Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 06 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 06, 2026 07:30 IST

    కాకినాడ: పిఠాపురం శ్రీకుక్కుటేశ్వర దేవస్థానంలో సహస్ర ఘటాభిషేకం

    • రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ సహస్ర ఘటాభిషేకం, వరుణ జపాలు

  • Oct 06, 2026 07:25 IST

    రేపు ఏలూరులో DGP హరీష్‌కుమార్ గుప్తా పర్యటన

    • స్థానిక ఎన్నికలపై 6 జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో DGP సమీక్ష

  • Oct 06, 2026 07:20 IST

    ప.గో.: భీమవరంలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

    • మృణాళిని (26) అనే మహిళ ఆత్మహత్య

    • ఆరు నెలల క్రితమే మృణాళిని వివాహం

    • అదనపు కట్నం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మృణాళిని బంధువుల ఆరోపణ

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 06, 2026 07:15 IST

    ప.గో.: భీమవరం చినఅమిరం దగ్గర ప్రమాదం

    • అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లిన కారు

    • మహేశ్వరి అనే వైద్యురాలికి తప్పినముప్పు

  • Oct 06, 2026 07:05 IST

    నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన

    • ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • Oct 06, 2026 07:00 IST

    కర్నూలు: నంద్యాల చెక్‌పోస్టు దగ్గర పార్క్ చేసిన రెండు జేసీబీల చోరీ

    • పవన్ అనే దొంగను అరెస్ట్ చేసిన త్రీటౌన్‌ పోలీసులు

  • Oct 06, 2026 06:55 IST

    వికారాబాద్‌ ఇందిరానగర్‌కాలనీలో కార్డన్‌సెర్చ్‌

    • DSP అంజయ్య, సీఐ రఘుకుమార్‌ ఆధ్వర్యంలో సోదాలు

    • పత్రాలు లేని వాహనాలు, బెల్ట్ షాపుల్లో లిక్కర్ స్వాధీనం

  • Oct 06, 2026 06:50 IST

    నేడు విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటన

    • షిప్‌యార్డ్‌లో స్లిప్ వే ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్ సింగ్

    • షిప్‌యార్డ్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

  • Oct 06, 2026 06:45 IST

    నంద్యాల జిల్లా : ఆత్మకూరు మండలం బైర్లూటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసి బస్సు-బొలెరో.. ఇద్దరు మృతి, మరొకరి పరస్దితి విషమం

    • మృతులు ఈడిగ దేవేందర్ గౌడ్, నితిన్‌గా గుర్తింపు

    • స్వల్ప గాయాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్, కండక్టర్‌.. ప్రయాణికులు సురక్షితం

  • Oct 06, 2026 06:40 IST

    సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు

    • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ అపరేష్‌కుమార్‌, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌

    • తెలంగాణ హైకోర్టు తాత్కాలిక CJగా జస్టిస్‌ శ్యాంకోశీ

  • Oct 06, 2026 06:35 IST

    మేడ్చల్‌: క్యారెట్‌లేన్ జువెలరీ షాపులో చోరీ కేసు

    • చోరీకి పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు

    • నిందితులంతా బిహార్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసుల అనుమానం

    • షాపులో పనిచేస్తూ ఇటీవల మానేసిన ముగ్గురు వ్యక్తులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 06, 2026 06:30 IST

    హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌ బౌరంపేటలో వీధి కుక్కల హల్‌చల్

    • వృద్దురాలు, ఆడుకుంటున్న పిల్లలపై కుక్కల దాడి

  • Oct 06, 2026 06:25 IST

    సంగారెడ్డి: పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట దగ్గర అగ్నికి ఆహుతైన మామిడి తోట

    • 3 ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతి.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

    • ఉద్దేశపూర్వకంగా మామిడి తోట తగలబెట్టినట్లు గుర్తింపు

  • Oct 06, 2026 06:20 IST

    నేడు సూర్యాపేట జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన

    • మంత్రులు భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, అడ్లూరి పర్యటన

    • మునగాల దగ్గర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌కు శంకుస్థాపన

    • పులిచింతల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం సందర్శన

  • Oct 06, 2026 06:17 IST

    నేడు మెదక్‌ జిల్లాలో గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

    • రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గవర్నర్

  • Oct 06, 2026 06:16 IST

    హౌతీలపై యుద్ధ రంగంలోకి పాక్‌, తుర్కియే దళాలు

    • సౌదీ-పాక్‌-తుర్కియే డీల్‌ కుదుర్చుకున్న దేశాలు

    • రియాద్‌లో విదేశాంగ మంత్రులు, మిలిటరీ అధికారుల భేటీలో నిర్ణయం

  • Oct 06, 2026 06:15 IST

    ముంబై బస్సు డిపోలో బారీ అగ్నిప్రమాదం

    • మంటల్లో కాలిపోయిన 12 CNG బస్సులు

    • మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

  • Oct 06, 2026 06:14 IST

    ఫ్లైదుబాయ్‌ ఘటనకు ఇరానే కారణం: డొనాల్డ్ ట్రంప్‌

    • టెర్రరిస్ట్‌ అటాక్‌కు ఇరాన్‌దే బాధ్యత: ట్రంప్‌

    • దర్యాప్తు కొనసాగుతోంది, ఇంకా ఆధారాలు లభించలేదు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌

  • Oct 06, 2026 06:13 IST

    పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

    • కారు, బైక్ ఢీ.. బైక్‌పై ఉన్న తన్నీరు శ్రీహరి మృతి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 06, 2026 06:12 IST

    నేడు తెలంగాణలో బార్ల బంద్‌కు పిలుపు

    • ఎక్సైజ్‌ కమిషనర్‌తో చర్చలు విఫలం కావడంతో బంద్‌

    • ప్రివిలేజ్‌ ట్యాక్స్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

  • Oct 06, 2026 06:10 IST

    నేటి నుంచి ఏపీలో వైద్యారోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె

    • కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌

    • విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం సహా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్

  • Oct 06, 2026 06:07 IST

    అమరావతి: నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

    • ఉదయం 9:30 గంటలకు చంద్రబాబు, పవన్ సమావేశం

    • రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి స్థానాల పోటీ అంశాలపై ఇరువురి చర్చ

  • Oct 06, 2026 06:05 IST

    ఢిల్లీ: GST కౌన్సిల్‌ మీటింగ్‌ ఎల్లుండికి వాయిదా

    • రేపు జరగాల్సిన GST మీటింగ్‌ అక్టోబర్‌ 8వ తేదీకి వాయిదా

    • GSTలో సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్న కేంద్రం

    • GST అరెస్ట్‌ నిబంధనల రద్దు యోచన

    • వ్యాపారులపై అరెస్ట్‌ చర్యలు తొలగింపు

  • Oct 06, 2026 06:03 IST

    నేటి నుంచి ఇండిగో విమాన టికెట్‌ ధరల పెంపు

    • దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ రూ.350 వరకూ పెంచిన ఇండిగో

    • ATF ధరలు భారీగా పెరగడంతో ఇండిగో నిర్ణయం

  • Oct 06, 2026 06:00 IST

    ఢిల్లీ: నేడు ఇండి కూటమి ఎంపీల ర్యాలీ

    • ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా ఉదయం 10:30 గంటలకు ర్యాలీ

    • పార్లమెంట్‌ మకరద్వారం నుంచి CEC ఆఫీస్‌ వరకూ జరగనున్న ర్యాలీ

    • CEC జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్