ట్రావెల్ చేస్తున్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:58 PM
ప్రయాణ సమయంలో తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోకపోతే వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది..
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణ సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. ప్రయాణంలో ఎక్కడ దొరికితే అక్కడ.. ఆహారం కొనుక్కుని తినడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణ సమయంలో ఆహారం, పానీయాల విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సరైన దుకాణం ఎంచుకోండి..
ప్రయాణ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు ఉండే ఆహార దుకాణాలను ఎంచుకోవడం మంచిది. అలాంటి చోట్ల ఆహారం తాజాగా తయారవడంతో పాటూ వేడిగా లభిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
మసాలా ఆహారం తినకండి..
ప్రయాణంలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినకండి. ఇవి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణం కావొచ్చు. అలాగే ప్రయాణ సమయంలో పాలు, పెరుగు వంటి పదార్థాలు కూడా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవి త్వరగా పాడై ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
తేలికపాటి ఆహారం తీసుకోండి..
దీర్ఘ ప్రయాణాల్లో భారమైన ఆహారం తీసుకోవడం కంటే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియకు సులభంగా ఉంటుంది. ప్రయాణంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
తగినంత నీరు తాగాలి..
ప్రయాణ సమయంలో శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి. తరచూ శుభ్రమైన నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా నివారించవచ్చు.ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ ప్రయాణం సురక్షితంగా, ఆరోగ్యంగా సాగుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News