Share News

Sankranti 2026 Travel Tips: సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టూరిస్ట్ స్పాట్స్ బెస్ట్ ఆప్షన్

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:01 AM

సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే ఈసారి కుటుంబంతో కలిసి చారిత్రక ప్రదేశాలను సందర్శించండి. ఈ పండుగకు తప్పక చూడాల్సిన ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sankranti 2026 Travel Tips:  సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టూరిస్ట్ స్పాట్స్ బెస్ట్ ఆప్షన్
Sankranti 2026 Travel Tips

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజును భారతీయ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పంట చేతికి వచ్చిన ఆనందం, నువ్వులు–బెల్లంతో చేసిన తీపి వంటకాలు, రంగురంగుల గాలిపటాలు... ఇలా సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. ఈ సమయంలో చాలా మంది కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి కర్ణాటకలోని చారిత్రక ప్రదేశాలు అద్భుతమైన ఎంపిక. ఈ సంక్రాంతి వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలంటే.. కర్ణాటకలోని ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి..


మైసూర్.. వారసత్వ నగరం

కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూర్. అద్భుతమైన అంబావిలాస్ ప్యాలెస్‌తో పాటు, మైసూర్‌లో మరో నాలుగు ప్యాలెస్‌లు ఉన్నాయి. అలాగే, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ గార్డెన్స్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. రాజుల వైభవం, అందమైన వాస్తుశిల్పం, పట్టు చీరలు, గంధపు చెక్కలకు మైసూర్ చాలా ప్రసిద్ధి చెందింది.

Hampi (2).jpg

హంపి – శిథిలాల నగరం

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి.. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధాని. విరూపాక్ష ఆలయం, రాతి రథం, హేమకూట కొండ ఆలయాలు, లోటస్ మహల్, ఏనుగు లాయం, ఉగ్రనరసింహ విగ్రహం వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.


విజయపుర (బీజాపూర్)

ప్రపంచ ప్రఖ్యాత గోల్ గుంబజ్, అందమైన ఇబ్రహీం రోజా, జామా మసీదు, అసర్ మహల్, మాలిక్-ఇ-మైదాన్ ఫిరంగి, బరకమాన్, ఉప్పలి బుర్జ్ వంటి చారిత్రక కట్టడాలు విజయపుర ప్రత్యేకత.

Bijapur.jpg

హళేబీడు

హసన్ జిల్లాలోని హళేబీడు ఒకప్పుడు హొయసల రాజుల రాజధాని. ఇక్కడి ఆలయాల్లోని సున్నితమైన శిల్పాలు, అద్భుతమైన వాస్తుశిల్పం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అందుకే దీనిని భారత వాస్తుశిల్ప రత్నం అని అంటారు.


బేలూర్

హళేబీడు దగ్గరలోని బేలూర్‌లో ఉన్న చెన్నకేశవ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణానికి 100 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. శిల్పకళలో ఇది ఒక అద్భుతం.

Belur.jpg

ఐహోళే – ఆలయాల పుట్టినిల్లు

బాగల్‌కోట్ జిల్లాలోని ఐహోళేలో వందకు పైగా పురాతన దేవాలయాలు ఉన్నాయి. దుర్గా ఆలయం, లాడ్ ఖాన్ ఆలయం, మేగుటి జైన ఆలయం, రావణ ఫాడి గుహ వంటి ప్రదేశాలు తప్పక చూడాల్సిన ప్రదేశాలు.


pattadakallu.jpg

పట్టడకల్లు

యునెస్కో వారసత్వ ప్రదేశమైన పట్టడకల్లులో తొమ్మిది హిందూ దేవాలయాలు, ఒక జైన ఆలయం ఉన్నాయి. విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయం, పాపనాథ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఈ మకర సంక్రాంతి 2026 పండుగను కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. కర్ణాటకలోని ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక సందర్శించండి.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..

సమతుల ఆహారంతోనే ఆరోగ్యం..

For More Latest News

Updated Date - Jan 09 , 2026 | 03:13 PM