-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 17th October 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 17 , 2026 | 07:24 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 17, 2026 08:29 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానం
బాంబు ఉందని ఓ విద్యార్థిని చెప్పడంతో అధికారులు అప్రమత్తం
శంషాబాద్‌లో ల్యాండింగ్ తర్వాత అధికారుల తనిఖీలు
-
Oct 17, 2026 08:29 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో దారుణం
ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై లైంగికదాడి
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
బాధితురాలిని అమీర్‌పేట UCHకు తరలింపు
నిందితుడి కోసం సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు
-
Oct 17, 2026 08:26 IST
హైదరాబాద్: యువత మత్తుకు దూరంగా ఉండాలి: మంత్రి శ్రీధర్‌బాబు
ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్
త్వరలోనే వరంగల్ ఎయిర్‌పోర్టును చూడబోతున్నారు: శ్రీధర్‌బాబు
హనుమకొండలో IT టవర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం: శ్రీధర్‌బాబు
-
Oct 17, 2026 08:26 IST
హైదరాబాద్: ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
తెల్లవారుజాము నుంచి జేబీఎస్ బస్టాండ్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
స్పెషల్ బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికుల వెయిటింగ్
ప్రత్యేక బస్సుల్లో 40% అదనపు చార్జీల బాదుడు
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు 7000 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
సాయంత్రం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం
జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్‌లో వద్ద పరిస్థితి నేరుగా పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
-
Oct 17, 2026 08:04 IST
హైదరాబాద్: కూకట్పల్లి లులు మాల్లో కొన్న కిట్‌క్యాట్ చాక్లెట్లో పురుగులు
పిల్లల కోసం కొన్న చాక్లెట్ తెరవగా కదులుతూ కనిపించిన పురుగులు
కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్
మాల్‌ను తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరిన వినియోగదారులు
ఎక్స్పైరీ తేదీ, ప్యాకింగ్ చూసి కొనాలని సూచన
ఇంకా స్పందించని కంపెనీ, మాల్ యాజమాన్యం
-
Oct 17, 2026 08:03 IST
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం
టీడీపీ మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష, వైసీపీ అభ్యర్థి సుశీల వరుసకు అత్తా కోడళ్లు
విజయ ప్రత్యూష సోదరి ప్రియాంక, సుశీల కుమారుడిని వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం
కర్నూలు పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారిన అత్తా కోడళ్ళ పోరు
-
Oct 17, 2026 07:59 IST
కర్నూలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఖరారు
టీడీపీ మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష
వైసీపీ అభ్యర్థిగా సుశీల ఎంపిక
ఆదోని పురపాలక సంఘం ఛైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా నాగమణి
గూడూరు నగర పంచాయతీ ఛైర్ పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి సునీత బాయ్
ఎమ్మిగనూరు పురపాలక సంఘం ఛైర్మన్‌గా
మాచాని మహేష్ కుమార్ పేరు దాదాపుగా ఖరారు
ఇవాళ మధ్యాహ్నంలోపు అధికారికంగా ప్రకటించే అవకాశం
-
Oct 17, 2026 07:57 IST
వనపర్తిలో భర్త హత్యకు భార్య స్కెచ్
ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్త హత్యకు కుట్ర
బెల్టుతో గొంతు బిగించి చంపేందుకు యత్నం
కుటుంబ సభ్యులు రావడంతో హత్యాయత్నం విఫలం
భార్య సహా ముగ్గురి అరెస్ట్
-
Oct 17, 2026 07:48 IST
హైదరాబాద్: నేడు అంబర్‌పేటలో బతుకమ్మ వేడుకలు
ఆసియాలోనే అతిపెద్ద 72 అడుగుల బతుకమ్మ ఏర్పాటు
కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల నిర్వహణ
ముఖ్య అతిథిగా హాజరుకానున్న తెలంగాణ గవర్నర్
-
Oct 17, 2026 07:48 IST
హైదరాబాద్: నేడు IPSల పాసింగ్ అవుట్ పరేడ్
నేషనల్ పోలీస్ అకాడమీలో కార్యక్రమం
హాజరుకానున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్
-
Oct 17, 2026 07:48 IST
ఢిల్లీ నిరసనల వేళ అభిజీత్ దీప్కే అరెస్ట్..
నేడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు
నిర్బంధ ప్రక్రియ అనంతరం ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా విడుదల
-
Oct 17, 2026 07:27 IST
మరికొంచెం తగ్గిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,47,430
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,35,140
కిలో వెండి ధర రూ.2,29,900
-
Oct 17, 2026 07:27 IST
నిర్మల్: బాసర క్షేత్రంలో వైభవంగా నవరాత్రి వేడుకలు
కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
-
Oct 17, 2026 07:26 IST
తమిళనాడు: TVK నేత భూబాలన్ నివాసంలో డ్రగ్స్ పట్టివేత
నాగపట్టినం జిల్లాలో భూబాలన్, ఆయన స్నేహితుల ఇళ్లలో DRI తనిఖీలు
రూ.100కోట్ల విలువైన 145 కిలోల మెథాంఫెటమిన్ డ్రగ్ స్వాధీనం
TVK నుంచి భూబాలన్ను బహిష్కరించినట్టు సమాచారం
-
Oct 17, 2026 07:25 IST
నంద్యాల: శ్రీశైలంలో ఏడో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం
గజవాహనంపై ఆది దంపతుల దర్శనం
రాత్రి శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం
-
Oct 17, 2026 07:24 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏడో రోజు శరన్నవరాత్రులు
శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం