధం లేకుండా 2 వారాల్లోగా కొత్త నిబంధనల కాపీని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీం ఆదేశం

  • Jul 13, 2026 16:10 IST

    షాబాద్ హత్యకేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

    • కొత్తూరు సమీపంలో లభ్యమైన రాజ్‌కుమార్ మృతదేహం

    • పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు

    • కొత్తూరు సమీపంలో లభ్యమైన డెడ్‌బాడీ రాజ్‌కుమార్‌దే అని ధ్రువీకరించిన చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్

  • Jul 13, 2026 15:58 IST

    చిత్తూరు: పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రగడ

    • పుంగనూరు ఇన్‌ఛార్జి మార్పు విషయంలో వివాదం

  • Jul 13, 2026 15:57 IST

    గద్వాల: యూత్ కాంగ్రెస్ నేత శివచరణ్‌రెడ్డిపై TPCC చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌

    • శివచరణ్‌రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా DCC చీఫ్‌ చల్లా నరసింహారెడ్డికి ఆదేశం

  • Jul 13, 2026 15:41 IST

    సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం

    • అహంకారంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు: ఈటల

    • ఇంజినీర్లపై సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి: ఈటల

  • Jul 13, 2026 15:33 IST

    పోలవరం ప్రాజెక్ట్ ECRF డ్యామ్ స్ట్రక్చర్‌ నమూనాను పరిశీలించిన సీఎం చంద్రబాబు

    • పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు వివరించిన ఇంజినీర్లు

    • పోలవరం ప్రాజెక్టు పురోగతి ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించిన సీఎం

  • Jul 13, 2026 15:20 IST

    సింగరేణి అధికారుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

    • సీఎండీ డా.బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్‌తో చర్చ

    • కోల్ ఇండియా తరహాలో వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలుపై నిర్ణయం తీసుకోవాలి: భట్టి

    • రాబోయే 3 నెలల్లో అధికారుల విజ్ఞప్తులపై నిర్ణయం తీసుకోవాలి: భట్టి

  • Jul 13, 2026 15:19 IST

    చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • హైడ్రా ద్వారా ఫేజ్-1 పనులకు గ్రీన్ సిగ్నల్

    • ORR పరిధిలోని 4 చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధికి ఆమోదం

    • ఫేజ్-1 కోర్ పనులకు రూ.227.98 కోట్ల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం

  • Jul 13, 2026 15:07 IST

    హైదరాబాద్: ఆయుష్ శాఖ, నిజామియా తిబ్బీ ఆస్పత్రిపై మంత్రి రాజనర్సింహ సమీక్ష

    • యునానీ వైద్యసేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు

    • ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనాల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం

    • ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు సూచన

    • మందులు, మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశం

  • Jul 13, 2026 15:00 IST

    ఢిల్లీ: జంతుబలి అంశంలో తమిళనాడు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

    • బక్రీద్ పండుగ సహా ఇతర రోజుల్లోనూ ఆవులు, దూడల వధ నిషేధించాలని హైకోర్టు ఆదేశం

    • మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తమిళనాడు ప్రభుత్వం

    • ప్రస్తుతం ఉన్న చట్టాలకు విరుద్ధంగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందని పిటిషన్

  • Jul 13, 2026 14:52 IST

    సీఎస్కే తదుపరి హెడ్ కోచ్‌గా హేమంగ్ బదానీ?

    • ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న బదానీ

    • ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పిన ప్రస్తుత కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్

    పూర్తి కథనం

  • Jul 13, 2026 14:45 IST

    శ్రీకాకుళం: బైక్‌ ప్రమాదం కేసులో పోలీసుల అదుపులో మాజీమంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్

    • అరవ్‌ను కాశీబుగ్గ పీఎస్‌లో ప్రశ్నిస్తున్న పోలీసులు

    • రాష్ డ్రైవింగ్‌ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి

    • కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు డ్రామాలను బయటపెట్టిన పోలీసులు

  • Jul 13, 2026 14:44 IST

    హైదరాబాద్: SIRపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమీక్ష

    • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

    • ఇంటింటి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్ష

    • BLOలు, BLAలు, రాజకీయ పార్టీల సమన్వయం కీలకమని సూచన

  • Jul 13, 2026 14:40 IST

    తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

    పూర్తి కథనం

  • Jul 13, 2026 14:37 IST

    హైదరాబాద్‌: LB నగర్‌లో బీసీ సంఘాల ఆందోళన

    • హైవేపై బైఠాయించి బీసీ సంఘాల నేతల నిరసన

    • ధర్నాతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌

    • LB నగర్ జంక్షన్ దగ్గర నిలిచిన వాహనాలు

    • ఈశ్వరమ్మ యాదవ్‌పై శివ్‌చరణ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీసీ సంఘాల ధర్నా

  • Jul 13, 2026 14:32 IST

    కాళేశ్వరంపై NDSA టెస్టింగ్‌ ప్రాసెస్ పూర్తికానుంది: మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

    • మూడు బ్యారేజీలు రిపేర్ చేసేందుకు IIT బాంబేతో రీడిజైన్ చేయిస్తున్నాం: ఉత్తమ్

    • వచ్చే వేసవి నాటికి పనులు పూర్తిచేసి నీటిని నిల్వ చేస్తాం: ఉత్తమ్‌

    • కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం లేదని ప్రతిపక్షాలు చేసేది దుష్ప్రచారం: ఉత్తమ్

  • Jul 13, 2026 14:24 IST

    షాబాద్ ఘటనకు సీఎం రేవంత్‌ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

    • రాజకీయాల కోసం పోలీసులను వాడుకుంటున్నారు: హరీశ్ రావు

    • BRS నేతలు చిన్న పోస్టు పెడితే సాయంత్రానికి అరెస్ట్ చేస్తున్నారు: హరీశ్ రావు

    • సైకోను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్యలు జరిగేవి కాదు కదా?: హరీశ్ రావు

    • రేవంత్ హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి: హరీశ్ రావు

    • షాబాద్ కిల్లర్‌ను రేవంత్ సన్నిహితుడే పోక్సో కేసు నుంచి కాపాడాడు: హరీశ్ రావు

  • Jul 13, 2026 13:54 IST

    బీఆర్ఎస్ రక్తదానంపై ఎక్స్‌లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోస్ట్

    • అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు: చామల

    • అధికారం పోయాక కార్యకర్తల రక్తంతో రాజకీయం మొదలుపెట్టారు: చామల

    • రక్తం రుచి మరిగిన కల్వకుంట్ల కుటుంబం ఎంతకైనా తెగిస్తుంది: చామల

  • Jul 13, 2026 13:53 IST

    హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత

    • రెండు కేసుల్లో రూ.3.12 కోట్ల విలువైన హాష్ ఆయిల్ సీజ్

    • జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్–బోరబండ పోలీసుల సంయుక్త ఆపరేషన్

    • 23.706 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం

    • మరో కేసులో 1.25 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్

    • రెండు కేసుల్లో మొత్తం ఏడుగురు నిందితుల అరెస్ట్

  • Jul 13, 2026 13:44 IST

    తూ.గో.: పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చాం: సీఎం చంద్రబాబు

    • కృష్ణా నీటిని రాయలసీమకు అందించాం: సీఎం చంద్రబాబు

    • ఒక్క నిర్ణయంతో రాయలసీమ దశ, దిశ మారిపోయింది: సీఎం చంద్రబాబు

  • Jul 13, 2026 13:43 IST

    తూ.గో.: ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులు ప్రారంభం

    • కాటన్ బ్యారేజీకి కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • వైసీపీ ప్రభుత్వం గేట్లు మార్చడం కాదు.. కొట్టుకుపోయినా పట్టించుకోలేదు

    • పోలవరం ప్రాజెక్ట్‌లో 72శాతం పనులు పూర్తి చేశాం: చంద్రబాబు

    • టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2021కి పోలవరం పూర్తయ్యేది

    • వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి: చంద్రబాబు

    • పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం

  • Jul 13, 2026 13:38 IST

    భద్రాద్రి: పినపాక మండలం బోటుగూడెంలో పోడు వివాదం

    • పోడు భూముల దగ్గర రైతులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

    • పోడుదారులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం

  • Jul 13, 2026 13:38 IST

    ఢిల్లీలో భార్యను కాల్చిచంపిన పోలీస్ కానిస్టేబుల్

    • స్కూటర్‌పై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం

    • రోడ్డుపైనే భార్యపై కాల్పులు జరిపి పరారైన కానిస్టేబుల్ మనీష్

    • తీవ్రంగా గాయపడిన టీచర్ ప్రియాంక(36) చికిత్స పొందుతూ మృతి

    • ఘటన జరిగిన రోజే ప్రియాంక పుట్టినరోజు కావడం విషాదం

  • Jul 13, 2026 13:31 IST

    ఢిల్లీ: ఆకివీడు రామాలయం కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    • కౌంటర్ దాఖలుకు సమయం కావాలని ప్రతివాదుల విజ్ఞప్తి

    • తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

    • పిటిషనర్ తరఫున వర్చువల్‌గా హాజరైన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

    • రామాలయ నిర్మాణంపై ఇప్పటికే స్టేటస్ కో కొనసాగుతున్నట్లు గుర్తు చేసిన సుప్రీంకోర్టు

  • Jul 13, 2026 13:26 IST

    అమరావతి: జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

    • అధికారంలో ఉండగా మత్స్యకారుల జీవితాల్ని చిన్నాభినం చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

    • మత్స్యకారుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలను సహించం: మంత్రి కొల్లు రవీంద్ర

    • పరామర్శ పేరుతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం: మంత్రి కొల్లు

    • మత్స్యకారులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోంది: మంత్రి కొల్లు

  • Jul 13, 2026 13:14 IST

    రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

    • ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

    • వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్తగేట్ల ఏర్పాటు పూర్తి చేయాలన్న సీఎం

    • ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని చంద్రబాబు ఆరా

    • 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందన్న అధికారులు

    • 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని చెప్పిన అధికారులు

    • కాల్వ చివరి భూములకూ నీరు అందేలా పర్యవేక్షించాలని సీఎం ఆదేశం

  • Jul 13, 2026 13:06 IST

    ఢిల్లీ: అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

    • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

    • సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశం

    • సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లు

    • రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌తో దర్యాప్తు చేస్తోందని సుప్రీంకోర్టుకు తెలిపిన తుషార్ మెహతా

    • తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా

  • Jul 13, 2026 13:04 IST

    గుంటూరు: తాడికొండ గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

    • విద్యార్థుల తరలింపుపై తల్లిదండ్రుల ఆగ్రహం

    • ఐఐటీ, నీట్, జేఈఈ శిక్షణ కోసమే విద్యార్థులను తరలిస్తున్నామన్న ప్రిన్సిపాల్

    • పిల్లలకు మంచి భవిష్యత్తు కోసమే తరలింపు ప్రక్రియ: ప్రిన్సిపాల్

    • తమ పిల్లలను తాడికొండ గురుకులంలోనే ఉంచాలని తల్లిదండ్రుల డిమాండ్

    • రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన తల్లిదండ్రులు

    • పోలీసుల జోక్యంతో ప్రిన్సిపాల్‌తో చర్చలకు వెళ్లిన తల్లిదండ్రులు

  • Jul 13, 2026 12:42 IST

    అమరావతి: పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ ఆమోదం

    • 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

    • 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం

    • రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

  • Jul 13, 2026 12:41 IST

    ఢిల్లీ: బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

    • హైకోర్టు ఉత్తర్వులకు సవరణ అవసరమన్న సుప్రీంకోర్టు

    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన తమిళనాడు ప్రభుత్వం

    • చట్టం అనుమతించే అంశాన్ని న్యాయస్థానం నిషేధించలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదన

    • తదుపరి విచారణ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

  • Jul 13, 2026 12:33 IST

    రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజ్‌లో గేట్ల పునరుద్ధరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

    • రూ.152.95 కోట్లతో పాత గేట్ల మార్పు పనులు

    • 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు

    • 12 హెడ్ స్లూయిస్‌లను కూడా మార్చనున్న ప్రభుత్వం

    • బ్యారేజ్ సామర్థ్యం, భద్రత పెంపుపై దృష్టి

  • Jul 13, 2026 12:32 IST

    హైదరాబాద్: ఎల్-నినోపై ఇక్రిశాట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష

    • శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులతో ప్రత్యేక భేటీ

    • ఎల్-నినో ప్రభావంపై విస్తృత చర్చ

    • మూడు కంటింజెన్సీ ప్రణాళికలపై సమీక్ష

    • తుది కార్యాచరణ ప్రణాళికకు మంత్రి తుమ్మల కసరత్తు

    • రైతుల నష్టం తగ్గించే చర్యలపై దృష్టి

    • ముందస్తు అప్రమత్త చర్యలకు వ్యవసాయ శాఖ సిద్ధం

  • Jul 13, 2026 12:27 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో కాళేశ్వరంపై ఫొటో ఎగ్జిబిషన్

    • ‘కేసీఆర్ అవినీతి దాహానికి నిదర్శనం కాళేశ్వరం’ పేరుతో ప్రదర్శన

    • కాళేశ్వరం ప్రాజెక్ట్, లోపాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్

    • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్

  • Jul 13, 2026 12:17 IST

    బనకచర్ల ప్రాజెక్టుపై నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

    • నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పిటిషన్ లిస్ట్ అయిందన్న సుప్రీంకోర్టు

    • ఒరిజినల్ సూట్ విషయంలో నిబంధనల ప్రకారమే విచారణకు రావాలన్న జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం

    • రిజిస్ట్రీ రూల్స్ ప్రకారం చాంబర్ జడ్జి ఎదుట తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు

    • ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా బెంచ్ ముందుకు విచారణకు రావడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

    • నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ వాదననూ పట్టించుకోని సుప్రీంకోర్టు

  • Jul 13, 2026 12:15 IST

    ఢిల్లీ: పౌరసత్వ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి: సుప్రీంకోర్టు

    • అస్సాం విదేశీయులకు సుప్రీం రక్షణ

    • బలవంతపు చర్యలపై తాత్కాలిక నిలుపుదల

    • గువాహటి హైకోర్టు తీర్పులకు బ్రేక్‌

    • ట్రైబ్యునళ్ల నిర్ణయాలపై సుప్రీం జోక్యం

    • తదుపరి విచారణ వరకు రక్షణ కొనసాగింపు

  • Jul 13, 2026 12:13 IST

    జమ్మూకశ్మీర్‌లో రోడ్డుప్రమాదం

    • బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో రెండు బస్సులు, కారు ఢీ

    • 18 మందికి గాయాలు, క్షతగాత్రుల్లో అమర్‌నాథ్ యాత్రికులు

  • Jul 13, 2026 12:13 IST

    షాబాద్ ఆరు హత్యల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    • విడాకులు అడిగిందని భార్యను చంపేసిన రాజ్‌కుమార్

    • ట్యూషన్ టీచర్‌ సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్

    • తనకన్నా ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్

  • Jul 13, 2026 12:12 IST

    ప్రముఖ హాలీవుడ్ నటుడు సామ్ నీల్ కన్నుమూత

    • 78 ఏళ్ల వయసులో సిడ్నీలో తుదిశ్వాస విడిచిన సామ్ నీల్

    • జురాసిక్ పార్క్, ది పియానో, డెడ్ కామ్ వంటి చిత్రాలతో గుర్తింపు

  • Jul 13, 2026 12:08 IST

    రంగారెడ్డి: షాబాద్ ఆరు హత్యల కేసు

    • నిందితుడు సూర్యాపేటలో ఉన్నాడని సమాచారం: చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్

    • పోలీసుల అదుపులో ఉన్నది రాజ్‌కుమారా? కాదా? స్పష్టత లేదు: చేవెళ్ల డీసీపీ

    • రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంటే అధికారికంగా తెలియజేస్తాం: చేవెళ్ల డీసీపీ

    • 14 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నాం: చేవెళ్ల డీసీపీ

  • Jul 13, 2026 12:07 IST

    గుంటూరు: మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఓటు గల్లంతు

    • ఓటు జాబితాలో పేరు లేకపోవడంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

    • 45 ఏళ్లుగా గుంటూరులోనే నివాసం ఉంటున్నానని అరుణ వెల్లడి

    • శ్యామలానగర్‌లో తన ఓటు లేదని అధికారులు చెప్పారని ఆరోపణ

    • మంత్రిగా పనిచేసిన తనకే ఓటు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్న

    • ఓటరు జాబితాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు

  • Jul 13, 2026 11:19 IST

    ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

    • బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు

    • కోచ్ పదవి కోసం ద్రవిడ్ పేరును బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం

    • ఈ రేసులో ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్, మాజీ స్పిన్నర్ రిచర్డ్ డాసన్

  • Jul 13, 2026 11:13 IST

    మెదక్ జిల్లాలో విషాదం

    • నిద్రిస్తున్న తల్లి, కూతురిని కాటేసిన పాము

    • కూతురు హారిక మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి లావణ్య

  • Jul 13, 2026 11:09 IST

    బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

    • బీకేటీసీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడు ప్రమోద్ నౌటియల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • విరాళాల నిర్వహణలో అక్రమాల ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్

    • నగదు, బంగారం, వెండి నాణేలు అపహరించినట్లు ఆరోపణలు

  • Jul 13, 2026 11:06 IST

    ఉక్రెయిన్ ప్రధాని యులియా స్విరిడెన్‌కో రాజీనామా

    • ప్రభుత్వంలో అధ్యక్షుడు మార్పులు సూచించడంతో రాజీనామా

    • యులియాకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్టు జెలెన్‌స్కీ ప్రకటన

  • Jul 13, 2026 11:03 IST

    మహారాష్ట్ర: వందల లీటర్ల పాలను పారబోసిన వ్యాపారులు

    • ఎఫ్‌డీఏ తనిఖీల ప్రచారంతో భయపడిన వ్యాపారులు

    • పాల నమూనాలు సేకరించి చర్యలు తీసుకుంటారనే భయంతో పాలు పారబోత

    • సోషల్ మీడియాలో వీడియో వైరల్

  • Jul 13, 2026 10:59 IST

    కేసీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు

    • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే: ఎంపీ చామల

    • బీఆర్ఎస్ అధికార, ధనదాహంతో పనిచేసింది: ఎంపీ చామల

    • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే: చామల

    • ఎన్నికల్లో ఈటల గెలుపునకు బీఆర్ఎస్ సహకరించింది: చామల

  • Jul 13, 2026 10:58 IST

    AISHE 2023-24 రిపోర్టు విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ

    • ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికం

    • ఎక్కువ మంది విదేశీ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రంగా కర్ణాటక రికార్డ్

  • Jul 13, 2026 10:50 IST

    వింబుల్డన్‌లో వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

    • ఫైనల్ పోరుకు హాజరైన యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, వైభవ్

    • అభిషేక్ భయ్యా నా సూట్ సెలక్ట్ చేశాడు: వైభవ్

  • Jul 13, 2026 10:44 IST

    రంగారెడ్డి: ఎస్ఐ పూజారి తిరుపతయ్య సస్పెన్షన్

    • డీజీపీ ఆదేశాలతో ఎస్ఐ తిరుపతయ్యపై చర్యలు

    • గంధంగూడ దగ్గర ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్

    • ఎస్ఐ తిరుపతయ్యపై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు

  • Jul 13, 2026 10:15 IST

    భారీగా తగ్గిన బంగారం ధరలు

    • రూ.1420 తగ్గి రూ.1,42,910కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1300 తగ్గి రూ.1,31,000కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,40,000

  • Jul 13, 2026 10:12 IST

    మీరు వెళ్తేనే.. నేను కారులోకి ఎక్కుతా: సోనాక్షి

    • ఫొటోగ్రాఫర్లు తప్పుకునే వరకు కారులోకి ఎక్కని సోనాక్షి

    • ‘మీరు వెళ్లే వరకు నేను కారులో కూర్చోను’ అని స్పష్టం చేసిన సోనాక్షి

    • ఫొటోగ్రాఫర్లు వెనక్కి తగ్గిన తర్వాతే కారులోకి ఎక్కిన సోనాక్షి

  • Jul 13, 2026 09:52 IST

    నష్టాల్లో దేశీయ సూచీలు..

    • 404 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్..

    • 123 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ..

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.74..

  • Jul 13, 2026 09:51 IST

    ఢిల్లీ: రష్యా నుంచి భారత్‌కు రికార్డ్‌స్థాయిలో చమురు దిగుమతులు

    • మేతో పోలిస్తే జూన్‌లో 34 శాతం దిగుమతులు

  • Jul 13, 2026 09:49 IST

    శ్రీకాకుళం: కాశీబుగ్గలో వైసీపీ నేత కుమారుడి ర్యాష్ డ్రైవింగ్

    • అతివేగంగా బైక్‌తో ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి

    • ప్రమాదానికి తాను కారణమని లొంగిపోయిన సిద్ధు అనే యువకుడు

    • కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో బయటపడ్డ వాస్తవాలు

    • ప్రమాద సమయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌ బైక్ నడిపినట్లు నిర్ధారణ

    • ప్రమాదానికి ముందు బంకులో పెట్రోల్ పోయించుకున్న అరవ్

  • Jul 13, 2026 09:47 IST

    తమిళనాడు: మదురైలో రోడ్డు ప్రమాదం

    • కొట్టాంపట్టి దగ్గర రెండు బస్సుల ఢీ

    • ఐదుగురి మృతి, 40 మంది ప్రయాణికులకు గాయాలు

  • Jul 13, 2026 09:39 IST

    బహ్రెయిన్‌లోని షేక్ ఈసా ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటన

    • అమెరికా సైనిక స్థావరాలపై రెండో విడత ప్రతీకార చర్యలని వెల్లడి

    • హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలు, P-8 విమాన హ్యాంగర్ లక్ష్యంగా దాడులు

    • అమెరికా డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడి

  • Jul 13, 2026 09:11 IST

    జైసల్మేర్: భూమిని అక్రమంగా విక్రయించిన 92 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారి

    • నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేశారని ఆరోపణలు

    • జైసల్మేర్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

  • Jul 13, 2026 09:08 IST

    రైలులో పూజలు.. వీడియో వైరల్

    • రైలు కోచ్‌లో పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

    • సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన వీడియో

    • రైలు కోచ్‌లో పూజలు చేయడంపై చర్చ

    • ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉందా? అని రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్న నెటిజన్లు

  • Jul 13, 2026 08:57 IST

    హైదరాబాద్: చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్యపై దర్యాప్తు

    • అల్వాల్ సాయిబాబానగర్‌ నివాసంలో ఉరేసుకుని బలవన్మరణం

    • అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందంటున్న కుటుంబ సభ్యులు

    • కడుపు, వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్టు కుమారుడి ఫిర్యాదు

  • Jul 13, 2026 08:56 IST

    కృష్ణా: కొత్త ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

    • విజయదుర్గ ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

    • మంటలార్పిన ఫైర్ సిబ్బంది, రూ.కోటి ఆస్తి నష్టం

  • Jul 13, 2026 08:55 IST

    నేడు విదేశీ కరెన్సీ డిపాజిట్లపై కేంద్ర ఆర్థికమంత్రి కీలక సమీక్ష

    • నేడు పీఎస్‌బీ అధిపతులతో నిర్మలా సీతారామన్ భేటీ

    • భారత్‌కు భారీగా తగ్గిన విదేశీ కరెన్సీ రాక

    • బ్యాంకుల్లో డిపాజిట్ల పెంపునకు కేంద్రం ముమ్మర కసరత్తు

  • Jul 13, 2026 08:54 IST

    జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

    • రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు

  • Jul 13, 2026 08:54 IST

    ఇరాన్‌లోని ఫారూర్ దీవిపై అమెరికా వైమానిక దాడులు

    • ఇరాన్ టెలికమ్యూనికేషన్స్ అధికారి మృతి, ఇద్దరికి గాయాలు

    • ఖేష్మ్ దీవి, బందర్ అబ్బాస్, బుషెహర్ పోర్ట్ పట్టణాల్లో దాడులు

    • కువైట్‌పై IRGC చేసిన దాడుల్లో అమెరికా స్థావరాలకూ భారీ నష్టం

  • Jul 13, 2026 08:48 IST

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపణ

    • తాజా అమెరికా దాడులు ఐరాస చార్టర్‌కు విరుద్ధమని విమర్శ

    • ఇరాన్‌పై దాడులకు భూభాగం ఇవ్వొద్దని గల్ఫ్ దేశాలకు హెచ్చరిక

  • Jul 13, 2026 08:46 IST

    వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

    • వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న సిన్నర్

    • మానసిక దృఢత్వమే విజయానికి కారణమని సచిన్ ప్రశంస

    • అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాటాన్ని కూడా కొనియాడిన టెండూల్కర్

  • Jul 13, 2026 07:34 IST

    హైదరాబాద్: నిజాంపేట్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

    • బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒకరి మృతి

    • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

    • మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 13, 2026 07:32 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • రూ.1,44,320కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,32,290కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,39,900

  • Jul 13, 2026 07:27 IST

    థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లోని పబ్‌లో అగ్నిప్రమాదం

    • 27 మంది మృతి, 63 మందికి గాయాలు

    • పలువురి పరిస్థితి విషమం, మృతుల్లో స్థానికులు, విదేశీయులు

  • Jul 13, 2026 07:27 IST

    ఏలూరు: నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

    • మధ్యాహ్నం 1:30కు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం

    • ప్రధాన డ్యామ్, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన

    • పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమీక్ష

  • Jul 13, 2026 07:25 IST

    నేటి నుంచి బీజేపీ సింగరేణి భరోసా యాత్ర

    • రెండు రోజులపాటు జరగనున్న భరోసా యాత్ర

    • నేడు కొత్తగూడెంకు కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు

  • Jul 13, 2026 07:25 IST

    నేడు తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల