ఒత్తిడిని తగ్గించే మూడు ముఖ్యమైన సూత్రాలు..
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:13 PM
ఈ రోజుల్లో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆందోళనలు మన జీవితంలో భాగంగా మారాయి. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన మూడు ముఖ్యమైన సూత్రాలను పాటిస్తే ఒత్తిడిని తగ్గించుకోవడం మాత్రమే కాదు, మనసుకు శాంతి, జీవితంలో స్థిరత్వం కూడా పొందవచ్చు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, బంధువుల సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనలు.. ఇలా అనేక మానసిక సమస్యలు మనసును బలహీనపరుస్తాయి. అయితే, ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో ఒత్తిడిని తగ్గించేందుకు మూడు ముఖ్యమైన సూత్రాలను సూచించారు. ఈ సూత్రాలను పాటిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ఒత్తిడికి అసలు కారణం ఏంటి?
చాణక్యుడి ప్రకారం, ఒత్తిడికి ప్రధాన కారణం బయట పరిస్థితులు మాత్రమే కాదు.. మన ఆలోచనలు, మన వైఖరి కూడా. ఇతరులను మనకు నచ్చినట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తాం.. కానీ నిజానికి మార్చుకోవాల్సింది మన ఆలోచనలే.
మార్చలేనిదాన్ని అంగీకరించండి..
మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మార్చలేని పరిస్థితులను అంగీకరించడం చాలా ముఖ్యం. అలా అంగీకరిస్తే మనసుకు శాంతి లభిస్తుంది, అలాగే మానసికంగా బలంగా ఉండగలం.
మీ ఆలోచనలను నియంత్రించుకోండి..
ఒత్తిడి బయట నుండి రాదు. అది మనలోని భయం, ఆందోళనల వల్ల ఏర్పడుతుంది. మనస్సును నియంత్రించగలిగిన వ్యక్తి.. జీవితంలో నిజమైన విజేత అవుతాడు. సానుకూల ఆలోచనలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మీ కోసం సమయం కేటాయించండి..
రోజూ కొంత సమయం మౌనంగా కూర్చొని మీ ఆలోచనలను పరిశీలించండి. ఇది మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. ధ్యానం, నిశ్శబ్దం, ఆత్మపరిశీలన వంటి అలవాట్లు మనలో కొత్త శక్తిని నింపుతాయి.
చిట్కాలు..
రోజూ ధ్యానం లేదా యోగా చేయండి.
లోతైన శ్వాస తీసుకునే అలవాటు పెంచుకోండి.
కొంత సమయం ప్రకృతితో గడపండి.
సానుకూలంగా ఆలోచించండి
మీ సమస్యలను విశ్వసనీయ వ్యక్తులతో పంచుకోండి.
ఒత్తిడిని పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోయినా.. దాన్ని నియంత్రించడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మార్చలేనిదాన్ని అంగీకరించడం, మనస్సును నియంత్రించడం, మన కోసం సమయం కేటాయించడం ద్వారా మన జీవితంలో నిజమైన శాంతి, ఆనందాన్ని పొందవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News