-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 12th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 12 , 2026 | 06:05 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 12, 2026 08:00 IST
ఏలూరు: చింతలపూడి మండలం లింగగూడెం దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రమాదం
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఒకరి మృతి, 15 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన
క్షతగాత్రులను చింతలపూడి ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 12, 2026 07:55 IST
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అరుదైన ఖనిజాల అన్వేషణ
209.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనకు గ్రీన్‌సిగ్నల్
ఖనిజాల అన్వేషణకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి
-
Sep 12, 2026 07:45 IST
విజయవాడ: శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం
ఒక్కసారిగా మారిన విజయవాడ వాతావరణం
ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం
ఈదురుగాలులతో నగరాన్ని ముంచెత్తిన వాన
భారీ వర్షంతో రోడ్లపైకి చేరుతున్న వర్షపు నీరు
-
Sep 12, 2026 07:30 IST
తిరుపతి: 14న స్విమ్స్ OP, OTలకు సెలవు
వినాయక చవితి సందర్భంగా సేవలకు సెలవు: డైరెక్టర్ గుడారు జగదీష్
అత్యవసర సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి: డైరెక్టర్ గుడారు జగదీష్
మరుసటి రోజు నుంచి మిగిలిన సేవలు పునఃప్రారంభం: డైరెక్టర్ గుడారు జగదీష్
-
Sep 12, 2026 07:15 IST
తిరుపతి: వెంకటగిరి సీఐ, ఎస్సై సహా పలువురు పోలీసులపై కేసు నమోదు
జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలతో ప్రైవేటు కేసు నమోదు
పోలీసులు తమను ఇబ్బంది పెట్టారంటూ కోర్టులో ఫిర్యాదు చేసిన ఐఐహెచ్‌టీ ఉద్యోగి
సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప, ఏఎస్సై రమణయ్యపై కేసు నమోదైనట్లు స్పష్టం చేసిన డీఎస్పీ చెంచుబాబు
-
Sep 12, 2026 07:00 IST
తిరుపతి: శ్రీకాళహస్తి వద్ద భారీగా ఎర్రచందనం దుంగల స్వాధీనం
మేలచ్చూరు సమీపంలో అక్రమంగా దాచిన 400 కిలోల 40 దుంగల స్వాధీనం
ఎర్రచందనం దుంగల విలువ రూ. 2 లక్షలు: ఎఫ్ఆర్ఓ లోకేశ్
ఎర్రచందనం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన అధికారులు
-
Sep 12, 2026 06:55 IST
గుంటూరు జిల్లా: పొన్నూరు పట్టణంలో దారుణం
8వ వార్డు క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి(45) హత్య
ప్రియుడితో కలిసి తల్లిని కూతురే హత్య చేసినట్లు బంధువుల ఆరోపణలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పొన్నూరు అర్బన్ పోలీసులు
-
Sep 12, 2026 06:45 IST
కర్నూలు: ఆస్పరి మండలం కైరుప్పలలో విషాదం
అప్పుల బాధతో వెంకట రాముడు (35) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 12, 2026 06:40 IST
కర్నూలు: నగర శివారులోని జగన్నాధగట్టుపై అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు
అడ్డుకున్న టిడ్కో ఇళ్ల నివాసితులు, దాడి చేసిన మట్టి మాఫియా
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
-
Sep 12, 2026 06:35 IST
గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకల ఢీ
రంగంలోకి ఇండియన్ కోస్ట్‌గార్డ్
21 మందిని రక్షించిన కోస్ట్‌గార్డ్
కాండ్లా ఎయిర్‌పోర్ట్ దగ్గర ఘటన
-
Sep 12, 2026 06:33 IST
నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మహాగణపతి దర్శనానికి వచ్చే వాహనాల మళ్లింపు
ఈ నెల 24 వరకూ కొనసాగనున్న ఆంక్షలు
-
Sep 12, 2026 06:30 IST
నేడు, రేపు TPCC ఎస్సీ సెల్ ధర్నా
కవ్వంపల్లి ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో కార్యక్రమం
అంటరానితనానికి వ్యతిరేకంగా TPCC ధర్నా
-
Sep 12, 2026 06:25 IST
ఏపీపై కొనసాగుతున్న అల్పపీడనం
నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన
నేడు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Sep 12, 2026 06:20 IST
నేడు విజయవాడలో ఐద్వా రాష్ట్ర మహాసభలు
ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
Sep 12, 2026 06:15 IST
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం
నేడు సిట్ సమక్షంలో సాయికృష్ణ తల్లి బ్లడ్ శాంపిల్స్ సేకరణ
-
Sep 12, 2026 06:10 IST
నేడు తెలంగాణ భవన్‌లో BRS మాక్ అసెంబ్లీ
అసెంబ్లీ సెషన్ నుంచి BRS ఎమ్మెల్యేలు, MLCలను సస్పెండ్ చేయడంతో మాక్ అసెంబ్లీ
స్పీకర్‌గా వ్యవహరించనున్న మాణిక్యరావు
సీఎం పాత్రలో తలసాని శ్రీనివాస్‌యాదవ్
-
Sep 12, 2026 06:05 IST
నేడు ఏపీలో నేడు ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభం
ఏపీలో రూ.249.50 కోట్లతో 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు
10 ఎమర్జెన్సీ కేంద్రాలు, 12 ప్రజారోగ్య ప్రయోగశాలలు
-
Sep 12, 2026 06:00 IST
నేటినుంచి ఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్
రెండు రోజులు జరగనున్న బ్రిక్స్ సదస్సు
సదస్సుకు రానున్న 11 దేశాధినేతలు