-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 5th November 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 05 , 2026 | 06:22 AM
ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.61 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో 582 జడ్పీటీసీ స్థానాలకు, 659 మండల పరిషత్‌ల పరిధిలో 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Live News & Updates
-
Nov 05, 2026 08:19 IST
కడప జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
39 జడ్పీటీసీ స్థానాల్లో 23 ఏకగ్రీవం.. 16 స్థానాల్లో ఎన్నికలు
406 ఎంపీటీసీ స్థానాల్లో 351 ఏకగ్రీవం
మిగిలిన 55 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్
-
Nov 05, 2026 08:16 IST
నెల్లూరు: కావలి మండలం సర్వాయపాళెంలో స్వల్ప ఉద్రిక్తత
ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త చెంచయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Nov 05, 2026 08:10 IST
అల్లూరి జిల్లా: అరకులోయలో తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ
వాగులు, వంకలు దాటుకుంటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
-
Nov 05, 2026 08:08 IST
తూర్పుగోదావరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
20 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
7 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
జిల్లా వ్యాప్తంగా 1,476 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-
Nov 05, 2026 08:04 IST
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నాగులూరులో వైసీపీకి షాక్
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ అభ్యర్థి
జోగి రమేష్, మండల నాయకుల నుంచి సహకారం లేదని ఆరోపణ
గ్రామ పార్టీ గ్రూపులో ఎన్నికల బహిష్కరణపై ప్రకటన చేసిన అభ్యర్థి, నాయకులు
-
Nov 05, 2026 07:55 IST
ఎన్డీఏ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గకుండా చూడాలని సూచన
వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని పిలుపు
అక్రమాలు, ఘర్షణలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
కార్యకర్తలు సంయమనం పాటించాలి: సీఎం చంద్రబాబు
-
Nov 05, 2026 07:50 IST
సంగారెడ్డి: కందిలో అగ్నిప్రమాదం
EV కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మంటలార్పుతున్న 3 ఫైరింజన్లు
-
Nov 05, 2026 07:48 IST
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ
అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీ పోటీ
మనుబోలు మండలంలో ఓటుకు రూ.3 వేల పంపిణీ చేసినట్లు ఆరోపణలు
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
-
Nov 05, 2026 07:25 IST
పోలవరం జిల్లాలో 12 జడ్పీటీసీ, 101 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
జిల్లాలో 2,78,545 మంది ఓటర్లు.. 368 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
మావోయిస్టు ప్రభావిత 44 కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్
-
Nov 05, 2026 07:20 IST
కృష్ణా: నందివాడ మండలం జనార్ధనపురం కేంద్ర వద్ద ఓటర్ల ఇబ్బందులు
భారీ వర్షానికి పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలిచిన నీరు
ఇసుక బస్తాలతో తాత్కాలిక నడకబాట ఏర్పాటు చేసిన సిబ్బంది
బస్తాలపై తడబడుతూ పోలింగ్‌కు వెళ్తున్న వృద్ధులు, దివ్యాంగులు
-
Nov 05, 2026 07:10 IST
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ZPTC, MPTC ఎన్నికల పోలింగ్
30 ZPTC, 362 MPTC స్థానాలకు ఎన్నికలు.. బరిలో 990 మంది అభ్యర్థులు
12,85,840 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు
1,568 పోలింగ్ కేంద్రాల్లో 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
-
Nov 05, 2026 07:05 IST
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పోలింగ్ ప్రారంభం
కొటికలపూడిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
ఏడీసీపీ గున్నం రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు
-
Nov 05, 2026 07:00 IST
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు
ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
-
Nov 05, 2026 06:55 IST
విశాఖ జిల్లాలో 4 జడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
నాలుగు మండలాల్లో 1,62,407 మంది ఓటర్లు
ఈ నెల 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
-
Nov 05, 2026 06:50 IST
అనకాపల్లి జిల్లాలో 427 ఎంపీటీసీ, 24 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. 425 స్థానాల్లో పోటీ
425 ఎంపీటీసీ స్థానాలకు 980 మంది, 24 జడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు బరిలో
1,530 పోలింగ్ కేంద్రాల్లో 12,600 మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ
-
Nov 05, 2026 06:45 IST
అల్లూరి జిల్లాలో 172 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
617 పోలింగ్ కేంద్రాల్లో 4,98,457 మంది ఓటర్లు
149 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్, ప్రత్యేక నిఘా ఏర్పాటు
-
Nov 05, 2026 06:40 IST
కృష్ణా జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్
ఏకగ్రీవమైన జడ్పీటీసీ స్థానాలు సున్నా
343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
-
Nov 05, 2026 06:35 IST
ఎన్టీఆర్ జిల్లాలో 16 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్
ఏకగ్రీవమైన జడ్పీటీసీ స్థానాలు సున్నా
276 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
మరో 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
-
Nov 05, 2026 06:33 IST
కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
26 జడ్పీటీసీ, 358 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
12.50 లక్షల మంది ఓటర్లు.. 1,432 పోలింగ్ కేంద్రాలు
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. 8,281 మంది సిబ్బంది ఏర్పాటు
-
Nov 05, 2026 06:32 IST
నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా 10.61 లక్షల మంది ఓటర్లు
20 జడ్పీటీసీ, 224 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
1,238 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
193 అతి సమస్యాత్మక, 129 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
-
Nov 05, 2026 06:30 IST
శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ZPTC, MPTC ఎన్నికలు
32 ZPTC, 377 MPTC స్థానాలకు పోలింగ్
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్
-
Nov 05, 2026 06:28 IST
ఖమ్మం: బేతపల్లి పెద్దచెరువు దగ్గర గల్లంతైన 11 మందిని రక్షించిన సహాయ సిబ్బంది
రాత్రంతా కొనసాగిన సహాయక చర్యలు
వరద ప్రవాహంలో చిక్కుకున్న 11 మంది క్షేమం
సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి తుమ్మల
-
Nov 05, 2026 06:25 IST
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
-
Nov 05, 2026 06:22 IST
అమరావతి: నేడు పరిషత్ ఎన్నికల పోలింగ్
28 ZPల్లో 659 ZPTCలకు గాను 77 ఏకగ్రీవం
మిగిలిన 582 స్థానాలకు 2,169 మంది పోటీ
659 MPPల్లో 9,821 MPTC స్థానాలకు గాను 2,051 ఏకగ్రీవం
7,767 MPTC స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీ
కడపలో 2, నంద్యాలలో 1 MPTC స్థానానికి ఆగిన ఎన్నికలు
-
Nov 05, 2026 06:20 IST
ఏపీలో మురసు తుఫాన్ ఎఫెక్ట్
నేడు జరగాల్సిన KRMB సమావేశం వాయిదా