Gas Cylinder: శీతాకాలంలో గ్యాస్ సిలిండర్ దగ్గర జాగ్రత్త
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:10 PM
చలికాలంలో గ్యాస్ సిలిండర్ దగ్గర తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చలి వాతావరణం కారణంగా గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చే రబ్బరు పైపులు గట్టిపడి చిట్లిపోయే అవకాశం ఉంది. అంతేకాదు..
ఆంధ్రజ్యోతి, జనవరి 5: చలికాలంలో ఇంట్లో ఎక్కువ సమయం గడపడం వల్ల గ్యాస్ సిలిండర్ వాడకం కూడా పెరుగుతుంది. కానీ ఈ సమయంలో వహించిన చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. గ్యాస్ లీకేజ్ కారణంగా, ఆకస్మిక అగ్నిప్రమాదం లేదా ఊపిరి ఆడకపోవడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా చల్లదనం వల్ల గ్యాస్ రబ్బరు పైపులు గట్టిపడి క్రాక్ అవ్వడం, వెంటిలేషన్ తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.
కిచెన్‌లో వెంటిలేషన్ పెంచండి:
వంట చేసేటప్పుడు కిటికీలు తెరిచి పెట్టండి లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయండి. సిలిండర్‌ను ఎప్పుడూ మూసి ఉన్న లేదా చాలా చల్లని ప్రదేశంలో పెట్టవద్దు.
రెగ్యులేటర్, పైప్ చెక్ చేయండి:
చల్లదనంలో రబ్బరు పైపులు గట్టిపడి పగుళ్లు రావచ్చు. పాత లేదా పగిలిన పైపులను వెంటనే మార్చండి. పైప్ మడతపడి లేదా వదులుగా ఉందేమో చూస్తూ ఉండండి.
గ్యాస్ లీక్ అనుమానం వస్తే:
గ్యాస్ వాసన వస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, రెగులేటర్ తీసి, తలుపులు-కిటికీలు తెరిచి వెంటిలేషన్ పెంచండి. లైట్లు లేదా స్విచ్‌లు ఆన్ చేయవద్దు. చిన్న స్పార్క్ కూడా ప్రమాదం కలిగించవచ్చు.
అంతేకాదు, హీటర్‌ని సిలిండర్ పక్కన పెట్టడం చాలా ప్రమాదకరం. గ్యాస్ వెలిగించేప్పుడు మ్యాచిస్ లేదా లైటర్ మాత్రమే వాడండి. మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ డివైస్‌లతో దూరంగా ఉండండి. గ్యాస్ పని అయిపోయాక రెగ్యులేటర్ వెంటనే ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ సాధారణ జాగ్రత్తలతో చలికాలంలో గ్యాస్ సిలిండర్ సురక్షితంగా వాడవచ్చు. ఎలాంటి సందేహమైనా వస్తే అధికారిక గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి! లేదా గ్యాస్ కంపెనీ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి..
సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం.. ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి