Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 05 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 05, 2026 12:48 IST

    నిర్మల్‌: ఖానాపూర్‌ పీఠం BJP-BRS కూటమి కైవసం

    • ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక(BJP) ఎన్నిక

    • వైస్‌ చైర్మన్‌గా మహమ్మద్‌ షోయబ్‌(BRS) ఎన్నిక

  • Apr 05, 2026 12:47 IST

    జనగామ: బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు: రాంచందర్ రావు

    • కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు..

    • ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది..

    • ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే డబ్బులు పంపుతున్నారు..

    • తెలంగాణలో ఎవరూ సంతృప్తిగా లేరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

  • Apr 05, 2026 12:33 IST

    రక్షకుడే భక్షకుడు అయ్యారు: హరీష్‌రావు

    • బడుగు బలహీన వర్గాల భూములకు రక్షణ లేదు..

    • ప్రభుత్వ పెద్దలే గద్దల్లా తన్నుకు పోతున్నారు..

    • హైదరాబాద్ కేంద్రంగా రూ.7వేల కోట్ల భూ స్కామ్ జరిగింది: మాజీ మంత్రి హరీష్ రావు

  • Apr 05, 2026 12:32 IST

    హైదరాబాద్: మాదిగ మహా శక్తి జెండా ఆవిష్కరణ

    • పోరాటాల కోసమే మాదిగలు పుట్టారు: మోత్కుపల్లి నర్సింహులు

    • అణచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది..

    • మాదిగలు ఒక్కటైతే రాజ్యాధికారం సాధ్యమే: మోత్కుపల్లి

  • Apr 05, 2026 11:59 IST

    కేసీఆర్ బయటికి నెట్టి ఐదేళ్లవుతోంది: ఈటల రాజేందర్

    • పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారు..

    • నేను, బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్నది అవాస్తవం..

    • పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు: ఎంపీ ఈటల రాజేందర్

  • Apr 05, 2026 11:56 IST

    రేపు తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారం

    • నాగర్‌కోయిల్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం

    • బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా ప్రచారం చేయనున్న డిప్యూటీ సీఎం

  • Apr 05, 2026 11:54 IST

    సిరిసిల్ల: ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల్లో వర్షం

    • పలు గ్రామాల్లో రాలిన మామిడి, తడిసిన ధాన్యం

    • ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, వరి

  • Apr 05, 2026 11:31 IST

    అమెరికా చరిత్రలో సాహసోపేతమైన ఆపరేషన్: ట్రంప్

    • ఇరాన్‌లో చిక్కుకున్న ఇద్దరు పైలట్లను కాపాడాం..

    • శత్రుదేశంలో చిక్కుకున్నవారిని కాపాడటం గొప్ప విజయం: డొనాల్డ్ ట్రంప్

  • Apr 05, 2026 11:30 IST

    తెలంగాణ హైకోర్టు జోన్‌-2 భవన శంకుస్థాపన

    • తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం

    • న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన

    • CJI జస్టిస్‌ సూర్యకాంత్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

  • Apr 05, 2026 10:26 IST

    గల్లంతైన అమెరికన్ పైలట్ ఆచూకీ లభ్యం

    • 36 గంటల తర్వాత లభ్యమైన పైలట్ ఆచూకీ

    • పైలట్‌ను రక్షించిన అమెరికా భద్రతా దళాలు

  • Apr 05, 2026 09:15 IST

    మాదాపూర్‌లో డీసీఎం బీభత్సం, మహిళ మృతి

    • మాదాపూర్ పీఎస్‌ పరిధి మైండ్‌ స్పేస్‌ దగ్గర స్కూటీని ఢీకొన్న డీసీఎం

    • స్కూటీపై ఉన్న దంపతులను కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లిన డీసీఎం

    • స్కూటీని ఈడ్చుకెళ్లడం గమనించి వాహనాన్ని ఆపిన స్థానికులు

  • Apr 05, 2026 08:18 IST

    హత్య కేసులో సీఐపై సస్పెన్షన్ వేటు

    • పల్నాడు జిల్లా: మాచర్లకు చెందిన చౌడమ్మ హత్య కేసులో సీఐపై వేటు

    • మాచర్ల పట్టణ సీఐ తురక వెంకట రమణపై సస్పెన్షన్ వేటు

    • చౌడమ్మ హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంపై చర్యలు

    • హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సీఐ సహకారం

    • గత నెల 18న చౌడమ్మను హత్య చేసిన కన్న తండ్రి

    పూర్తి కథనం..

  • Apr 05, 2026 07:11 IST

    అల్లూరి: అరకు లోయలో భూ ప్రకంపనలు

    • రాత్రి 11:31 నిమిషాలకు భూ ప్రకంపనలు

    • ఒడిశా కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం

    • రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదు

    • అరకు లోయ, పాడేరు నియోజకవర్గాల్లో భూ ప్రకంపనలు: నేషనల్‌ సెంటర్ ఫర్ సిస్మాలజీ

    పూర్తి కథనం..

  • Apr 05, 2026 07:02 IST

    ఇరాన్‌ నుంచి సురక్షితంగా భారత్‌ చేరుకున్న మత్య్సకారులు

    • పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ మత్య్సకారులు

    • ఆర్మేనియా మీదుగా భారత్‌కు చేరుకున్న 345 మంది మత్య్సకారులు

  • Apr 05, 2026 07:00 IST

    హోర్ముజ్‌పై ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని ఇరాన్‌

    • ట్రంప్ బెదిరింపులపై ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్‌

    • మరో రెండు అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటన

    • అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించాం: ఇరాన్‌

  • Apr 05, 2026 06:59 IST

    నేడు ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్ ఎన్నిక

    • ఖానాపూర్‌లో నిన్నటి ఉద్రిక్తతలతో పోలీసుల అలర్ట్‌

    • చైర్మన్ ఎన్నిక కోసం భారీ బందోబస్తు

    • కాంగ్రెస్ తీరుకు నిరసనగా మున్సిపాలిటీ బంద్‌కు బీజేపీ-BRS పిలుపు

  • Apr 05, 2026 06:31 IST

    నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్

    • ఖమ్మంలో జరగనున్న వెడ్డింగ్ రిసెప్షన్

    • వేడుకకు హాజరుకానున్న పలువురు మంత్రులు, MLAలు

  • Apr 05, 2026 06:23 IST

    నేడు హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

    • బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న కిషన్‌రెడ్డి

    • న్యూ నల్లకుంటలో నరేంద్ర పార్క్‌ను సందర్శించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • Apr 05, 2026 06:22 IST

    విజయవాడ: టెర్రర్ లింక్‌ కేసు.. నేటితో ముగియనున్న కస్టడీ

    • నేటితో ముగియనున్న ఐదుగురు నిందితుల కస్టడీ

    • నిందితులను ఐదు రోజులు ప్రశ్నించిన పోలీసులు

    • మిగతా ఏడుగురితో ఉన్న సంబంధాలపై అధికారుల ఆరా

  • Apr 05, 2026 06:04 IST

    నేడు తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం

    • న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన

    • CJI జస్టిస్‌ సూర్యకాంత్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

    • సాయంత్రం 6 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసుల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌

    • ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • Apr 05, 2026 06:02 IST

    హైదరాబాద్‌: నేడు సేవ్‌ సింగరేణి పేరుతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

    • తెలంగాణ జాగృతి, HMS ఆధ్వర్యంలో కార్యక్రమం

    • హాజరుకానున్న కవిత, కార్మిక సంఘాల నేతలు

  • Apr 05, 2026 06:01 IST

    హైదరాబాద్: నేడు KBR పార్క్‌ దగ్గర ట్రాఫిక్‌ ఆంక్షలు

    • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ట్రయల్‌ రన్

    • త్వరలో ట్రయల్‌ రన్‌ రూట్‌లోనే వాహనాల రాకపోకలు

  • Apr 05, 2026 06:00 IST

    IPL: నేడు హైదరాబాద్‌ Vs లక్నో మ్యాచ్‌

    • హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌

    • బెంగళూరులో రాత్రి 7:30 గంటలకు బెంగళూరు Vs చెన్నై మ్యాచ్‌