Meghalaya Tourism: ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. మేఘాలయ పర్యటనకు బెస్ట్ టైమ్ ఇదే.!
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:04 PM
మేఘాలయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. పచ్చని లోయలు, అందమైన జలపాతాలు, నదులు, దట్టమైన అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న మేఘాలయ, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఈ రాష్ట్రం తన అద్భుతమైన జలపాతాలు, పచ్చిక అడవులు, అందమైన కొండలతో పాటు ఖాసీ, జైంతియా, గారో తెగల సంప్రదాయ, సంస్కృతీకి ప్రసిద్ధి చెందింది. పర్యటనకు బెస్ట్ టైమ్ అంటే శీతాకాలం.. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలలు. ఈ సమయంలో మేఘాలయ వాతావరణం చల్లగా ఉంటుంది, కాబట్టి ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం మరింత సులభం.
లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు
ఖాసీ తెగ ప్రజలు రబ్బరు చెట్లు ఉపయోగించి నిర్మించిన ఈ వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ముఖ్యంగా, చిరపుంజి ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. అడవుల మధ్యన ఏర్పడిన ఈ వంతెనలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

లైట్లం కాన్యన్
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు ఒక గంట ప్రయాణం తర్వాత లైట్లం కాన్యన్ చేరవచ్చు. కొండల అంచునుంచి ఈ ప్రదేశం ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి అద్భుతంగా ఉంటుంది. శీతాకాలంలో మంచుతో కప్పబడిన కాంతివంతమైన దృశ్యాలు మరచిపోలేనివి.

క్రాంగ్ సూరి జలపాతం
షిల్లాంగ్ నుండి మూడు గంటల దూరంలో ఉన్న ఈ జలపాతం ఎత్తైన కొండల మధ్య ప్రవహిస్తుంది. పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి కుటుంబంతో వెళ్లి ఆనందించవచ్చు.

ఉమ్ గోట్ నది
మావ్లిన్నాంగ్‌కి తూర్పు వైపున ఒక గంట ప్రయాణం చేస్తే డౌకి గ్రామం సమీపంలో ఉమ్ గోట్ నది ఉంది. ఈ నది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, నదిలో పడవ ప్రయాణం చేయడం ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

మేఘాలయ ప్రకృతి ప్రేమికుల కోసం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పచ్చని లోయలు, నదులు, జలపాతాలు, ప్రత్యేక తెగల సంస్కృతి, శీతాకాలం వాతావరణం..ఇవన్నీ మేఘాలయను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
వంటలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఏం చేయాలో తెలుసా?
For More Latest News