Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 27 , 2026 | 06:08 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 27, 2026 06:50 IST

    రాజమండ్రి: ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

    • 8.50 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటిమట్టం

    • బ్యారేజ్ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత

    • 5. 60 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల

    • ఈరోజు సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం

  • Sep 27, 2026 06:45 IST

    విశాఖ: ఆర్కే బీచ్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ మారథాన్ ఫైవ్ కే రెడ్ రన్

    • వైద్యారోగ్యశాఖ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

    • ఉత్సాహంగా పాల్గొన్న నగర యువత

  • Sep 27, 2026 06:40 IST

    యాదాద్రి : చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద ప్రమాదం

    • అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన ప్రేమ్ ట్రావెల్స్ బస్సు

    • ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు

    • ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

    • హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం

  • Sep 27, 2026 06:35 IST

    నల్లగొండ: మీర్‌బాగ్‌ కాలనీలో వ్యక్తి హత్య

    • షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ 4వ ఫ్లోర్‌లో హత్య

    • తమిళనాడుకు చెందిన కూలీల మధ్య ఘర్షణ

    • కూలీ డబ్బుల అంశంలో వివాదంతో హత్య

    పూర్తి కథనం..

  • Sep 27, 2026 06:30 IST

    అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ దాడులు

    • 28 జిల్లాల్లో 70 హోటల్స్‌, రెస్టారెంట్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు

    • 25 సంస్థల మూసివేత, 30 కేసుల నమోదు

  • Sep 27, 2026 06:25 IST

    విజయవాడ: నేడు 72 అడుగుల డూండీ మట్టి గణపతి నిమజ్జనం

    • ప్రతిష్ఠించిన చోటే భారీ గణపతి నిమజ్జనానికి అధికారుల ఏర్పాట్లు

  • Sep 27, 2026 06:24 IST

    CEO నిర్ణయాలకు వ్యతిరేకంగా నేడు రఘువీరారెడ్డి నిరసన

    • మడకశిరలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం

  • Sep 27, 2026 06:23 IST

    నేడు నెల్లూరులో మంత్రులు ఆనం, నారాయణ పర్యటన

    • ఎల్లుండి ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం

    • పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రులు

  • Sep 27, 2026 06:22 IST

    నేడు ఒంగోలు నగరంలో హెరిటేజ్ వాక్

    • ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి నేటికి 150 ఏళ్లు

    • వాక్‌లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

  • Sep 27, 2026 06:20 IST

    నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • Sep 27, 2026 06:19 IST

    నేడు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ

    • చలో విజయవాడకు అనుమతి లేదన్న పోలీసులు

    • ఉద్యోగుల ఆందోళనపై పోలీసుల నిఘా

  • Sep 27, 2026 06:18 IST

    నేడు పూర్తి స్థాయిలో పనిచేయనున్న బ్యాంక్‌లు

    • దేశవ్యాప్తంగా 3 రోజుల సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా RBI చర్యలు

    • ఆదివారం కూడా బ్యాంక్‌లు పనిచేస్తాయని వెల్లడి

  • Sep 27, 2026 06:17 IST

    నేటి నుంచి తెలంగాణ రక్షణ సేన విస్తృత సమావేశాలు

    • వరుసగా నాలుగు రోజుల పాటు సమావేశాలు

    • పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న కవిత

    • ఆదిలాబాద్, ఖమ్మం నేతలతో భేటీకానున్న కవిత

  • Sep 27, 2026 06:15 IST

    చెన్నై: సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ విమర్శలు

    • విజయ్ సినిమాలు మానేశారని ఎవరు చెప్పారు?: స్టాలిన్

    • విజయ్ ప్రజల ముందు నటిస్తూనే ఉన్నారు: స్టాలిన్

  • Sep 27, 2026 06:12 IST

    పాకిస్థాన్‌లో మరో సూసైడ్ అటాక్.. 11 మంది మృతి

    • ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఘటన

    • 11 మంది పోలీసుల మృతి, 30 మందికి గాయాలు

    • ఘటనకు తమదే బాధ్యత అని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ప్రకటన

  • Sep 27, 2026 06:10 IST

    సౌతాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో మహిళల మిస్టరీ మరణాల కలకలం

    • రెండు నెలల వ్యవధిలో 10 మృతదేహాల లభ్యం

    • ఇప్పటికే ఇద్దరు మహిళల అరెస్ట్.. కొనసాగుతున్న దర్యాప్తు

  • Sep 27, 2026 06:07 IST

    హోర్ముజ్‌ను దిగ్బంధించడంతో ఇరాన్ భారీగా నస్టపోతోంది: ట్రంప్

    • హోర్ముజ్‌ను వెంటనే తెరవాలని కోరుతోంది: డొనాల్డ్ ట్రంప్

    • అది తెరిస్తే మాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది: ట్రంప్

    • హోర్ముజ్ జలసంధిపై మాకు పూర్తి పట్టు ఉంది: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • Sep 27, 2026 06:05 IST

    వన్డేల్లో కొనసాగడంపై మరోసారి విరాట్ కోహ్లీ స్పష్టత

    • 2027 వన్డే ప్రపంచకప్ ఆడతా

    • 2027 టోర్నీయే భారత్ తరఫున ఆడబోయే నా చివరి ప్రపంచకప్

    • వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు నా సర్వశక్తులూ ధారపోస్తా: కోహ్లీ

  • Sep 27, 2026 06:02 IST

    నేడు నెక్లెస్‌ రోడ్‌లో పింక్ పవర్ రన్ 3.0

    • బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా పింక్ పవర్ రన్

  • Sep 27, 2026 06:00 IST

    నేడు భారత్-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌

    • తిరువనంతపురంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌