Share News

చాలా మంది నల్ల రంగు గొడుగునే వాడతారు.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Jun 23 , 2026 | 08:35 AM

వర్షం పడినప్పుడు సర్వ సాధారణంగా అంతా గొడుగు వాడతారు. వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కూడా గొడుగును వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో వివిధ రంగుల డిజైన్లతో గొడుగులు అందుబాటులోకి వచ్చాయి.

చాలా మంది నల్ల రంగు గొడుగునే వాడతారు.. ఎందుకో తెలుసా?
Black umbrella

వర్షం పడినప్పుడు సర్వ సాధారణంగా అంతా గొడుగు వాడతారు. వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కూడా గొడుగును వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో వివిధ రంగుల డిజైన్లతో గొడుగులు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ చాలా మంది నల్ల రంగు గొడుగులనే వాడుతుంటారు. రంగు రంగుల డిజైన్లతో ఎన్ని గొడుగులు వచ్చినా.. అత్యధికంగా నల్ల రంగు గొడుగులనే ఎక్కువగా ప్రజలు కొనుగోలు చేస్తారు. గొడుగులు అధికంగా నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి. వాటినే కొనేందుకు ప్రజలు ఎందుకు ఆసక్తి చూపుతారు. దీని వెనుక ఏమైనా ఆసక్తికర విషయం దాగి ఉందా? అంటే..


సూర్యుని వేడి నుంచి రక్షణ..

సాధారణంగా నలుపు రంగు.. సూర్యకిరణాలను గ్రహించి ఎక్కువ వేడిని వెదజల్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే వేసవిలో నల్లని దుస్తులు ధరించవద్దని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే.. నల్లని దుస్తులు సూర్యుని వేడిని త్వరగా గ్రహిస్తాయి. ఆ వేడి నేరుగా శరీరానికి చేరేలా చేస్తాయి. కానీ గొడుగుల విషయానికి వస్తే.. పలు ప్రయోజనాలు ఉన్నాయి.


నల్ల గొడుగు సూర్యకిరణాలతోపాటు హానికరమైన అతినీలలోహిత కిరణాలను త్వరగా గ్రహిస్తుంది. కానీ ఆ కిరణాలు నేరుగా మన శరీరంపై పడకుండా నివారిస్తుంది. గొడుగును మన శరీరం నుంచి కొంత దూరంలో.. అంటే పైకి పట్టుకోవడం వల్ల అది గ్రహించిన వేడి మనకు చేరకుండా గాలిలోకి వెళ్లిపోతుంది. తద్వారా మనకు చల్లదనాన్ని అందిస్తుంది. ఇది శరీరాన్ని అధిక వేడి నుంచి కాపాడటమే కాకుండా.. చర్మాన్ని కూడా కాపాడుతుంది. చర్మ సమస్యల( స్కిన్ అలెర్జీ)ను నివారిస్తుంది.


వర్షాకాలంలో వాటిని నివారించడానికి..

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో కూడా చాలా మంది నల్ల గొడుగులనే వాడతారు. వర్షాకాలంలో రహదారులపై బురద, దుమ్ము అధికంగా ఉంటుంది. ఇవి గొడుగుపై పడినా.. దాని నలుపు రంగు కారణంగా ఆవి అంతగా కనిపించవు. అంతేకాకుండా వర్షాలు తగ్గిన తర్వాత.. ఈ గొడుగులు త్వరగా ఆరిపోతాయి. వాటిపై ఉన్న మరకలు కూడా అంతగా కనిపించవు. దీంతో వర్షాకాలంలో కూడా నల్ల రంగు గొడుగులను అధికంగా ఉపయోగిస్తారు.


ఈ రంగు గొడుగులు వాడడం వల్ల..

నల్ల రంగు గొడుగులు వినియోగించడం వల్ల శని దుష్ప్రభావాలు తగ్గుతాయని పలు ప్రాంతాల్లోని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నలుపు రంగు శని దేవుడితో ముడిపడి ఉంటుంది. వివిధ కాలాల్లో ఈ నల్ల గొడుగును ఉపయోగించడం వల్ల శని వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయని చెబుతారు. అదీకాక ఉరుములు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలు నుంచి ఈ నల్ల రంగు గొడుగు రక్షణ కల్పిస్తుందని ప్రజలు భావిస్తారు.


గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో లభించే నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే

ఆకలి లేకపోయినా తింటున్నారా? ఇది తెలుసుకోండి

Updated Date - Jun 23 , 2026 | 08:42 AM