-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 2nd November 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 02 , 2026 | 05:55 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 02, 2026 08:25 IST
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు నివాళి
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తుచేసుకున్న అచ్చెన్న
ఉత్తరాంధ్ర అభివృద్ధికి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించారని వెల్లడి
భౌతికంగా దూరమై 14 ఏళ్లు గడిచినా మా అన్నయ్య జ్ఞాపకాలు సజీవమేనన్న అచ్చెన్నాయుడు
-
Nov 02, 2026 08:11 IST
విజయవాడ: SEC కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైసీపీ నేతలపై కేసులు
ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలతరెడ్డి, మురుగుడు హనుమంతరావు..
రుహుల్లాతో పాటు మొత్తం14 మందిపై కేసులు నమోదు
SEC జాయింట్ డైరెక్టర్ రామారావు కంప్లైంట్ ఆధారంగా కేసులు
-
Nov 02, 2026 08:08 IST
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాగునీటి శాఖ అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ భేటీ
-
Nov 02, 2026 08:06 IST
ఏపీ స్థానిక ఎన్నికల్లో13 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభం
సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
అనంతపురం కార్పొరేషన్ 30/3లో రీపోలింగ్
తిరుపతి 36/4, కడప 15/2లో రీపోలింగ్
మాచర్ల 23వ వార్డులోని 1, 2లో రీపోలింగ్
ప్రకాశం జిల్లా చీమకుర్తి 14/1లో రీపోలింగ్
జమ్మలమడుగు 3/2, 17/1, 29/1లో రీపోలింగ్
పులివెందుల 1, 3, 7, 8 వార్డుల్లోని 1 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
-
Nov 02, 2026 08:03 IST
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
దక్షిణ ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్
9 మంది మృతి, దర్యాప్తు చేపట్టిన FAA, NTSB
ఆస్టిన్ నుంచి బహామాస్‌కు వెళ్తుండగా ఘటన
-
Nov 02, 2026 07:43 IST
అమెరికా హాలోవీన్ వీకెండ్ వేడుకల్లో వేర్వేరు చోట్ల కాల్పులు
ఆరుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
వివిధ కోణాల్లో దర్యాప్తు.. పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
నైట్‌క్లబ్‌లు, హాలోవీన్ కాస్ట్యూమ్ స్టోర్లు, హౌస్ పార్టీలు..
యూనివర్సిటీ క్యాంపస్‌ల సమీపంలో కాల్పుల ఘటనలు
-
Nov 02, 2026 07:38 IST
స్థిరంగా బంగారం, వెండి ధరలు
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,870
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,290
కిలో వెండి ధర రూ.1,99,900
-
Nov 02, 2026 07:36 IST
తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
ఈ మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంట గంటకు 80 నుంచి 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
గడచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర తుపాను
-
Nov 02, 2026 07:12 IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
గంటకు 27 కి.మీ. వేగంతో కదులుతూ నెల్లూరుకు 550 కి.మీ. దూరంలో మురసు తుపాను
ఈ అర్ధరాత్రి లేదా, రేపు తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
-
Nov 02, 2026 06:00 IST
ఏపీలో కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌కు SEC ఆదేశం
మూడు వార్డుల్లోని 4 బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఆదేశం
బూత్ కాప్చరింగ్, రిపోర్ట్‌ల ఆధారంగా SEC నిర్ణయం
-
Nov 02, 2026 05:57 IST
తిరుపతిలో రీపోలింగ్
36/4 డివిజన్‌లో ఘర్షణ కారణంగా బూత్‌లోకి వచ్చిన రెబల్ అభ్యర్థులు
వెబ్ కాస్టింగ్‌లో రికార్డ్ అయిన విజువల్స్
రీపోలింగ్‌కు కలెక్టర్ ఆదేశం
-
Nov 02, 2026 05:55 IST
నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
ఏలూరు, తూ.గో., ప.గో., ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
సహాయక చర్యలు కోసం ముందస్తుగా 6 NDRF, 7 SDRF బృందాలు
ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక