-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 9th October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 09 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 09, 2026 08:55 IST
నేడు రాష్ట్రపతిని కలవనున్న ఇండి కూటమి నేతలు
రాష్ట్రపతిని కలిసేందుకు 10 మందికి మాత్రమే అనుమతి
కాసేపట్లో రాష్ట్రపతిని కలిసే సమయంపై రానున్న స్పష్టత
ఖర్గే, రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్న బృందం
-
Oct 09, 2026 08:45 IST
కరీంనగర్: హుజూరాబాద్‌లో తప్పిన ప్రమాదం
అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఐదుగురు ప్రయాణికులు సురక్షితం
-
Oct 09, 2026 08:30 IST
విశాఖ: ఈ నెల 11 నుంచి 15 వరకూ స్పెషల్ టెట్ పరీక్షలు
జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలు
ఎగ్జామ్ రాయనున్న 5,624 మంది అభ్యర్థులు
-
Oct 09, 2026 08:15 IST
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్న సీఎం
మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నివాసానికి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Oct 09, 2026 08:00 IST
గుంటూరు: కొల్లిపర మండలం హనుమాన్ పాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం
టీవీఎస్ ఢీకొన్న ఇసుక ట్రాక్టర్.. ఇద్దరి మృతి
మృతులు అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మగా గుర్తింపు
వ్యవసాయ పనులకు వెళ్తున్న సమయంలో ప్రమాదం
-
Oct 09, 2026 07:45 IST
హైదరాబాద్: మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం
మెట్రో పిల్లర్ నెంబర్ 600 దగ్గర బైక్‌ను ఢీకొన్న టిప్పర్
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బైకర్
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విష్ణు (29) మృతి, కేసు నమోదు
-
Oct 09, 2026 07:30 IST
సిద్దిపేట : 10K రన్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా పదేళ్ల ఉత్సవంలో భాగంగా డిగ్రీ కాలేజీలో 10K రన్
పదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా ఏర్పాటైంది: హరీశ్ రావు
జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు
సిద్దిపేట యూనివర్సిటీ సాధిస్తాం: హరీశ్ రావు
-
Oct 09, 2026 07:15 IST
విశాఖపట్నం: RK బీచ్‌లో డాక్టర్ల వాక్‌థాన్
'కలిసి నడుద్దాం–కలిసి సంరక్షిద్దాం' నినాదంతో వాక్‌థాన్
-
Oct 09, 2026 07:00 IST
కృష్ణా: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన
అర్ధాంతరంగా పనులు నిలిపివేయడంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
అధికారుల బాధ్యతారాహిత్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మంత్రి అసహనం
హార్బర్ నుంచే కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర
-
Oct 09, 2026 06:45 IST
ఛత్తీస్‌గఢ్: సుక్మాలో మందుపాతర పేలుడు
నలుగురు జవాన్లకు గాయాలు
మందుపాతర నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం
BDS బృందంలోని నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమం
-
Oct 09, 2026 06:30 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇలా
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,560
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,090
కిలో వెండి ధర రూ.2,44,900
-
Oct 09, 2026 06:25 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రిలో 11 నుంచి నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిలో సర్వం సిద్ధం
-
Oct 09, 2026 06:20 IST
నేడు భారత్ Vs వెస్టిండీస్ రెండో టీ20
రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్
-
Oct 09, 2026 06:17 IST
15 తర్వాత ఏపీలో వర్షాలు
ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం
-
Oct 09, 2026 06:15 IST
బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు
అక్టోబర్ 10 నుంచి 18 వరకూ బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ వేడుకలకు రూ.10 కోట్లు మంజూరు
ఈ నెల 18న ట్యాంక్‌బండ్ దగ్గర సద్దుల బతుకమ్మ నిర్వహణ
ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపు
రేపు ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు
-
Oct 09, 2026 06:10 IST
భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్
కొత్తగూడెం మణుగూరు ఇల్లందు భద్రాచలం డిపోల్లో పోలింగ్
ఉదయం 5గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్
సాయంత్రం 6 వరకూ జరగనున్న పోలింగ్
-
Oct 09, 2026 06:07 IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకుంటున్న కార్మికులు, ఉద్యోగులు
6 డిపోల ఫరిధిలో 1,773 ఓటర్లు, సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్
14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అవకాశం, 17న ఓట్ల లెక్కింపు
-
Oct 09, 2026 06:05 IST
అమరావతి: నేడు 2027 జనాభా లెక్కల సేకరణపై రాష్ట్రస్థాయి భేటీ
హాజరుకానున్న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సీఎస్ సాయిప్రసాద్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయకుమార్ నారాయణ్
-
Oct 09, 2026 06:03 IST
ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇండి కూటమి నేతల భేటీ
రాష్ట్రపతిని కలవనున్న 10 మంది ఇండి కూటమి ప్రతినిధులు
కేంద్ర ఎన్నికల సంఘం, CEC జ్ఞానేష్‌కుమార్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న నేతలు
-
Oct 09, 2026 06:00 IST
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
జరుగుమల్లి మండలం నర్సింగోలులో రైతుల పాసు పుస్తకాల పంపిణీ
నర్సింగోలు గ్రామసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
తర్వాత కొండపి నియోజకవర్గ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం