-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 15th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 15 , 2026 | 07:12 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 15, 2026 07:58 IST
స్థిరంగా బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,37,620
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,26,150
కిలో వెండి ధర రూ.1,95,000
-
Nov 15, 2026 07:57 IST
హైదరాబాద్ జీడిమెట్ల దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
బౌరంపేట బొడ్రాయి సమీపంలో తగలబడుతున్న గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న ప్రవేటు ట్రావెల్స్ బస్సులు
పూర్తిగా అగ్నికి ఆహుతి అయిన 5 బస్సులు.పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో భయాందోళన చెందుతున్న స్థానికులు
గ్యారేజ్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని సమాచారం
పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో ఒకదానికొకటి వ్యాపించిన మంటలు
దట్టమైన పొగలు వ్యాపించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం
-
Nov 15, 2026 07:56 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం
రేపు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందే చాన్స్
ఈ నెల 18 ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
18, 19న ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
-
Nov 15, 2026 07:52 IST
ఇవాళ మధ్యాహ్నం సినీనటుడు గిరిబాబు(83) అంత్యక్రియలు
ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు
అనారోగ్య సమస్యలతో నిన్న గిరిబాబు కన్నుమూత
-
Nov 15, 2026 07:51 IST
తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు
తొలి దశలో 3,967 పంచాయితీలకు నామినేషన్లు
ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు
-
Nov 15, 2026 07:50 IST
నేడు నల్లగొండలో అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలు
3 రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలు
సాయంత్రం భారీ ర్యాలీ, బహిరంగ సభ
పాల్గొననున్న సీపీఎం జాతీయ, రాష్ట్ర నేతలు
-
Nov 15, 2026 07:50 IST
నేటి నుంచి భీమ్‌గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు
దక్షిణబద్రిగా పేరుగాంచిన లింబాద్రి నరసింహస్వామి
ఈనెల 26 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు
-
Nov 15, 2026 07:49 IST
ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
-
Nov 15, 2026 07:49 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం రేవంత్
ఖేలో ఇండియా కార్యక్రమానికి మోదీకి ఆహ్వానం
ఎల్‌నినో ప్రభావంపై ప్రధానికి వివరించనున్న సీఎం
కరువును ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్న రేవంత్
సాగు నీరు, రైతుల ఇబ్బందులపై చర్చించనున్న రేవంత్
తెలంగాణకు భారీ ఆర్థిక సాయం కోరనున్న రేవంత్‌రెడ్డి
-
Nov 15, 2026 07:48 IST
నేడు సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం
మురసు తుపాను పంట నష్టం అంచనాపై చర్చ
-
Nov 15, 2026 07:48 IST
తిరుపతి: చంద్రగిరి టోల్‌ప్లాజా దగ్గర రోడ్డుప్రమాదం
టిప్పర్‌ను ఢీకొన్న సుమో, ముగ్గురి మృతి
మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
మృతులు బంగారుపాళ్యం వాసులుగా గుర్తింపు
-
Nov 15, 2026 07:45 IST
ఏలూరు: జీలుగుమిల్లిలో పెద్దపులి సంచారం
పి.రాజవరం వెళ్లే రహదారిలో కనిపించిన పెద్దపులి
స్థానిక దుకాణాల సీసీ కెమెరాలో రికార్డయిన పులి కదలికలు
పెద్దపులి సంచారంతో భయాందోళనలో గ్రామస్థులు
-
Nov 15, 2026 07:45 IST
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీకమాసం ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీ స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో వేలాది సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు