మినీ మాల్దీవులు.. పర్యాటకులను ఆకర్షిస్తోన్న లఖ్నవరం సరస్సు
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:56 PM
తెలంగాణలో మాల్దీవుల అనుభూతిని ఇచ్చేలా ప్రత్యేకమైన ప్రదేశం ఉందని తెలుసా? హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల దూరంలో ఉంది. తక్కువ బడ్జెట్‌లో, కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా ట్రిప్‌కు వెళ్లవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న లఖ్నవరం సరస్సు దాని సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ సరస్సు ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతానికి మంచి ఉదాహరణ. దట్టమైన అడవులు, మధ్యలో చిన్న ద్వీపాలతో నిండి, ఈ సరస్సు నేడు తెలంగాణ మినీ మాల్దీవులుగా ప్రసిద్ధి చెందింది. సరస్సుపై నిర్మించిన 160 మీటర్ల పొడవైన సస్పెన్షన్ వంతెన పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది. ఇది ప్రధాన తీరానికి 13 చిన్న ద్వీపాలను కలుపుతుంది. సరస్సు చుట్టూ ఉన్న కొండలు, అడవులు, జలపాతాలు ఒక సినిమా సెట్ లాగా కనిపిస్తుంది.
లఖ్నవరం సరస్సు చరిత్ర:
లఖ్నవరం సరస్సును కాకతీయ రాజు గణపతి దేవ పాలనలో 1213 ADలో నిర్మించారు. సరస్సు మానవ-నిర్మిత జలాశయం మాత్రమే కాకుండా, దక్షిణ భారతదేశంలో రైతులకు నీటి ప్రాధాన్యతను కలిగించే వనరు కూడా.. సుమారు 10,000 ఎకరాల విస్తీర్ణంలో సరస్సును నిర్మించారు. ఇంకా 3,500 ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందిస్తుంది.

హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్లు, కేవలం 3 గంటల దూరంలో ఉంది. ఇక్కడ కృష్ణా నదిలో బోటింగ్, అందమైన వాతావరణం, ప్రత్యేకమైన చేపల వంటకాలు అన్ని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ టూరిజం శాఖ సోమశిలకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసింది. కాటేజీలు, ప్రత్యేక బస్సు సర్వీసులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

తక్కువ బడ్జెట్‌లో, కుటుంబం లేదా స్నేహితులతో వెళ్ళే పర్యటనకు సోమశిల ఒక అద్భుతమైన ఎంపిక. లఖ్నవరం సరస్సు కేవలం జలాశయం మాత్రమే కాదు, చరిత్ర, సహజ సౌందర్యం, ఆధునిక పర్యాటక సౌకర్యాల సంగమం. మీరు ప్రకృతి, చరిత్ర ప్రేమికులైతే, కాకతీయుల కాలం నాటి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే.
Also Read:
ఈ వ్యక్తులను అవమానిస్తే మీకే నష్టం..
నిమ్మకాయ కొనేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి
For More Latest News